ఎండ తీవ్రత నుంచి రక్షణ జాగ్రత్తలు పాటించాలి…

ఎండ తీవ్రత నుంచి రక్షణ జాగ్రత్తలు పాటించాలి

నర్సంపేట సీఐ శ్రీనివాస్ సిబ్బందికి సూచనలు

పోలీస్ సిబ్బందికి చలువ కళ్లజోళ్లు, క్యాప్స్,టవల్స్ పంపిణీ

నర్సంపేట,నేటిధాత్రి:

విధి నిర్వహణలో వేసవికాలంలో ఎండ తీవ్రతకు జాగ్రత్త తీసుకోవాలని నర్సంపేట టౌన్ శ్రీనివాస్ పోలీస్ సిబ్బందికి సూచించారు.నర్సంపేట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేసవిలో బయట పెట్రోలింగ్ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి చలువ కళ్లజోళ్లు, క్యాప్స్, టవల్‌లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో భాగంగా పెట్రోలింగ్ చేసే సమయంలో ఎండ తీవ్రత వల్ల అస్వస్థతకు గురికాకుండా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వేసవిలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.సిబ్బంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ సీఐకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు గూడా అరుణ్ కుమార్, రవికుమార్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మండుతున్న ఎండలు…. మండుతున్న మంటలు…

మండుతున్న ఎండలు…. మండుతున్న మంటలు..

◆”-: మార్చిలోనే పెరిగిన తీవ్రత

◆”-: 37 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

◆”-: కరెంటు కోతలతో అల్లాడుతున్న జనాలు

◆”-: పరీక్షల కాలంలో సతమతమవుతున్న విద్యార్థులు

◆”-: 12 గంటలకే నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు

◆”-: జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఫిబ్రవరి వరకు చలి తీవ్రతకు గజగజలాడిన జనం ఇప్పుడు భగ భగ మండే ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. మార్చి నెలలోనే ఎండలు మండుతున్నాయి. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజు రోజుకు పెను మార్పులు వస్తున్నాయి. గతేడాదితో పోల్చితే ఇప్పుడు మరింతగా ఎండల ప్రభావం పెరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఉద యం నుండే భగ..భగమంటూ వస్తున్న ఎండలను చూసి ప్రజలు జంకుతున్నారు. వచ్చే రోజుల్లో మరింత రికార్డు స్థాయికి ఎండలు చేరుకునే పరిస్థితులుంటాయని వాతావరణ శాఖ అధికారులు అంచ నా వేస్తున్నారు.

ఎండల తీవ్రత అత్యంత వేగంగా పెరుగుతుం ది. గతం కంటే మించి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం మార్చి నెలలోనే ఉన్నా ఎండల వేడి మండిపోతుంది. ఉదయం, సాయంత్రం అన్న తేడా లేకుం డా రోజంతా భానుడి ప్రతాపం భగ భగమంటున్నది. పెరిగిపోతున్న ఎండలకు వృద్ధులు, చిన్నారు లు ఎక్కువగా విలవిలలాడుతున్నారు. ఒక్కసారిగా ఎండవేడిమి పెరిగిపోవడంతో ఉక్కపోతలు ప్రజలకు గుక్క తిప్పనీయడం లేదు. జిల్లాలో మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇదే నెలలో వారం రోజుల ఎం డలను పరిశీలిస్తే..ఉష్ణోగ్రతల తీవ్రత తెలిసిపోతుంది. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం 8 నుంచి 10గంటల వరకు కరెంట్‌ సరఫరా అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇక గ్రామాల్లోనూ కరెంట్‌ కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ప్రత్యామ్నాయాలపై దృష్టి…

ఉదయం నుంచే ఎండ వేడి ఎక్కువ కావడంతో వాటిని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయలను అనుసరిస్తున్నారు. టోపీలు, హెల్మెట్‌లు, మాస్క్‌లు, రుమా ళ్లు ధరించి జనం ఉపశమనం పొందుతున్నారు. రోడ్ల పక్కల నీడనిచ్చే చెట్లు కనిపిస్తే చాలు సేదతీరుతున్నారు. కొత్త కుండలను తీసుకొని చల్లని నీటితో ఉపశమనం పొందుతున్నారు. ఎండలు పెరుగుతున్నందునా కొత్త కుండల విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. మనుషుల పరిస్థితి ఇలా ఉంటే, పశు పక్షాదుల పరిస్థితి కూడా ఇబ్బందిగా మారింది. గ్రామాల్లో ఉండే కోతులు ఎక్కడ నీరు కనిపించినా వాటిలో దూకడం పరిపాటిగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే పశువులు కూడా ఆయా గ్రామాల చెరువుల్లో ఎండలకు తాళలేక సేద తీరుతున్నాయన్న అభిప్రాయం ఉంది.

పరీక్షల కాలంలో..

 

ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య పరీక్ష నిర్వహణ ఉంటుంది. విద్యార్థులంతా ఇతర ప్రాంతాల నుంచి సెంటర్లకు వచ్చి వెళ్త్తూ ఉంటారు. బస్సులు, ఆటోలు, మోటర్‌ సైకిళ్లపై ప్రయాణిస్తూ తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. ఇలా ఎండలు పెరగడం వల్ల విద్యార్థులు సహితం ఇబ్బందులకు గురవుతున్నారు.

జాగ్రత్తలు అవసరం..

ఎండల తీవ్రతను బట్టి సోమవారం నుంచి ఒంటిపూట బడులను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఎండలకు ఇబ్బందులు పడకుండా ఉండాలం టే తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. పిల్లలు ఎక్కవ సమయం ఎండలో ఆడకూడదు. ఎండలోఎక్కువ తిరిగితే వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాతనే చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావడం శ్రేయస్కరం. ఎక్కువ నీరు తాగడం.. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడంలాంటివి చేయాలి. జీన్స్‌లాం టి దుస్తులకు దూరంగా ఉండి…తేలికైన వస్ర్తాలను ధరించడంవల్ల ఉపశమనం లభిస్తుంది. రోజు రెండు, మూడుసార్లు చల్లనీళ్లతో స్నానం చేయించడం పిల్లలకు మరింత శ్రేయస్కరంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మండే ఎండలతో పాటు కలుషిత నీరు, పరిశుభ్రత లోపం కారణంగా పలు రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఝరాసంగం మండల వైద్యాధికారి డాక్టర్ రమ్య ఏరియా ఆసుపత్రి సీనియర్ వైద్యులు డాక్టర్ సూచిస్తున్నారు. “విశాల తెలంగాణ” తో మాట్లాడుతూ వేసవి కాలంలో చిన్న నిర్లక్ష్యం కూడా తీవ్రమైన అనారోగ్యానికి దారితీసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

“ఝరాసంగం మండల వైద్యాధికారి డాక్టర్ రమ్య”

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

 

 

ప్రభుత్వ ఆసుపత్రులు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ తో కలిసి సందర్శించి వార్డులు,రిజిస్టర్లు, మందుల నిల్వలు,పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.ఎండాకాలం దృష్ట్యా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.వైద్యులు,సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని,ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని,ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.వెంకట్రావుపేట, దౌడపల్లి,చందారం గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ,ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా పట్టాలని,ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.గృహాలు, వ్యాపార సముదాయాల వద్ద చెత్తను రోడ్లపై,మురుగు కాలువలలో వేయకూడదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు పొందిన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని,నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.లక్షట్టిపేట మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అమృత్ పథకం నీటి ట్యాంకుల నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తో కలిసి పరిశీలించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.రానున్న వేసవిలో ప్రజలకు నిరంతరంగా నీటిని అందించే విధంగా కార్యచరణ రూపొందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పనులను సందర్షించిన సర్పంచ్…

ఉపాధి హామీ పనులను సందర్షించిన సర్పంచ్:

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కొల్లూరు గ్రామంలో గల ఉపాధి హామీ 100 రోజుల పనికాహార పథకం పనులను కొల్లూరు గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ సందర్శించారు.వేసవి కాలంలో ఎండ తీవ్రత యెక్కువ వుంటుంది కాబట్టి పనికివచ్చేవాళంతా తప్పకుండా నీళ్ళు, భోజనం తెచ్చుకోవాలని తగు జాగ్రత్తలు సూచించడం జరిగింది…ఈ కార్యక్రమములో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ చింతలగట్టు సుబాకర్, వార్డు సభ్యులు చింతలగట్టు ప్రకాష్ ,మంగలి రమేష్, డప్పూర్ శ్రీశైలం, కుమ్మరి దేశరథ్,చింతలగట్టు అబ్రహం, పారిశుధ్య కార్మికులు దేవదాస్, నర్సింలు, అనిల్ త‌దిత‌రులు ఉన్నారు…

సీజనల్ వ్యాధులపై అవగాహన శిబిరం

సీజనల్ వ్యాధులపై
జాగ్రత్తలు పాటించాలి

నిజాంపేట: నేటి ధాత్రి

 

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. నిజాంపేట మండలం రజక్ పల్లి గ్రామంలో బుధవారం ఏఎన్ఎం అరుణ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గోరువెచ్చటి నీటిని త్రాగాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version