ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నాసిరకం బీటీ రోడ్ పై ఆగ్రహం

నాసిరకం బీటీ రోడ్డు నిర్మాణంపై ఎమ్మెల్యే ఆగ్రహం.

* కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి.

* ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లేఖ.

జడ్చర్ల /నేటి ధాత్రి.

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం
బాలానగర్ మండలంలోని బోడగుట్ట తండా నుంచి దేవుని గుట్ట తండా వరకు నిర్మించిన 1 కిలోమీటర్ బీటీ రోడ్ ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసీరకంతో నిర్మించడానికి కారణమైన కాంట్రాక్టర్, ఈ రోడ్డు నాణ్యతను ధ్రువీకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి కోరారు.
ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు లేఖ రాశారు. దేవునిగుట్ట తండాలో వేసిన బీటీ రోడ్డు ఒక రోజుకే గుంతలు పడిపోవడం, చేతితో లాగితే రోడ్డుపై వేసిన బీటీ పెళ్లపెల్లలుగా రావడం, బీటీ కింద కంకర వేసిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఈ రోడ్డు నిర్మాణం విషయంగా తాండా ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం, అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గతంలోనే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రంగా స్పందించి నాసిరకంగా వేసిన కొత్త బీటీ రోడ్ మొత్తాన్ని తీసివేసి దాని స్థానంలో పూర్తి నాణ్యత ప్రమాణంతో కొత్త రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించడం ఈ మేరకు అధికారులు నాసిరకంగా వేసిన రోడ్డు మొత్తాన్ని తీసివేయడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనిరుద్ రెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ ఈఈకి లేఖ రాశారు.
ఈ నాసిరకం రోడ్డు కారణంగా ప్రభుత్వం అప్రదృష్ట పాలయిందని ప్రజాధనం వృథా అయిందని పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో బీటీ కింద వేయాల్సిన WBM కంకర లేకపోవడం, కంకర వేయకుండానే రోడ్డు వేయడం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం అని అభిప్రాయపడ్డారు. ఈ నాసిరకం రోడ్డు నిర్మాణానికి కారణమైన కాంట్రాక్టర్, పర్యవేక్షించిన అధికారులు, నాణ్యతను ధ్రువీకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version