రైతులకు యూరియా బస్తాలు అందజేయాలని CPM ధర్నా

రైతులకు యూరియా బస్తాలు అందజేయాలని సిపిఎం ధర్నా

పరకాల నేటిధాత్రి

రైతులకు పంటకు సరిపడా యూరియా బస్తాలను సకాలంలో అందించాలని పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఫర్టిలైజర్ షాపులు యూరియా బస్తాలను నిలువ ఉంచుకొని రైతులకు అందించడం లేదని, ఇతర మందులు కొంటేనే యూరియా బస్తాలు అమ్ముతామని చెప్పడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని,వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ కరువైందని,షాపుల యజమానులు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని,రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా బస్తాలు ఇవ్వకుంటే చర్యలు చేపడుతామని హెచ్చరించారు.పట్టణంలో ఉన్న వ్యాపారాలు మాత్రం దాన్ని ధిక్కరిస్తున్నారని,సిండికేట్ గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని,ప్రభుత్వము అధికారులు స్పందించి రైతులను మోసం చేస్తున్న పార్టీలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సిపిఎం నేతలు వ్యవసాయ అధికారికి ఫోన్ లో సమాచారం అందించిన వెంటనే స్పందించి నిల్వ ఉన్న యూరియా బస్తాలను రైతులకు ఇవ్వాలని చారని,రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామని షాపుల యజమాన్యాలను హెచ్చరించారని కళ్యాణ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బొచ్చు ఈశ్వర్,బొజ్జ హేమంత్ రైతులు పాల్గొన్నారు.

యూరియా కుంభకోణానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T155155.515-1.wav?_=1

యూరియా కుంభకోణానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం..

రైతుల సమస్యలు విస్మరించి.. కాంగ్రెస్ రాజకీయ యాత్రలు..

కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందించని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా కుంభకోణానికి పాల్పడుతున్నదని రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్
రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.యూరియా కొరత వనల రైతులు పడుతున్న ఇబ్బందుల వల్ల స్పందించిన పెద్ది సుదర్శన్ రెడ్డి అండగా ఉంటున్నారు.నిత్యం ప్రజలు,రైతుల కోసం మరోసారి పోరాటం చేయకతప్పలేదు.నర్సంపేట డివిజన్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై జరుగుతున్న రైతు పోరాటాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని అధికారులను,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ యూరియా కొరత సృష్టించి మార్కెట్ ధర కంటే అధిక ధరకు నానో యూరియా అమ్ముతూ రైతులను ఆర్థికంగా దోచుకుంటున్న ప్రభుత్వాలపై పెద్ది మండిపడ్డారు.పంటలు పాడవుతున్నాయని యూరియా కోసం ఆడిగిన రైతులపైన పిడిగుద్దులతో కాంగ్రెస్ పార్టీ దండయాత్ర చేస్తున్నదని విమర్శించారు.సన్నరకం వడ్లు కొనుగోలు చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు రూ.1267 కోట్లా బోనస్ కాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో రూ. 262 కోట్లు బోనస్ ఎగవేసిందని,రైతులు కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ అంగు ఆర్భాటాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ యాత్రలు చేస్తున్నదని ఎద్దేవా చేశారు.వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కౌలు రైతులు ,రైతు కూలీలకు ఇచ్చిన హామీలు,ఎగబెట్టిన రైతూ భరోసాపై ఎందుకు ప్రస్తావించడం లేదని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.యూరియా కొరత పైన కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య ఉన్న లాలూచీ ఒప్పందం ఏంటని.. 52 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రైతుల కోసం కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని పత్రికా సమావేశంలో ఎందుకు అడగడంలేదని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శించారు.యూరియా జాతీయ సమస్య ఐతే పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు.
యూరియా కోసం క్యూలైన్లలో నిలబడే వేలమంది రైతులు బిఆర్ఎస్ పార్టీ రైతులే అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.యూరియా కొరత అనేది కాంగ్రెస్ పార్టీ సృష్టించిన కృత్తిమ కొరతే అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును చేపట్టి పూర్తిచేయలేదని,సాగునీరు అందివ్వని ఆసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి యాత్రలు చేసే అర్హతలేదని ఆరోపించారు.ఆరు గ్యారెంటీలు 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పదానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు.

కోనాపూర్‌లో యూరియా కొరతపై రైతుల ధర్నా…

కోనాపూర్‌లో యూరియా లభ్యం లేక రైతుల రోడ్డుపై ధర్నా..

రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండలం నుండి
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో యూరియా లభ్యం కాక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం గ్రామంలోని వందలాది మంది రైతులు కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయి, ట్రాక్టర్లు, ఆటోలు, బస్సులు, రెండు చక్రాల వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఆకస్మికంగా ఏర్పడిన ఈ పరిస్థితితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Farmers Protest Over Urea Shortage in Konapur

రైతులు మాట్లాడుతూ—వర్షాకాలంలో పంటల సాగు ఉధృతంగా సాగుతున్న తరుణంలో యూరియా అందకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, పంటలపై పెట్టిన ఖర్చు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా యూరియా కోసం సహకార సంఘం, మార్కెట్ యార్డ్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఒక్క బస్తా కూడా అందలేదని, ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రైతులు మాట్లాడుతూ, “ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమవుతోంది. రైతులకు ఎరువులు అందించడం లో విఫలమవుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే పంటలన్నీ నాశనం అవుతాయి. మా జీవితాలు ప్రమాదంలో పడతాయి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్నా విషయం తెలిసి పోలీసులు అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడారు. అధికారులు త్వరలోనే యూరియా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. అయితే హామీలు కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
స్థానికులు కూడా ఈ సందర్భంలో మాట్లాడుతూ—గ్రామంలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతులకు షరతులు లేకుండా యూరియా – బీఆర్ఎస్ డిమాండ్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-79-1.wav?_=2

షరతులు లేకుండా రైతులకు యూరియా అందించాలి

రైతుల పక్షాన నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

వ్యవసాయ ఆధికారికి వినతి పత్రం అందజేత

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.నేటిధాత్రి…

రైతులు పండించే పంటలకు షరతులు లేకుండా యూరియా అందించాలని బిఆర్ఎస్ పార్టీ
పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు సోమవారం
మండల కేంద్రంలో రైతులతో కలిసి ప్రధాన రహదారి పై నిరసన తెలిపారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంతో రావుల సోమయ్య మాట్లాడుతూ.తప్పుడు హామీలతో గద్దినెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచిన రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదం వ్యక్తం చేశారు.రైతులు పండించే పంటలకు సకాలంలో యూరియా కూడా సరఫరా చేయలేని దినస్థితిలో ఈ ప్రభుత్వం కళ్ల మూచుకొనీ ఉందన్నారు.అనంతరం రైతుల సమస్యలను పరిష్కరించి,సకాలంలో ఎరువులు అందించాలని రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-59-4.wav?_=3

సబ్సిడీ పై వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు*

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
2025-26 ఆర్థిక సంవత్సరనికిగాను రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆర్ కే బి వై లో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణ ఉప ప్రణాళిక (ఎస్ ఎం ఎ ఎం) ద్వారా సబ్సిడీ పై వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు కొరకు ఆసక్తి గల రైతులు ధరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
భూపాలపల్లి డివిజన్ పరిధిలోని మొగుళ్ళపల్లి మండలానికి కేటాయించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మేకనైజేషన్) క్రింద వ్యవసాయ యంత్ర పరికరాలకై ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 కు గాను సన్న కారు, చిన్న కారు రైతులు మహిళ రైతులకు, ఎస్సి, ఎస్టి రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును. ఇట్టి రైతుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము. ఈ పథకం క్రింద మొగుళ్ళపల్లి మండలానికి బ్యాటరీ స్ప్రేయర్స్ -85, పవర్ స్ప్రేయర్స్- 27, రోటవేటర్స్-6, కల్టివేటర్స్/MB ప్లౌ -7, సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్-1, బ్రష్ కట్టర్-1, పవర్ టిల్లర్-1, పవర్ వీడర్ –1 మరియు స్ట్రా బేలర్-2 కేటాయించడం జరిగింది. ఇట్టి పథకానికి ఆసక్తి కలిగిన ఎస్సీ, ఎస్టి & జనరల్ మహిళా రైతులు దరఖాస్తు తో పాటుగా, పట్టాదార్ పాస్ పుస్తకం కాపీ, ఆధార్ కార్డు కాపీ, కుల ధ్రువీకరణ పత్రం, ట్రాక్టర్ కు సంబంధించిన పరికరాలకై రిజిస్ట్రేషన్ పేపర్స్ తో ఫోటో అతికించిన దరఖాస్తును మీ క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు రైతు వేదికలో గాని మొగుళ్ళపల్లి మండల వ్యవసాయ కార్యాలయంలో గాని అందజేయవలసిందిగా అర్హులైన రైతులను కోరుతున్నాం. అలాగే వివిధ పనిముట్లకు అనుమతించబడే సబ్సిడీ గురించి దరఖాస్తులు మరియు ఇతర పూర్తి సమాచారాన్ని పొందుటకొరకు మీ యొక్క క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి ఏ ఈ ఓ/మండల వ్యవసాయ అధికారి (ఎం ఏ ఓ) సంప్రదించగలరు.

ఎరువుల దుకాణాల తనిఖీ చేసిన కలెక్టర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-52-4.wav?_=4

రైతులు అవసరానికే యూరియా కొనుగోలు చేయాలి…

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

కేసముద్రం/ నేటి ధాత్రి

గురువారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కేసముద్రం మండలంలో ఫర్టిలైజర్ దుకాణాలను, పాలిటెక్నిక్, జిల్లా పరిషత్ ఉన్నత పతశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కలెక్టర్ కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ స్టాక్ నిలవలను రైతు వారీగా యూరియా కొనుగోలు వివరాలను పరిశీలించారు. యూరియా పంపిణీపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్, యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని యూరియా గురించి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, రైతులు ప్రస్తుత అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని, జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. క్కువ రద్దీ కాకుండా.. ఉదయాన్నే షాప్ లను తెరవాలని…రైతులను ఇబ్బంది పెట్టకుండా యూరియా అమ్మకం జరగాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా లో సరిపడా యూరియా ఎప్పటికప్పుడు సరఫర అవుతోందని.. రైతులు ఆందోళన చెందాలిసిన అవసరం లేదన్నారు. ఎవరైన కృత్రిమ కొరత సృష్టించాలని చేసిన, అధిక ధరలకు విక్రయించిన వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఎరువుల దుకాణంలో ఒక్కో రైతు వారీగా కొనుగోలు చేసిన వివరాలు రిజిస్టర్లు అప్డేట్ గా ఉండాలని అన్నారు.

అనంతరం కేసముద్రం మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలను తనిఖీ చేసి కిచెన్ షెడ్, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన పరిశుభ్రమమైన వేడి వేడి ఆహార పదార్థాలను వడ్డించాలని, చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అన్నారు. విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు టీచర్లు సులభమైన, అర్థవంతమైన పద్దతిలో పాటాలు నేర్పాలని అన్నారు.

డోర్నకల్ మండలం లోని శ్రీ బాలాజీ ఫెర్టిలైజర్ దుకాణాన్ని రెవెన్యు అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ తనిఖీ చేసి షాపులోని నిల్వలను, రైతులు కొన్న రశీదులను పరిశీలించారు.

ఈ తనిఖీ లో సంబందిత వ్యవసాయ అధికారులు, తహసిల్దార్ లు కళాశాల ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయుడు, తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల షాపులపై కలెక్టర్ తనిఖీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-51-3.wav?_=5

ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

యూరియా వచ్చిన వెంటనే డీలర్లు రైతులకు సరఫరా చేయాలి

అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

జిల్లా కలెక్టర్” మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో గల కావ్య ఏజెన్సీస్ ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్” మ్యాజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ , సహాయ వ్యవసాయ సంచాలకులు మహబూబాబాద్ డివిజన్ అజ్మీరా శ్రీనివాసరావు తో కలిసి ఎరువుల దుకాణాలలో గల యూరియా నిలువలను తనిఖీ చేయడం జరిగింది, వారు స్టాక్ రిజిస్టర్, బ్యాలెన్స్, పి ఓ ఎస్ మిషన్ బాలన్స్, గోడం బ్యాలెన్స్, స్టాక్ బోర్డు వివరాలు ఇన్వైస్లను తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువుల డీలర్లు తమ షాపులో ఉన్నటువంటి యూరియా నిలువలను ఉంచుకొని ఎవరైనా యూరియా రైతులకు సరఫరా చేయకపోయినా, అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు, రైతులకు పిఓఎస్ మిషను మరియు ఆధార్ కార్డు, పట్టాదారు పాసు బుక్ జీరా క్సు ద్వారా మాత్రమే యూరియాను, ఇతర ఎరువులను సప్లై చేయాలని వారు కోరారు, ప్రతి ఎరువుల డీలర్లు తమకు వచ్చినటువంటి యూరియా నిలువలను ప్రతిరోజు ఎప్పటికప్పుడు మండల వ్యవసాయ అధికారి కి తెలియజేయాలని వారు సూచించారు, యూరియా వచ్చిన వెంటనే ఎరువుల డీలర్లు రైతులకు సరఫరా చేయాలని వారు కోరారు.
ప్రతిరోజు ఎరువుల నిల్వలను స్టాకు రిజిస్టర్ అప్డేట్ చేయాలని, స్టాక్ బోర్డు ద్వారా ప్రతిరోజు నిలువలు రైతులకు కనిపించే విధంగా, బోర్డులు రాయాలని,
ప్రతిరోజు తమకు వచ్చే యూరియా నిల్వలను వెంటనే మండల వ్యవసాయ అధికారి కి తెలియజేసి, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో యూరియా పంపిణీ వెంటనే పూర్తి చేయాలని వారు సూచించారు నియమ నిబంధనలు అతిక్రమించిన ఎరువుల డీలర్ల పై నిత్యవసరం వస్తువుల చట్టం 1955 మరియు ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు సూచించారు, ప్రతిరోజు స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్కులు,ఇన్వైస్లు,స్టాక్ బోర్డులు అప్డేట్ చేయాలని వారు సూచించారు.
దఫా ల వారీగా యూరియా మండలానికి వస్తున్నందున రైతులు ఎవరూ అధైర్య పడొద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో, మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న, వ్యవసాయ విస్తరణ అధికారి సాయి చరణ్ పాల్గొన్నారు

యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-50-4.wav?_=6

యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు

* రైతుల గొస పంచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

మరిపెడ నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో రైతులు యూరియా కొరతతో గురువారం రోజున ఆర్ అండ్ బీ అతిథి గృహం ముందు రైతులు ధర్నా నిర్వహించారు,మరిపెడ మండల నికి 45 నుండి 50 గ్రామపంచాయతీలు అనుసంధానం గా ఉండడంతో ప్రతి గ్రామంలో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులకు ఒక్కసారిగా యూరియా అవసరము పడడంతో యూరియా కొరత ఏర్పడింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, వర్షాకాలం కావడం తో రవాణా సదుపాయం చురుగ్గా లేకపోవడం సమయానికి యూరియా అందుబాటు కాలేకపోవడంతో యూరియా కొరత ఏర్పడింది. దూర ప్రాంతం నుండి వచ్చిన రైతులు ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ యూరియా కోసం తిండి తిప్పలు లేకుండా షాపుల ముందు లైన్లో నిలబడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు రైతులు వాపోయారు. పైమందులు తీసుకుంటేనే యూరియా బస్తా ఇస్తామని షాపు యజమానులు ఇబ్బందులు పడుతున్నారన్నారు,గత ప్రభుత్వంలో ప్రతి రైతుకు యూరియా సరిపడా బస్తాలు ఇచ్చేవారని ఇప్పుడు ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తున్నారని ఇచ్చిన యూరియా బస్తాలు వ్యవసాయానికి సరిపోక పోవడంతో ఏం చేయాలో తోచడం లేదని సదరు రైతులు వాపోయారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని యూరియా కొరతను తీర్చి ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన అధికారులని కోరారు.

వ్యవసాయ బావిలో కాలుజారి పడి వ్యక్తి మృతి

వ్యవసాయ బావిలో కాలుజారి పడి వ్యక్తి మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలం చిరాగ్పల్లి గ్రామానికి చెందిన రఘు (42) వ్యవసాయ బావిలో కాలుజారి పడి మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే జహీరాబాద్ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది, SDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశాయి. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

యూరియా బ్లాక్‌పై రైతుల ఆందోళన హెచ్చరిక…

యూరియా ను రైతులకు పూర్తిస్థాయిలో అందించాలి

కొండు బానేష్ జిల్లా కార్యదర్శి రైతుసంఘం

మంచిర్యాల19ఆగస్టు నేటి దాత్రి

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలలో ఫర్టిలైజర్. డీ. సీ. ఎం. ఎస్. హాక. పి ఎ సి ఎస్. సెంటర్ల ద్వారా రైతులకు ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్న డీలర్లపై తనిఖీలు చేపట్టాలి.
యూరియా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్న ఎరువుల షాపులను రద్దు చేయాలి.
రైతులకు ఎరువులను సబ్సిడీ ద్వారా ఇవ్వకుండా అధికంగా వసూలు చేస్తున్న డీలర్ల లైసెన్స్ రద్దు చేసి కేసులు నమోదు చేయాలి.
యూరియా ఎంఆర్ పి 266.5 రూపాయలు ప్రభుత్వం నిర్ణీత రేటు కంటే ఎక్కువ నమ్ముతున్న డీలర్లపై కేసులు నమోదు చేయాలి.
యూరియా కొరతను ఆసరాగా చేసుకుని రైతులను నిలువునా దోచుకుంటున్న వ్యవహారంపై వ్యవసాయ అధికారులు దృష్టి పెట్టడం లేదు ప్రభుత్వ నిర్ణీత ధరలకే డీలర్లు అమ్మకాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి.
సబ్సిడీ ద్వారా రైతులకు అందాల్సిన ఎరువులు పక్కదారి పట్టకుండ దళారుల చేతులలోకి పోకుండ చూడాలి.
ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారులు దృష్టి పెట్టకపోవడం వల్ల దళారులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి రైతులని నిలువునా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి గ్రామ. మండల కేంద్రాలలో కొనసాగుతుంది.
ఒక్కో యూరియా బస్తా మీద 80 నుండి 100 రూపాయలు వరకు వసూలు చేస్తున్నారు.
కానీ రైతులకు బిల్లులు ఇవ్వడం లేదు ఫర్టిలైజర్ షాపులపై అధికారులు నిరంతరం తనిఖీ చేస్తూ ఉండాలని ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులు యూరియా తదితర ఎరువుల కొరత సృష్టించి పేద మధ్య తరగతి రైతులకు అధిక ధరలకు ఎరువులను అమ్ముతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.
మారుమూల ప్రాంతాల్లో ఊరుకోక ఎరువుల దుకాణాలు ఏర్పాటు చేసుకొని పేద మధ్య తరగతి రైతుల నడ్డి విరుస్తున్నారు.
ఫర్టిలైజర్ దుకాణాలపై అధికారులు తనిఖీ చేస్తూ వారి పైన చర్యలు తీసుకోవాలి.
లేని యెడల తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతులను ఐక్యం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన హెచ్చరించడం జరిగింది.

ఫోటోగ్రఫీ పోటీల్లో డబుల్ అవార్డు సాధించిన వీరేశం..

తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రఫీ పోటీల్లో డబుల్ అవార్డు విజేత..

ఫోటోగ్రఫీలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఇరుకుల్ల వీరేశం

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన ఇరుకుల్ల వీరేశం ఫోటోగ్రఫీని హాబీగా ప్రారంభించి స్వంత నైపుణ్యంతో అనేక సుందర ఛాయాచిత్రాలను సృష్టించి వివిధ్ ఫోటోగ్రఫీ పోటీలకు పంపించి ఎన్నో అవార్డులను గెలుచుకున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డులను సైతం కైవసం చేసుకున్నారు.
2022 లో ఎన్ ప్రింట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (ప్రింట్ అండ్ డిజిటల్) వారు అంతర్జాతీయంగా ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించగా ఇందులో 27 దేశాలు పాల్గొన్నాయి. భారతదేశం తరపున ఈ పోటీలో ఆన్ లైన్ లో పాల్గొన్న ఇరుకుల్ల వీరేశం అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలలో ప్రింట్ కలర్ విభాగంలో 8 అవార్డులను సాధించారు. 2016 సంవత్సరం నుండి ప్రతి ఏటా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏదో ఒక అవార్డును సాధించారు.
ఫోటోగ్రఫీని ప్రాణంగా భావించే వీరేశం, గిరిజనుల అందాలను చిత్రీకరించడానికి అరకులోయ, ఒడిస్సా, వినాయక నిమజ్జనం దృశ్యాల కోసం మహారాష్ట్ర, హిమాలయాల సౌందర్యం ఒడిసి పట్టడానికి జమ్మూ కాశ్మీర్ లాంటి వైవిద్య భరితమైన ఎన్నో ప్రాంతాలను సొంత డబ్బులు వెచ్చించి అత్యంత వ్యయ ప్రయాసల కోర్చి పర్యటించారు. అక్కడి అందాలను తన కెమెరాల్లో బంధించి ఎన్నో విలువైన ఛాయాచిత్రాలను ఆవిష్కరించారు.
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఐ అండ్ పిఆర్ శాఖ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఇరుకుల్ల వీరేశం కు కేటగిరి రాజీవ్ యువ వికాసంలో తృతీయ బహుమతి మరియు కేటగిరి రైతు భరోసా లో కన్సోలేషన్ బహుమతి లభింఛాయి.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పలు సంక్షేమ పథకాల పైన తీసిన ఛాయా చిత్రాలకు గాను పోటీ నిర్వహించగా అందులో రాజీవ్ యువ వికాసం ఫోటోకు తృథియ బహుమతి & రైతు భరోసా ఫోటోలు ఎంపిక చేశారు.
ఈ బహుమతిని మంగళవారం హైదరాబాదులోని గ్రీన్లాండ్స్ గ్రీన్ పార్క్ హోటల్ లో సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సమాచార, పౌర సంబంధాల కమిషనర్ సిహెచ్ ప్రియాంక, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా వీరేశం అవార్డు అందుకున్నారు.
గ్రామీణ నేపథ్యం కలిగిన వీరేశం.. సునిశిత దృష్టితో ప్రకృతి అందాలు, గిరిజన జీవితాలు, సంస్కృతి సంప్రదాయాలు పరిశీలించి తన కెమెరాలతో బంధించి చూపర్లను సమ్మోహిత పరుస్తున్నాడు.అతని ప్రతిభకు లభిస్తున్న పురస్కారాల పట్ల ఫోటోగ్రఫీ అభిమానులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

సహజ వ్యవసాయంలో దేశీయ గోవుల పాత్ర..

*సహజ వ్యవసాయంలో దేశీయ గోవుల పాత్ర..

*పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి ప్రస్తావన..

తిరుపతి(నేటి ధాత్రి)అగస్టు 19:

దేశీయ ఆవుల లభ్యతపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సహజ పద్ధతులు పెరుగుతున్న వేళ, దేశీ ఆవుల కొరత రైతులకు పెద్ద అడ్డంకిగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, దేశీ ఆవు జాతుల సంరక్షణ, అభివృద్ధి, పెంపకానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై సమాచారం కోరారు. అలాగే, రైతులకు దేశీ ఆవుల పెంపకం కోసం అందిస్తున్న ప్రోత్సాహకాలు, గత మూడు సంవత్సరాల్లో లబ్ధిదారుల వివరాలు, భవిష్యత్‌లో తీసుకోబోయే కొత్త కార్యక్రమాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర పశుసంవర్థక శాఖ సహాయ మంత్రి ఎస్.పి.సింగ్ బాఘెల్ సమాధానంగా, దేశీయ ఆవుల సంరక్షణకు కేంద్రం రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పలు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 2019 పశుగణన ప్రకారం, దేశంలో 193.46 మిలియన్ పశువులుండగా, వీటిలో 73.45% దేశీయ జాతులవని చెప్పారు.
గత మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 8.55 కోట్ల కృత్రిమ గర్భధారణలు నిర్వహించగా, 2.78 కోట్ల రైతులు లబ్ధి పొందారని తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 91.61 లక్షల కృత్రిమ గర్భధారణలు జరిగి,18.52 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని పేర్కొన్నారు. ఆవుల నాణ్యత పెంపు కోసం లింగ క్రమబద్ధీకరించిన వీర్యం, ఐవిఎఫ్ టెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులు వినియోగిస్తున్నారని తెలిపారు. గుంటూరు, చింతలవెల్లి లాంటి ప్రాంతాల్లో ఐవిఎఫ్ కేంద్రాలు, గోకుల్ గ్రామాలు ఏర్పాటు చేశారన్నారు. దేశవ్యాప్తంగా 38,736 సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇచ్చారు. వీరిలో 4,746 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలన్నింటి ఉద్దేశ్యం దేశీయ ఆవుల రక్షణతో పాటు,సహజ వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, రైతుల ఆదాయం పెంచడమే అని మంత్రి తెలిపారు.
ఎంపి గురుమూర్తి కామెంట్స్ : రాష్ట్రాలతో సమన్వయం పెంచుకోవాలని, దేశీయ ఆవుల పెంపకాన్ని మరింత బలోపేతం చేయాలని ఎంపీ గురుమూర్తి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు ఫలితాలు ఇవ్వడంలో ఆలస్యం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆదాయం, సహజ వ్యవసాయం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మరింత బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు

యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు
* ఒక రైతుకు రెండు బస్తాలేనా…!

మహాదేవపూర్ ఆగస్టు 19 (నేటి ధాత్రి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి మహాదేవపూర్ మండల కేంద్రంలో రైతులు యూరియా కొరతతో మంగళవారం రోజున పి.ఎ.సి.ఎస్ కార్యాలయం ముందు బారు తీరారు. ఉమ్మడి మండలమైన మహాదేవపూర్ కి 27 గ్రామపంచాయతీలు అనుసంధానం గా ఉండడంతో ప్రతి గ్రామంలో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులకు ఒక్కసారిగా యూరియా అవసరము పడడంతో యూరియా కొరత ఏర్పడింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, వర్షాకాలం కావడం తో రవాణా సదుపాయం చురుగ్గా లేకపోవడం సమయానికి యూరియా అందుబాటు కాలేకపోవడంతో యూరియా కొరత ఏర్పడింది. దూర ప్రాంతం నుండి వచ్చిన రైతులు ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ యూరియా కోసం తిండి తిప్పలు లేకుండా పి.ఎ.సి.ఎస్ కార్యాలయం ముందు లైన్లో నిలబడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు రైతులు వాపోయారు. గత ప్రభుత్వంలో ప్రతి రైతుకు యూరియా సరిపడా బస్తాలు ఇచ్చేవారని ఇప్పుడు ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తున్నారని ఇచ్చిన యూరియా బస్తాలు వ్యవసాయానికి సరిపోక పోవడంతో ఏం చేయాలో తోచడం లేదని సదరు రైతులు వాపోయారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని యూరియా కొరతను తీర్చి ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన అధికారులని కోరారు.

ఎమ్మెల్యే మాణిక్ రావును అవమానించారు: బండి మోహన్ ఆరోపణ.

ఎమ్మెల్యే మాణిక్ రావును అవమానించారు: బండి మోహన్ ఆరోపణ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావును వేదికపైకి పిలవకుండా అధికారులు అవమానించారని ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండి మోహన్ ఆరోపించారు. దళితుడైనందుకే ఎమ్మెల్యేను అవమానించారని, దీనిని దళిత సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని, ఎమ్మెల్యే సూచనల మేరకు అర్హులకు వెంటనే ఇళ్ల తాళాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-49.wav?_=7

ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

వర్దన్నపేట (నేటిధాత్రి):
79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గ
మొదటగా వారి నివాస గ్రామమైన కట్ర్యాల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించబడిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై తదనంతరం ఇల్లంద గ్రామంలోని వారి అధికారిక కార్యాలయమైన వద్దన్నపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం నందు నిర్వహించబడిన 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య జాతీయ జెండాను ఎగురవేసి మువ్వన్నెల జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ కార్యక్రమములో PACS చైర్మన్ కన్నయ్య,వైస్ చైర్మన్ సిరికొండ కృష్ణా రెడ్డి,మార్కెట్ డైరెక్టర్లు ,ఎండి ఖాజామియా,ఎండి మహమూద్, బచ్చు గంగాధర్ రావు,ఎద్దు శ్రీనివాస్,అంగోత్ నాను నాయక్,మల్యాల దేవేందర్,కాటబోయిన సంపత్,బండి సంపత్ గౌడ్,అల్ల కొమురయ్య,పబ్బతి సంపత్,పుల్లూరి దామోదర్,కర్ర మాలతి రెడ్డి,మార్కెట్ సెక్రెటరీ శ్రీనివాస్ రాజు,సూపర్ వైజర్ బి వెంకన్న ,మార్కెట్ సిబంది లు పాల్గొన్నారు.

నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి…

నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి
వరంగల్ ప్రాంతీయ కేంద్ర పరిశోధన శాస్త్రవేత్తలు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలు సాగు చేస్తున్న రైతులు పంట చేలలో వర్షపు నీటి నిలువలు లేకుండా జాగ్రత్త పడాలని వరంగల్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ వీరన్న డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రమ్య, మొగుళ్లపల్లి మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డిలు సూచించారు. మొగుళ్ళపల్లి మండలంలో ఇటీవల ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం స్థానిక మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ వీరన్న, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రమ్యతో కలిసి మొగుళ్ళపల్లి మండలంలో పత్తి, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మండలంలో సాగు చేస్తున్న పత్తి ,వరి, మొక్కజొన్న పంటల వద్ద ఉన్న రైతులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో కురుస్తున్న అతి భారీ వర్షాలకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల పలు సూచనలు అందించారు. పత్తి పంటలో ప్రస్తుతం కురుస్తున్న వర్షపు నీటిని చేనులో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు బయటకు తీసివేయాలని, పత్తి పంట అధిక వర్షాలకు గురైనప్పుడు ప్రతి మొక్క పెరుగుదలకై 19:19:19 పాలిఫీడ్ లేదా 13:0:45 మల్టీకే పోషకాలను లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలని, వర్షాలు తగ్గిన తర్వాత ఎకరాకు 25 కిలోల యూరియాతో పాటు 20 కిలోల మెరువట పోటాష్ ఎరువులను భూమిలో మొక్కకి 4 అంగుళాల దూరంలో మొదల దగ్గర వేసుకోవాలని, అలాగే పత్తి చేనులో గుంపులు గుంపులుగా మొక్కలు ఎండిపోవడం లేదా వాలిపోవడం గమనించినట్లయితే వేరు కుళ్ళు లేదా భావించి మొక్కలు మొదల చుట్టూ వేరు బాగా తడిచేటట్లు లీటర్ నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును పోసుకోవాలని, పత్తి చేనులో అధికత్తమ ఉన్నప్పుడు ఎకరాకు 10 కిలోల ఏరియాతో పాటుగా 400 నుండి 5 గ్రాముల కార్బన్దజిం + మాన్కోజేబ్ కలుపుకొని మొక్క మొదల దగ్గర వేసుకుంటే పార విల్ట్ ను తగ్గించుకోవచ్చునని శాస్త్రవేత్తలు అన్నారు. ప్రస్తుతం వాతావరణంలో గాలి అధిక తేమతో ఉన్నందున పత్తిలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ, అసికోకైట బ్లైట్ వచ్చే అవకాశం ఉంది, కావున మల్టీకే లాంటి పోషకాలతో పాటుగా క్యాప్తన్+ హెక్సకోనజోల్ 1.5 గ్రాములు లేదా ప్రోపీకొనుజోల్ 1 మిల్లీలీటర్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే నివారించవచ్చునని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. అలాగే వరి పంటలో ఒకవేళ వరి నారు ముదిరినట్లయితే రైతు సోదరులు తప్పకుండా కొనలు తుంచి నాటు వేసుకోవాలి. దీని ద్వారా కాండం తొలచు పురుగు గుడ్లను నిర్మూలించుకోవచ్చన్నారు. నాటు వేసిన 20-25 రోజుల తర్వాత ఎకరానికి 8 నుండి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు తప్పకుండా వేసుకోవాలి తద్వారా కాండం తొలుచు పురుగును నిర్మూలించవచ్చన్నారు. కావున రైతు సోదరులు పైన సూచించిన సూచనలు పాటించి అధిక దిగుబడులు పొందాలని శాస్త్రవేత్తలు పలు గ్రామాల రైతులకు సూచించారు. అలాగే పత్తి పంటలో నీరు నిలబడి మొక్కలు వదలిపోయిన చోట కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రాములు, మరియు ప్లాంటమైసిన్ ఒక గ్రామ్, 10 లీటర్ల నీటితో కలిపి మొక్కల మొదలు దగ్గర పోయాలని, అదేవిధంగా రసం పీల్చే పురుగు ఉధృతి ఉన్నచోట ఇమిడాక్లోఫ్రైడ్ 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలని, గులాబీ రంగు పురుగు ఉధృతి గమనించడం కోసం లింగాకర్షక బట్టలు పెట్టుకోవాలని, అదేవిధంగా మొక్కజొన్నలో మువ్వు పురుగు ఉన్నచోట ఇమమెక్టిన్ బెంజోట్ నాలుగు మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలన్నారు. పెసర పంటలో క్లోరాంత్రిని రోల్ 60 గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేయాలని, వరి పంటలో నీరు తీసివేసి 35 కిలోల యూరియా, 15 కిలోల పోటాష్ వారం రోజుల్లో రెండు దాఫాలుగా వేసుకోవాలని, అదేవిధంగా వరిలో తుంగ నివారణ కోసం florpyrauxifen benzyle+సైహలొఫోప్ butyl, 500 మిల్లీలీటర్ ఒక ఎకరానికి స్ప్రే చేయాలని రైతులకు తెలపడం జరిగిందన్నారు.

రైతులకు సరిపడాయూరియా పంపిణీ చేయాలి..

రైతులకు సరిపడాయూరియా పంపిణీ చేయాలి

కేంద్ర ప్రభుత్వం రైతులకు,యూరియా పంపిణీ తగ్గించడం దుర్మార్గమైన చర్య

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు మానుకొని రైతులకు న్యాయం చేయాలి
ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపుల దోపిడి అరికట్టాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి ముషo రమేష్

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

ఈరోజు జిల్లా కేంద్రంలోని అమృత లాల్ శుక్ల కార్మిక భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు వానకాలానికి సరిపోవు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు అలాగే జిల్లాలోని సహకార సంఘ గోదాముల వద్ద తెల్లవారుజాము నుండే బార్లు తీరుతున్న రైతుల బాధలు పట్టించుకునే నాధుడే లేడని అన్నారు ఇంత జరుగుతున్నా జిల్లా వ్యవసాయ అధికారులు మాత్రం జిల్లాలో యూరియా కొరతలేదని రైతులు ఆందోళన చెందవద్దని ప్రకటనలు చేస్తున్నారని అన్నారు అలాగే ప్రైవేటు వ్యాపారులు కూడా ఇదే అదునుగా భావించి ఒక యూరియా బస్తా 310 రూపాయల నుండి 350 వరకు అమ్ముతూ యూరియాతోపాటు మిగతా పెటిలైజర్ కొంటేనే యూరియా ఇస్తామని అవసరం లేకున్నా దంటు గోళీలు గడ్డి మందు తదితర ఫెర్టిలైజర్ అంట కడుతున్నారని వారిపై వ్యవసాయ శాఖ ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఆయన అన్నారు గతంలో ప్రతి సహకార సంఘ గోదాముల్లో నిల్వ ఉండే యూరియా బస్తాలు నేడు కనిపించడం లేదని యూరియా బస్తాలు కేటాయింపుల్లో కూడా పెద్ద రైతులు భూస్వాములు లైన్లో ఎక్కడ కనిపించడం లేదని ఎక్కడ చూసినా సన్నకారు చిన్న కారు రైతులే ఇబ్బందులు పడుతున్నారని మరి వారికి యూరియా ఎలా అందుతుందో అర్థం కావడం లేదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి సీజనకు సరిపడా యూరియా సప్లై చేయాలని లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రైతులతో ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ,జవ్వాజి విమల పాల్గొన్నారు

వర్షపు నీటిలో ఎద్దు మృతి…

ప్రమాదవశాత్తు ఎద్దు మృతి

బోరన వినిపించిన రైతు ఎల్లయ్య

#నెక్కొండ ,నేటి ధాత్రి:

మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన రైతు బైరు ఎల్లయ్య వ్యవసాయ పనుల నిమిత్తం తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పనులు ముగించుకొని వస్తున్న సమయంలో మడిపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ లోతుగా ఉండడంతో అకాల వర్షాలకు కురిన వర్షపు నీరు రైల్వే అండర్ బ్రిడ్జి లో ఎక్కువగా ఉండడంతో పాడి ఎద్దు మృత్యువాత పడినట్టు రైతు బైరు ఎల్లయ్య తెలిపారు. వ్యవసాయానికి చేదోడు వాదోడుగా ఉన్న ఎద్దు మృత్యువాత పడడంతో రైతు బైరు ఎల్లయ్య బోరుణ విలపించారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.

తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు పంపిణీ

తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు పంపిణీ

మాజీ సర్పంచ్ నామాల సత్యవతి తిరుపతి

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం రామారావు పేట గ్రామపంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలలో నామాల వెంకన్న 13వ వర్ధంతి సందర్భంగా టై,బెల్ట్స్,ఐడెంటి కార్డ్స్,విద్యార్థిని,విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులు అందించారు.నామాల వెంకన్న కుమారులైన నమాల సత్యవతి తిరుపతి,జ్యోతి రవి,మాధురి శ్రీనివాస్ విద్యార్థిని,విద్యార్థులకు టై, బెల్ట్,ఐడికార్డ్స్ వారి నాన్న జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు సంతోష్ ఆధ్వర్యంలో బుధవారం అందజేశారు.ఈ సందర్భంగా నామాల తిరుపతి మాట్లాడుతూ..మన ప్రభుత్వ పాఠశాలను మనమే అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థిని,విద్యార్థులను ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు దీటుగా తయారుచేసి పోటీ పరీక్షల్లో ప్రైవేటు పాఠశాల విద్యార్థులపై నెగ్గే విధంగా తయారు చేయాలని అన్నారు.మా వంతుగా ప్రభుత్వ పాఠశాలకు ఏ అవసరమొచ్చిన సహాయం చేయడానికి ముందుంటామని తెలిపారు.అలాగే పాఠశాల ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు నామాల సత్యవతి తిరుపతి ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్ విజయ,యూత్ సభ్యులు శ్రీకాంత్, రాజకుమార్,శ్యామ్ కుమార్, శ్రీకర్,తదితరులు పాల్గొన్నారు.

మోదీ రైతు సంక్షేమ ప్రకటనకు మిశ్రమ స్పందనలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-25-3.wav?_=8

రాష్ట్ర రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన ప్రకటనకు ప్రభుత్వ అనుకూల రైతు సంఘాలు స్వాగతం పలికాయి. మంగళవారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ సంఘాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించే అన్యాయ సుంకాలపై భారత్ వెనక్కి తగ్గబోదని మోదీ చెప్పిన తీరు రైతులకు భరోసా కలిగించిందని పేర్కొన్నాయి.

భారతీయ రైతు చౌధరి చరణ్ సింగ్ సంస్థ జాతీయ అధ్యక్షుడు ధర్మేంద్ర చౌధరి, చత్తీస్‌గఢ్ యూత్ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అసోసియేషన్ నాయకుడు విరేంద్ర లోహాన్, భారతీయ కిసాన్ యూనియన్ (నాన్ పొలిటికల్) నేత ధర్మేంద్ర మాలిక్ — ఈ ముగ్గురూ మోదీ నిర్ణయం రైతు, పశుపాలక, మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడే దిశగా ఉందని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు.

కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నకిలీ ఎరువులు, రసాయనాల తయారీపై కఠిన చర్యలు తీసుకునే కొత్త చట్టాన్ని త్వరలో అమలు చేస్తామని, రైతుల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

అయితే ఎడమ భావజాల రైతు సంఘం ఆల్ ఇండియా కిసాన్ సభ మాత్రం మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. సంస్థ నాయకులు అశోక్ ధావలే, విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ, గత 11 ఏళ్ల పాలనలో రైతుల పోటీతత్వం దెబ్బతిందని, 2014లో ఇచ్చిన కనీస మద్దతు ధర హామీని అమలు చేయలేదని, రైతులు అప్పుల బారిన పడి ఆత్మహత్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రభుత్వ డేటా చెబుతోందని, కానీ రైతుల అప్పుల మాఫీకి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అదే సమయంలో ₹16.11 లక్షల కోట్ల కార్పొరేట్ అప్పులను మాఫీ చేశారని ఆరోపించారు. వ్యవసాయ, అటవి, ఖనిజ, నీటి వనరులు దేశీయ, విదేశీ కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తున్నాయని వారు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version