స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థులు దరఖాస్తులకు ఆహ్వానం

స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థులు దరఖాస్తులకు ఆహ్వానం

జిల్లా క్రీడల శాఖ అధికారి రఘు

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా స్తాయి స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్ 2026-27
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాలనుసారం, జిల్లా కలెక్టర్ అనుమతి తో 2026-27 సంవత్సరానికి గాను నాలుగవ తరగతి బాల బాలికలకు స్పోర్ట్స్ స్కూల్ నందు ప్రవేశం కొరకు జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించబడును.
కావున జిల్లా పరిధిలోని బాలబాలికలకు ఈనెల 30 న ఆంబేద్కర్ స్టేడియం, కృష్ణ కాలనీ, భూపాలపల్లి నందు ఎంపిక పోటీలు జరుగును. బాల బాలికలకు ఎత్తు, బరువు, 800 మీటర్ల పరుగు, 6 x 10 మీటర్ల షటిల్ రన్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, మెడిసిన్ బాల్ పుట్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ అను తొమ్మిది రకముల పోటీలు నిర్వహించబడును. ఇందులో అర్హత సాధించిన బాలబాలికలను 10 మంది బాలురు 10 మంది బాలికలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయిలో జరిగే ఎంపికలకు పంపించడం జరుగును.
కావున జిల్లాస్థాయి ఎంపికలకు హాజరగు బాలబాలికలు తమ వెంట జనన ధ్రువీకరణ పత్రము, కుల ధ్రువీకరణ పత్రం, వయస్సు స్టడీ ధ్రువీకరణ పత్రము, ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆధార్ కార్డు 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు (ఒరిజినల్ మరియు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు) తప్పక తీసుకురాగలరని జిల్లా యువజన క్రీడల అధికారి, చిర్ర రఘు ఒక ప్రకటనలో తెలిపారు

వ్యవసాయ బావిలో కాలుజారి పడి వ్యక్తి మృతి

వ్యవసాయ బావిలో కాలుజారి పడి వ్యక్తి మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలం చిరాగ్పల్లి గ్రామానికి చెందిన రఘు (42) వ్యవసాయ బావిలో కాలుజారి పడి మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే జహీరాబాద్ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది, SDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశాయి. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

భాద్యతలు చేపట్టిన టౌన్ సీఐ రఘు.

భాద్యతలు చేపట్టిన టౌన్ సీఐ రఘు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణ సీఐగా లేతాకుల రఘు బుదవారం నూతనంగా భాద్యతలు చేపట్టారు.నర్సంపేట పట్టణ సీఐగా భాద్యతలు నిర్వర్తించిన సీఐ రమణమూర్తి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీసీఎస్ కి బదిలీపై వెళ్ళారు.కాగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సీఐ రఘు నర్సంపేట పట్టణం సీఐగా నియమితులను చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.కాగా లేతాకుల రఘు పట్టణ సిఐగా పోలీస్ స్టేషన్ లోని తన కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా సీఐ రఘు మాట్లాడుతూ
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు.లా అండ్‌ ఆర్డర్‌ పై ప్రత్యేకంగా నిఘ ఉంచడం జరుగుతుందని తెలిపారు. మత్తుపదర్థాలు,గంజాయి,గుట్కా,అంబర్ లాంటి నిషేధిత పదార్థాలపై ఎప్పటికప్పుడు అన్వేషణ ఉంటుందని సీఐ రఘు తెలిపారు.ముందుగా భాద్యతలు చెకట్టేందుకు వచ్చిన సీఐ రఘుకు ఎస్సైలు, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version