ఎమ్మెల్యే మాణిక్ రావును అవమానించారు: బండి మోహన్ ఆరోపణ.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావును వేదికపైకి పిలవకుండా అధికారులు అవమానించారని ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండి మోహన్ ఆరోపించారు. దళితుడైనందుకే ఎమ్మెల్యేను అవమానించారని, దీనిని దళిత సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని, ఎమ్మెల్యే సూచనల మేరకు అర్హులకు వెంటనే ఇళ్ల తాళాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.