యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు
* రైతుల గొస పంచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
మరిపెడ నేటిధాత్రి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో రైతులు యూరియా కొరతతో గురువారం రోజున ఆర్ అండ్ బీ అతిథి గృహం ముందు రైతులు ధర్నా నిర్వహించారు,మరిపెడ మండల నికి 45 నుండి 50 గ్రామపంచాయతీలు అనుసంధానం గా ఉండడంతో ప్రతి గ్రామంలో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులకు ఒక్కసారిగా యూరియా అవసరము పడడంతో యూరియా కొరత ఏర్పడింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, వర్షాకాలం కావడం తో రవాణా సదుపాయం చురుగ్గా లేకపోవడం సమయానికి యూరియా అందుబాటు కాలేకపోవడంతో యూరియా కొరత ఏర్పడింది. దూర ప్రాంతం నుండి వచ్చిన రైతులు ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ యూరియా కోసం తిండి తిప్పలు లేకుండా షాపుల ముందు లైన్లో నిలబడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు రైతులు వాపోయారు. పైమందులు తీసుకుంటేనే యూరియా బస్తా ఇస్తామని షాపు యజమానులు ఇబ్బందులు పడుతున్నారన్నారు,గత ప్రభుత్వంలో ప్రతి రైతుకు యూరియా సరిపడా బస్తాలు ఇచ్చేవారని ఇప్పుడు ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తున్నారని ఇచ్చిన యూరియా బస్తాలు వ్యవసాయానికి సరిపోక పోవడంతో ఏం చేయాలో తోచడం లేదని సదరు రైతులు వాపోయారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని యూరియా కొరతను తీర్చి ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన అధికారులని కోరారు.