రైతు బీమా దరఖాస్తులకు ఆహ్వానం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-11-1.wav?_=1

రైతు బీమా దరఖాస్తులకు ఆహ్వానం

◆:- రైతు బీమా – నమోదుకు 13.08.2025 చివరి తేదీ

◆:- మండల వ్యవసాయ అధికారి వెంకటేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని రైతులు రైతు బీమా గురించి కేవలం 4 రోజులు సమయం ఉన్నది
05-06-2025 నాటికి భూభారతి పోర్టల్‌లో డిజిటల్ సైన్ చేసిన పట్టాదారుల వివరాలు మరియు కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ నుండి అందిన ROFR పట్టు హోల్డర్ల వివరాలు ఆధారంగా పాత/కొత్త అర్హులైన రైతుల బీమా పునరుద్ధరణ/నమోదు జరుగుతుంది.18 నుండి 59 సంవత్సరాల వయస్సు (పుట్టిన తేదీ 14-08-1966 నుండి 14-08-2007 వరకు, రెండు తేదీలు కలుపుకొని) ఉన్నవారు మాత్రమే అర్హులు.నమోదు కోసం రైతు తప్పక ఈ పత్రాలు ఒరిజినల్ మరియు జీరోక్స్ కాపీలను తీసుకురావాలి
1. రైతు ఆధార్ కార్డు
2. భూమి పట్టా పాస్‌బుక్
3. నామినీ ఆధార్ కార్డు
4. రైతు బీమా Enrollment ఫామ్
రైతు తప్పక హాజరు కావలెను.

Agriculture Officer Venkatesham

(వాట్సప్ ద్వారా కానీ ఇతర వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ పంపుతాము మేము చాలా దూరంలో ఉన్నాము ఇంత తక్కువ సమయంలో మేము రాలేము అని దయచేసి భీమ చేయండి అని అడగొద్దు రైతు తప్పక వొచ్చి సంతకం చేయాలి.)
భూమి కలిగి ఇంకా రైతు బీమా నమోదు చేయని రైతుల వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల రైతు వేదిక ఆఫీసర్ లో వద్ద అందుబాటులో ఉన్నాయి. దయచేసి సంప్రదించండి.

నాణ్యమైన విత్తనాలు విత్తనాలను సందర్శించిన..

నాణ్యమైన విత్తనాలు విత్తనాలను సందర్శించిన మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని కప్పాడ్ గ్రామంలో పలు పంటలను వ్యవసాయ అధికారి వెంకటేశ్ సందర్శించడం జరిగింది. అందులో భాగంగా గ్రామంలో నాణ్యమైన విత్తనాలు సంబంధించిన పెసర పంటను సందర్శించడం జరిగింది ప్రస్తుతం పెసర పంట 60 రోజుల దశ లో ఉంది దీనికి పోతదశలో ముఖ్యంగా పోషకాల లోపం లేకుండా 19:19:19 ఒక కిలో ఎకరానికి మరియు పత్తి. పంటను సందర్శించడం పంటల దిగుబడికి విడతల వారిగా కాంప్లెక్స్ ఎరువులు
మరియు ముఖ్యంగా యూరియా వాడకం తగ్గించాలి నానో యూరియా స్ప్రే చేసుకోవాలి ఇందులో వ్యవసాయ విస్తరణ అధికారి హరి కృష్ణ, రైతులు రమేష్, నర్సింలు, కృష్ణ పాల్గొన్నారు.

రైతుల ఖాతాలో డబ్బులు జమ..

రైతుల ఖాతాలో డబ్బులు జమ
.. మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-02T131331.402.wav?_=2

నిజాంపేట, నేటి ధాత్రి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిఎం కిసాన్ పథకంలో భాగంగా శనివారం రోజున వారణాసిలో ప్రధాని విడుదల చేసిన పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యాయని నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సోమ లింగారెడ్డి అన్నారు ఈ మేరకు నిజాంపేటలో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 6091 మంది లబ్ధిదారులకు నిధులు జమ అయ్యాయని పేర్కొన్నారు మరో 300 మంది రైతులు ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు

గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణం ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎరువుల దుకాణాన్ని జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది ముందుగా వారు స్టాక్ బోర్డును పరిశీలించి 616 యూరియా బ్యాగులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని రైతులు అధైర్య పడద్దని రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంటాయని వారు తెలియజేయడం జరిగింది వారితో పాటు డి ఏ ఓ బాబురావు ఎం ఏ ఓ ఐలయ్య ఎమ్మార్వో మధురకవి సత్యనారాయణ స్వామి ఎంపీడీవో భాస్కర్ గణపురం మండల స్పెషల్ ఆఫీసర్ కుమారస్వామి పాల్గొనడం జరిగింది

పంటలను సందర్శించిన శాస్త్రవేత్తల బృందం

పంటలను సందర్శించిన శాస్త్రవేత్తల బృందం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వరంగల్ శాస్త్రవేత్తల బృందం భూపాలపల్లి జిల్లా లోని, మొగుళ్లపల్లి మండలం, రంగాపురం గ్రామంలో వివిధ పంట పొలాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్. యు నాగభూషణం మాట్లాడుతూ రైతులు కలుపు యాజమాన్యం పై రైతు జాగ్రత్త వహించాలని.. గడ్డి జాతి కలుపు మొక్కల నివారణకు ఫినాక్సి ప్రాప్ ఈథైల్ (రైస్ స్టార్) అనే మందును ఎకరాకి 350 మిల్లీమీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించారు. అలాగే వెడల్పాటి ఆకు కలుపు మరియు తుంగ నిర్మూలనకై ట్రై ఫోమో + ఈత్ ఆక్సీ సల్ఫురాన్
( కౌన్సిల్ ఆక్టివ్) మందును ఎకరానికి 90 గ్రాములు చొప్పునరో డువందలులీటర్ల నీటిలో పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించారు.. అలాగే పత్తి పంటలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రసం పీల్చేచే పురుగుల నివారణకై వేప నూనె (1500 పి పి ఎం) ఎకరాకు లీటర్ మందు చొప్పున లేదా అసిఫేట్ ఎకరాక మూడు వందల గ్రాములు చొప్పున పిచికారి చేసుకోవాలని. అంతేకాకుండా 1:4 నిష్పత్తిలో మోనోక్రోటఫాస్ లేదా 1:20 నిష్పత్తిలో ఇమిడా క్లోరోప్రీడ్ లేదా ఫ్లునికామైడ్ మందును నీటిలో కలుపుకొని బొట్టు పెట్టే పద్ధతి ద్వారా లేత కారణానికి అంటే విధంగా మొక్కలకు పూసుకోవాలి అని సూచించారు. ఈ బృందం సభ్యులు శాస్త్రవేత్త డా// ఆర్ విశ్వతేజ, మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి, తో పాటు ఏ ఈ ఓలు, అభ్యుదయ రైతులు పోలినేని రాజేశ్వర్ రావు,ఎర్రబెల్లి శ్రీనివాస రావు పాల్గొన్నారు.

గత బీఆర్‌ఎస్ పాలన గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడింది..

గత బీఆర్‌ఎస్ పాలన గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడింది

వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య

వర్ధన్నపేట,(నేటిధాత్రి):
వర్ధన్నపేట మండల కేంద్రంలో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు &వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అబిడి రాజ్ రెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్ లు విలేఖర్లతో మాట్లాడుతూ.
గత బి.ఆర్.ఎస్ పాలనలో హరిజన – గిరిజనులపై దాడులు జరిగినవి ఎస్టీ సంక్షేమ అభివృద్ధి కోసం పది సంవత్సరాల కాలములో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలే,ఎస్సీ -ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి హరిజన ,గిరిజన కాలనీ, గూడలా లో అభివృద్ధి చేస్తే గత బి.ఆర్.ఎస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం చేసి ఎస్సీ, ఎస్టీ కాలాని, గూడ లలో ఒక్క పైసా పనికూడా చేయలేదు తండాలు గ్రామ పంచాయతీలు గా ఏర్పాటు అయితే బి.ఆర్. ఎస్ పాలనలో పంచాయతీ కార్యాలయా లు కట్టించ లే,అక్కడ ఏలిన సర్పంచ్ లకు నిధులు ఇవ్వలేదు, నిధులు ఇవ్వక పోయే సరికి ఆత్మహత్య లు చేసుకోవడం జరిగింది.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు గిరిజనుల సంక్షేమ ము కోసం 17,169 కోట్లు కేటాయించి మూత వేయబడ్డ కార్పొరేషన్ ,తెరిపించి ,గిరిజన యునివర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది,గత బి.ఆర్.ఎస్ పాలనలో సమగ్ర సర్వే చేసి బయట పెట్టకుండా దాస్తే,కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుల గణన విషయంలో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నది. కులగణన ద్వారా భవిష్యత్ లో ఎస్టీ,ఎస్సీ,బిసి, మైనార్టీ వర్గాల ప్రజలకు ఉపయోగ కారంగా ఉంటుంది.కనీసం గిరిజన యునివర్సిటీ కట్టని చరిత్ర బి.ఆర్.ఎస్ పార్టీ ది.
బిసి లుగా కోన సాగిన గిరిజనులను ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది,1975 లో గిరిజనులకు వ్యవసాయ భూములు ఇచ్చి,ఇండ్ల ప్లాట్లు ఇచ్చి ఇండ్లు కట్టించింది, వ్యవసాయం చేసుకోవడం కోసం బ్యాంకులను జాతీయం చేసి పెట్టుబడులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ,పోడు భూముల కోసం 1/70 యాక్ట్ చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది,గిరిజనుల కోసం కాంగ్రెస్ పాటుపడింది,మరి గిరిజనుల కోసం బి.ఆర్.ఎస్ పార్టీ ఏమి అభివృద్ధి చేసిందో గమనించాలని గిరిజన సోదరులను కోరుచున్నాం.

బ్యాంక్ సిబ్బంది పనితీరును ప్రశ్నించిన రైతు హక్కుల సాధన..

బ్యాంక్ సిబ్బంది పనితీరును ప్రశ్నించిన రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షులు

◆: -ఆర్ టి హెచ్ ఎస్ ఎస్ అధ్యక్షుడు చిట్యం పల్లి బాలరాజ్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T140852.758.wav?_=3

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ కవెలి గ్రామములో గల కెనరా బ్యాంక్ అకౌంట్ కలిగిన రైతుల నమ్మదగిన సమాచారం మేరకు స్పందించిన రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజు కెనరా బ్యాంక్ యజమాన్యం పనితీరు ను ప్రశ్నిస్తూ వారు మాట్లాడుతూ అందుబాటులో లేని బ్యాంకు మేనేజర్ అని బ్యాంకు యజమాన్యం తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరును పసిగడుతూ బ్యాంకు యొక్క గేటుకు ముందుగా కంప్యూటర్ సిస్టం పనిచేయటం లేదు బోర్డు పెట్టడం జరిగింది. మేనేజర్ సన్న చిన్నకారి రైతు చిన్నచూపు చూస్తూ వారికి ఎలాంటి లోన్ ఇవ్వడం లేదు. కేంద్ర ప్రవేశపెట్టిన సన్నా సన్న చిన్నకారి బిజినెస్ చేసుకోవడం ముద్ర లోన్ గాని ఇవ్వడం లేదు. ఇకనైనా పై అధికారులు స్పందించి కెనరా బ్యాంకులో అకౌంట్ కలిగిన రైతులకు సమస్యలు త్వరగా తీర్చే విధంగా చూడాలని అధికారులు ఆదేశించారు.

కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలి…

కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలి…

కోతుల బెడద వల్ల వ్యవసాయ రంగానికి రక్షణ లేకుండా పోయింది…

రోడ్లపైకి వెళ్ళుటకు జంకుతున్న ప్రజలు…

పాఠశాలకు వెళ్లడానికి భయపడుతున్న విద్యార్థులు…

కోతులకు ప్లానింగ్ ఆపరేషన్ చేయాలని కోరుతున్న ప్రజలు…

రాష్ట్రపతి ద్రౌపది మూర్ముకు లేక రాసిన సామాజికవేత్త కందునూరి ఈశ్వర్ లింగం…

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-

గార్ల మండల వ్యాప్తంగా 20 గ్రామపంచాయతీలతో పాటు,ముఖ్యంగా గార్ల పట్టణ కేంద్రంలో కోతులు జనవాసాలలోకి గుంపులు, గుంపులుగా ఇండ్లలోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.కోతుల బెడద రోజురోజుకు పెరిగిపోతుంది.ఆకలితో అలమటిస్తూ,అడవులను వదిలేసి గ్రామాల్లో ప్రజలపై దాడులు చేస్తున్నాయి.కోతుల దాడులలో గాయపడిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.గ్రామాల్లో ఇంటి తలుపులు వేయడం మర్చిపోతే ఇక అంతే సంగతులు కోతులు ఇంట్లోకి ప్రవేశించి వంట సామాగ్రి, దుస్తులు,ఆహార పదార్థాలు చిందర-వందర చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. తమ అవసరాల కోసం ప్రజలు రోడ్లపైకి వెళ్లడానికి జంకుతున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి భయపడుతున్నారు.వసతి గృహాలలో ఉన్న విద్యార్థినీ, విద్యార్థులు కోతుల బారినపడి గాయాలైన సందర్భాలు కో కొల్లలుగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడద వల్ల మండల వ్యాప్తంగా రైతాంగానికి, వ్యవసాయ రంగానికి రక్షణ లేకుండా పోయింది. పండించిన పంటను చేతికొచ్చే సమయంలో కోతులు ఆగం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులకు ప్లానింగ్ ఆపరేషన్ చేయాలని ప్రజలు ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు.ఇప్పటికే కోతుల నివారణ చర్యలు చేపట్టాలని సామాజికవేత్త రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కు లేఖ రాశారు. రాష్ట్రపతి కార్యాలయానికి ఈశ్వర్ లింగం రాసిన లేక అందినట్లు తనకు లేఖ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.అనేక దఫాలుగా కోతుల నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరినప్పటికీ సమస్య పరిష్కారానికి కృషి చేయడంలో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సాధ్యమైనంత త్వరగా కోతుల నివారణ చర్యలు చేపట్టాలని విద్యార్థులు,విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.

ఎరువుల షాపులలో ఆకస్మికంగా తనిఖీ..

ఎరువుల షాపులలో ఆకస్మికంగా తనిఖీ

మొగుళ్ళపల్లి ఎస్సై బి అశోక్
మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం, మొగుళ్ళపల్లి (PACS) వద్ద యూరియా మరియు ఇతర ఎరువుల విక్రయాల పై స్థానిక ఎస్సై బి. అశోక్ , మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి తానిఖీ నిర్వహించడం జరిగింది. తానిఖీలో యూరియా మరియు ఇతర ఎరువుల లభ్యత మరియు నిల్వలకు సంబంధించిన వివరాలు, కొనుగోలు రశీదులు, అమ్మకపు బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డు, ధరల పట్టికలు మొదలగునవి పరిశీలించి తానిఖీ చేయడం జరిగింది. అలాగే ప్రతి రైతుకి వారి యొక్క వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని బట్టి, రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం సిఫారసు మేరకే యూరియా మరియు ఇతర ఎరువుల బస్తాలను రైతులకి పంపిణీ చేయాలని సూచించడం జరిగింది. అలాగే, నానో యూరియా మరియు నానో డి‌ఏ‌పి వాడకం, నానో యూరియా వాడడం వల్ల కలిగే లాభాలు మరియు సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయ మార్గాల గురించి రైతులకు సూచించడం జరిగింది.
మొగుళ్ళపల్లి మండల డీలర్లు సూచించబడిన చట్టలకు లోబడి విక్రయాలు జరపవాల్సిందిగా కోరడమైనది, లేని ఎడల సదరు చట్టలలో పొందపరిచిన నియమాలనుసారంగా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడుతాయని తెలియపర్చడం జరిగింది ఈ PACS, మొగుళ్ళపల్లి వద్ద 444 బస్తాలు, PACS, మొట్లపల్లి వద్ద 444 బస్తాలు, PACS, ఇస్సిపేట వద్ద 444 బస్తాలు మరియు అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద 222 బస్తాలు వచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది, కావున రైతులు మీ యొక్క పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ మరియు ఆధార్ కార్డు తో సంబంధిత కేంద్రాలనుండి ఎరువులను పొందగలరు.
ఇట్టి తానిఖీలో CEO A. సాగర్ PACS పంపిణీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

ఎరువుల డీలర్లు ప్రతి రైతుకు విధిగా బిల్లులు ఇవ్వాలి

ఎరువుల డీలర్లు ప్రతి రైతుకు విధిగా బిల్లులు ఇవ్వాలి

ఎవరైనా డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడితే చట్టపరమైన చర్యలు

మండల వ్యవసాయ అధికారి…. బి వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్, మరియు జిల్లా వ్యవసాయ అధికారి మహబూబాబాద్ ఆదేశాల మేరకు, శనివారం కేసముద్రం మండలంలోని పలు ఎరువుల దుకాణాలు, మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను, ఆగ్రో రైతు సేవ కేంద్రాలను కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న, మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు తనిఖీలు చేయడం జరిగింది, పలు దుకాణాలలో వారు యూరియా నిలువలు, లైసెన్స్, పి ఓ ఎస్ మిషన్ బ్యాలెన్స్ మరియు, స్టాక్ బోర్డు, స్టాక్ రిజిస్టర్ బ్యాలెన్స్, గోదాం బ్యాలెన్స్ తనిఖీలు చేయడం జరిగింది.
కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న మాట్లాడుతూ, కేసముద్రం మండలంలోని ఎరువుల డీలర్లు, ప్రాపర్ గా, స్టాక్ బోర్డు మరియు, గోదాం బ్యాలెన్స్,స్టాక్ రిజిస్టర్ బ్యాలెన్స్, పి ఓ ఎస్ బ్యాలెన్స్ మెషిన్ తో సమానంగా ఉండేటట్లుగా ప్రతిరోజు అప్డేట్ చేసుకోవాలని వారు సూచించారు, ఎరువుల డీలర్లు ప్రతి రైతుకు విధిగా బిల్లులు ఇవ్వాలని, బిల్లుల మీద రైతు సంతకాలు తీసుకోవాలని, ఎవరైనా డీలరు బ్లాక్ మార్కెటింగ్ పాల్పడిన, అధిక ధరలకు విక్రయించిన, నిత్యావసర వస్తువుల చట్టం 1955 మరియ ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు సూచించారు. అదేవిధంగా రైతులు ఆధార్ కార్డు మరియు పట్టాదార్ పాస్ బుక్ జిరాక్స్ నకలు ను తీసుకువెళ్లి యూరియా మరియు ఇతర ఎరువులను కొనుగోలు చేయాలని వారు సూచించారు.
అదేవిధంగా నానో యూరియా వాడకాన్ని రైతులు అలవాటు చేసుకోవాలని, అది కూడా గ్రాన్యూలార్ యూరియా వలె పని చేస్తుందని, వారు తెలిపారు.
కేసముద్రం మండలంలో యూరియా నిల్వలు 389 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని, 1) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవ కేంద్రాల వద్ద 210 మెట్రిక్ టన్నులు, 2) ప్రవేట్ దుకాణాల వద్ద 179 మెట్రిక్ టన్నులు యూరియా రైతులకు అందుబాటులో ఉన్నందున రైతులు ఎవరు ఆందోళన చెందువద్దని, విడతలవారీగా మండలానికి యూరియా వస్తున్నందున రైతులు పత్తి, మొక్కజొన్న మరియు ఇతర పంటలకు మోతాదులో మాత్రమే వినియోగించాలని వారు సూచించారు, ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న మరియు ఆయా క్లస్టర్ల వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి…

రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి…

వరి పంటలో కలుపు ను నివారించాలి…

పురుగులు,తెగుళ్ల నుండి కాపాడటానికి సస్యరక్షణ పద్ధతులు పాటించాలి…

మోతాదుకు మించి యూరియా వాడటం ద్వారా చీడపీడల ఉధృతి అధికమవుతుంది…

రైతులు జింక్ సల్ఫేట్ ను వినియోగించాలి…

గట్ల మీద బంతి మొక్కలు నాటుకోవాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T145747.284.wav?_=4

నేటి ధాత్రి -గార్ల :-

రైతులు వరి పంట సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చునని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు అన్నారు.శనివారం మండల పరిధిలోని శేరిపురం గ్రామంలో వరి నాట్లు వేసే క్షేత్రాన్ని రైతులతో కలిసి సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,రైతుల పంట పొలాల్లో జింక్ లోపం అధికంగా ఉన్నదని, రైతులు నాట్లు వేసే ముందు ఎకరాకు 20 కేజీల ముడీ జింక్ సల్ఫేట్ ను ఆఖరి దమ్ములో కాంప్లెక్స్ ఎరువులతో కలపకుండా విడిగా వేయాలని సూచించారు. జింక్ లోపం ఉండడం వలన మొక్కలో ఎదుగుదల లోపించి గిడసబారుతాయని తెలిపారు. రసాయన ఎరువులు మితంగా వాడాలని యూరియా మోతాదుకు మించి అధికంగా వాడటం వలన చీడపీడల ఉధృతి అధికమవుతుందని తెలిపారు.నాటు వేసే ముందు ఎకరాకు ఒక బస్తా డిఏపి కానీ 20-20-0-13 కానీ లేదా 2బస్తాలు సూపర్ పాస్పేట్ ను 25 కేజీల పోటాష్ తో కలిపి వేయాలని, రెండవ దఫా ఒక బస్తా యూరియాను నాటు వేసిన 20నుంచి 30 రోజులలో అర లీటర్ నానో యూరియా ను పై పాటుగా స్ప్రే చేయాలనీ సూచించారు.వరి చిరు పొట్ట దశలో 25 కేజీల యూరియా 25 కేజీల మూరెట్ ఆఫ్ పొటాష్ తో కలిపివేయాలని అన్నారు.మన భూములలో భాస్వరం నిలువలు అధికంగా పంటకు అందనిలేని స్థితిలో ఉన్నాయని వాటిని కరిగించి మొక్కలకు అందుబాటులోకి తేవడానికి పాస్పో బ్యాక్టీరియాను వాడాలని, తద్వారా రైతులకు రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుందని అన్నారు.రైతులు యాజమాన్య,సస్యరక్షణ పద్ధతుల కొరకు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ శేరిపురం విస్తరణ అధికారి రాజ్యలక్ష్మి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

తొలకరి పలకరింపులతో మొదలైన సాగుబడి.

*తొలకరి పలకరింపులతో మొదలైన సాగుబడి.

వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య*
ఏరువాకకు సిద్ధం అంటున్న రైతులు- రైతన్నలకు బాసటగా నిలుస్తున్న ప్రజాప్రభుత్వం*

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T133619.125.wav?_=5

వర్దన్నపేట( నేటిధాత్రి ):
వర్ధన్నపేట మండలం, నల్లబెల్లి గ్రామంలో వర్ధన్నపేట మండల వ్యవసాయ అధికారి విజయకుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎరువాక-సాగుబడి కార్యక్రమానికి వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య & కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో తొలకరి పలకరింపులతో సాగుబడి మొదలవుతుంది అందుకు రైతన్నలు భూములు సిద్ధం చేసుకుని రోహిణి కార్తిలో విత్తనాలు నాటడం మొదలవుతూ రైతన్నలు ఏరువాకకు సిద్ధమవుతారు అని అన్నారు.అదేవిధంగా మృగశిర కార్తిలో వ్యవసాయ సాగుబడి ఊపందుకోవడం ఆనాతిగా వస్తున్న సాంప్రదాయం అని అన్నారు.
గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతన్నలకు వ్యవసాయం ఒక గుదిబండగా మారిందని అన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వ్యవసాయం దండుగ కాదు ఒక పండుగ అని నిరూపిస్తుందని అన్నారు.
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసిఆర్ వరి వేసుకుంటే ఉరే అని వ్యవసాయాన్ని హెద్దెవా చేశారు. కానీ నేటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరి వేసుకొని సన్నాలు పండిస్తే మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాలుకు 500/- బోనస్ ఇస్తూ రైతన్నలను ఆదుకుంటుంది మన ప్రజాప్రభుత్వం అని అన్నారు.
తెలంగాణ రైతన్నలకు ప్రజాప్రభుత్వం నాణ్యమైన ఎరువులు విత్తనాలు సబ్సిడీపై అందిస్తుందని అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మి అటువంటి వారిపై పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టడం జరుగుతుందని తెలిపారు. కావున రైతులు ఎవరు అధైర్య పడకూడదు ఏరువాక మొదలై సాగుబడి ప్రారంభమవుతున్న ఈ తరుణంలో రైతులు వ్యవసాయాన్ని ఒక పండుగలా చేసుకోవాలని హితవు పలికారు.
ఈ ఖరీఫ్ మొదలు ప్రారంభంలోనే రైతు భరోసా కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని ఒకే రోజులో 70 లక్షల మంది రైతులకు 9900 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు.
యూరియా కొరత లేదు యూరియా మోతాదు మించకుండా వాడుకోవాలి నికర లాభాలు పొందాలి రైతుల సిఫారసు చేయబడ్డ మోతాదులో మాత్రమే యూరియా వాడాలి సాగు ఖర్చులు తగ్గించుకోవాలి .అధిక యూరియా వాడడం వల్ల పంటలలో చీడ పీడలు మరియు వాతావరణ నీటి కాల్షియం మరియు భూసార తగ్గుదల జరుగుతుంది.నాన్ యూరియా స్ప్రే చేసుకొవాలి , గుళికల యూరియా వినియోగాన్ని తగ్గించుకోవాలి.

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు…

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు…

నేటి ధాత్రి -గార్ల :-

ఎరువులు అధిక ధరలకు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకొంటామని ఎంతటి వారైనా ఉపేక్షించ బోమని మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ వ్యవసాయ అధికారి అజ్మీరా శ్రీనివాస్ రావు ఎరువుల డీలర్లను ను హెచ్చరించారు.శుక్రవారం గార్ల మండల పరిధిలోని పుల్లూరు మరియు గార్ల లో పలు ఎరువుల దుకాణం లను మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు తో కలిసి తనిఖీ చేపట్టారు.స్టాక్ బోర్డు, స్టాక్ రిజిస్టర్,ఇన్వాయిస్ లు, ఈపాస్ మెషిన్స్ క్షుణ్ణంగా పరిశీలించినారు.రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎరువులను సాఫీగా పంపిణీ చేయాలని డీలర్స్ ను కోరారు.ఎరువులు జిల్లా లో సరిపడా అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మోతదు కు మించి రసాయన ఎరువులు వాడవద్దని రైతులకు సూచించారు.ఎరువులు అమ్మకం లో అక్రమాలకు పాల్పడితే సంబందించిన ఎరువుల లైసెన్స్ రద్దు చేస్తామని హేచ్చరించినారు.

ఆయిల్ పామ్ పంట పై అవగాహన సదస్సు.

ఆయిల్ పామ్ పంట పై అవగాహన సదస్సు :

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝారసంగం మండలంలో రైతుబంధు ఆయిల్ పామ్ మరియు మామిడి పంటల మీద ఆహ్వాన సదస్సు నిర్వహించడం జరిగింది ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది మరియు సంగారెడ్డి జిల్లాలో 3000 ఎకరాల oil palm సాగులో ఉంది ఈ సంవత్సరం 3750 ఎకరాలు ప్రభుత్వం టార్గెట్ నిర్ణయించబడినది అదే విధంగా ఝరాసంగం మండలంలో 160 ఎకరాలకు సాగులో ఉంది మరియు కొత్తూరు D నర్సరీలొ 150000 మొక్కలను,ఆయిల్ పామ్ పంటని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు మరియు కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యాన శాస్త్రవేత్త శైలజ గారు మామిడిలో చేపట్ట వలసిన యాజమాన్య చర్యలు మరియు సస్యరక్షణ చర్యల మీద వివరించడం జరిగింది. తదుపరి మామిడి తోటలో చేపట్ట వలసిన కొమ్మ కత్తిరింపులను క్షేత్రం లో చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి సునీత రోజు గారు వ్యవసాయ అధికారి వెంకటేష్ గారు కెవికె సైంటిస్ట్ శిరీష గారు మరియు ఏపీవో రాజ్ కుమార్ గారు ఏఈఓ జ్ఞానం గారు గోద్రెజ్ ఆగ్రోవేట్ ప్రతినిధులు కొండలరావు గారు, రాజేష్ రెడ్డి, దినేష్ మరియు డ్రిప్పు ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.

రైతులంటే అధికారులకు చిన్న చూపా.

రైతులంటే అధికారులకు చిన్న చూపా

* ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్

మహదేవపూర్ జూలై 23 (నేటి దాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని అగ్రికల్చర్ ఆఫీసులో చేయాల్సిన ఆన్లైన్ పనులు మీ సేవ లకు అప్పజెప్పి కమిషన్లు దొబ్బుతూ రైతులను అధికారులు చిన్నచూపు చూస్తున్నారని బుధవారం రోజున ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ ఒక ప్రకటనలో అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయడం తమకేం సంబంధం లేనట్టుగా అంత ఆన్లైన్ సెంటర్లో ఆన్లైన్ చేసుకోవాలని ఏ ఈ ఓ లు వ్యవహరిస్తున్నారని, రైతులకు సంబంధించిన ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ మరియు ప్రభుత్వ పథకాల సేవలను గాలికి వదిలేస్తూ దర్జాగా ఉంటున్నారనీ, మండలంలో ఉన్నటువంటి ఏవో కనీస పర్యవేక్షణ చేయకుండా చూస్తూ ఉండడం గమనార్థమని, రైతులని ఇబ్బంది పెట్టే విధంగా ఉందని మండిపడ్డారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ల కోసం రైతుల నుండి మీసేవ, ఆన్లైన్ సెంటర్ లు డబ్బులు వసూలు చేస్తూ కమిషన్ రూపం లో ఏఈవోలకు పైసలు ముట్ట చెపుతున్నారని అన్నారు. రైతులకు సమస్య వస్తె పరిష్కారం కోసం చెప్పులు అరిగేలా తిరుగాల్సిందే కానీ పరిష్కారం కాదని, రైతుల దగ్గర డబ్బులు ఉంటే గాని వ్యవసాయ శాఖ కార్యాలయానికి రాలేని పరిస్థితి నెలకొందని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం తో గత్యంతరం లేక రైతులు పైసలు పెట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను మీసేవ, ఆన్లైన్ సెంటర్ లలో చేసుకుంటున్నారని అన్నారు.

క్షుద్బాధతో భిక్షాందేహి అని చేయి చాపితే ఛీదరించుకుంటున్నారు.

హైదరాబాద్,నేటి ధాత్రి:

క్షుద్బాధతో భిక్షాందేహి అని చేయి చాపితే ఛీదరించుకుంటున్నారు.
దొంగ బాబాలు చేయిచాపి చాపకముందే కోట్లు కుమ్మరిస్తారు.

తినేందుకు ఏమిలేక ఆకలై అడిగితే అది ముష్టేనట
బడా బాబులు అడిగితే అది భక్తేనట

కొబ్బరి కాయలు, పూలదండలు అమ్మేవాళ్ళ వద్ద గీచిగీచి బేరాలాడుతుంటారు.
దేవుడి హుండీలో దక్షిణ పూజ టిక్కెట్ వద్ద బేరసారాలు గుర్తుకురావంటారు.

విలాసవంతమైన సూపర్ మార్కెట్లో సరకులు కొని మారు మాట్లాడకుండా బిల్లు కట్టుతారు.
చిన్న చితక కిరాణా కొట్టులో గీచిగీచి బేరంఆడి సరకులు కొని బిల్లు కట్టుతారు.
ఎందుకనో
ఈ వ్యవస్థ మారాలని కోరుకుంటూ.

రచన ✍️మంజుల పత్తిపాటి.
మాజీ డైరెక్టర్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ
యాదాద్రి భువనగిరి జిల్లా,
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218

అరక పట్టిన ఎమ్మెల్యే కోరం కనకయ్య.

అరక పట్టిన ఎమ్మెల్యే కోరం కనకయ్య…

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల 

పంచె కట్టుతో పత్తి చేనులో అరక పట్టి పాటు చేసిన ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య. తన స్వగ్రామం టేకులపల్లి మండలంలోని కోయగూడెం గ్రామంలో తన వ్యవసాయ భూమిలో అరక పట్టి పత్తి చేనులో పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రైతును రాజును చేయాలనేదే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఎమ్మెల్యే వెంట సిఐ తాటిపాముల సురేష్, ఎస్ఐలు రవీందర్, శ్రీకాంత్, ఆత్మకమిటి చైర్మన్ బోడ మంగీలాల్ నాయక్, రావూరి సతీష్, భద్రం,సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

నానో ఎరువులతో లాభాలేన్నో..

నానో ఎరువులతో లాభాలేన్నో

రైతులకు నానో ఎరువులపై అవగాహన కార్యక్రమం

మండల వ్యవసాయ అధికారి గంగా జమున

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-55.wav?_=6

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో నానో యూరియా,నానో డిఏపి వాడేలా రైతులను ప్రోత్సహిం చాలని మండల వ్యవసాయ అధికారి గంగా జమున ఆధ్వ ర్యంలో రైతులకు నానో ఎరు వులపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏవో మాట్లాడుతూ నానో యూరియా, నానో డిఎపి వాడటం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదకత నాణ్యత పెరుగుతుంది పంటలకు పర్యావరణ ఒత్తిడి తెగుళ్లను తట్టుకునే శక్తిని అందిస్తాయని అన్నారు అంతే కాకుండా పర్యావరణహితంగా పనిచేస్తాయని పేర్కొన్నారు నెలల ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా గాలి నీటి కాలుష్యాన్ని తగ్గిస్తాయని వివరించారు. సంప్రదాయక ఎరువులకు బదులుగా నానో యూరియా నానో డిఏపి ఎరువులను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వాటి వినియోగం గురించి రైతులకు తెలియ జేయడం జరిగింది ఈ కార్యక్ర మంలో, ప్రగతిసింగారo గ్రామం లోని రైతులు, డీలర్లులు, ప్రజలు పాల్గొన్నారు.

గ్రోస్ రైతు సేవ కేంద్రంలో యూరియా.

గ్రోస్ రైతు సేవ కేంద్రంలో యూరియా

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని నార్లాపూర్ గ్రామంలో ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో 20 మెట్రిక్ టన్నులు,నడికూడ ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో 2 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో కలదు.
యూరియా కావలసిన రైతులు ఆధార్ మరియు పట్టా పాస్ పుస్తకం సమర్పించి పొందగలరు.
ప్రస్తుతం మండలంలో పత్తి పంట 8500 ఎకరాలలో సాగు అవుతున్నది వరి నాట్లు ఇప్పటివరకు 1200 ఎకరాలలో వేసినట్లు అంచనా.
ముఖ్యంగా పత్తి పంట 30-40 రోజుల శాఖియ దశలో ఉన్నది కాబట్టి రైతు సోదరులు సాంప్రదాయ యూరియాకు బదులుగా ద్రవ రూపంలో ఉండే నానో యూరియాను పత్తిలో పిచికారి చేసుకోవలసిందిగా కోరుచున్నాము.
నానో యూరియా వల్ల లాభాలు
నానో యూరియా అనేది ద్రవ రూపంలో ఉండే ఎరువు.ఇది మొక్కలకు చాలా మొత్తంలో అవసరమైన పోషకాలను అందిస్తుంది.సాంప్రదాయ యూరియా (గ్రాన్యులర్ యూరియా)తో పోలిస్తే,నానో యూరియాకు అనేక లాభాలున్నాయి.
నానో యూరియాను ఆకులపై పిచికారీ చేయడం వల్ల, మొక్కలు పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహిస్తాయి.దీనివల్ల పంట దిగుబడి 2-4% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.
సాంప్రదాయ యూరియాలో దాదాపు 20-30% నత్రజని ఆవిరైపోతుంది లేదా లీచ్ అవుతుంది.నానో యూరియాలో ఈ నష్టం చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది నేరుగా మొక్కల ఆకుల ద్వారా శోషించబడుతుంది.దీంతో, తక్కువ యూరియాతోనే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.
తక్కువ మొత్తంలో యూరియా వాడటం వల్ల భూగర్భ జలాల్లోకి నత్రజని చేరడం తగ్గుతుంది.ఇది పర్యావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది.
నానో యూరియా తక్కువ పరిమాణంలో అవసరం కాబట్టి,రవాణా,నిల్వ ఖర్చులు తగ్గుతాయి.అలాగే, తక్కువ ఎరువును వాడటం వల్ల రైతులకు డబ్బు ఆదా అవుతుంది.
నానో యూరియా వాడకం వల్ల పంటల నాణ్యత కూడా మెరుగుపడుతుంది.
ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ సాగు గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఆయిల్ ఫామ్ సాగుచేయదలచిన మండలంలోని రైతు సోదరులు పూర్తి వివరాలకు సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించవలసినదిగా కోరుచున్నాను.
నడికూడ మండలంలోని నార్లాపూర్ గ్రామంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పోరిక జై సింగ్ తో పాటుగా వ్యవసాయ విస్తరణ అధికారి జనగం ప్రదీప్,రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది.

ఎరువుల షాపులను తనిఖీ.!

ఎరువుల షాపులను తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి

రైతులకు ఎరువుల కొరత ఉండదు… ఏ ఓ వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న కేసముద్రం మండలంలోని పలు ఎరువుల దుకాణాలు, మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సెంటర్ లను తనిఖీ చేయడం జరిగింది, వారు మాట్లాడుతూ ప్రతి ఎరువుల డీలరు యూరియా మరియు ఇతర ఎరువులను ఈపాస్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయించాలని, స్టాక్ రిజిస్టర్ బ్యాలెన్స్ మరియు, గోదాం బ్యాలెన్స్, ఈపాస్ బ్యాలెన్స్ సమానంగా ఉండేటట్లు ప్రతిరోజు చూసుకోవాలని వారు సూచించారు, స్టాక్ బోర్డులు, ఇన్వైస్లు, ఓ ఫామ్సు ప్రాపర్ గా మెయింటైన్ చేయాలని వారు సూచించారు, ఎవరైనా డీలరు ఎరువుల కొరత సృష్టించిన, అధిక ధరలకు విక్రయించిన, ఎరువులు నియంత్రణ చట్టం 1985 ప్రకారం, మరియు నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం చర్యలు తీసుకుంటామని, వారు సూచించారు.

వారు మాట్లాడుతూ కేసముద్రము మండలంలో, ప్రైవేటు ఎరువుల దుకాణాలు మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా 323 మెట్రిక్ టన్నులు, డిఏపి 53 మెట్రిక్ టన్నులు ,పోటాష్ 44 మెట్రిక్ టన్నులు, సూపర్ 115 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 534 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నది కావున రైతు సోదరులు ఎటువంటి అధైర్యపడవద్దని వారు సూచించారు, కావలసిన రైతులు ఆధార్ కార్డు తీసుకువెళ్లి, యూరియా మరియు ఇతర ఎరువులను పొందాలని వారు సూచించారు, వారు మాట్లాడుతూ ప్రస్తుతము పత్తి మరియు మొక్కజొన్న పంట 25 నుంచి 30 రోజుల వయసులో ఉన్నందున పంటలలో మోతాదుకు మించి యూరియా వాడినట్లయితే రసం పీల్చే పురుగుల బెడద, కలుపు బెడద ఎక్కువై పంటకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున, యూరియా మరియు ఇతర కాంప్లెక్స్ ఎరువులను మొక్కకు కావలసిన మోతాదులోనే అందియాలని వారు సూచించారు , అదేవిధంగా వ్యవసాయ అధికారి రైతులకు నానో యూరియా మీద అవగాహన కల్పించడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version