న్యూఢిల్లీ, ఆగస్టు 13 (పిటిఐ): కాంగ్రెస్ పార్టీ బుధవారం ‘వోట్ చోరి’పై తన ప్రచారాన్ని మరింత ఉధృతం చేసింది. నకిలీ ఓట్లు ఎలా వేయబడుతున్నాయో చూపించే వీడియోను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రజలను తమ హక్కులను కాపాడుకోవాలని, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) “పట్టులో నుండి రాజ్యాంగ సంస్థలను విముక్తం చేయాలి” అని పిలుపునిచ్చారు.
మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆ వీడియోను పంచుకుంటూ, “మీ ఓటు చోరీ అనేది మీ హక్కుల చోరీ, మీ గుర్తింపు చోరీ” అని అన్నారు. ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ, ఓటు దోపిడీని ఖండించారు. ఖర్గే మాట్లాడుతూ, “మీ ఓటు హక్కు దోపిడీకి గురి కాకుండా కాపాడుకోండి. ప్రశ్నించండి, సమాధానాలు కోరండి, ఈసారి వోట్ చోరికి వ్యతిరేకంగా స్వరం వినిపించండి” అని పిలుపునిచ్చారు.
రాష్ట్ర రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన ప్రకటనకు ప్రభుత్వ అనుకూల రైతు సంఘాలు స్వాగతం పలికాయి. మంగళవారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ సంఘాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించే అన్యాయ సుంకాలపై భారత్ వెనక్కి తగ్గబోదని మోదీ చెప్పిన తీరు రైతులకు భరోసా కలిగించిందని పేర్కొన్నాయి.
భారతీయ రైతు చౌధరి చరణ్ సింగ్ సంస్థ జాతీయ అధ్యక్షుడు ధర్మేంద్ర చౌధరి, చత్తీస్‌గఢ్ యూత్ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అసోసియేషన్ నాయకుడు విరేంద్ర లోహాన్, భారతీయ కిసాన్ యూనియన్ (నాన్ పొలిటికల్) నేత ధర్మేంద్ర మాలిక్ — ఈ ముగ్గురూ మోదీ నిర్ణయం రైతు, పశుపాలక, మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడే దిశగా ఉందని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు.
కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నకిలీ ఎరువులు, రసాయనాల తయారీపై కఠిన చర్యలు తీసుకునే కొత్త చట్టాన్ని త్వరలో అమలు చేస్తామని, రైతుల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
అయితే ఎడమ భావజాల రైతు సంఘం ఆల్ ఇండియా కిసాన్ సభ మాత్రం మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. సంస్థ నాయకులు అశోక్ ధావలే, విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ, గత 11 ఏళ్ల పాలనలో రైతుల పోటీతత్వం దెబ్బతిందని, 2014లో ఇచ్చిన కనీస మద్దతు ధర హామీని అమలు చేయలేదని, రైతులు అప్పుల బారిన పడి ఆత్మహత్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రభుత్వ డేటా చెబుతోందని, కానీ రైతుల అప్పుల మాఫీకి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అదే సమయంలో ₹16.11 లక్షల కోట్ల కార్పొరేట్ అప్పులను మాఫీ చేశారని ఆరోపించారు. వ్యవసాయ, అటవి, ఖనిజ, నీటి వనరులు దేశీయ, విదేశీ కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తున్నాయని వారు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి అంజిరెడ్డి చేయూత
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ సమీపంలో పస్తాపూర్ వద్ద ద్విచక్ర వాహనం లారీని ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి అండగా నిలిచారు. ఆయన వెంటనే స్పందించి, ఆ యువకుడిని అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సహాయక చర్యకు పలువురు ఆయనను అభినందించారు.
ఝరాసంఘం మండలం బిడే కన్నె గ్రామంలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. గ్రామ సమీపంలో వాగులో చిక్కుకున్న బొలెరో వాహనాన్ని గ్రామస్తులు చాకచక్యంగా బయటకు తీశారు. గ్రామానికి వెళ్లే రోడ్డుపై మోకాలిలోతు నీరు ప్రవహించింది. ఏడాకులపల్లి గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులను గ్రామస్తులు సురక్షితంగా దాటించారు. ఈ ప్రాంతంలో 2.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు , కోహిర్ మాజి సర్పంచ్ కళీమ్ గారి జన్మదిన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు కోహిర్ మండలం అధ్యక్షులు నర్సింలు, ఝరసంఘం మండలం అధ్యక్షులు వెంకటేశం ,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,యువ నాయకులు ముర్తుజా ,దీపక్ , మల్లేష్ తదితరులు..
_ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండండి – బొరేగౌ నాగేందర్ పటేల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
భారీ వర్షాల కారణంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.రహదారులు నీటితో నిండిపోవచ్చని ముందస్తు హెచ్చరిక ఇవ్వుతూ, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొరేగౌ నాగేందర్ పటేల్ సూచించారు.సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని, ఉధృత ప్రవాహం ఉన్న చోట్లకు చేరరాదని సూచించారు.వాగులు, వంకల వద్దకు చేపల వేటకు జాలర్లు వెళ్లకూడదు. పశువులను కాయడానికి నదులు, వాగులు, చెరువుల దగ్గరకు తీసుకెళ్లకుండా జాగ్రత్త వహించాలని కోరారు.అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు.వర్షాల వల్ల ప్రమాదకరంగా మారే ప్రాంతాల్లో ఎలాంటి విపత్తులు జరుగకుండా మండల పోలీసులు మరియు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లి, వారి ప్రాణాలు రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దివంగత జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం విగ్రహానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ను టీపీసీసీ కో ఆర్డినేటర్ దారా భాస్కర్ శాలువాతో మంగళవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు పోమాల్ గ్రామా మాజీ సర్పంచ్ కొండనోళ్ల కృష్ణయ్య, మాజీ సర్పంచ్ కొందుటి రామచంద్రయ్య, పోమాల్ గ్రామా మాజీ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు మాజీ వార్డ్ సభ్యులు పిడుగు సుధాకర్, సంజీవ రెడ్డి, కావలి ఎల్లప్ప ముదిరాజ్, వెంకటయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి
పరకాల నేటిధాత్రి
ఇండియా కూటమి,రాహుల్ గాంధీని,మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాందిలను ఇండియా కూటమి నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య కూనికి నిదర్శనమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికలలో అదేవిధంగా ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం మరియు ఈసీ కుమ్మక్కై దొంగ ఓట్లు సృష్టించి కేంద్రంలోని ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి దొంగ ఓట్లే కారణమని రాహుల్ గాంధీ ఆరు నెలల నుండి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో తిరిగి ప్రజావాదానికి ఎగ్జిట్ పోల్స్ కు ఏమాత్రం పొంతన లేకుండా వచ్చిన ఎలక్షన్ రిజల్ట్ ను చూసి ఈసీ దగ్గర ఓటర్ లిస్టు తీసుకుని దేశంలో కొన్ని ప్రాంతాల సెలక్ట్ చేసుకుని ఎంక్వయిరీ చేయగా నలుగురు ఉన్న ఇంట్లో 40,50 ఓట్లు దొంగ ఓట్లు సృష్టించి ఆ యొక్క ఇంటి నెంబర్లకు సైతం ఇంటి నెంబర్ సున్నాగా చూపించి దొంగ ఓట్లతో బీజేపీ పాలిత రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడం జరిగిందన్నారు.ఇదేంటని బీజేపీని మరియు ఈసీని ప్రశ్నించగా తమ తమ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెబ్సైట్లను బందు చేసి,ప్రజలకు ఎలాంటి సమాచారం తెలియకుండా కేంద్రం బిజెపి ఈసప్రజాస్వామ్య ఉల్లంఘన నిదర్శనమని దీన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీని తన తోటి నాయకులను అరెస్ట్ చేస్తారా అని మోడీ బిజెపి ప్రభుత్వాని ప్రశ్నించారు.రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి మంచి కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి అని, ప్రజలంతా విశ్వసిస్తూ ప్రజలంతా రాహుల్ గాంధీ వెంటే ఉన్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేయించడం సిగ్గుచేటని రామకృష్ణాపూర్ పట్టణ బిఆర్ఎస్వి నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఐక్య విద్యార్థి సంఘాల పిలుపుమేరకు హలో హైదరాబాద్ చలో గాంధీ భవన్ ముట్టడి, నిరసన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో రామకృష్ణాపూర్ పట్టణ పోలీసులు బిఆర్ఎస్వి నాయకులు రామిడి లక్ష్మీకాంత్, చంద్ర కిరణ్, గోనే రాజేందర్, కుర్మ దినేష్, మాచర్ల కుమార్, కాంపల్లి శ్రీకాంత్ లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి నాయకులు మాట్లాడారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని అన్నారు.ఆరు గ్యారెంటీలు అమలు అయ్యే వరకు పోరాటం ఆగదని అన్నారు.
జహీరాబాద్ పట్టణ నూతన టౌన్ ఎస్ఐగా పదవి బాధ్యతలు చేపట్టిన వినయ్ కుమార్ ను సోమవారం తుమ్మనపల్లి గ్రామ షేక్ సోహెల్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి,ఈ సందర్భంగా ఎస్ ఐ వినయ్ కుమార్ మాట్లాడుతూ. పట్టణంలో శాంతి భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. సన్మానించిన షేక్ సోహెల్ తదితరులు పాల్గొన్నారు.
గణపురం మండలo దేవాదుల ప్రాజెక్ట్ నుండి గోదావరి నీరు రామప్ప చెరువులో చేరడం జరుగుతుంది అదేవిధంగా గ్రావిటీ కెనాల్ ద్వారా గణపసముద్రం చెరువులోకి నీటిని వదిలి దాని ఆయకట్టు రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు తీసుకోవలసిందిగా ఎమ్మార్వో కి వినతి పత్రం ను మండల అధ్యక్షుడు నవీన్ రావు ఆధ్వర్యం లో ఇవ్వడం జరిగింది ఇందులో సీనియర్ నాయకులు దుగ్గిశెట్టి పున్నం చందర్ ఉపాధ్యక్షులు మాదాసు మొగిలి. బూత్ అధ్యక్షులు కాశెట్టి సాయి కన్వీనర్ .మండల కన్వినర్ మండల రాజు పాల్గొనడం జరిగింది అలాగే రేపు మండల కేంద్రం లో జరిగే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లో అందరు పెద్ద ఎత్తున పాల్గొని స్వాత్రంత్ర సమర్యోదులను గుర్తు చేస్తూ బావితరాలకు తెలియజేయాలనీ కోరడం జరిగింది
బీసీలపై సవతి ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – బీజేపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా. సవతి తల్లి తన సవతి పిల్లలపైన సవతి ప్రేమా ఎలా చూపిస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీల పైన సవతి ప్రేమ చూపిస్తుందని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు అడ్డగోలుగా, ఇష్టానుసారంగా తలా తోక లేని గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చారు, అలాగే కామారెడ్డిలో డిక్లేర్ చేసిన బీసీ రిజర్వేషన్ ఎంతవరకు సాధ్యమవుతుందని తెలుసుకోకుండా తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు బిజెపి పైన ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అని జ్యోతి పండాల్ కాంగ్రెస్ లీడర్స్ నీ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిసి డిక్లరేషన్ తెలిసి చేశారా తెలియక చేశారా అన్న అంశం కాంగ్రెస్ వాళ్ళకి తెలియాలి. జనవరి 1, 1979 నాడు అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిషన్ ని బీ.పీ మండల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టికల్ 340 ప్రకారం ఎవరైతే బీసీలు సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా వెనుకబడి ఉంటారో వాళ్ళందరినీ సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని కమిషన్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కమిటీ వాళ్లు సర్వే చేసి డిసెంబర్ 31, 1984 సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారము బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 1979లో ఏదైతే గవర్నమెంట్ రూలింగ్ లో ఉండెనో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత 1980లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ 1989 వరకు అధికారంలో ఉండడం జరిగింది కానీ ఈ పదేళ్ల కాలంలో రాజీవ్ గాంధీ గారు గాని సోనియా గాంధీ గారు గాని ఈ రిపోర్టు పైన ఎలాంటి స్పందన తెలియజేయలేదు. 1990లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం కోల్పోయిన తర్వాత 1990లో అప్పటి ప్రధానమంత్రి అయిన వీ.పీ సింగ్ గారు ఈ మండల్ కమిటీ వారు ఏదైతే రిపోర్టు ఇవ్వడం జరిగిందో ఆ రిపోర్టు ప్రకారము 27% రిజర్వేషన్ ఇవ్వాలని వారు నిర్ణయించుకొని రిజర్వేషన్ అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్స్ ని అమల్లోకి తీసుకురావడం వల్ల దేశంలో ఉన్న అప్పర్ క్యాస్ట్ వాళ్ళు నిరసనలు చేపట్టడం జరిగింది. అయితే ఇంద్రా సావ్నే అనే పిటిషనర్ సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల, సుప్రీంకోర్టు ఇంద్రా సావ్నే vs యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టు ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. అలాగే మన భారత రాజ్యాంగంలో మూడు గవర్నమెంటల్ మిషనరీస్ ని అమలులోకి తీసుకురావడం జరిగింది (లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ). అయితే పార్లమెంట్లో ఏదైతే బిల్లు పాస్ చేయడం జరుగుతుందో ఆ బిల్లు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది అన్నప్పుడు సుప్రీంకోర్టు దాన్ని పరిశీలించడం జరుగుతుంది. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ సమానత్వం ఉండాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ లిమిట్ ని విధించడం జరిగింది. ఇప్పుడు బిజెపి గవర్నమెంట్ బిసి రిజర్వేషన్ ని ఆమోదించిన కూడా సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించడం జరుగుతుంది. ఒకవేళ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు చాలా చాలా స్పష్టమైన మరియు న్యాయపరమైన అలాగే స్టాటిస్టికల్ డేటాని చూపిస్తూ మన రాష్ట్రంలో బీసీలు ఎలా అణిచివేయబడుతున్నారు, వాళ్ళకి ఎలా అన్యాయం జరుగుతున్నది అని ఇలాంటి అంశాలన్నీ కూడా న్యాయస్థానానికి ఇచ్చినప్పుడు మాత్రమే బిసి రిజర్వేషన్నీ ఆమోదించడం జరుగుతుంది.మీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కాస్ట్ సర్వే చేశామని చెప్పడం జరుగుతుంది కానీ ఆ రిపోర్ట్ ని ఎందుకు బయట పెట్టడం లేదని జ్యోతి పండాల్ కాంగ్రెస్ లీడర్స్ ని ప్రశ్నించడం జరిగింది. ఆ రిపోర్టు బయట పెట్టినప్పుడు మాత్రమే మీరు ఎంత బాగా సర్వే చేశారని తెలుస్తుంది. తీన్మార్ మల్లన్న గారు కూడా బీసీ సర్వే కరెక్ట్ గా జరగలేదు బీసీల జనాభాని తక్కువ చేసి చూపించడం జరుగుతుంది అని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ వారు తీన్మార్ మల్లన్న నీ సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే బీసీ సర్వే అవ్వకముందే బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ఎలా ప్రవేశపెడతారు? ఈ అడ్డిమారి గుడ్డి బిసి సర్వే ని ఆధారం చేసుకొని బిజెపి ప్రభుత్వం గానీ సుప్రీంకోర్టు గాని ఎలా ఆమోదిస్తుంది అని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలు తగిన బుద్ధి చెబుతారనే భయంతో బీసీల పైన సవతి ప్రేమ చూపిస్తూ ఢిల్లీలో నిరసన తెలియజేయడం చూస్తుంటే, బట్ట కాల్చి బిజెపి పైన వేయాలన్న ఉద్దేశం చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుందని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాల వరకు భారతదేశంలో రూలింగ్ లో ఉండే మరి అప్పుడు బీసీల పైన ఈ ప్రేమ ఎక్కడ పోయింది, కొత్తగా ఈ ప్రేమ ఇప్పుడు ఎప్పటినుంచి పుట్టుకొచ్చిందో తెలియజేయాలని జ్యోతి పండాల్ ప్రశ్నించడం జరిగింది. మీ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఇది సుప్రీంకోర్టు ఆమోదించదు మరియు 9th షెడ్యూల్లో కూడా చేర్చడం చాలా కష్టమైన విషయం అని తెలిసి కూడా బీసీల సింపతి కోసం మరియు బీసీల ఓట్ల కోసం ఈ సవతి ప్రేమ చూపించడం జరిగిందని చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ లో ఉన్న బీసీలు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలాగే మద్దతు తెలిపితే మిమ్మల్ని ఇలానే మోసం చేస్తూ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండేలా చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కావున కాంగ్రెస్ లో ఉన్న బీసీలు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మోసాన్ని తెలుసుకోవాలని మరియు తెలుసుకుంటారని ఆశిస్తున్నానని జ్యోతి పండాల్ అన్నారు.
యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ లోని ఆదర్శనగర్ కాలనీలో సెట్విన్ చైర్మన్ ఎన్ గిరిధర్రెడ్డి నివాసంలో ఆదివారం యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్రెడ్డి, మైనార్టీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా.సిద్దం ఉజ్వల్రెడ్డి వారిని శాలువాతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
నులి పురుగుల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత : ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని జిల్లా పరిషద్ గర్ల్స్ హై స్కూల్ నందు పాఠశాల విద్యార్థినులకు అర్బెండజోల్ మాత్రలను అందించే కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానంగా ఒకటి నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు నులి పురుగుల నిర్మూలన యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకుంటామని తెలిపారు ఈ వ్యాధి వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వలన, వండిన మరియు కలుషితమైన ఆహారం , స్వీట్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వంటి వివిధ కారణాలవల్ల పిల్లల్లో వార్మ్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని అన్నారు అందుకే ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా ఈ నూలి పురుగుల నివారణ కొరకై ఈ టాబ్లెట్లను పిల్లలు తప్పకుండా వేసుకోవాలని అన్నారు అనంతరం నూలి పురుగుల నివారణకు టాబ్లెట్లను పిల్లలకు అందించారు ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం , మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ , గణేష్ ,దీపక్ ,చంద్రయ్య , డీఎం & హోం గాయత్రి దేవి ,వైద్య సిబ్బంది ,ఉపాధ్యాయులు , తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ భవన్ లో Ktr పై జిల్లా బీజేపీ నాయకులు చేసిన వాక్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన BRS సిరిసిల్ల పట్టణ యూత్ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్…. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ రెండు కలసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. అధికారం లో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ని నీలాదీయడం మానేసి ప్రతి పక్షం లో ఉన్న KTR ని విమర్శించడం వారి విజ్ఞత కే వదిలి వేస్తున్నాం. Ktr సిరిసిల్ల నియోజకవర్గం లో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రతి గ్రామం లో మేము చూపిస్తాం మీ నాయకుడు మంత్రి హోదా లో ఉన్న బండి సంజయ్ ఏమి చేసారో కనీసo ప్రతి మండలం లో అయినా చూపెట్టే దమ్ము మీకు ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం.బండి సంజయ్ తనకు తాను పెద్ద నాయకుడు అనే భ్రమలో ఉన్నాడు రాష్ట్ర రాజకీయాలను మార్చేసే వ్యక్తి బండి సంజయ్ కాదు రాష్ట్ర రాజకీయాలను మార్చేసే శక్తి కూడా కాదు అటువంటి నాయకుడి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ KTR లేదు అని ఈ సందర్బంగా తెలియజేసుకుంటున్నాం ఇంకెన్ని రోజులు దేవుడి పేరు చెప్పి ప్రజలను రెచ్చగొడతారు గల్లీ లో మాట్లాడడం కాదు ప్రజా సమస్యేలపై పార్లమెంట్ లో మాట్లాడాలని మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు పాస్ అని తప్పించుకొని పోకుండా పోరాటం చేయాలనీ బండి సంజయ్ కోరుతున్నాను. ktr సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధి కి ఏంతగానో కృషి చేసారు మళ్ళీ అధికారం లో కి వచ్చాక మరింత ముందుకు తీసుకెళ్లే దమ్ము ktr కి ఉంది బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా కేంద్రం లో కేంద్ర పరిది లో ఉన్న ఒక ఫ్లై ఓవర్ దాదాపు 8 సంవత్సరము లుగా పనులు పూర్తి గాక అసంపూర్తి గా ఉండి అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది అది కూడా పూర్తి చేయని అసమర్ధత కలిగిన Mp మనకు ఉండటం మన దౌర్భాగ్యం కేంద్ర పరిది లో ప్రజలకు అవసరంమైన ఎన్నో అభివృద్ధి పనులు ఉంటాయి వాటిని తీసుకు రాకుండ మీ కుటుంబం వచ్చి గుడి లో ప్రమాణం చేస్తే మా కుటుంబం వచ్చి ప్రమాణం చేస్తుంది ఇవ్వా ఒక కాబినెట్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటలు..అని ఈ సందర్బంగా తెలియజేసుకుంటున్నాం ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం లో జిల్లా నాయకులు మెట్ట రాజు,కత్తెర వరుణ్ కుమార్, BRSV పట్టణ అధ్యక్షులు షేక్ సికిందర్, వడ్లురి సాయి, సూర్య, జోయేల్, వడ్లురి వేణు, ఆరుట్ల శరన్ పాల్గొన్నారు.
బిజెపి కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు చింతకుంట సాగర్
చందుర్తి, నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయాలని కిసాన్ మోర్చా చందుర్తి మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ రైతుల పక్షపాతి అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని వారు అన్నారు ఎకరానికి ఒక బస్తా అని చెబుతున్న ప్రభుత్వం దానికి సరిపడా కూడా చేయడం లేదు పైగా కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు కేంద్ర ప్రభుత్వం ఒక యూరియా బస్తా పై 2100 సబ్సిడీ రైతుల గురించి ఇస్తుందని వారు పేర్కొన్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం యూరియా ను తక్షణమే సరఫరా చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలనీ కోరారు.
TG: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ నిర్మాణం పూర్తి కావొస్తుండటంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘KCR హయాంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాం. నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, సిద్దిపేటలో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆదిలాబాద్ కూడా ఈ లిస్టులో చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం మా సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ పాలనపై తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం ప్రాజెక్టలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
ఖమ్మం, ఆగస్ట్ 10: గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందంటూ బీఆర్ఎస్ పార్టీపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టు మధ్యలో పనులను అర్ధాంతరంగా ముగించేసిందని విమర్శించారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడులో రూ. 630 కోట్లతో నిర్మించ తలపెట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ అంటేనే పేదల ప్రభుత్వమని ఆయన ఆభివర్ణించారు.
10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క ఇల్లు అయినా నిర్మించాడా? అని ప్రజలను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. అలాగే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సన్న బియ్యం పంపిణి చేశాడా? అంటూ ప్రజలను అడిగారు. రూ. 12 వేల కోట్లతో ఆర్ అండ్ బి రోడ్లు నిర్మాణం చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ప్రజా సంక్షేమంపై మాత్రమే ఉంటుందని.. అంతే కానీ ఓట్లపై ఉండదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. అపర భగీరథుడని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ చివరి ఆయకట్టు రైతులకు తొలిసారి నీరు ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కంకణం కట్టుకున్నారని తెలిపారు. దశబ్ద కాలంగా జవహార్ ఎత్తిపోతల పథకాన్ని నిర్విరం చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతోందని మండిపడ్డారు. నాగార్జునసాగర్ నీరు పాలేరు రిజర్వాయర్ ద్వారా వైరాకు అక్కడి నుంచి మధిర, ఎర్రిపాలెం మండలాలకు సాగునీరు.. తాగునీరు అందించేందుకు డిప్యూటీ సీఎం భట్టి ప్రణాళికలు రచించారని వివరించారు. అందుకు రూ.630. 30 కోట్లతో ఈ రోజు శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని రేవంత్ సర్కార్ పరుగులు పెట్టిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. మాట ఇచ్చాం ఇల్లు పూర్తి చేస్తున్నాం.. అర్హులైన పేద ప్రజలు ఎవరూ కూడా ఇందిరమ్మ ఇళ్లు రాదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సూచించారు. తమ ప్రభుత్వంలో రైతులకు టింగు టింగు మంటూ వారి ఖాతాలో రైతు భరోసా పథకం కింద నగదు పంపిణీ జరిగిందన్నారు. భూ భారతితో రైతులకు అనుకూలమైన చట్టం చేశామని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేదవానికి సేవ చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భరోసా ఇచ్చారు.
తెలంగాణలో బీజేపీకి ఓటు షేర్ పెరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు అన్నారు. బీజేపీకి సున్నా అని గతంలో విమర్శించిన బీఆర్ఎస్ పనే ప్రస్తుతం సున్నా అయ్యిందని ఎద్దేవా చేశారు. గువ్వల బాలరాజు బీజేపీలో చేరిన సందర్భంగా రామ్‌చందర్ రావు మాట్లాడారు. ‘ఓట్ల గురించి మాట్లాడే అర్హత రాహుల్ గాంధీకి లేదు. ఓడిపోతారని తెలిసే ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
అన్నాచెల్లెళ్లు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ మహోత్సవం.శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదారాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డికి టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బీమగాని సౌజన్య గౌడ్ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Former MPP Soujanya Goud
రాఖీ పండుగ సందర్భంగా సీఎం ఆత్మీయత ఎంతో సంతోషాన్ని కలిగించిందని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మాజీ ఎంపిపి,టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి భీమాగాని సౌజన్య గౌడ్ తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.