గుండెపోటుతో ఆంధ్రప్రభ రిపోర్టర్ మృతి…

గుండెపోటుతో ఆంధ్రప్రభ రిపోర్టర్ మృతి

•భౌతికకాయానికి నివాళిలు అర్పించిన భీంభరత్
* రాములు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

షాబాద్ మండలం తిర్మలపూర్ గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ రాములు శనివారం ఉదయం అకాల మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే రాములు స్వగ్రామానికి చేరుకొని వారి పార్థివ దేహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, తమిల్లి రవీందర్ షాబాద్ సర్పంచ్, షాబాద్ ఎంపీటీసీ అశోక్, తొంట వెంకటయ్య , మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిరుమలపురం శ్రీరామ్ రెడ్డి, బందయ్య దోస్వాడ సర్పంచ్ రాములు, తాళ్లపల్లి సర్పంచ్ పెంటయ్య, మద్దూరు మల్లేష్ సర్పంచ్, తదితరులు రిపోర్టర్ రాములు భౌతికకాయానికి నివాళిలు అర్పించారు.

రాజీవ్ గాంధీ భారతదేశ సమాచార విప్లవ పితామహుడు

రాజీవ్ గాంధీ భారతదేశ సమాచార విప్లవ పితామహుడు

చేవెళ్ల, నేటిధాత్రి:

చిన్న వయస్సులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిదేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమనిచేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ 81వ జయంతిని పురస్కరించుకునిమొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ చౌరస్తాలొ మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే పిన్న వయసులో దేశానికి ప్రధానమంత్రి అయ్యి దేశంలో తరం మార్పుకు సంకేతంగా రాజీవ్ గాంధీ దేశ చరిత్రలో అతిపెద్ద మెజారిటీ సాధించా రన్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ, ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశట్టిన రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారని అన్నారు. దేశంలో కంప్యూటరైజేషన్,టెలికమ్యూనికేషన్ విప్లవం ఘనత అతనికే చెందుతుందని కొనియాడారు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్ , టీ పి సి సి కార్యదర్శులు రామ్ రెడ్డి , మొయినాబాద్ మండలం అధ్యక్షులు మానయ్య , మాజీ జడ్పీటీసీ కె భాస్కర్ , వెంకటాపూర్ మహేందర్ రెడ్డి , ఉపాధ్యక్షులు మర్రి రవీందర్ రెడ్డి , దారెడ్డి కృష్ణ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గణేష్ గౌడ్, ఎంపీటీసీ కేబుల్ రాజు, అప్పారెడ్డిగూడ కిరణ్ కుమార్, రాములు,డైరెక్టర్ బాలకృష్ణ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, ఫిషార్మెన్ మండల ప్రసిడెంట్ బిక్షపతి, గన్నెపాగ నర్సింగ్ రావు, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి , శ్రీ పాల్ , ఆయా గ్రామాల ఇందిరమ్మ కమిటీమెంబర్స్,మాజీ సర్పంచ్ ,ఉప సర్పంచ్ లు తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

పార్దివాదేహానికి ఘన నివాళి అర్పించిన భీంభరత్

పార్దివాదేహానికి ఘన నివాళి అర్పించిన భీంభరత్

* మహేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన
కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ భీం భరత్

చేవెళ్ల, నేటిధాత్రి :

 

మొయినాబాద్ మండలం మోతుకు పల్లీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎరుకల మహేష్ తీవ్ర అనారోగ్యంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. మహేష్ మృతి చెందిన విషయం తెలిసి కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ పామేనా భీం భరత్, మహేష్ పార్టివదేహా నికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. అంతరం మహేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపీ ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఆయనవెంట జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి దయానంద్ గౌడ్ , మురళి, పిరంగి భాస్కర్, గుడ్ల యాదయ్యా , బోద ప్రలద్ , బలరాజ్ , సునీల్ , సుబ్బారావు , పట్వారీ , దేవరాజ్ , మారాలి , చెంద్రయ్య ,రమేష్ , రాములు ,నరేష్ , శేఖర్ శంకరయ్య తదితరులు ఉన్నారు.

ఎల్‌బీ స్టేడియంలో నేడు ‘ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్

ఎల్‌బీ స్టేడియంలో నేడు ‘ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ బహిరంగ సభ

సభను విజయవంతం చేద్దాం : భీమ్ భరత్

శంకర్పల్లి, నేటిధాత్రి:

 

 

 

ప్రజలందరినీ జాగృతం చేసేందుకు “జై బాపు, జై భీం, జై సంవిధాన్” పేరిట మానవ హక్కులు, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణపై విస్తృత కార్యక్రమానికి చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జి భీమ్ భరత్ పిలుపునిచ్చారు. జూలై 4న ఎల్‌బీ నగర్ లో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ (AICC) జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరై ప్రసంగించనున్నట్లు భీమ్ భరత్ తెలిపారు. రాజ్యాంగంపై జరుగుతున్న దాడులపై ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా సమానత్వం, హక్కుల పరిరక్షణపై స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ కమిటీల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మైనారిటీ సెల్ మహిళా అధ్యక్షులు, బీసీ సెల్ అధ్యక్షులు, ఎస్సీ సెల్ అధ్యక్షులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో హాజరవ్వాలని భీమ్ భరత్ ఈ సందర్భంగా కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version