చేవెళ్ల నియోజకవర్గ ఫాస్టర్స్ నూతన కమిటీ ఎన్నిక…

చేవెళ్ల నియోజకవర్గ ఫాస్టర్స్ నూతన కమిటీ ఎన్నిక

* సమాజానికి సేవలందించడంలో చర్చిల పాత్రను పెంచుతుంది
* అధ్యక్ష, కార్యదర్శిలు నర్సిములు, రాజేందర్

చేవెళ్ల, నేటిధాత్రి:

చేవెళ్ల నియోజకవర్గ ఫాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం శంకర్పల్లిలోని షారోని ప్రార్థన మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ నూతన ఫాస్టర్స్ కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికైన కమిటీలో నియోజకవర్గ ఫాస్టర్స్ అధ్యక్షులుగా ఆసాపు ( నర్సింలు ), ఉపాధ్యక్షులుగా ఎం. అనంతరావు ( జేమ్స్), కార్యదర్శిగా
డప్పు. రాజేందర్, సహాయ కార్యదర్శి
జి. ప్రేమానందం, కోశాధికారిగా వై.మల్లేష్( ఇస్సాకు)లను
ఎన్నుకున్నారు. సలహాదారులు గా, ఎన్.కృష్ణ పి.యాదయ్య, పి.సంజీవరావు, పిఎం. సామ్యూల్,
పి.అబ్రహం, ఎమ్.ఎమ్. సామ్యూల్, ఎస్.లింగం,
వి. దానియేలు, ఎస్.సంజీవరావు, జి.సామ్యూల్,
డి.జయకర్, వై.రమేష్ లతో నియోజకవర్గ ఫాస్టర్స్ నూతన
కమిటీ ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కమిటీ అధ్యక్షులు నర్సింలు (ఇస్సాకు )మాట్లాడుతూ..పాస్టర్లందరిని ఏకతాటిపైకి తెచ్చి, వారి హక్కుల కోసం పోరాడుతుందని, ప్రభుత్వ పథకాలు మరియు ఇతర సదుపాయాలను పాస్టర్లకు అందజేయడంలో కృషి చేస్తుందన్నారు. కమిటీ కార్యదర్శి డప్పు రాజేందర్ మాట్లాడుతూ..ఈ కమిటీ చర్చిల సమస్యలను ఆధ్యాత్మికంగా, సామాజికంగా సమాజానికి సేవలందించడంలో చర్చిల పాత్రను పెంచుతుందని, చర్చిల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. పాస్టర్ల అవసరాలను తీర్చడంలో చురుకుగా వ్యవహరిస్తుందని, ఇది పాస్టర్ల సమాజానికి ఒక ఆశాకిరణంగా మారుతుందని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం కమిటీ సభ్యులుగా పాలకవర్గముగా నియమితులైన ఫాస్టర్లు ఈ నూతన కమిటీని ప్రభువు కృపలో దేవుడు బలపరిచి చేవెళ్ల నియోజకవర్గంలో అనేక కార్యాలు జరిపించాలని దేవుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండలాల ఫాస్టర్స్, నూతన కమిటీ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

దళితుల గుడి దారిలో కుల వివక్ష చిచ్చు

దళితుల గుడి దారిలో చిచ్చురేపిన కుల వివక్ష

* దళితుల పోచమ్మగుడిదారికి అడ్డంపడిన బీసీలు
* మాజీ సర్పంచ్ క్రిష్ణ గౌడ్ ప్రోద్బలమే వివాదానికి మూలం
* నాలుగు రోజులుగా చల్లారని దారి వివాదం
* సమస్య సామరస్యానికి అధికారులప్రయత్నం విఫలం
* ఎమ్మార్వో పక్షపాత వైఖరి అవలంభించారన్న దళితులు
* చివరికి దళిత దేవుళ్ళకూ.. తప్పని కులవివక్ష
* దళితులకు న్యాయం చెయ్యాలంటూ అంబేద్కర్ సంఘాల డిమాండ్

చేవెళ్ల, నేటిధాత్రి:

షాబాద్ మండలపరిధిలోని నాగరగూడ గ్రామపంచాయతీ సర్వేనెంబర్ 277లో దేవుడి గుడికి దారి వివాదంలో కులవివక్ష అగ్గిరాజేషింది. రెండు వర్గాలమధ్య నాలుగు రోజులుగా వివాదం కులచిచ్చు రేపుతుంది. తమకు న్యాయం చెయ్యాలని దళితులు ప్రజాసంఘాలు, కులసంఘాలతో కలిసి ఎమ్మార్వో, ఆర్డివోలకు పిర్యాదు చేశారు. ఈ వివాదం చిలిగి చిలిగి గాలివానలా పెరిగి పెద్దదయ్యింది. (నాగరగూడ మాజీ సర్పంచ్ క్రిష్ణ గౌడ్ ప్రోద్బలమే వివాదానికి దారి తీసింది. జైలుకైనా వెళ్తాను కాని వారికీ దారి వదలమని క్రిష్ణ గౌడ్ మాటలు మరింత చిచ్చు రేపాయి. దళితులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని అని వికృత మాటలు దళితుల మనోభావాలను
దెబ్బతీసేలా మారాయి. దీంతో మాపై ఇంకా కుల వివక్ష కొనసాగుతుందని దళితులు ఆందోళన వ్యక్తం చేశారు.అధికారుల ముందు మారని క్రిష్ణ గౌడ్ తీరు.


ఒకానొక దశలో మాజీ సర్పంచి క్రిష్ణ గౌడ్ మాటలకూ సీఐ కాంతరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు). మీరు ఇలాగే మాట్లాడితే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శాంతి భద్రతలకు కలిగిస్తే ఎవ్వరినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.

* ప్రభుత్వం కేటాయించిన స్మశానవాటిక దళితులకేనా ?

రానున్న రోజుల్లో స్మశానవాటికలకు భూమి సరిపోదనే ఉద్దేశ్యంతో కోట్లరుపాయలతో అన్నివర్గాల ప్రజల అవసరనిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి స్మశానవాటిక అభివృద్ధి చేసింది. కాని గ్రామాలలో వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే తరహాలో నాగరగూడ గ్రామపంచాయతిలో సర్వేనెంబర్ 277 లో కొనసాగుతున్న దారి గొడవ. పురాణ స్మశానవాటికలోనే బీసీలు సమాధులు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కేటాయించిన స్మశానవాటిక దళితులకేనన్న భావనకు నాంది పలుకుతుంది, ప్రజల మధ్య కులాల మధ్య కులవిబేదాలకు తావిస్తుంది.

* మాజీ సర్పంచ్ క్రిష్ణ గౌడ్ ప్రోద్బలమే వివాదానికి కారణం .

నాగరగూడ మాజీ సర్పంచ్ క్రిష్ణ గౌడ్ ప్రోద్బలమే వివాదానికి దారి తీసింది.( జైలుకైనా వెళ్తాను కాని వారికీ దారి వదలమని క్రిష్ణ గౌడ్ మాటలు మరింత చిచ్చురేపాయి. (దళితులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని కులంతో కలిపి చేసిన వికృత మాటలు దళితుల మనోభావాలను
దెబ్బతీసేలా మారాయి). సర్వేనెంబర్ 277 లో ఉన్న సమాధులకు అదే సర్వేనెంబర్ లో సమాధులకు ఆనుకుని దళితులు తాతముత్తాతలు నిర్మించిన పోచమ్మ గుడి ఉంది.ఈ గుడికి సమీపంలో అగ్రవర్ణాల గుడి ఉంది. ప్రతి సంవత్సరం పండగలు, పూజలు కార్యక్రమాలు నిర్వహించుకునే క్రమములో అందరు బోనాలు ఓకే దారిగుండా వెళ్ళాల్సిన క్రమంలో బీసీ పెద్దలు, మా బోనాలు ముగిసిన తరువాతే దళితులు నిర్వహించుకోవాలనే నిబంధన తీసుకొచ్చారు. ఈ క్రమంలో దళితులపై కులవివక్ష కొనసాగుతుండటంతో దళితులు మాకు మరోదారి కావాలని సర్వేనెంబర్ 277 లో ఉన్న పురాతన స్మశానవాటికలో కాళీ స్థలం నుండి పోచమ్మ దేవాలయానికి దారిచేసుకుని నడుస్తున్నారు. ఇదిలా కొనసాగుతున్న క్రమంలో నాగర్ గూడ మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్ ప్రోద్బలంతోనే బీసీలు, దళితుల దారికి అడ్డంపడుతున్నారని ఆరోపించారు. మూడు రోజుల క్రితం గురువారం రోజుల క్రితం బీసీవర్గం

* అధికారుల ప్రయత్నం విఫలం .

దీంతో శనివారం రెండువర్గాలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అధికారుల ప్రయత్నం చేశారు.
వివాదం లేకుండా సమస్య పరిష్కరించుకోవాలని ఎమ్మార్వో అన్వర్, షాబాద్ సీఐ కాంతరెడ్డి సూచించారు. ఎవరైనా కులవివక్ష చూపితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇరువర్గాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

షాబాద్ ఎమ్మార్వో అన్వర్, దళితులు వేసుకున్న దారికి ప్రత్యామ్నాయంగా మరో దిక్కు దారి కల్పిస్తామన్నా మాటలకు దళితులను వేరుచేసే వైఖరి అవలంబిస్తున్నారని, ముందునుండి బీసీలు చేస్తున్న వాదననే వారు రాసిచ్చిన స్క్రిప్ట్ నే ఎమ్మార్వో ఇక్కడ చదివారని, ఎమ్మార్వో అన్వర్ మాటలు బీసీలకే అనుకూలంగా ఉన్నాయని దళిత సంఘాలు మండిపడ్డాయి.

 

* ఎమ్మార్వో వైఖరిపై మండిపడ్డ దళిత సంఘాలు

ఎమ్మార్వో అన్వర్ మాట్లాడుతూ ఈ స్థలం గ్రేవార్డుకు సంబంధించిందని, ఇక్కడ దారి ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పారు. ఊరికి స్మశానవాటిక ఉందికదా మరొక్కటి ఎందుకని దళితసంఘం నాయకులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. నాగరగూడ గ్రామం భవిష్యత్తులో మున్సిపాలిటీ ఏరియా కాబోతుందని ఫిజికల్ గ్రేవార్డులను పెరిగే అవకాశం ఉందని అన్నారు. దళితులకు ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. దళితులు వేసుకున్న దారికి ప్రత్యామ్నాయంగా పక్కనుండి దారి కల్పిస్తామని అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను లిప్ట్ చెయ్యాలని విద్యుత్ ఏఈకి ఫోన్ చేసి మాట్లాడారు. అయినా దళితులు ఒప్పుకోలేదు తరతరాలుగా నాగరగూడలో దళితులపై కులవివక్ష సాగుతుందని, ఎమ్మార్వో అన్వర్ మరో దిక్కు దారి కల్పిస్తామన్నా మాటలు దళితులను వేరుచేసే వైఖరి అవలంబిస్తున్నారని, ముందునుండి బీసీలు చేస్తున్న వాదనను,అక్కడ వారు రాసిచ్చిన స్క్రిప్ట్ నే ఎమ్మార్వో ఇక్కడ చదివారని, ఎమ్మార్వో అన్వర్ మాటలు బీసీలకే అనుకూలంగా ఉన్నాయని దళిత సంఘాలు మండిపడ్డాయి. చివరికి దళిత దేవుళ్ళపై కూడా కుల వివక్ష జరుతుందని .. ఆందోళన చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని దళితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బేగరి యాదయ్య, దుర్గేష్, పెంటయ్య, గోపాల్, క్రిష్ణ, ప్రవీణ్, బాలరాజ్, క్రాంతికుమార్, చందు, రమేష్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ బేగరి మహేష్, నరేందర్, జైపాల్, శ్రీనివాస్, రామకృష్ణ, సుధాకర్, శేఖర్, రాజు, నర్సిములు, అంజయ్య, రాంచంద్రయ్య, నందు, పవన్ తదితరులు పాల్గొన్నారు.

విషాదంలో ప్రజలు వినోదంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య…

విషాదంలో ప్రజలు వినోదంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య

* మీర్జాగూడలో రోడ్డు ప్రమాద ఘటన వద్ద ఎమ్మెల్యేకు నిరసన సేగ
•ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకుండా ప్రారంభోత్సవాలు
* ఎమ్మెల్యే బాటలోని ఆయన అనుచర గణం
* నియోజకవర్గ ప్రజలు చీదరించుకుంటున్న పట్టింపులేని ఎమ్మెల్యే
•అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కాలే యాదయ్య
•ఆస్తులు, పదవులను కాపాడుకునేందుకే ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న కాలే యాదయ్య
•మాజీ ఎమ్మెల్యేగా మారెందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్న ప్రజలు

చేవెళ్ల, నేటిధాత్రి:

 

అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శనివున్నట్లు చేవెళ్ల నియోజకవర్గం ఓటర్ల దుస్థితి. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కాలే యాదయ్య నియోజకవర్గ ప్రజల్ని నిండా ముంచుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో తన ఆస్తులను, పదవిని కాపాడుకునేందుకే పార్టీలు మారుతున్నారు తప్ప ప్రజల మీద ప్రేమతో కాదని స్థానిక ప్రజలు అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికై పార్టీలు మారినట్లు చెబుతున్న ఎమ్మెల్యే ఇప్పటివరకు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, నియోజకవర్గ ప్రజలు వరుసగా మూడు సార్లు కాలే యాదయ్యను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఓరగబెట్టింది ఏమి లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

* ఘోర రోడ్డు ప్రమాద ఘటన వద్ద ఎమ్మెల్యేకు నిరసన సేగ

హైదరాబాదు బీజాపూర్ జాతీయ రహదారి చేవెళ్ల నియోజకవర్గం మీర్జాగూడ వద్ద ఈనెల 3వ తేదీన సోమవారం ఉదయం 6.15 గంటలకు ఘోర రోడ్డు రోడ్డు ప్రమాదం జరిగితే తాఫీగా అందరూ వచ్చాక 9 గంటలకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యకు స్థానిక ప్రజల నుంచి నిరసనసెగ తగిలింది. ఈ ప్రమాదానికి కారణం గత 10ఎళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులే కారణమంటూ ఎమ్మెల్యే కాలే యాదయ్యను స్థానిక ప్రజలు అడ్డంగా నిలదీశారు. 2018 లో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పనులు ప్రారంభం కావాల్సి ఉండగా మీరేం చేశారని ఎమ్మెల్యేను స్థానికులు సూటిగా ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే మీరేం చేస్తున్నారని, ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చారని స్థానికులు నిలదీశారు. అనంతరం ఎమ్మెల్యే గో బ్యాక్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ఓ సందర్భంలో ఎమ్మెల్యే పై స్థానిక ప్రజలు రాళ్లుతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్యే చేసేది ఏమీ లేక నోరు మెదపకుండా సైలెంట్ గా అక్కడి నుంచి పారిపోయాడు. గత ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నియోజకవర్గ ప్రజల నుంచి పలు గ్రామాల్లో నిరసన సెగ తగిలింది. అయినగాని ఎమ్మెల్యే కాలే యాదయ్యలో ఎలాంటి మార్పు రాదని వచ్చే ఎన్నికల్లో కాలే యాదయ్య మాజీ ఎమ్మెల్యేగానే మిగిలిపోతారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

•శవాల మీద ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

ఒకవైపు నియోజకవర్గం ప్రజలంతా ఘోర రోడ్డు ప్రమాదంలో 20మందికి పైగా ప్రాణాలు కోల్పోయి తీవ్ర ఆవేదనలో శోకసంద్రంలో ఉంటే అదేమీ పట్టనట్లు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తో కలిసి షాబాద్ మండలంలో పలు ప్రారంభోత్సవాలు చేశారు.ఈ ఘోర రోడ్డు ప్రమాదం వార్త తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా యావత్తు దేశ వ్యాప్తంగా ఈ ఘటన ప్రజలందరినీ కలిచివేయటం, అందరు దిగ్బ్రాంతికి గురై శోక సంద్రంలో మునిగిపోయారు. ఓవైపు శవాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అవుతుండగానే మానవత్వం లేని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఆయన అనుచరులతో కలిసి మానవత్వాన్ని మంట కలిలిపేలా షాబాద్ మండల పరిధిలో మాచన్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయం, కమ్యూనిటీ హాల్, పునరుద్ధరించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, పార్కును ప్రారంభించారు. అనంతరం పార్కులో ప్రారంభమైన క్రీడా పరికరాలపై విన్యాసాలు చేస్తూ ఆనందం పొందారు.

•రంగులు మార్చడంలో మమ్మల్ని మించిన వారే లేరయ్యా.

చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం, వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తాజా ఎమ్మెల్యే కాలే యాదయ్య రంగులు మార్చడంలో మిమ్మల్ని మించిన వారే లేరయ్యా అన్న ధోరణిలో, విశ్వదాభిరామ వినురవేమా అని వేమన పద్యాన్ని నిజం చేశారు.కేవలం నియోజకవర్గ అభివృద్ధి పేరుతో ఊసరవెల్లి రంగులు మార్చినట్టు పార్టీల జెండాలను మార్చటంలో తాజా ఎమ్మెల్యే కాలే యాదయ్య చరిత్ర సృష్టించారు.వరుసగా మూడుసార్లు కాలే యాదయ్యను నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మూడుసార్లు పార్టీలను మార్చి తమ ఆస్తులను, పదవులను కాపాడుకునేందుకే,అవకాశవాద రాజకీయాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇది నియోజకవర్గ ప్రజల పాలిట శాపంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కేఎస్ రత్నం కూడా ఊసరవెల్లిలా తెలుగుదేశం నుంచి టిఆర్ఎస్, టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి బిజెపి పార్టీల జెండాలను మార్చి చరిత్ర సృష్టించారు. మరి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాలే యాదయ్య 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొంది టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేరారు. 2019లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందగా, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామేన భీమ్ భరత్ పై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అనంతరం అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేస్తున్నారని పలువురు కాంగ్రెస్ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇలా గెలుపొందిన మూడుసార్లు అధికార పార్టీలో లేకుంటే తన ఆస్తులు, పదవులను కాపాడుకుకోలేననే భయంతోనే రంగులు మార్చడంలో ఒకరిని మించి ఒకరు తయారయ్యారని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గత 20 ఏళ్లుగా,నాలుగు పర్యాయాలు చేవెళ్ల నియోజకవర్గం (ఎస్సీ)నుంచి ప్రాతినిధ్య ఊహించిన ఇద్దరు (మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య) ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ ఆదర్శంగా నిలిచారని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలు మారిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో వారి ఆస్తులు, పదవులను కాపాడుకునేందుకే పార్టీలు మారుతున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలపై ప్రేమతో కాదని నియోజకవర్గ ప్రజలు బల్లగుద్ది చెబుతున్నారు.

•ఎమ్మెల్యే కాలే యాదయ్య ఏపార్టీలో ఉన్నారో బహిరంగ ప్రకటన చయాలి

బీఆర్ఎస్ పార్టీ భీ పామ్ పై గెలుపొందిన ఎమ్మెల్యే కాలే యాదయ్య అసలు తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా…? లేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కోనసాగుతున్నరో నియోజకవర్గ ప్రజలకు బహిరంగ ప్రకటన చేయాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో కోనసాగితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పిలుపుల్లో ఎందుకు పాల్గొనటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయన అనుచర కాంగ్రెస్ పార్టీ నేతలు ఆపార్టీ కండువాలు వేసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైతుండగా మరి ఆయన ఎందుకు కాంగ్రెస్ కండువా వేసుకోవటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన వేటు పడి ఉప ఎన్నికలు వస్తే ఎమ్మెల్యేను ఈసారి ఇంటి బాట పట్టిస్తామని ఓటర్లు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా నియోజకవర్గ అభివృద్ధికై తమ ఎమ్మెల్యే కాలే యాదయ్యకు భగవంతుడు మంచి బుద్ధి, మంచి జ్ఞానాన్ని ప్రసాదించి హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

రాజీవ్ గాంధీ భారతదేశ సమాచార విప్లవ పితామహుడు

రాజీవ్ గాంధీ భారతదేశ సమాచార విప్లవ పితామహుడు

చేవెళ్ల, నేటిధాత్రి:

చిన్న వయస్సులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిదేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమనిచేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ 81వ జయంతిని పురస్కరించుకునిమొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ చౌరస్తాలొ మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే పిన్న వయసులో దేశానికి ప్రధానమంత్రి అయ్యి దేశంలో తరం మార్పుకు సంకేతంగా రాజీవ్ గాంధీ దేశ చరిత్రలో అతిపెద్ద మెజారిటీ సాధించా రన్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ, ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశట్టిన రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారని అన్నారు. దేశంలో కంప్యూటరైజేషన్,టెలికమ్యూనికేషన్ విప్లవం ఘనత అతనికే చెందుతుందని కొనియాడారు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్ , టీ పి సి సి కార్యదర్శులు రామ్ రెడ్డి , మొయినాబాద్ మండలం అధ్యక్షులు మానయ్య , మాజీ జడ్పీటీసీ కె భాస్కర్ , వెంకటాపూర్ మహేందర్ రెడ్డి , ఉపాధ్యక్షులు మర్రి రవీందర్ రెడ్డి , దారెడ్డి కృష్ణ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గణేష్ గౌడ్, ఎంపీటీసీ కేబుల్ రాజు, అప్పారెడ్డిగూడ కిరణ్ కుమార్, రాములు,డైరెక్టర్ బాలకృష్ణ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, ఫిషార్మెన్ మండల ప్రసిడెంట్ బిక్షపతి, గన్నెపాగ నర్సింగ్ రావు, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి , శ్రీ పాల్ , ఆయా గ్రామాల ఇందిరమ్మ కమిటీమెంబర్స్,మాజీ సర్పంచ్ ,ఉప సర్పంచ్ లు తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version