సీఎం రేవంత్ కు రాఖీకట్టిన మాజీ ఎంపీపీ సౌజన్య గౌడ్..

సీఎం రేవంత్ కు రాఖీకట్టిన మాజీ ఎంపీపీ సౌజన్య గౌడ్

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:

అన్నాచెల్లెళ్లు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ మహోత్సవం.శనివారం
రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదారాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డికి టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బీమగాని సౌజన్య గౌడ్ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Former MPP Soujanya Goud

రాఖీ పండుగ సందర్భంగా సీఎం ఆత్మీయత ఎంతో సంతోషాన్ని కలిగించిందని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మాజీ ఎంపిపి,టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి భీమాగాని సౌజన్య గౌడ్ తెలిపారు.

 కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదంటే.. కవిత షాకింగ్ కామెంట్స్

 కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదంటే.. కవిత షాకింగ్ కామెంట్స్

 

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈసారి సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ను 37శాతం ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లాభాలను ఎందుకు తక్కువ చేసి చూపిస్తోందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్‌తో (KTR) గ్యాప్‌పై మాట్లాడటానికి ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఇష్టపడలేదు. కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదనే మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆమె దాటవేశారు. బీఆర్ఎస్‌పైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒక మాట, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోమాట మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. ఇవాళ(ఆదివారం) బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చినా.. బీజేపీ హై కమాండ్ ఎందుకు చర్చించలేదని నిలదీశారు. దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తాననని ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత.

సింగరేణి కార్మికులకు భరోసా కల్పించేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు కార్మికుల‌ సమస్యలపై HMSతో కలసి అలయన్స్‌గా పనిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈసారి సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ను 37శాతం ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లాభాలను ఎందుకు తక్కువ చేసి చూపిస్తోందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత.

పంచాయతీ ఎన్నికలు..

పంచాయతీ ఎన్నికలు.. BIG UPDATE

TG: పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్న రూల్‌ను రద్దు చేసే ఛాన్సున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ చట్టం-2018 సెక్షన్ 21(3)ని తొలగించే ప్రతిపాదనను క్యాబినెట్ ముందు ఉంచనున్నట్లు చర్చ మొదలైంది. BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ఈ మార్పు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం..

యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

కేసముద్రం/ నేటి ధాత్రి

యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం అంబేద్కర్ సెంటర్లోయూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గొల్లపల్లి మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ చరణ్, మహబూబాబాద్ యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్, మహబూబాద్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ మిట్ట గడుపుల యాకూబ్, మండల యూత్ ఉపాధ్యక్షులు సమీర్, యూత్ మండల ప్రధాన కార్యదర్శి కాసు సతీష్ , మండల యువజన నాయకులు కొండేటి కళాధర్, హరికృష్ణ, అభి, దినేష్, సందీప్, యశ్వంత్, తదితరులు పాల్గొనడం జరిగింది.

కాంగ్రెస్ కార్యకర్త అంతిమయాత్రలో పాల్గొన్న..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-09T142219.426.wav?_=1

కాంగ్రెస్ కార్యకర్త అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర నేటిధాత్రి :

గంగాధర మండల కేంద్రానికి చెందిన రాజుల ఆదిరెడ్డి శుక్రవారం రోజున కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం గంగాధర మండల కేంద్రంలో ఆదిరెడ్డి అంతిమయాత్రను నిర్వహించగా శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం అంత్యక్రియలో పాల్గొని ఆదిరెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అంతిమయాత్రలో ఆదిరెడ్డి పాడె ను మోశారు. ఆదిరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యకర్తను కోల్పోయిందని, ఆదిరెడ్డి ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని ఆకాంక్షించారు.

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-09T135807.613.wav?_=2

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

*మహదేవపూర్ఆగస్టు9(నేటి ధాత్రి) *

మహాదేవపూర్ మండలంలోని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పర్శవేణి నగేష్ యాదవ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి,కేక్ కట్ చేసి కాంగ్రెస్ నాయకులతో సంబరాలు చేశారు
ఈ కార్యక్రమములో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అక్బర్ ఖాన్, సింగల్ విండో చెర్మన్ చల్ల తిరుపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుడాల శ్రీనివాస్, కట్కాo అశోక్,మాజీ కాళేశ్వరం దేవస్థానం చెర్మన్ వామన్ రావు,మాజీ సర్పంచ్ కోట సమ్మయ్య,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లేతకారి రాజబాబు,మాజీ ఎంపీటీసీ గంగయ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోత రామకృష్ణ యూత్ నాయకులు రాజేష్, కడార్ల నాగరాజు,శంకర్,రవిచందర్, సంతోష్,శివరాజు,మనోజ్ రెడ్డి,స్వామి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు

విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్లో వరలక్ష్మి వ్రతం పూజ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-09T130238.015-1.wav?_=3

విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్లో వరలక్ష్మి వ్రతం పూజ

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రమైన విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్లో వరలక్ష్మి వ్రతం సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో పూజలు నిర్వహించారు అదేవిధంగా రాఖీ పౌర్ణమి పండగ ముందస్తుగా వేడుకలను విద్యార్థిని విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమములో పాఠశాల కరస్పాండెంట్ బి నాగన్న ప్రధానోపాధ్యాయులు శ్వేత ఉపాధ్యాయులు మల్లయ్య సాయికుమార్ పవన్ కుమార్ వి నాగజ్యోతి స్రవంతి ఈశ్వరమ్మ ప్రతిభ సుష్మిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండండి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-4-3.wav?_=4

_ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండండి – బొరేగౌ నాగేందర్ పటేల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

భారీ వర్షాల కారణంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.రహదారులు నీటితో నిండిపోవచ్చని ముందస్తు హెచ్చరిక ఇవ్వుతూ, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొరేగౌ నాగేందర్ పటేల్ సూచించారు.సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని, ఉధృత ప్రవాహం ఉన్న చోట్లకు చేరరాదని సూచించారు.వాగులు, వంకల వద్దకు చేపల వేటకు జాలర్లు వెళ్లకూడదు. పశువులను కాయడానికి నదులు, వాగులు, చెరువుల దగ్గరకు తీసుకెళ్లకుండా జాగ్రత్త వహించాలని కోరారు.అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు.వర్షాల వల్ల ప్రమాదకరంగా మారే ప్రాంతాల్లో ఎలాంటి విపత్తులు జరుగకుండా మండల పోలీసులు మరియు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లి, వారి ప్రాణాలు రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సింగరేణి కంపెనీలో సీమాంధ్ర అధికారుల ఆధిపత్యం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-08T134729.909-1.wav?_=5

సింగరేణి కంపెనీలో సీమాంధ్ర అధికారుల ఆధిపత్యం

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు తీరని అన్యాయం

భూపాలపల్లి నేటిధాత్రి

 

తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ
సింగరేణి మెడికల్ బోర్డులో కార్మికులకు నిరాశే కొత్తగూడెంలో నిర్వహించిన హయ్యర్ సెంటర్ మెడికల్ బోర్డు కు 55 మంది కార్మికులను పిలిచి కేవలం ఐదుగురిని మాత్రమే మెడికల్ బోర్డు మెడికల్ చేసింది
దాదాపు 9 నెలలుగా ఎలాంటి వేతనాలు లేకుండా మెడికల్ లో ఉంచి కార్మికులను తొమ్మిది నెలలు ఎదురుచూసిన కార్మికుల నోట్లో మట్టి కొట్టిన సీమాంధ్ర అధికారులు
ఈసారి మెడికల్ బోర్డు విషయంలో దళారి వ్యవస్థకు చెక్కు పెట్టిన అంటున్నా అధికారులు
అంటే గతంలో ఈ రూల్స్ పాటించలేదా గత ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని కార్మికులకు అన్యాయం తల పెట్టిందని సింగరేణి వ్యాప్తంగా 12 మంది ఎమ్మెల్యేలను కార్మిక వర్గం గెలిపిస్తే ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అన్యాయం తలపెడుతున్నది
కాంగ్రెస్ ప్రభుత్వంలో టాప్ రెండు పదవులలో ఉన్న నాయకుల మధ్య కోల్డ్ వార్ లో సమిదాలైన మెడికల్ బోర్డు దరఖాస్తు దారులు ఇన్నాళ్లుగా అన్యాయంగా మెడికల్ ఇన్వాల్విడేషన్ చేసిందిఎవరు సింగరేణి ఉన్నంత యాజమాన్యానికి ఇది తెలియదా
ప్రభుత్వ ఆది నాయకత్వానికి తెలియదా
జరుగుతున్న ఉల్లంఘన తెలిసే నూతనంగా ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం తన తర్వాత ఉన్న వారికి చెక్కుపెట్టి మెడికల్ బోర్డులో జరిగే లావాదేవీలను నియంత్రించడానికి ఇతనిని నియమించారు అనుకుందాం ఈ మెడికల్ బోర్డు ఫలితాలు తార్ మార్ కావడంతో ఎన్నో కుటుంబాలు వీధిపాలయ్యాయి ఈ కొత్తగా వచ్చిన అధికారి ఇంతటితో ఆగలేదు 35 సంవత్సరాల నుండి 45 ఏళ్ల లోపు వారికి కారుణ్య నియామకాలకు అర్హత ఇచ్చింది కంపెనీ ఆ మాజీ ఉద్యోగులు వారి పిల్లలకు ఉద్యోగం దొరకాలనే గంపెడు ఆశతో ఓపెన్ స్కూల్ టెన్త్ సర్టిఫికెట్లువయసు 35 లోపు ఉండేలా పెట్టుకున్నారు 40 కి అర్హత వచ్చాక సింగరేణి యాజమాన్యం అడగడంతో వారి ఒరిజినల్ రెగ్యులర్ టెన్త్ సర్టిఫికెట్లు సంక్షేమ అధికారులకు అమాయకంగా ఇచ్చారు
కొత్తగా వచ్చిన బాస్ వాళ్లను మోసగాళ్లుగా ప్రకటించారు ఉద్యోగాలు కాదు కదా యంఎంసి డబ్బులు కూడా వారికి రద్దు చేశారు ఆ కుటుంబాలన్నీ ఆర్థికంగా నష్టపోయాయి
సింగరేణిలో కార్మిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతున్న సింగరేణి కార్మిక వర్గం ఓట్లతో గెలిచిన గుర్తింపు ప్రాతినిత్య సంఘాలు నోరు మేతపడకపోవడంలో అంతరాయం ఏంటి
మూడు నెలలుగా కారుణ్య నియామకాలు ఆగిపోయినాయి ఒక్కరికి సైత్యం ఆర్డర్ ఇవ్వలేదు
కార్మిక వర్గం పడుతున్న బాధలు తెలియని ఇతర ప్రాంతాల అధికారులు ఇరువురు ఈ కారుణ్యనియామక నష్టానికి కార్మికులు రక్త మాంసాలను ద్వారా పోసి ఇన్ని సంవత్సరాలు కంపెనీకి సేవ చేస్తే కార్మికుల యం ఎం సి డబ్బులు రాకుండా ఉండడానికి కారణం ఎవరు అని కార్మికులు భావిస్తున్నారు
ప్రజా పాలనతో రాష్ట్రాలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన అమీలను అమలు పరచాలని మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికునిమెడికల్ ఇన్వాలిడేషన్ చేసి వారి కుటుంబంలో ఎలాంటి షరతులు లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం సింగరేణి కంపెనీని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
కార్యక్రమంలో
టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం నాయకులు
దాసరి జనార్ధన్
నామల శ్రీనివాస్
కాసర్ల ప్రసాద్ రెడ్డి
రాళ్ల బండి బాబు
జయశంకర్
కే నరసింహారెడ్డి
ఎండి సలీం
తదితరులు పాల్గొన్నారు

దిగ్వాల్లో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-33.wav?_=6

దిగ్వాల్లో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండలంలోని దిగ్వాల్ గ్రామంలో ప్రజపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆత్మ కమిటీ చైర్మన్ పట్లోళ్ల రామలింగా రెడ్డి గురువారం అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. భూమి పూజలో పాల్గొని పనులు ప్రారంభించారు.

ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు కార్యక్రమం జోరుగా

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-31.wav?_=7

ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు కార్యక్రమం జోరుగా

వర్దన్నపేట నేటిధాత్రి :

భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల,కడారి గూడెం గ్రామం పరిధిలోని 227 228 229 బూత్ శక్తి కేంద్రం ఇంచార్జ్ నాంపల్లి కుమార్ ఆధ్వర్యంలో మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా “ఇంటింటికి బిజెపి ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు” పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి జడ సతీష్ అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని మోసాన్ని నరేంద్ర మోదీ గారి పథకాల గొప్పతనాన్ని నిబద్ధత గల సైనికులుగా పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరింత బలంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు చిక్కొండ రాజు , పింగిలి రాజేందర్ రెడ్డి. జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి పింగిలి సంపత్ రెడ్డి. బూత్ కమిటీ సభ్యులు చిర్రా కిరణ్. వంగాల రాజేందర్ రెడ్డి . పింగిలి ఇంద్రసేనారెడ్డి. సుదర్శన్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T152502.610.wav?_=8

పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…

జీవో 76 ప్రకారం ఇండ్ల పట్టాలను పక్కన పెట్టిన ప్రభుత్వం…

హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన గాలికి వదిలేసిందని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరచడం లేదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. గురువారం రామకృష్ణాపూర్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి రామాలయం చౌరస్తాలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడారు. మందమర్రి పట్టణంలో జయశంకర్ ఏడడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తరలి వెళుతున్నామని అందులో భాగంగానే రామకృష్ణాపూర్ పట్టణం నుండి ర్యాలీగా వెళ్లడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చడంలేదని దుయ్యబట్టారు. సింగరేణి ప్రాంతంలో జీవో నెంబర్ 76 ప్రకారం వీళ్ళ పట్టాలు గత మా ప్రభుత్వంలో అందించడం జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు అందించడంలో విఫలమయ్యిందని అన్నారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లను కులుస్తుందని ధ్వజమెత్తారు.

Congress government

20 నెలల పరిపాలనలో ప్రజలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T130130.548.wav?_=9

నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలంలో రైతు వేదిక ఆఫీస్ నందు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొనగా
చర్ల మండలంలోని ప్రజలకు నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన అర్హులకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది

MLA Dr. Tellam Venkat Rao

ఈ కార్యక్రమంలో చర్ల ఎండిఓ ఈదయ్య ఎంపివో వలీ హజ్రత్ సివిల్ సప్లయ్ డిటి రాజులు ఏపిఎం లక్ష్మి దుర్గ చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి భద్రాచలం నియోజకవర్గం టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి గుండెపూడి భాస్కరరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలిన లంకరాజు ఇందల రమేష్ బాబు పొట్రూ బ్రహ్మానంద రెడ్డి ఈర్ప వసంత్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పరుచూరి రవిబాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు అభిమానులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు

మద్దూరు మండలం పిట్టల గూడెం సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి:

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T124755.909.wav?_=10

మద్దూరు మండలం పిట్టల గూడెం సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి:

బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బొంగోని సురేష్ గౌడ్

మద్దూరు నేటి ధాత్రి

జనగామ నియోజకవర్గం మద్దూరు మండలం లో ధర్మారం గ్రామం పిట్టల గూడెం లో బీజేపీ మండల అధ్యక్షులు ఉదయ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బొంగోని సురేష్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మారం గ్రామ పిట్టల గూడెం లో కనీస వసతులు లేవని, ఉండడానికి ఇల్లు లేక గుడిసెల్లో జీవనం సాగిస్తుంటే పాము కాటుకు గురి కానీ కుంటుంబం అంటూ లేదు అని బాధపడ్డారు అలాగే మురుగు నీరు రోడ్లమీద ప్రవహిస్తుంటే ఈ కాలనీ వాసులు రోగాల పాలు అవుతున్నారని, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మరుగు దొడ్లు మంజూరు చేపిస్తే ఈ కాలనీ వాసులకు ఇవ్వలేని దుస్థితి నెలకొనడం బాధాకరం అని వాపోయారు స్థానిక శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి కి, కాంగ్రెస్ ఇక్కడి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కంటికి కనబడడం లేదా అని మండిపడ్డారు. పిట్టల గూడెం ప్రజల సమస్యలను పరిష్కరించాలని లేని యెడల వారి వారికీ అండగా బీజేపీ పోరాడుతుందని హెచ్చరించారు.అదేవిదంగా పిట్టల గూడెం రోడ్డు అద్వానంగా తయారై నిత్యం ప్రమాదలకు గురై నానా అవస్థలు పడుతున్నారని వెంటనే తారు రోడ్ ను వేయాలని డిమాండ్ చేశారు.అనంతరం పిట్టల గూడెం వాసులతో కలిసి వారి గుడిసెలో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు కూరెళ్ల కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బియ్య రమేష్, నరదాసు సందీప్, బండి శ్రీహరి,వినయ్, సిరిమల్లె సురేష్, ఏలూరి శివ, రవి, బొల్లు రాజు, ప్రశాంత్, సాయి కిరణ్, సాయి బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

జాతీయ చేనేత దినోత్సవం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T124230.169.wav?_=11

జాతీయ చేనేత దినోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

(ఆంగ్లం: National Handloom Day) ఆగస్టు 7న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటుచేయడం జరిగింది.

ప్రారంభం

2015, ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించి, భారత చేనేత లోగోను ఆవిష్కరించడంతోపాటూ ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా 2012-14 సంవత్సరాల్లో చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన 72మందికి అవార్డులు (వీరిలో 16 మందికి సంత్ కబీర్ పురస్కారాలు) ప్రదానం జరిగింది.

చరిత్ర

భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. భారత స్వాతంత్ర్యోద్యమంలో చేనేత అహింసాయుత ఉద్యమానికి నాంది పలికిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాపోలు ఆనంద భాస్కర్ 2005లో చేనేత దినోత్సవానికి సంబంధించిన పరిశోధన చేసి చారిత్రిక ఆనవాళ్లను శోధించాడు, చేనేత దినోత్సవానికి సరైన తేదీ కోసం అధ్యయనం చేశాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమం జరుగుతున్న సమయంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం వచ్చింది. మొదటిసారిగా 1905లో బెంగాల్‌ రాష్ట్ర రాజధాని కలకత్తాలోని టౌన్‌హాల్‌లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి విదేశీ వస్త్రాలను బహిష్కరించడంతోపాటూ దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. అలా విదేశి వస్తు బహిష్కరణలో కీలకపాత్ర వహించిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా చేయాలని ఆనంద భాస్కర్ ప్రతిపాదించాడు. ఈ దినోత్సవానికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించాలని తడ్క యాదగిరి, ఎర్రమాద వెంకన్న నేతతోపాటు మరికొందరిని ప్రోత్సహించాడు.

National Handloom Day

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2006వ సంవత్సరం నుండి స్థానిక చేనేత సంఘ నాయకులతో కలిసి వివిధ కార్యక్రమాలను నిర్వహించిన ఆనంద భాస్కర్, ఆగస్టు 7వ తేదీకి ఉన్న చారిత్రిక ప్రాధాన్యతను అందరికి తెలియజేసి, 2006 నుండి చేనేత దినోత్సవ కార్యక్రమం క్రమంతప్పకుండా జరిగే విధంగా రూపకల్పన చేశాడు.

అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, అప్పటి కేంద్ర జౌళీ శాఖ మంత్రి శ్రీ శంకర్ సింగ్ వాఘేలా, ఎల్.కె.అద్వానీ లతోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆనంద భాస్కర్ ప్రయత్నాన్ని అభినందిస్తూ సందేశాలు పంపారు. 2008, ఆగస్టు 7న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన చేనేత దినోత్సవ వేడుకలకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖరరెడ్డి పాల్గొన్నాడు.

2012, ఏప్రిల్ 2న ఆనంద భాస్కర్ కు రాజ్యసభ సభ్యునిగా అవకాశం రావడంతో చేనేత దినోత్సవ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 2012, ఏప్రిల్ 6న రవీంద్రభారతిలో ఎర్రమాద వెంకన్న నేత సారథ్యంలో చేనేత దినోత్సవ చరిత్ర, ఆవశ్యకతను వివరిస్తూ స్వదేశీయం సంగీత నృత్య రూపకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి అప్పటి రాజ్యసభ సభ్యులు రాపోల్ ఆనంద భాస్కర్, చిరంజీవి ముఖ్య అతిధులుగా హజరయ్యారు. ఆ తరువాత చేనేత దినోత్సవానికి సంబంధించి ఢిల్లీలో జరిగిన అన్ని జాతీయ కార్యక్రమాలకు ఆనంద భాస్కర్ నాయకత్వం వహించాడు. వివిధ రాష్ట్రాలలోని జాతీయ నాయకులను కలిసి దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని కల్పించాడు.

2012, ఆగస్టు 7న ఆనంద భాస్కర్ ఆద్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారిగా చేనేత దినోత్సవం జరుపబడింది. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారులను, రాజకీయ దిగ్గజాలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఎర్రకోట నుండి రాజ్ ఘాట్ వరకు చేనేత వాక్ నిర్వహించి జాతీయ స్థాయిలో ఈ దినోత్సవంపై ఆసక్తిని కలిగించాడు. 2014లో అదే రాజ్ ఘాట్ లో చేనేత దినోత్సవ ర్యాలీకి ముఖ్య అతిథిగా వచ్చిన అప్పటి కేంద్ర జౌళీ శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రధానితో చర్చించి చేనేత దినోత్సవాన్ని అధికారికం చేస్తామని మాటిచ్చాడు.

2014 నుండి 2015 వరకు ప్రభుత్వాధికారులపై ఒత్తిడి పెంచిన ఆనంద భాస్కర్, 2015 మార్చి 3న రాజ్యసభలో ఆగస్టు 7ని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించాలని ప్రతిపాదించాడు. అందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి, అందులో రాపోలు ఆనంద భాస్కర్ ని సభ్యునిగా చేర్చి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరింది. చేనేత దినోత్సవానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, రికార్డులు, పూర్వ చరిత్ర, సంబంధిత చేనేత జౌళిశాఖామంత్రి అప్పటి కేంద్ర వస్త్ర, జౌళి శాఖామంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ కి అందించాడు. ఆనంద భాస్కర్ సమర్పించిన పత్రాలు రికార్డులను పరిశీలించిన శాఖ అధికారులు, తమ నివేదికను ప్రధానమంత్రికి సమర్పించారు.
ఆనంద భాస్కర్ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రాంత ప్రభుత్వాల అంగీకారంతో 2015, జూలై 29న భారత ప్రభుత్వం ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా అధికారిక గెజిట్ విడుదల చేసింది. 2015, ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలో అధికారికంగా ప్రారంభించారు. ఈ అధికారిక జాతీయ పండుగకు కేంద్ర మంత్రులు, తమిళనాడు రాష్ట్ర మంత్రులు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ చేనేత కళాకారులు పాల్గొన్నారు. ఆనాటి నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రమం తప్పకుండా జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్నాయి.

మ్యూజియం నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశాడు. అనంతరం మన్నెగూడలోని బీఎంఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొని రాష్ట్రంలోని చేనేత కార్మికులు కొత్త తరహా మగ్గాల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించడంకోసం రూపొందించబడిన తెలంగాణ చేనేత మగ్గం పథకాన్ని ప్రారంభించాడు. నేతన్న బీమా పథకం వయో పరిమతిని 59 నుండి 75 వయస్సుకు పెంచుతున్నట్లు, చేనేత మిత్ర పథకం ద్వారా అందించే 50 శాతం సబ్సిడీకీ బదులుగా మగ్గానికి నెలకు రూ.3వేలు అందజేయనున్నట్లు, కార్మికులు దహన సంస్కారాల కోసం అందించే ఆర్థక సహాయాన్ని రూ.12,500 నుండి రూ.25వేలకు పెంచుతున్నట్లు, ఆరోగ్య కార్డు ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ. 25వేల వరకు వైద్య సేవలు అందించనున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా చేనేత మిత్ర, పావలావడ్డీ, నేతన్నకు చేయూత, నూలు సబ్సిడీ లబ్ధిదారులకు చెక్కులనూ, 36మంది చేనేత కార్మికులు, వృత్తి నిపుణులకు కొండా లక్ష్మణ్‌బాపూజీ అవార్డులను అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక-సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, ఎమ్మెల్సీ రమణ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ చింతా ప్రభాకర్, పవర్ లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చైర్మన్‌ గూడూరి ప్రవీణ్ లతోపాటు పలు చేనేత సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఇతర వివరాలు

✓ చేనేతరంగంలో విశిష్ట కృషిచేసిన చేనేత కార్మికులను గౌరవిస్తూ 2012నుంచి ఏటా చేనేత కార్మికులకు సంత్‌కబీర్‌ అవార్డులను జాతీయస్థాయిలో అందిస్తున్నారు.
✓ 2018లో యాదాద్రి – భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన చేనేత కళాకారులు కుట్టులేని జాతీయ జెండాను రూపొందించారు. 24 ఆకులతో కూడిన అశోక చక్రం సహా జాతీయ పతాకమంతా ఎలాంటి కుట్టులేకుండా మగ్గంపై తయారుచేశారు.

కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించిన ఎమ్మెల్య.

కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

నేటిధాత్రి చర్ల

చర్ల మండలం ఎంపీడీవో ఆఫీస్ పక్కన రైతు వేదిక వద్ద ‌కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి అధ్యక్షతన ముఖ్యఅతిథులుగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కళ్యాణ లక్ష్మి పధకం క్రింద పేద ఇంటి ఆడబిడ్డ పెళ్ళి చేసిన తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేసిన ఈ పధకం ద్వారా చర్ల మండలంలో 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం జరిగింది సంబంధితులకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి భద్రాచలం నియోజకవర్గం టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలిన లంక రాజు ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పరుచూరి రవిబాబు గుండెపూడి భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర బీసీల సమస్యలు..

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర బీసీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యమిద్దాం

బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్

కరీంనగర్, నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశ రాజధాని ఢిల్లీలో బీసీల డిమాండ్లపై ధర్నాలు ఆందోళనలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండడం పట్ల తెలంగాణ బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బుచ్చన్న యాదవ్ ఒక ప్రకటనలో బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థలలో విద్యా, ఉద్యోగ రంగాలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ నలబై రెండు శాతం రిజర్వేషన్ ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ కు పంపించి నెలలు గడిచిన దానిపై నేటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం చూస్తుంటే బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత కపట ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. నేను బీసీ ప్రధానమంత్రిని అని చెప్పుకునే మోడీకి బీసీ డిమాండ్లు పట్టవా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో బీసీ బిల్లుకు మద్దతు పలికి కేంద్రంలో దానిని వ్యతిరేకంగా వ్యవహరించడం బిజెపి ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనం అన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని ప్రగల్బాలు పలికిన బిజెపి నేతలు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం నుండి కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు మిగతా ఎంపీలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వాన్ని, ఎంపీలను ఒప్పించి రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించాలని లేకుంటే బీసీ ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదల కోసం అంటూ 13వ రాజ్యాంగ సవరణ చేసి పది శాతం రిజర్వేషన్లు పార్లమెంటులో బిల్లు పెట్టి అమలు చేసిందని కానీ బీసీల పట్ల మెతక వైఖరి వహించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి బీసీలకు రిజర్వేషన్లు వెంటనే కల్పించాలని లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వంపై బీసీలంతా ఐక్యంగా ఉండి ప్రజా ఉద్యమాలు చేస్తామని కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ హెచ్చరించారు.

బోర్ మోటార్ ని ప్రారంభం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు..

బోర్ మోటార్ ని ప్రారంభం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ సర్పంచ్ మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కోరటపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ, ముదిరాజ్ కాలనీలలో చేతి పంపులు పని చేయక తాగునీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్న సమస్యను గుర్తుంచి వెంటనే స్పందించి తన స్వంత ఖర్చులతో బోర్ మోటార్ ఫిట్ చేపించి ఇబ్బందిని తీర్చిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ సర్పంచ్ మేకల ప్రభాకర్ యాదవ్. ఈసందర్భంగా గ్రామ ప్రజలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో యువ మోర్చా మండల అధ్యక్షులు దురుశెట్టి రమేష్, బూత్ అధ్యక్షులు ఉప్పు తిరుపతి, మేకల అభిషేక్, దుర్శేట్టి అంజి, కనుకం మల్లయ్య, రాజయ్య, పోచయ్య, గణేష్, శ్రీకాంత్, గ్రామ ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా టీజీఈ చైర్మన్,టీఎన్జీవో కేంద్ర సంఘం…

ఘనంగా టీజీఈ చైర్మన్,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా టిజిఈ జేఏసీ చైర్మన్,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు మంచిర్యాల టీఎన్జీవో కార్యాలయంలో బుధవారం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఉద్యోగుల సమస్యలు సాధించడానికి ఉద్యోగులందరూ టిజిఇ జేఏసీ చైర్మన్,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ కి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నం మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాబురావు, ఉపాధ్యక్షులు కేజియా రాణి,రామ్ కుమార్ సంయుక్త కార్యదర్శి,రవి కిరణ్ మంచిర్యాల యూనిటీ అధ్యక్షులు,నాగుల గోపాల్ బెల్లంపల్లి యూనిటీ అధ్యక్షులు,వెంకటేష్ సభ్యులు రోశయ్య తదితరులు పాల్గొన్నారు.

రజక సంఘానికి భూమి పూజ…

రజక సంఘానికి భూమి పూజ

నేటి ధాత్రి కథలాపూర్

కథలాపూర్ మండలంలోని దులూరు గ్రామంలో బుధవారం రోజున రజక సంఘ నూతన భవన నిర్మాణానికి సంఘ సభ్యులు భూమిపూజ చేసారు.రజక సంఘానికి పార్లమెంట్ సభ్యులు MP లాడ్స్ నుండి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు 3 లక్షల రూపాయలు మంజూరు చేసారని తెలిపారు ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, సహకారాన్ని అందించిన వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చెన్నమనేని వికాస్ రావు లకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్యాల మారుతి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర్రావు,నరెడ్ల రవి,కాసోజీ ప్రతాప్,లక్ష్మి నర్సయ్య,రాజేష్,జెలందర్,మీన్ రెడ్డి, రాజారెడ్డి,వెంకటేష్,శ్రీమాన్,శ్రీకాంత్, రాజు,గంగారాం పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version