రాజీవ్ గాంధీ భారతదేశ సమాచార విప్లవ పితామహుడు
చేవెళ్ల, నేటిధాత్రి:
చిన్న వయస్సులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిదేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమనిచేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ 81వ జయంతిని పురస్కరించుకునిమొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ చౌరస్తాలొ మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే పిన్న వయసులో దేశానికి ప్రధానమంత్రి అయ్యి దేశంలో తరం మార్పుకు సంకేతంగా రాజీవ్ గాంధీ దేశ చరిత్రలో అతిపెద్ద మెజారిటీ సాధించా రన్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ, ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశట్టిన రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారని అన్నారు. దేశంలో కంప్యూటరైజేషన్,టెలికమ్యూనికేషన్ విప్లవం ఘనత అతనికే చెందుతుందని కొనియాడారు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్ , టీ పి సి సి కార్యదర్శులు రామ్ రెడ్డి , మొయినాబాద్ మండలం అధ్యక్షులు మానయ్య , మాజీ జడ్పీటీసీ కె భాస్కర్ , వెంకటాపూర్ మహేందర్ రెడ్డి , ఉపాధ్యక్షులు మర్రి రవీందర్ రెడ్డి , దారెడ్డి కృష్ణ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గణేష్ గౌడ్, ఎంపీటీసీ కేబుల్ రాజు, అప్పారెడ్డిగూడ కిరణ్ కుమార్, రాములు,డైరెక్టర్ బాలకృష్ణ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, ఫిషార్మెన్ మండల ప్రసిడెంట్ బిక్షపతి, గన్నెపాగ నర్సింగ్ రావు, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి , శ్రీ పాల్ , ఆయా గ్రామాల ఇందిరమ్మ కమిటీమెంబర్స్,మాజీ సర్పంచ్ ,ఉప సర్పంచ్ లు తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.