గెలిపిస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామన్నారు .. ఏమైంది?
సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
ఎన్నికలలో గెలిపిస్తే కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచుతామన్నారని, ఏమైందని సింగరేణి కార్మిక సంఘాల ( జేఏసీ) నాయకులు ప్రశ్నించారు.బుధవారం నాయకులు గట్టు మహేందర్, ఎస్సీ కేఎస్ (సిఐటియు) డివిజన్ కార్యదర్శి మాట్లాడుతూ..సింగరేణిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా,రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 22ను వెంటనే గెజిట్ చేసి కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.ఈ నెల 22న జెఎసి సంఘాల ఆధ్వర్యంలో ఛలో ప్రజాభవన్ కు కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలనే పిలుపులో భాగంగా బుధవారం శ్రీరాంపూర్ ఓసిపిలో కాంట్రాక్టు కార్మికుల అడ్డలో జెఎసి నాయకులు ప్రచారం చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లు, బడాపెట్టుబడిదారుల అనుకూల విధానాలతో కార్మికుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయని ఆరోపించారు.చేసే పనులకు అనుగుణంగా కనీస వేతనాలు లేక కుటుంబాలను పోషించుకో లేక సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన 5 జీవోలను (,21,22,23,24,25) గెజిట్ చేయకుండా గత కేసీఆర్ ప్రభుత్వం కాలయాపన చేస్తే, నేడు మమ్మల్ని గెలిపిస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని అధికారంలోకి వచ్చి,సంవత్సర కాలం గడిచిపోయిన నేటికీ కనీస వేతనాల జీవోల గెజిట్ ప్రస్తావన తీయకుండా కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయడం దుర్మార్గం అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెంబర్ 22ను వెంటనే గెజిట్ చేసి కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.ఈ నెల 22 న ఛలో ప్రజాభవన్ కు పెద్ద ఎత్తున కార్మికులు కదలి రావాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బెల్ట్ క్లీనింగ్, రోడ్డు క్లీనింగ్ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.