డివైడర్ ని ఢీకొన్న కారు బాలుడి ఆరోగ్యం విషయం…

డివైడర్ ని ఢీకొన్న కారు బాలుడి ఆరోగ్యం విషయం
* మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి ఆసుపత్రికి తరలింపు
* ముగ్గురికి స్వల్ప గాయాలు
* కాలేశ్వరం పుణ్యక్షేత్రానికి వెళ్తూ ప్రమాదం

మహాదేవపూర్ నవంబర్ 5 (నేటిదాత్రి)

 

భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీకొన్న సంఘటన బుధవారం రోజున చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం కార్తీక మాసం సందర్భంగా జనగాం నుండి కాలేశ్వరం పుణ్యక్షేత్రానికి వెళ్తున్నామని కారు అదుపుతపడంతో డివైడర్ ని డి కోనడంతో నాలుగు సంవత్సరాల బాబుకు తీవ్రంగా గాయాలు కాగా మహదేవపూర్ ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

జనగామ నుండి సిద్దిపేట వరకు బస్సు లో అందని మహిళల ఉచిత బస్సు సౌకర్యం..

జనగామ నుండి సిద్దిపేట వరకు బస్సు లో అందని మహిళల ఉచిత బస్సు సౌకర్యం

అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్న కండక్టర్లు

చేర్యాల నేటిధాత్రి

జనగామ డిపో పరిధిలో ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలలో గొప్పగా చెప్పుకునే ఆర్టీసీ ఉచిత మహిళల బస్సు సౌకర్యం ప్రయాణం అనే పథకం జనగామ డిపో పరిధిలో గల కండక్టర్లు పలు కారణాలు చూపిస్తూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తాలేరని విమర్శలు వస్తున్నాయి ఇక్కడ తిరిగే మహిళలు వాపోతున్నారు జనగామ సిద్దిపేట వెళ్లే దారిలో నిత్యం కండక్టర్లు మొండివైఖరితో మహిళలను ఇబ్బందులకు గురిచేస్తూ డబ్బులు తీసుకుంటూ ఏమైనా ఉంటే డిపో మేనేజర్ కు కంప్లైంట్ చేసుకోమని దురుసుగా ప్రవర్తిస్తున్నారు తెలంగాణ అని రాసి ఉన్న మహాలక్ష్మి పథకం కింద ఫోటో సరిగ్గా లేదని ఫోటో లేటెస్ట్ గా లేదని కుంటి సాకులు చెబుతూ మహిళలను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు వెంటనే డిపో మేనేజర్ చర్యలు తీసుకొని ప్రభుత్వం తీసుకు వచ్చిన మహిళలు కు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు

భద్రకాళి పరపతి సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ

భద్రకాళి పరపతి సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ

జనగామ, వరంగల్ నేటిధాత్రి.

 

వరంగల్ కాశిబుగ్గ శ్రీ భద్రకాళి పరపతి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జనగామలో తొమ్మిది ఎకరాల స్థలానికి భూమిపూజ నిర్వహించారు. సంఘ అధ్యక్షులు గుళ్ళపల్లి రాజ్కుమార్ (బాంబుల కుమార్) కార్యవర్గ సభ్యుల సహకారంతో ఈ స్థలాన్ని కొనుగోలు చేసి, సభ్యులందరికీ కుడా లేఔట్ రూపకల్పన చేసి ప్రతీ ఒక్కరికీ ప్లాట్లు కేటాయించాలని సంకల్పించారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ వర్తక సంఘం అధ్యక్షులు గుండేటి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, యునైటెడ్ కార్పొరేషన్ అధ్యక్షులు, 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్, గౌరవ సలహాదారులు ధూపం సంపత్, వివేకానంద యోగ పరపతి సంఘం అధ్యక్షులు కూరపాటి సుదర్శన్, లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం అధ్యక్షులు వంగరి ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే భద్రకాళి పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి గోగికార్ కిరణ్, కోశాధికారి మాటేటి విద్యాసాగర్, ఉపాధ్యక్షులు గోరంట్ల మనోహర్, సల్లా రాజేందర్, సిద్ధోజు శ్రీనివాస్, ఇప్పలపల్లి శివాజీ, కోయల్ కార్ నందకిషోర్, గుర్రపు సత్యనారాయణ, గుత్తికొండ నవీన్, గుళ్ళపల్లి సాంబశివుడు, వంగరి రవి, వెంగళ లక్ష్మణ్, సిందం చంద్రశేఖర్, రామ యాదగిరి, పోత్కనూరి రాజు, ములుక సురేష్, బండారి శ్రీనివాస్ తదితర కమిటీ సభ్యులు, పలు సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. సభ్యులందరికీ ఆర్థిక సహాయం సంకల్పంతో ఈ భూసేకరణ చేసి, శాశ్వత నివాస వసతి కల్పించడమే సంఘ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version