ఆర్థిక తుఫాన్‌కు అలర్ట్.? బంగారం కొనొద్దని మోదీ ఎందుకు అన్నారు?

ఆర్థిక తుఫాన్‌కు అలర్ట్.?
బంగారం కొనొద్దని మోదీ ఎందుకు అన్నారు?

https://youtu.be/7I3PULZXfks?si=9mJosP-DEXquCkjX

దేశ ప్రజలకు PM ఇచ్చిన పిలుపు వెనుక… కనిపించని సంక్షోభ సంకేతాలున్నాయా..?

ఎందుకంటే…
ఒక ప్రధానమంత్రి ప్రజలకు ఇలా చెప్పడం సాధారణ విషయం కాదు..!

పెట్రోల్ తగ్గించండి…
బంగారం కొనొద్దు…
విదేశీ టూర్లు తగ్గించండి…
డెస్టినేషన్ మ్యారేజ్‌లకు బ్రేక్ వేయండి…
వంటనూనె కూడా జాగ్రత్తగా వాడండి…
ఒక ప్రధానమంత్రి… దేశ ప్రజలకు ఇలా “ఖర్చులు తగ్గించండి” అని ఓపెన్‌గా చెప్పడం… సాధారణ ప్రసంగం కాదు. ముందస్తు హెచ్చరిక.

మోదీ మాటల్లో దాగిన “ఎకానమీ ఎమర్జెన్సీ సిగ్నల్స్” ఏంటి..?

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మోదీ చేసిన ప్రసంగం… కేవలం పొదుపు సందేశం కాదు.
దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే అవకాశమున్న ప్రమాదాలపై ఇచ్చిన “సాఫ్ట్ వార్నింగ్”గా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే…
ఒకేసారి ఆయన ప్రస్తావించిన అంశాలు చూడండి :

పెట్రోల్ & డీజిల్ వినియోగం తగ్గించండి
బంగారం కొనొద్దు
విదేశీ పర్యటనలు తగ్గించండి
విదేశీ వస్తువులు తగ్గించండి
ఎరువులు తగ్గించండి
వంటనూనె దిగుమతులపై ఆధారపడొద్దు
ప్రజారవాణా వాడండి
స్వదేశీ వస్తువులు కొనండి

ఇది కేవలం “సేవ్ మనీ” క్యాంపెయిన్ కాదు..!
దేశ విదేశీ మారక నిల్వలు, దిగుమతి భారం, గ్లోబల్ వార్ ఎఫెక్ట్, భవిష్యత్ ఇంధన సంక్షోభం… అన్నింటినీ కలిపి ఇచ్చిన సంకేతంలా కనిపిస్తోంది.

అలాగే ‘దుబారా తగ్గించండి’ అంటున్నారు..? ఎందుకు అంటే?

కోవిడ్ తర్వాత ప్రపంచ సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది. దీనికి తోడు..
చైనా-తైవాన్ టెన్షన్స్…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం…
మిడిల్ ఈస్ట్ అస్థిరత…
రెడ్ సీ రూట్ సమస్యలు…
ఇవి అన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా రవాణా ఖర్చులు, ఇంధన ధరలు, దిగుమతి బిల్లులను పెంచేశాయి.
అందుకే మోదీ మాటల్లో “దిగుమతులపై ఆధారపడొద్దు” అన్న ఆవేదన స్పష్టంగా కనిపించింది.

ఇక బంగారం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు..?
ఇది చాలా కీలక పాయింట్..!
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ఇంపోర్టర్లలో ఒకటి.
భారతీయుల బంగారం కొనుగోళ్లు కేవలం పెట్టుబడి కాదు—సాంప్రదాయం, భద్రత, సామాజిక ప్రతిష్ఠతో ముడిపడి ఉంటాయి. అలాంటి అంశంపై మోదీ నేరుగా వ్యాఖ్య చేయడం వెనుక ఆర్థిక ఆందోళన ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.

ప్రజలు భారీగా బంగారం కొంటే…
దేశ విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్తుంది.
అంటే…
డాలర్‌పై ఒత్తిడి పెరుగుతుంది.
రూపాయి బలహీనపడుతుంది.
దిగుమతులు మరింత ఖరీదవుతాయి.
అందుకే మోదీ నేరుగా “ఒక ఏడాది బంగారం కొనొద్దు” అన్నంత దూరం వెళ్లారు.
ఇది సాధారణ విజ్ఞప్తి కాదు…
దేశ ఫారెక్స్ సేవింగ్స్‌పై ఫోకస్ చేసిన ఎకానమిక్ అలర్ట్‌గా విశ్లేషకులు చూస్తున్నారు.

ఇక పెట్రోల్-డీజిల్ తగ్గించమన్నది ఎందుకు..?
భారత్ ఇంకా భారీగా క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడుతోంది.
ఒక్కసారి గ్లోబల్ వార్ పెరిగితే…?
హార్ముజ్ జలసంధి బ్లాక్ అయితే..?
మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరిగితే..?
పెట్రోల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటొచ్చు.
అందుకే ఇప్పుడు నుంచే :
EVలు
ఎలక్ట్రిక్ రైల్వేలు
ప్రజారవాణా
ఇంధన పొదుపు
వైపు దేశాన్ని మళ్లించే ప్రయత్నంగా మోదీ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.

ఇక డెస్టినేషన్ మ్యారేజ్‌ల వరకూ ఎందుకు వెళ్లారు..?
ఇది మిడిల్ క్లాస్‌కు ఇచ్చిన సైకాలజికల్ మెసేజ్.
“సోషల్ స్టేటస్ కోసం దుబారా ఖర్చులు తగ్గించండి”
అనే సంకేతాన్ని మోదీ చాలా క్లియర్‌గా ఇచ్చారు.
అంటే…
ప్రభుత్వానికి ముందున్న పరిస్థితులపై ఒక దీర్ఘకాలిక ఆందోళన ఉందా..?
భవిష్యత్‌లో ఖర్చులు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయా..?
అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

వంటనూనె దిగుమతుల గురించి ప్రధాని ప్రస్తావించడం కూడా చాలా ముఖ్యమైన సంకేతం. ఎందుకంటే ఇది నేరుగా దేశ ఆహార భద్రతకు సంబంధించిన అంశం. భారత్ భారీగా ఎడిబుల్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడుతోంది. ఒకవేళ అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతింటే… ప్రజల రోజువారీ జీవన ఖర్చులపై భారీ ప్రభావం పడే ప్రమాదం ఉంది.
అందుకే మోదీ “వంటనూనెలో స్వయం సమృద్ధి” అనే మాటను ప్రస్తావించారు. ఇది కేవలం వ్యవసాయ విధానం కాదు… భవిష్యత్ ఆహార భద్రతకు సంబంధించిన ఆందోళనగా కూడా చూడొచ్చు.

యూరియా ధరల గురించి మాట్లాడటం ద్వారా మోదీ మరో కీలక అంశాన్ని టచ్ చేశారు. ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధరలు భారీగా పెరిగినా… భారత్‌లో మాత్రం ప్రభుత్వం భారీ సబ్సిడీలతో తక్కువ ధరకు అందిస్తోంది.
అంటే ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఆర్థిక భారం మోస్తోందన్న సంకేతం ఇందులో కనిపిస్తోంది. ప్రపంచ పరిస్థితులు మరింత క్షీణిస్తే ఈ సబ్సిడీల భారం ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకే “ఎరువుల వినియోగం తగ్గించండి” అన్న పిలుపు కేవలం పర్యావరణ కోణం మాత్రమే కాదు… ఆర్థిక కోణం కూడా కలిగి ఉంది.

తెలంగాణలో బెంగాల్ ఫార్ములా బీజేపీ అండర్ కరెంట్ వ్యూహాలు

తెలంగాణలో బెంగాల్ ఫార్ములా
బీజేపీ అండర్ కరెంట్ వ్యూహాలు

 

 

పశ్చిమ బెంగాల్‌లో మమతా కోటను బద్దలు కొట్టిన కమలనాథులు.. ఇప్పుడు కన్ను దక్షిణ భారతంపై వేశారు. ముఖ్యంగా తెలంగాణ గడ్డపై పాగా వేసేందుకు ‘బెంగాల్ సైలెంట్ ఆపరేషన్’ను ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. 15 ఏళ్ల కిందట బెంగాల్‌లో నామమాత్రంగా ఉన్న శక్తి, నేడు అక్కడ అధికారాన్ని సవాల్ చేసే స్థాయికి చేరడమే కాకుండా, 207 సీట్లతో బలమైన ముద్ర వేసింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో తెలంగాణలో కమల వికాసం కోసం మోదీ-షా ద్వయం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. బెంగాల్ గెలవగలిగితే.. తెలంగాణ ఎందుకు సాధ్యం కాదు? అనే నినాదంతో కమలనాథులు క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్తున్నారు.

మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ సభ ఈ రాజకీయ పోరులో అత్యంత కీలకం కాబోతోంది. సుమారు 8 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని.. అదే వేదికగా రాజకీయ మార్పుకు పిలుపునివ్వనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీయేనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ సభ ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి నేతలు  టీమ్ మోదీ  పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  వికసిత్ తెలంగాణ నినాదంతో తో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన పార్టీ, ఇప్పుడు మోదీ సభతో పీక్ స్టేజ్‌కు చేరుకోవాలని చూస్తోంది.

బెంగాల్‌లో ఎలాగైతే కిందిస్థాయి ఓటర్లను మచ్చిక చేసుకున్నారో, తెలంగాణలోనూ అదే తరహా సైలెంట్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఇతర పార్టీల అసంతృప్త నేతలను చేర్చుకోవడం, కుల సమీకరణలను సరిదిద్దడం, కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి వాటిని ఇంటింటికీ తీసుకెళ్లడం ద్వారా ఓటు బ్యాంకును పటిష్టం చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లను టార్గెట్ చేస్తూ బీజేపీ సోషల్ మీడియా సైన్యం రంగంలోకి దిగింది. బీజేపీ అంచనా ప్రకారం, దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత పార్టీకి అత్యంత అనుకూలమైన రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ ఇప్పటికే బలమైన ఓటు శాతం ఉండటం, నాయకత్వం చురుగ్గా ఉండటం వల్ల కొంచెం కష్టపడితే అధికారం సాధ్యమని అమిత్ షా బృందం లెక్కలు వేస్తోంది. బెంగాల్ విజయం అందించిన ఊపుతో, తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఆవశ్యకతను మోదీ తన ప్రసంగంలో నొక్కి చెప్పనున్నారు. బెంగాల్ ఓటమితో ప్రతిపక్ష ఇండియా కూటమి నైతిక దెబ్బ తిన్న తరుణంలో, ఆ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. పరేడ్ గ్రౌండ్స్ గర్జన తర్వాత తెలంగాణ రాజకీయాలు మరోసారి త్రిముఖ పోరు నుంచి బిజెపి వర్సెస్ అదర్స్ గా మారే అవకాశం కనిపిస్తోంది.

విజయ్ కింగ్ మేకర్ అవుతారా?

https://youtu.be/srHwVVZo1KQ?si=Lbpeve5hOGYlSKxi

తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం హై వోల్టేజ్ స్థాయికి చేరుకున్నాయి. స్టార్ హీరో Vijay ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేయడం ప్రధాన చర్చగా మారింది. అభిమానులు ఇప్పటికే ఆయనను సీఎం కుర్చీలో చూడాలని ఆశపడుతున్నారు. అయితే తాజా ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆ అంచనాలకు కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం అంచనాల ప్రకారం, విజయ్ పార్టీకి 10 నుంచి 20 స్థానాలు రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ సంఖ్య 20 దాటితే అది రాజకీయంగా పెద్ద విజయంగా భావిస్తున్నారు. మొదటి ప్రయత్నంలోనే ‘కింగ్’ కాకపోయినా, కనీసం 40 స్థానాలు సాధించి ‘కింగ్ మేకర్’గా మారాలని భావించిన లక్ష్యం కొంత దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

అయితే ఈ ఫలితాలను పూర్తిగా ప్రతికూలంగా చూడలేము. బలమైన ద్రవిడ పార్టీల మధ్య ఎలాంటి పొత్తులు లేకుండా స్వతంత్రంగా పోటీ చేసి 20 వరకు స్థానాలు సాధించడం చిన్న విషయం కాదు. ఇది విజయ్ రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాది అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఫలితాల రోజు వరకు అసలు తీర్పు ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. అభిమానులు మాత్రం ఇంకా ఆశావహంగా ఉన్నారు.

టీనేజ్ గర్భధారణపై అవగాహన అవసరం

చేవెళ్ళలో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పలు అంగన్వాడీ కేంద్రాల్లో ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంక

Awareness on Teenage Pregnancy & Safety

టరెడ్డి నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీనేజ్ లో గర్భధారణ మరియు ఎలోప్మెంట్ వంటి సమస్యలపై యువతకు అవగాహన అవసరమని పేర్కొన్నారు. అమ్మాయిలు మోసపూరిత మాటలకు లోనవకుండా తమ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు.

సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించి చదువు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అవుట్ పేషంట్ రిజిస్టర్,మందుల నిల్వలు, ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని,వేసవి అయినందున వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించాలని తెలిపారు.వైద్యులు,సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని,వేసవి దృష్ట్యా వడదెబ్బ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.ఆసుపత్రిలో కొనసాగుతున్న  పోస్టుమార్టం పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనశాల,అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.విద్యార్థుల సంఖ్యను పరిశీలించి మరింత పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.వంటశాలను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం,శుద్ధమైన త్రాగునీటిని అందించాలని,విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మోకిలా తాండ గ్రామ సర్పంచ్గా వర్త్య శాంతమ్మ రీజాయినింగ్

మోకిలా తాండ గ్రామ సర్పంచ్గా వర్త్య శాంతమ్మ రీజాయినింగ్

బాధ్యతలు అప్పగించాలంటూ అధికారులకు కోర్టు ఉత్తర్వులు

బూటకపు ఆరోపణలతో సస్పెండ్ చేయించారు : శాంతమ్మ

శంకరపల్లి, నేటిధాత్రి:

ఆరోపణలతో అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేదని మరోసారి రుజువైందంటూ మోకిలా తాండ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఓటమిని జీర్ణించుకోలేని కొంతమంది చేసిన పనులకు తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది. తిరిగి వర్య శాంతమ్మను పదవిలో కొనసాగాలని కోర్టు జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేసింది. నిజ నిజాలు ప్రజలు గ్రహిస్తూనే ఉంటారని, బెదిరింపులు అసత్య ఆరోపణలతో ఏం చేయలేరని గ్రామస్తులు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల తండా గ్రామపంచాయతీ సర్పంచ్గా వర్త్య శాంతమ్మను తిరిగి పదవిలో కొనసాగాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వాస్తులకు నష్టం కలిగించడం, పంచాయతీ స్థలంలో మొక్కలను ధ్వంసం చేయడం వంటి ఆరోపణలతో సస్పెండ్ కాబడిన శాంతమ్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు పెండింగ్ విచారణ కొనసాగుతున్నప్పటికీ ఆమెను సర్పంచిగా బాధ్యతలు స్వీకరించాలని వెంటనే ఉపసర్పంచ్ నుంచి శాంతమ్మ సర్పంచ్ బాధ్యతలను తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని జిల్లా, మండల, గ్రామ అధికారులకు కోర్టు సూచించింది. ఈ సందర్భంగా శాంతమ్మ మాట్లాడుతూ నిజం ఎప్పటికైనా గెలుస్తుందని ఎల్లప్పుడూ తనను గెలిపించిన ప్రజల కోసం సేవ చేసేందుకు ముంటానన్నారు. గ్రామ ప్రజల తీర్పుతో గెలిచామని, వారి అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతానన్నారు.

32వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన.

32వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన.

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవ రజిత.

బెల్లంపల్లి, నేటిధాత్రి:

 

బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి మున్సిపాలిటీ 32వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 32వ వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవ రజిత కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ఈ కార్యక్రమంలో అభ్యర్థి దేవ రజిత, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూనెటి సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

17వ వార్డులో బీఆర్ఎస్ జోరైన ప్రచారం…

17వ వార్డులో బీఆర్ఎస్ జోరైన ప్రచారం

అందుబాటులో ఉంటాం ఆదరించండి

పరకాల,నేటిధాత్రి

 

 

మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో అభ్యర్థి రజిని నవీన్ లతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు జోరుగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థితో పాటు స్థానిక నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్బంగా శనిగరపు రజిని నవీన్ మాట్లాడుతూ నమ్మకంతో గెలిపించండి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.వార్డులో తాగునీరు,డ్రైనేజీ,రోడ్ల అభివృద్ధి,పారిశుధ్యం వంటి సమస్యలపై పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చూపుతామని అన్నారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు ఆముదాలపల్లి అశోక్ గౌడ్,పార్టీ నాయకులు,కార్యకర్తలు,పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేయాలి..

బీఆర్ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేయాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి

భూపాలపల్లి, నేటిధాత్రి:

 

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ 11 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు అనంతరం తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినారు పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను నూతన మండలాలను గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసి అలాగే జయశంకర్ సార్ పేరు మీద భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడు కొంతమంది నాయకులు భూపాలపల్లి జిల్లాను తీసేస్తామని అంటున్నారు ఇప్పటికైనా పట్టణ ప్రజలు ఆలోచించాలి భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి భూపాలపల్లి అభివృద్ధికి సహకరించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయింది భూపాలపల్లి మున్సిపాలిటీకి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేదు ఎన్నికలు వచ్చిన సమయాన మంత్రులను తీసుకువచ్చి చిలాపాలకాలు వేసి హడావిడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావున పట్టణ ప్రజలు ఆలోచించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటరాణి సిద్దు మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి మేకల సంపత్ బుర్ర రమేష్ రజిత తిరుపతి రాజు తదితరులు పాల్గొన్నారు

ఒలిమా డిన్నర్ పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు….

ఒలిమా డిన్నర్ పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్, నేటిధాత్రి:

ఝరాసంగం గ్రామానికి చెందిన సొసైటీ కార్యదర్శి నిస్సర్ అహ్మద్ గారి సోదరుని ఒలిమా డిన్నర్ కార్యక్రమంలో పాల్గొని పెళ్లి కుమారుని పూలమాలలతో సన్మానించారు తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్.ఈ సందర్బంగా నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలిపారు.బొగ్గుల జగదీశ్వర్. తో పాటు మండల మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియ మాజీ ఎంపీటీసీ విజేందర్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ ఏజాస్ బాబా సర్పంచ్ లు వార్డ్ మెంబర్లు నాయకులు పాల్గొన్నారు …

“ఆరూరి”రాజీనామా.

“నేటిధాత్రి”,హైదరాబాద్.
బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

aroori Ramesh resigns from bjp

ఎల్లుండి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన ఆరూరి రమేష్

మున్సిపాలిటీ భాజపాకు ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం: సీతారాం నాయక్

ఎన్నికల్లో నర్సంపేట మున్సిపాలిటీ ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం.

రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేటకు ఏమిచ్చింది.

మాజీ ఎంపీ,భాజపా రాష్ట్ర నేత,ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్

కుంభకోణాల్లో కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలు

జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం

నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి నిధులు కేంద్రం నుంచి వచ్చినవే.. ఇప్పటివరకు నర్సంపేటను పాలించిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏమి అభివృద్ధి చేశాయి. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తాం అని మాజీ ఎంపీ,భాజపా రాష్ట్ర నేత,ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ అన్నారు.మున్సిపల్ ఎన్నికలకు ముందు భాజపా ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు,కార్యకర్తలతో ముందస్తు సన్నగ్ద సమావేశాలు నిర్వహించేందుకుగాను శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి, నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి ఇచ్చిందో మరోసారి పట్టణ ప్రజలు తెలుసుకోవాలని కోరారు.నర్సంపేట పరిదిలో ముఖ్యమైన అభివృద్ధి పనులు చేసేవి చాలా ఉన్నాయి.మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించండి.. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత మాది అని సీతారాం నాయక్ హామీ ఇచ్చారు.కాంగ్రెస్,భారాస పార్టీలు అభివృద్ధి చేస్తాయని ఇప్పటికీ నర్సంపేట మోసపోయింది.మరల మోసపోవద్దు అని పేర్కొన్నారు.ప్రస్తుతం నర్సంపేటలో జరిగిన అభివృద్ధి నేను చేసిందే.. కేంద్ర ప్రభుత్వ నిధులతో..చేసిన అభివృద్దే కనబడుతున్నది అని మాజీ ఎంపీ తెలిపారు.ప్రధాని మోడీ ప్రపంచ నాయకునిగా ఆచరిస్తున్నారు.అదే తరహాలో ఎన్నికల్లో మున్సిపాలిటీ ఇస్తే రాబోయే ఎమ్మెల్యే కూడా భాజపాదే అని భాజపా రాష్ట్ర నేత సీతారాం నాయక్ తెలిపారు.మాజీ ఎమ్మెల్యే,మాజీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు,మున్సిపల్ ఎన్నికల జిల్లా కన్వీనర్ కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ

2014 నుండి ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని దశ దిశలను మార్చారు.అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను చైతన్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు అవగాహన కల్పించి ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.జరుగబోయే మున్సిపల్ ఎన్నికలల్లో గెలుపు జెండాలను ఎగురవేయడానికి సన్నాహక సమావేశాలు నిర్వస్తున్నామని అన్నారు.ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం అన్ని డివిజన్ లలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఎంపికలు ఉంటాయన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ ఏమి అభివృద్ధి చేసినన్నారు.డెబ్బై ఏండ్ల కాంగ్రెస్,
పదేండ్ల బిఆర్ఎస్ పార్టీలు ఒకే కుటుంబ పార్టీలు..అవి నిత్యం కుంభకోణాలను నిలయంగా మారుతున్నాయని ఆరోపించారు.
గతంలో గిలిచిన 9 ఎంపిలు,9 ఎమ్మెల్యే స్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగబోయే మున్సిపాలిటీలో ఎన్నికలో అధిక మున్సిపాలిటీలను గెలిపించుకోవడమే లక్ష్యం.దీంతో వచ్చే శాసన సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జోష్యం చెప్పారు.కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ,ఎన్నికల జిల్లా కో కన్వీనర్ పుల్లారావు మాట్లాడుతూ నర్సంపేటలో చేసే ప్రతి అభివృద్ధి పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే అని పేర్కొన్నారు.
సొమ్మోకరిది సోకోకరిది అనే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులంటూ కాంగ్రెస్ ప్రభుత్వం,కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.జిల్లా ప్రధాన కార్యదర్శి,నర్సంపేట ఎన్నికల కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలల్లో
30 డివిజన్లలో పోటీ చేస్తున్నాం.
ప్రజా బలం ఉన్న నాయకున్ని ఎన్నికల బరిలో దింపుతామని పేర్కొన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధాని మోడీ నర్సంపేట 3000 ఇండ్లు పంపితే ఒక్క డబుల్ బెడ్రూo కూడా ఇవ్వలేదన్నారు.ఆరు గ్యారెంటీలు,420 హామీలతో అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సిసి రోడ్ల పేరుతో కాంట్రాక్టర్ అవతారంలో ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గమనించి భాజపా నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే నర్సంపేటకు శ్రీరామ రక్షా అవుతుందని రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు,జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్,నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ సీనియర్ నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్, బాల్నే జగన్, పంజాల శ్రీ రాం,కుంభం కోమల్ రెడ్డి, జూలూరు మనీష్ గౌడ్,గుడిపూడి రాధాకృష్ణ, కట్ల రామచందర్ రెడ్డి, బానోత్ వీరన్న, మల్యాల సాంబామూర్తి,పొనుగోటి రవీంద్రచారి నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత మహిళ నాయకురాలు మార్త సంధ్యారాణి,బీజేపీ పట్టణ నాయకులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు,రాజ్ కుమార్, మస్ శివ,థౌటం నిశాంత్, చిలువేరు అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిపక్ష నేతల గొంతు నొక్కుతున్న రేవంత్ ప్రభుత్వం: గండ్ర వెంకట రమణా

ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతున్న రాష్ట్ర ప్రభుత్వం

హరీష్ రావు ని విచారణకు పిలవడం ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు నిదర్శనం

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పై ఫోన్ ట్యాపింగ్ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష్యపూరితంగా వారిని విచారణకు పిలవడం హేయమైన, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్యగా పరిగణించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వాటి నుంచి తప్పించుకునే కుట్రలో భాగంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచే చేస్తున్నారు.
ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అనే అస్త్రాన్ని ఉపయోగించి హరీష్ రావు పై కేసులు పెట్టి రాజకీయ కుట్రలకు పాల్పడ్డారు.
హరీష్ రావు పై విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ, నిన్న మళ్లీ విచారణకు పిలవడం అనేది పూర్తిగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేని అసహనానికి నిదర్శనం.
భారత రాష్ట్ర సమితికి ఉన్న అపార ప్రజాదరణను చూసి, మునిసిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులను ఎదుర్కొనే ధైర్యం లేక, బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలను వేధింపులకు గురిచేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది.
ఇలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పటికీ భయపడదు.
ఎంతమందిని విచారణలకు పిలిచినా, ఎంతమంది కార్యకర్తలను వేధించినా, బీఆర్‌ఎస్ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది.
ఈ ప్రభుత్వాన్ని పదవి నుంచి దించే వరకు ప్రజాపక్షంలో పోరాడటం ఖాయం. ఈ క్రమంలో అసెంబ్లీలో పార్టీ ఉపనాయకుడిగా హరీష్ రావు ప్రభుత్వ వైఫల్యాలను, బొగ్గు కుంభకోణంలో వేల కోట్ల రూపాయల అవినీతిని ధైర్యంగా బయటపెడుతున్నందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది.
కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక చర్యలను ప్రజలు క్షేత్రస్థాయిలో గమనిస్తున్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తే ప్రజలు హర్షిస్తారు.లేకపోతే, ఇలాంటి నిరంకుశ చర్యలతో చరిత్రలో తప్పకుండా చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. వారు హెచ్చరించారు

ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి వివేక్ హామీ

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి..

ఆర్కే ఫోర్ గడ్డ ఏరియాను ఓసి ప్రభావిత ప్రాంతంగా గుర్తిస్తాం…

కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఆర్కేపి ఉపరితల గని ప్రభావిత ప్రాంతమైన ఆర్కే ఫోర్ గడ్డ ఏరియా ప్రజలకు పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తానని, వార్డులలో ఉన్న సమస్యలను, ప్రజా సమస్యలను సైతం పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పార్టీ నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ లో మంత్రి వివేక్ పాల్గొన్నారు.పట్టణంలోని 3,4,17,18,19 వార్డ్ లలో పర్యటించారు.

రానున్న రోజుల్లో రామకృష్ణాపూర్ ఉపరితల గని రెండో దఫా పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పించాలని మంత్రిని ఆర్కే ఫోర్ గడ్డ ప్రజలు కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. మంత్రి వెంట మార్నింగ్ వాక్ లో పాల్గొన్న మందమర్రి ఏరియా సింగరేణి జిఎం రాధాకృష్ణ, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు లకు ఉపరితల గని బాధితులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఆదేశించారు.3,18 వార్డుల్లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.

పలు కాలనీలో బెల్ట్ షాపులతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు తెలపగా వెంటనే బెల్ట్ షాపులను అరికట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి ప్రాంతంలో నిలిపివేసిన 76 జీవోను అమలు చేసి ఇండ్ల క్రమబద్ధీకరణ చేయాలని వార్డుల్లోనీ ప్రజలు కోరగా , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడి సింగరేణి భూముల్లో ఉన్న ఇండ్ల స్థలాలకు పట్టాలను ఇచ్చేలా కృషి చేయాలని కోరడంతో మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మార్నింగ్ వాక్ లో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే పర్యటిస్తున్నానని మునిసిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అన్నారు. మంత్రి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ ముందు బాధితుల ఆందోళన…

 

https://netidhatri.com/wp-content/uploads/2026/01/download-2026-01-03T113618.428.wav?_=1

 

పోలీస్ స్టేషన్ ముందు బాధితుల ఆందోళన

జహీరాబాద్ : జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో వారం రోజుల క్రితం నమోదైన ఓ దాడి కేసుకు సంబంధించి నిందితుల రిమండ్ లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ :రూరల్ పోలీస్ స్టేషన్ లో
వారం రోజుల క్రితం నమోదైన ఓ దాడి కేసుకు సంబంధించి నిందితుల రిమండ్ లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పోలీస్ అధికారులు కల్పించుకొని సత్వరమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మండలంలోని హుగ్గెల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల అనంతరం ఓ వర్గం వ్యక్తులు మరో వర్గానికి చెందిన వారిపై దాడి చేసారు. ఈ దాడుల నేపథ్యంలో నిందితుల రిమాండ్ పట్ల ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంజీ. రాములు, గ్రామస్తులు, నిందితులతో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆందోళనకు దిగారు. దీంతో డీఎస్పీ సైదా సీఐ శివలింగం, పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ నిందితులపై చట్టపరమైన చర్యలు తప్పవని సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.

సాతారం సర్పంచ్, ఉప సర్పంచ్‌లను సన్మానించిన విద్యాసాగర్ రావు

సాతారం సర్పంచ్ ఉప సర్పంచ్ లను సన్మానించిన బిఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు
మెట్ పల్లి డిసెంబర్ 30 నేటి ధాత్రి

 

 

మెట్‌పల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన మల్లాపూర్ మండలం సాతరం గ్రామ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కిషన్ గౌడ్ ఉప సర్పంచ్ జగన్
విద్యాసాగర్ రావు నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్‌లను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు
గ్రామ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దామని తెలిపారు.

వేం నరేందర్ రెడ్డికి రాజకుమార్ జన్మదిన శుభాకాంక్షలు

వేం నరేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజకుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారిని బంజారా హిల్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నేతకాని మహర్ కుల సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షుడు గజ్జె రాజకుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని ఉన్నంతమైన పదవులు చేపట్టాలని అలాగే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని వారు అన్నారు

గణపురంలో బిజెపి వార్డ్ మెంబర్లకు ఘన సన్మానం

బిజెపి వార్డ్ నెంబర్లకు ఘనంగా సన్మానం

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధికి చందుపట్ల కీర్తి రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డ్ మెంబర్లను శాలువా కప్పి సన్మానించిన చందుపట్ల కీర్తి రెడ్డి బిజెపిజిల్లా పార్టీ ఆఫీసులో స్థానిక సంస్థ లో బస్వ రాజుపల్లి గ్రామం నుండి ఒకటవ వార్డ్ నెంబర్ గా కుక్కముడి రమేష్ మైలారం గ్రామము నుండి ఐదవ వార్డ్ నెంబర్ గా బండి ఉపేందర్ గెలుపొందిన సందర్భంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నె మొగిలి రాష్ట్రకార్యవర్గ సభ్యుడుపాపన్న బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

భూపాలపల్లి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

భూపాలపల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ అర్బన్ ప్రెసిడెంట్ కటకం జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన భూపాలపల్లి పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరయ్యారు.
ఈ సందర్భంగా 3వ వార్డు మాజీ కౌన్సిలర్ పిల్లలమర్రి శారద నారాయణ సేవాలాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్యా రాజు
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సమావేశంలో రానున్న మున్సిపాలిటీ ఎన్నికలే ప్రధాన అజెండాగా, ప్రతి వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల ఆశలను ప్రభుత్వం నిరాశపరుస్తోందని, హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ముఖ్యంగా సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారి హక్కులను కాపాడడంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతూ, రానున్న ఎన్నికల్లో భూపాలపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలనే సంకల్పాన్ని కార్యకర్తలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కట్టకం జనార్ధన్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ భూపాలపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటరాణి సిద్దు వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ గెలిచిన సర్పంచ్‌లకు ఘన సన్మానం

బిజెపి పార్టీ నుండి గెలిచిన సర్పంచ్ లకు సన్మానం

బిజెపి పార్టీ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను ఘన విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి హాజరై
అభ్యర్థులను సన్మానం చేయడం జరిగింది
అనంతరం కీర్తి రెడ్డి మాట్లాడుతూ
ప్రజలు బీజేపీపై పెట్టిన నమ్మకమే ఈ విజయానికి నిదర్శనమని, ఇది పార్టీ కార్యకర్తల కష్టానికి లభించిన ఫలితమని పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధికి పునాది అని, స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రజల సమస్యలను నేరుగా గుర్తించి పరిష్కరించే కీలక పాత్ర పోషిస్తారని ఆమె తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసి, పారదర్శకంగా అమలు చేయడంలో మీరు ముందుండాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేయగలమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విజయం ఆరంభమే తప్ప అంతిమం కాదని, గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యమని అన్నారు.
ఈ సందర్భంగా విజయం సాధించిన ప్రతి ఒక్కరికి కీర్తి రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో నిబద్ధతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న చదువు రామచంద్రారెడ్డి కన్నం యుగదీశ్వర్ పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ రాయరాకుల మొగిలి రాష్ట్ర నాయకులు బట్టు రవి జిల్లా ప్రధాన కార్యదర్శిలు దొంగల రాజేందర్ పెండ్యాల రాజు తాడికొండ రవి కిరణ్ వివిధ మోర్చ అధ్యక్షులు జిల్లా నాయకులు వివిధ మండలాధ్యక్షుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version