వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పుట్టినరోజు వేడుకలు
* పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
వర్దన్నపేట (నేటిధాత్రి)
వర్ధన్నపేట మండల ప్రభుత్వ ఆసుపత్రిలో వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి వందమంది పేషెంట్స్ కి పండ్లుపంపిణీ చేయడం జరిగింది. జాతీయ యువజన అవార్డు గ్రహీత వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తూ వర్ధన్నపేట నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు ఆపద కాలంలో పార్టీని కాపాడి ప్రజా సేవే ఏకైక లక్ష్యంగా జీవిస్తున్న ఎర్రబెల్లి స్వర్ణ వరదరాజేశ్వరరావు గార్ల నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అర్హత నైపుణ్యం కలిగిన యువ నాయకత్వాన్ని బలపరుస్తూ భవిష్యత్తు తరాలకు దిక్సూచిగా నిలిచారు..
ఈ కార్యక్రమంలో , తెలంగాణ అంబేద్కర్ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నర్సయ్య,వర్ధన్నపేట పట్టణ మాజీ కౌన్సిలర్ తుమ్మల రవీందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దుబ్బ యాకయ్య, ఎండీ షాబీర్, పోలుసనీ దేవేందర్ రావు,దుబ్బ ఎల్లన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు ఈరెల్లి శ్రీనివాస్, తెలంగాణ అంబేద్కర్ జంగిలి భాస్కర్, వర్దన్నపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు నందిపక భాస్కర్, చేరిపల్లి బాబు, సమ్మెట రాంబాబు, యువ నాయకులు మంద రవీందర్, కుమారస్వామి, రాములు, రమేష్, శ్రీనివాస్ , రాజు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు