ఉచిత వైద్య శిబిరం .

ఉచిత వైద్య శిబిరం ను సద్వినియోగం చేసుకోవాలి

మరిపెడ నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మూల మర్రి తండ గ్రామపంచాయతీ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరం లో మొత్తం 60మంది పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగింది.డాక్టర్ రవి మాట్లాడుతూ వర్ష కాలంలో దోమల ద్వారా వ్యాపించే, వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్య, మెదడు వాపు, బోధకాలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత గురించి తండ వాసులకు వివరించారు. ఈ కార్యక్రమం లో తానంచెర్ల పల్లె దవాఖాన మిడ్ లెవెల్ హెల్త్ ప్రోవిడర్ ఝాన్సీ, హెల్త్ సూపెర్వైసోర్ కృష్ణ,లక్ష్మి కుమారి,హెల్త్ అసిస్టెంట్ వీరయ్య, ఏఎన్ఎం రోజమణి, ఆశాలు విజయ, అనిత తదితరులు పాల్గొన్నారు.

పశు వైద్యశాల ఏర్పాటు చేయాలి.

పశు వైద్యశాల ఏర్పాటు చేయాలి…

పశువులకు ఆసుపత్రి లేక సకాలంలో అందని వైద్య సేవలు…

నేటి ధాత్రి -గార్ల 

మహబూబాబాద్ జిల్లా,గార్ల మండల పరిధిలోని చిన్నకిష్టపురం గ్రామపంచాయతీ సమీపంలో పశు వైద్య శాల ఏర్పాటు చేసి, పశువులకు సకాలంలో వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి ముల్కనూర్ గ్రామపంచాయతీ పరిధిలోని,ముల్కనూర్ గ్రామంలో పశు వైద్యశాల ఉన్నప్పటికీ చిన్నకిష్టపురం గ్రామపంచాయతీ ప్రజలకు దూరం కావడంతో పశువులకు సకాలంలో వైద్యం అందడం లేదని అంటున్నారు. చిన్నకిష్టపురం గ్రామపంచాయతీ పరిధిలో పశు వైద్యశాల లేక పశువులకు ప్రయివేటు వైద్యం అందించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు.పశువైద్యశాల ఏర్పాటు చేస్తే చిన్నకిష్టపురం గ్రామపంచాయతీ పరిధిలోని దేశ్య తండ, మంగళితండ, ఎస్ టీ కాలనీ, సర్వన్ తండ రైతులకు అందుబాటులో ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. తెల్ల పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పెరటి కోళ్లకు మందులను అందుబాటులో ఉంచి వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు. పశువైద్యశాల ఏర్పాటు చేసి అవసరం మేర వైద్యులు, స్టాఫ్ ను నియమించి, మందులు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. పశువైద్యశాలలో గాజుగుడ్డ, సిరంజీలు, కుక్కలకు సంబంధించిన యాంటీ రేబిస్ వ్యాక్సిన్, యాంటీ స్నేక్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని, పశువైద్యశాల ఏర్పాటు దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నారు.

కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా రాస్తారోకో…

కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా రాస్తారోకో…

కొత్తగూడ, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లో అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు అమలు చేసిన విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు రాస్తారోకో నిర్వహించారు భారతదేశంలో కార్మికులందరూ జూలై 9న సార్వత్రిక సమ్మెను పిలుపులో భాగంగా కొత్తగూడ లో నిర్వహించారు పలువురు నాయకులు మాట్లాడుతూ కార్మికులపై పాలక -పెట్టు బడి దారి వర్గాలు మోపుతున్న వేతన బానిసత్వం పని గంటల పెంచిందని . కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కార్మిక చట్టాలను వెంటనే విరమించుకోవాలని కార్మికులకు కనీస వేతనాలు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ(న్యూ) బిఆర్ఎస్. నాయకులు అంగన్వాడి కార్యకర్తలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు,,

అ”పూర్వ” విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

అ”పూర్వ” విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మరిపెడ నేటిధాత్రి : 

 

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని ప్రజ్ఞ ఉన్నత పాఠశాలలో 1998 -99 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యాభ్యసించిన పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం ప్రజ్ఞ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు 26 సంవత్సరాల కాలం తర్వాత కలవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పాఠశాల లో పూర్వ విద్యార్దినీ, విద్యార్థులు మాట్లాడుతూ గతంలో విద్యాబోధన చేసిన పూర్వ ఉపాధ్యాయులను గుర్తు చేసుకోని వాళ్ళు నేర్పినటువంటి విద్యా బుద్ధులను ఎన్నటికీ మరువలేమని వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయని కొనియాడారు,గత స్మృతులను గుర్తుతెచ్చుకుంటూ తమ గురువుల సేవలను త్యాగాలను ఎన్నడూ మరవలేమని తమ జీవితంలో వారు అందించిన విద్య బుద్ధులను స్ఫూర్తి గా తీసుకోవడం వలన జీవితంలో ఎంతగానో ఉపయోగపడిందని కొనియాడారు,అనంతరం పూర్వ విద్యార్థులు కలిసి చదువుకున్న స్నేహితురాలు గుండెపుడి గ్రామవాసి చంద్రకళ అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో వారికి శాంతి కలగాలని రెండు నిమిషాల మౌనం పాటించడం జరిగింది ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు 30 మంది కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమన్ని విద్యాబుద్ధులు నేర్పిన గురువులతో కలిసి ఎంతో ఘనంగా జరుపుకున్నారు, ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు మల్లు ఉపేందర్ రెడ్డి,రమా మేడం, రామచంద్రయ్య,రేపాల యాదయ్య,కుడితి ఉపేందర్ రెడ్డి,నాగార్జున, సరస్వతి మేడం,జానకి రాములు, పూర్వ విద్యార్థులు, ఆర్గనైజేషన్ టీం బూర్లే శివప్రసాద్,రాంపల్లి సురేష్ బాబు,ముదిరెడ్డి అనిత, కళ్యాణి,మంజుల,సంతోష్ అయ్యగారు,బుద్ధ శ్రీకాంత్, గుగులోత్ వీరన్న,మిగితా స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version