వైసీపీకి బిగ్ షాక్.. కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు..

వైసీపీకి బిగ్ షాక్.. కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు

 

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో ఇవాళ(ఆదివారం) మరో కేసు నమోదు చేశారు.

 మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి (Kakani Govardhan Reddy) మరో బిగ్ షాక్ తగిలింది. వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో కాకణిపై ఇవాళ(ఆదివారం) మరో కేసు నమోదు చేశారు. మాజీమంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని చవటపాలెం సొసైటీ చైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కాకణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

నకిలీ మద్యం కేసుల్లో కీలక ఫైళ్లు..

మరోవైపు.. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి నకిలీ మద్యం కేసుల్లో కీలక ఫైళ్లు మాయం అయ్యాయి. 2014 ఎన్నికల్లో గోవా నుంచి నకిలీ మద్యానికి లేబుళ్లు వేసి, ఓటర్లకు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ మద్యం తాగి అపట్లో పలువురు మృతిచెందగా… వందలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 2018లోనే కొన్ని కీలక ఫైళ్లు మిస్ అయినట్లుగా విజయవాడ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. ఈ క్రమంలో సీఐడీకి కేసును అప్పగించింది న్యాయస్థానం. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ కేసు దర్యాప్తు చేయలేదు. ప్రస్తుతం మళ్లీ తెరపైకి ఈ కేసు వచ్చింది. ఈ కేసును నీరుగార్చేందుకే కీలక‌ ఫైళ్లు మాయం చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పరికామణిలో చోరీ కేసు.. టీటీడీ అధికారులపై న్యాయమూర్తి అసహనం..

పరికామణిలో చోరీ కేసు.. టీటీడీ అధికారులపై న్యాయమూర్తి అసహనం

 

ఈ నెల 27న టీటీడీ ఈవో.. కోర్టు ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. లేనిపక్షంలో 20 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.తిరుమల పరకామణిలో చోరీ కేసుపై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు సహా ప్రాథమిక దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సీఐడీ సమర్పించింది. ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ అధికారుల తీరుపై హైకోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 27న టీటీడీ ఈవో.. కోర్టు ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. లేనిపక్షంలో 20 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తిరుమల పరకామణిలో చోరీ ఘటనపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని హైకోర్టును టీటీడీ కోరింది. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయమిస్తూ ఈనెల 27కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

కాగా.. 2023లో వైసీపీ ప్రభుత్వంలో తిరుమల పరకామణిలో చోరీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. పరకామణి చోరీపై టీటీడీ విజిలెన్స్‌కు 2023లోనే ఫిర్యాదు అందింది. రవికుమార్ అనే ఉద్యోగి పెద్ద ఎత్తున పరకామణిని కొల్లగొట్టారని ఆరోపణలతో ఫిర్యాదులు వెళ్లాయి. అయితే ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపకుండానే అప్పటి టీటీడీ అధికారులు లోకాయుక్తతో రాజీ చేయించారు. ఇప్పుడు తాజాగా పరకామణిలో చోరీ వ్యవహారంపై శ్రీనివాసులు అనే వ్యక్తి పిటిషన్ వేయడంతో ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. పరకామణి చోరీ కేసులో చోరీపై సీఐడీ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో తిరుమల పరకామణిలో దస్త్రాలను సీఐడీ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version