ఏరియా ఆసుపత్రిలో వైద్యులు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఏరియా ఆసుపత్రిలో సరైన సమయానికి వైద్యులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా వైద్యులు లేకపోవడం వల్ల రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత కారణంగా గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే వైద్యుల నియామకాలు చేసి, ఆసుపత్రి సేవలను బలోపేతం చేయాలని ఆయన జిల్లా ఆరోగ్య అధికారులను డిమాండ్ చేశారు. ఇది స్థానిక ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్న పిలుపునిచ్చారు.
