బంగారం ధరలకు రెక్కలు.. హైదరాబాద్‌లో పది గ్రాముల ధర ఎంతంటే..

బంగారం ధరలకు రెక్కలు.. హైదరాబాద్‌లో పది గ్రాముల ధర ఎంతంటే..

 

ఇటీవలి కాలంలో వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర సోమవారం యూటర్న్ తీసుకుంది. ఈ రోజు ఉదయం 9 గంటల తర్వాత బంగారం ధర భారీగా పెరిగింది. ఇటీవల ధర బాగా తగ్గడంతో కొనుగోళ్లు పెరగడమే ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది

ఇటీవలి కాలంలో వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర సోమవారం యూటర్న్ తీసుకుంది. ఈ రోజు ఉదయం 9 గంటల తర్వాత బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 23, 220కి చేరింది (Gold price in Hyderabad). నిన్నటితో పోల్చుకుంటే దాదాపు రూ.1200 పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1, 11, 950కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు రూ.1100 పెరిగింది.
ఇటీవల ధర బాగా తగ్గడంతో కొనుగోళ్లు పెరగడమే ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది (live gold rates). ఇక, ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 23, 370కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1, 13, 100కి చేరుకుంది.ఇక వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల నమోదైంది. కేజీకి 2,500 రూపాయల మేర వెండి ధర పెరిగింది . హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 1, 67, 000గా ఉంది. ఇక, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1, 55, 000గా ఉంది.

 పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు….

పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

 

తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజులోనే తులం బంగారం రూ.3,770 పెరిగింది.అంతర్జాతీయంగా కీలక పరిణామాలు, దీపావళి పండుగ దృష్ట్యా దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటున్నాయి. తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజులోనే తులం బంగారం రూ.3,770 పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,180 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,690గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,85,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమలులో ఉంటాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version