మండల బి ఆర్ యస్ అధ్యక్షులు వెంకటేశం గారి తండ్రి నర్సింలుకు శ్రద్ధాంజలి..

మండల బి ఆర్ యస్ అధ్యక్షులు వెంకటేశం గారి తండ్రి నర్సింలుకు శ్రద్ధాంజలి

◆-: డీసీఎంఎస్ చైర్మన్ ఎం శివకుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల బి ఆర్ యస్ పార్టీ మండల అధ్యక్షులు ఎం వెంకటేశం గారి తండ్రి ఇటీవల మరణించిన విషయం విధితమే అయితే వారి.దశ దిన కర్మకు హాజరైన ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చెర్మన్ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తు అశ్రు నయనాలతో వారికి శ్రద్ధదంజలి ఘటించారు.వారితో పాటు పార్టీ ముఖ్యులు ఝరాసంగం మండల బి ఆర్ యస్ పార్టీ యువనాయకులు పరమేశ్వర్ పాటిల్ .ఝార్సంగం సర్పంచ్ బాలరాజ్ తుమ్మన్ పల్లి సర్పంచ్ షేక్ షోహైల్ . ఎంపీ నగేష్ పాటిల్.వెంకటరెడ్డి రాజు మాణిక్యం దత్తు తదితరులు శేషివర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు

గ్రామ అభివృద్ధి నా లక్ష్యమని నూతన సర్పంచ్

గ్రామ అభివృద్ధి నా లక్ష్యమని నూతన సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన మాటను ఓ గ్రామ నూతన సర్పంచ్ నిలబెట్టుకున్నారు. ప్రమాణ స్వీకారా చేసిన తరువాత ఒక్కొక్కటిగా గ్రామంలోని పనులు తాగునీటి సమస్యను తీర్చారు.ఝరాసంగం మండలంలోని తుమ్మనపల్లి గ్రామానికి చెందిన నాజియా అంజుమ్ షేక్ సోహెబ్ ఎన్నికల్లో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం
పైపులైన్ ద్వారా తాగునీటి సరఫరా చేయించారు.
గతంలో కూడా గ్రామస్తులు అవసరాల కోసం అప్పుడు కూడా సొంత ఖర్చులతో పైపులైన్ వేయించారు. కొంతకాలం తాగునీటి సరఫరా జరిగింది. పైపులైన్ దెబ్బతిని తాగునీటి సమస్య ఏర్పడింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఒకటి ఒకటి పనులు పరిష్కరించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బొరేగౌ గ్రామపంచాయతీలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం..

బొరేగౌ గ్రామపంచాయతీలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బొరేగౌ గ్రామంలో పంచాయతీ నూతన పాలకవర్గం కొలువుదీరింది. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సర్పంచ్ నాగేందర్ పటేల్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

సర్పంచ్ బరిలో సుల్తాన్ సలావుద్దీన్

సర్పంచ్ ఎన్నికలు బరిలో మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామ ప్రజల ఆదరాభిమానాలు పొందిన మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడ్డా తిరుగుండదు అని ప్రజలు చెబుతున్నారు.

వస్తున్న మీ కోసం………

ప్రజలకు సేవ చేయడానికి…. వచ్చి రాజకీయాన్ని కార్పొరేట్ చేసిన ఈ తరుణంలో దానికి కొత్త నిర్వచనం చెప్పడానికై వస్తున్నా…..మీ కోసం సడెన్ గా ఎన్నికల్లో ప్రత్యక్షమై మాయమైపోయే నాయకుల్లా కాను ఎన్నో ఏళ్ళుగా వివిధ రకాల సామజిక కార్యక్రమాలు చేస్తూ మీ మధ్యలో ఉంటున్నా మీకోసం పదవి ఉన్న లేకున్నా నేను మీకోసం ఏదో ఒక రూపంలో సేవ చేస్తుంటా
నా లాంటి సేవకుడికీ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి స్వలాభం లేకుండా నిస్వార్ధగా తెలిపారు. మీకు సేవ చేస్తాను అని

జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో క్రిష్ణాపూర్ ఉపాధ్యాయుడు సురేష్ కు అవార్డు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T113405.044.wav?_=1

 

జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో క్రిష్ణాపూర్ ఉపాధ్యాయుడు సురేష్ కు అవార్డు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈ నెల 18 నుండి మూడు రోజుల పాటు నారాయణఖేడ్ లో జరిగింది. ఉపాధ్యాయ విభాగంలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఝరాసంగం మండలం క్రిష్ణాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు యం. సురేష్ కు జిల్లా స్థాయిలో అవార్డు దక్కింది. ముగింపు సమావేశంలో విద్యా శాఖ అధికారి వెంకటేశ్వర్లు, నారాయణఖేడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే సంజీవరెడ్డి, పట్టభద్రుల ఎం ఎల్ సి అంజిరెడ్డి, డి.యస్. పి, సబ్ కలెక్టర్ ఉమాహారతి చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందుకున్నారు.

దళరులకు పత్తి అమ్మి మోసపోకండి….

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T123435.544.wav?_=2

 

దళరులకు పత్తి అమ్మి మోసపోకండి….!

– షేక్ సోహెల్ బిఆర్ఎస్ యువ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రైతులను ఆదుకోవాడని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆకాల వర్షాల వల్ల రైతుల పంటలు నష్ట పోయరని పంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు మద్దతు ధరను ప్రకటించాయని ఝరాసంగం మండల తుమ్మన్ పల్లి గ్రామ షేక్ సోహెల్ బిఆర్ఎస్ యువ నాయకులు పేర్కొన్నారు. ఝరాసంగం మండల వ్యవస మార్కెట్ దళరుల బెడుద ఎక్కువైయిదన్నారు. వ్యవస మార్కెట్ కమిటీ వెంటనే స్పందించి దళారుల పై చెర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి ధరను నిర్ణయించి 8100 క్వింటాల్ కు కల్పించిందని తెలిపారు. పేట మార్కెట్ కమిటీ దళారులకు మేలు రకం పత్తికి 8100 రూ.. నాసిరకం పత్తికి 7500 ఇచ్చేల చెర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. దళారులు తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తే వారి లైసెన్స్ రద్దు చేయాలన్నారు. అధికార ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుభడి ఉందని తెలిపారు. మునిపల్లి వ్యవస మార్కెట్ లో సరైయిన ధరను రైతులు పొందు తున్నారన్నారు. అక్కడి దళరులు కూడా ఇదే పత్తి కి 7500 వందలు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. పేటలో వ్యవస్థ మార్కెట్ దళారులతో ఒప్పందం చేసుకొని రైతులకు నష్టం చేయటం మానుకోవాలని పేర్కొన్నారు. కౌలు రైతులకు సిసిఐ అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. సిసిఐ అవకాశం ఇస్తే దళారుల దోపిడీ తగ్గు తుందని అన్నారు. రైతుల అవసరాలను అసగా చేసుకొని దొచేస్తున్నారు. రైతుల పక్షణ రాజకీయం పార్టీలు పోరాటం చేయాలన్నారు. త్వరలో పత్తి మార్కుట్ లో దళరుల ప్రమేయం తగ్గించాలని ఉద్యమం చేయనున్నామని తెలిపారు.

సౌదీ అరేబియా బస్సు ప్రమాద బాధితులకు ప్రగాఢ సానుభూతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T122255.558.wav?_=3

 

సౌదీ అరేబియా బస్సు ప్రమాద బాధితులకు ప్రగాఢ సానుభూతి

◆:- షైక్ రబ్బానీ ఎంఐఎం పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన అనేక మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షైక్ రబ్బానీ పేర్కొన్నారు. మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్నా బస్సు డిజిల్ ట్యాంకర్ ను ఢీకొని భారతీయ యత్రికులు సజీవ దహనమైన ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు
వారిలో సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామానికి చెందిన మౌలానా, ఆయన కూతురు గౌసియా బేగం, అల్లుడు ఖదీర్, మనుమడు సోయబ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు, అలాగే, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించే విధంగా సౌదీ అధికారులతో మరియు భారత్ రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి బాధిత కుటుంబాలకు సహాయం అందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం: హైదరాబాదీ మౌలానా కుటుంబం దుర్మరణం

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం: హైదరాబాదీ మౌలానా కుటుంబం దుర్మరణం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సౌదీ అరేబియాలోని మక్కాలో ఉమ్రా యాత్రకు వెళ్లిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పా నగర్ గ్రామానికి చెందిన మౌలానా, ఆయన కూతురు గౌసియా బేగం, అల్లుడు ఖదీర్, మనుమడు సోయబ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మక్కా వెళ్తుండగా బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగడంతో, మనుమడు సోయబ్ కిటికీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అతనికి కాళ్లు విరిగి, స్వల్పంగా గాయాలైనట్లు సమాచారం. మిగతా కుటుంబ సభ్యులు పాస్పోర్ట్ సమస్యల వల్ల ముందుగానే వెళ్లారు.

అధ్వానంగా మారిన గ్రామ రోడ్డు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-14T135107.516.wav?_=4

 

అధ్వానంగా మారిన గ్రామ రోడ్డు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల బొప్పనపల్లి యువ నాయకులు శశివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మండల
గ్రామీణ ప్రాంతాలకు రహదారుల అభివృద్ధికి పట్టుకొమ్మలు అని అంటారు. అలాంటి రోడ్లు మండలంలోని బొప్పనపల్లి గ్రామ రోడ్డు పూర్తిగా పాడైపోయ్యాయి. గ్రామాల అభివృద్ధికి రహదారులు మూలస్తంభంగా ఉంటాయని అన్నారు. కానీ గ్రామీణ రహదారులు పూర్తిగా అధ్వానంగా

మారినాయియని. అడుగేస్తే మడుగు అనే అంతలా పరిస్థితి ఉంది. రోడ్డు నిర్మాణం, మారమ్మతులపై ఉన్న ప్రభుత్వ పాలకులు ఇచ్చిన హామీలు గాలిలో కలిశాయాన్నట్టుగా ఉంది. ఒక వైపు కంకర తేలిన రోడ్డు, మరో వైపు గుంతల రోడ్డు, ఇంకో వైపు మూలమలుపు లతో రోడ్డు ద్విచక్ర వాహనాలకు రాత్రి సమయంలో ప్రమాదకరంగా మారిందన్నారు. ఝరాసంగం మండలానిక సమీపంలో ఉన్న బొప్పనపల్లి గ్రామం, రోడ్డు అధ్వానంగా మారిందన్నారు, వెంటనే అధికారులు స్పందించి మరమ్మతు చేయించాలని కోరారు,

దశదినకర్మలో పాల్గొన తాజా మాజీ సర్పంచ్…

దశదినకర్మలో పాల్గొన తాజా మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ .మాజీ మంత్రి శాసనసభ్యులు హరీష్ రావు తండ్రి ఇటీవల మరణించడం తో వారి దశదినకర్మ లో పాల్గొని వారికిశ్రద్ధాంజలి ఘటిస్తు వారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుంటూ మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియాజేయాడం జరిగింది అని అన్నారు,

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం చేసిన నాయకులు

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం చేసిన నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాతకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా,సోమవారం ఝరాసంగం మండలం పరిధిలో కక్కర్ వాడ గ్రామ లో తాటిపల్లి నాగమణి మహిపాల్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సకాలంలో ఇల్లు పూర్తి చేసుకొని ఇలాంటి మంచి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం తరపున కోరుకుంటున్నాము అన్నారు.

ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన ప్రజా ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహింస్తోంది. ప్రజలు అందరూ సద్వినియగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హన్మంత్ రావు పాటిల్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ నాయకులు మారుతి రావు సంగ్రామ్ పాటిల్ డప్పురు సంగన్న రాజ్ కుమార్ స్వామి గ్రామ యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి గోపాల్ రెడ్డి మాజీ ఎం పి టిసి నర్సిములు.అడ్వకేట్ షకీల్ సర్ శ్రీనివాసరెడ్డి రాంరెడ్డి పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు.యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్ మండల సోషల్ మీడియా ఇంచార్జి నవీన్ సుభాష్,మాణయ్య ఇస్మాయిల్ తధీతరులు పాల్గోని మహిపాల్రెడ్డికి శుభకాంక్షలు తెలియజేసారు 

సామాన్య కుటుంబ నుండి క్రేన్ యజమాని గా మారిన మొయిజ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-01T115938.911.wav?_=5

 

సామాన్య కుటుంబ నుండి క్రేన్ యజమాని గా మారిన మొయిజ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

క్రేన్ డ్రైవర్‌గా పనిచేసి యజమానిగా ఎదిగిన ఒక రైతు బిడ్డ గురించి ప్రత్యేకంగా ఒక వార్త అందుబాటులో లేదు, అయితే డ్రైవర్‌గా పనిచేసిన ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ మొయిజ్ యజమానిగా ఎదిగిన వ్యక్తు ఉన్నాయి. ఉదాహరణకు, కుప్పా నగర్కు చెందిన మొహమ్మద్ మొయిజ్ అనే యువకుడు, మొదట్లో క్రేన్ డ్రైవర్ గా తొక్కేవాడు, కానీ తరువాత లక్షల రూపాయల విలువైన రెండు క్రేన్ యజమానిగా ఎదిగాడు. అతను పదవ తరగతి మాత్రమే చదువుకున్నప్పటికీ, తన కుటుంబ పోషకానికి ఆలోచనతో రెండు క్రేన్లు తెచ్చి యజమాని అయ్యాడు ఎవరికైనా రెంటు కావలసినవారు ఈ సెల్ నెంబరుకు 9550653577 సంప్రదించగలరని కోరారు,

దసరా పండుగకు అన్ని సౌకర్యాలు చేయాలి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T115216.124-1.wav?_=6

 

దసరా పండుగకు అన్ని సౌకర్యాలు చేయాలి

 షేక్ సోహెల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

దసరా పండుగకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఝరాసంగం మండల తుమ్మన్ పల్లి గ్రామ బిఆర్ఎస్ యువ నాయకుడు షేక్ సోహెల్ గ్రామాల్లో వీధిదీపాలు లేవు గడ్డి పెద్ద పెద్ద కావడం జరిగింది మరియు నీళ్ల సౌకర్యం సరిగా లేదు ఈ పండుగ హిందువులకు చాలా పెద్దది ఎక్కడెక్కడో ఉన్న తమ గ్రామానికి ప్రతి ఒక్కరు వస్తారు గత ప్రభుత్వ హాయంలో గ్రామాలు చాలా బాగుండేది ఇప్పుడు ప్రభుత్వం చాలా వెనుకబడింది గ్రామ అభివృద్ధి వెంటనే అధికారులు స్పందించి గ్రామ సౌకర్యాలు విద్యుత్ దీపాలు నీటి సౌకర్యం గ్రామ పరిశుభ్ర మురికి కాలువలు శుభ్రం చెయ్యాలన్నారు,

అకాల వర్షాలతో పత్తి పంటకు నష్టం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-20T112702.152.wav?_=7

 

అకాల వర్షాలతో పత్తి పంటకు నష్టం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లాలో అకాల వర్షాల కారణంగా పత్తి పంట తీవ్రంగా నష్టపోయింది. పత్తి కాయలు కుళ్ళిపోవడం, పువ్వులు, కాడలు రాలిపోవడంతో రైతులు దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నష్టాలను అధిగమించడానికి ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో 5,000 హెక్టార్లకు పైగా పత్తి సాగు చేయగా, వర్షాల వల్ల పంట దెబ్బతింది. ఝరాసంగం మండల మేదపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్ ఈ విషయాన్ని ప్రకటనలో తెలిపారు.

మండల పాఠశాల కరస్పాండెంట్లులను ఘన సన్మానం…

మండల పాఠశాల కరస్పాండెంట్లులను ఘన సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండల్ లోని ప్రైవేట్ పాఠశాలలు ఉపాధ్యాయ బృందాన్ని జహీరాబాద్ ట్రస్మ తరఫున ఉపాధ్యాయులందరినీ సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము ఉపాధ్యాయులందరిని సన్మాన సత్కారము జరుపబడుతుంది అదేవిధంగా ఈసారి కూడా ప్రతి పాఠశాల ఐదుగురు ఉపాధ్యాయులను పాఠశాల కరస్పాండెంట్ లను సన్మాన సత్కారము చేయబడింది ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్లు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పెద్దలు ట్రస్మా ప్రెసిడెంట్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయా స్కూల్ ల
కరస్పాండెంట్లు విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్ కరస్పాండెంట్ నాగన్న అక్షర భారతి కరస్పాండెంట్ శ్రీనివాస్ మరియు హాని టెక్నో పాఠశాల కరస్పాండెంట్ శరణప్ప ట్రస్మా ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి మోహన్ రెడ్డి దశరథ్ రెడ్డి మరియు సభ్యులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది,

కుప్పానగర్ ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ – టిఎల్ఎం మేళా..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-05T122159.817.wav?_=8

 

కుప్పానగర్ ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ – టిఎల్ఎం మేళా

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం లోని కుప్పానగర్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఎఫ్ఎల్ఎన్ )- టిఎల్ఎం మేళా కార్యక్రమాన్ని మండల విద్యాధికారి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి( ఎంఈఓ ) మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులు అందరూ బోధనోపకరణాలతో పాల్గొని విద్యా ప్రమాణాలు పెంచేలా కృషి చేశారన్నారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, అంజనేయులు, విష్ణు వర్ధన్ రెడ్డి, నాగేశ్వరరావులు మాట్లాడుతూ వివిధ విషయాలు తెలుసుకుని విద్యార్థుల అభివృద్ధికై కృషి చేయాలని అన్నారు.

 

కార్యక్రమంలో ఎఫ్ ఎల్ ఎన్ ( ఎఫ్ఎల్ఎన్ )- టిఎల్ఎం బోధనోపకణాల పట్ల అన్ని అంశాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం మండలం నుండి ఉత్తమ బోధనోపకణాలు( టిఎల్ఎం ) ప్రదర్శించిన ఉపాధ్యాయుల వివరాలు జిల్లా స్థాయికి పంపిస్తామన్నారు. ఈ మేళాలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీ ఆర్ పీ లు పాల్గొన్నారు.

చిన్నారుల చోట గణేష్ నిమజ్జనం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T123222.024-1.wav?_=9

 

చిన్నారుల చోట గణేష్ నిమజ్జనం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ శాసన పరిధిలోని ఝరాసంగం మండలం జీర్ణపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం బీసీ కాలనీలోని చిన్నారులు ఘనంగా చోట గణేష్ నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వారు ప్రసాదాలు పంచుతూ,నిమజ్జనం చేసి, చూపరులను ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమం గ్రామంలోని ప్రజలందరినీ ఆనందపరిచింది అందరూ చూసి ఆనందించారు.

ఝరాసంగం గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-96-1.wav?_=10

పారిశుధ్య లోపం.. ప్రజలకు శాపం

◆:- కనీస సౌకర్యాలకు నోచుకోని గ్రామాలు

◆:- పర్యవేక్షణ లోపంతో నిత్యం ప్రజల అవస్థలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం:ఇక్కడ పారిశుధ్య లోపంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.నిధుల కొరత పేరుతో గ్రామాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.

ముఖ్యంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో
ఇక్కడి కార్యదర్శులు ఆడిందే ఆట పాడిందే పాట సాగుతుంది.

అందుకు నిదర్శనంగా ఝరాసంగం మండలంలోని బిడకన్నె,కంబాలపల్లి,కృష్ణాపూర్ గ్రామాల దుస్థితి గురించి చెప్పవచ్చు.ఈ గ్రామాలలో కనీసం పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా సక్రమంగా చేపట్టకపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నట్లు ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఈ గ్రామాల్లో విధిగా మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం నుండి దుర్గంధం వెదజల్లుతుంది.

దీంతో ఈగలు,దోమలు,బ్యాక్టీరియా వెదజల్లి రోగాల బారిన పడుతున్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వర్షాకాలంలోనైనా బ్లీచింగ్ పౌడర్ నైనా సరిగా చల్లడం లేదని వారు వివరించారు.నిధుల కొరత పేరుతో ప్రజల కనీస అవసరాలు తీర్చ తీర్చకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా తాగునీటి బోర్లు,మంచినీటి కుళాయిలు ఇతర నీటి పథకాల వద్ద మురుగునీరు నిలుచుని పిచ్చిగడ్డి మొలవడంతో పారిశుద్ధ్యం కొరవడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.కనీసం గ్రామాలలో వీధి బల్బులు కూడా సక్రమంగా బిగించకపోవడంతో రాత్రిపూట అంధకారం నెలకొని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఈ ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నత అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, కనీసం మండల స్థాయి అధికారులైన గ్రామాలను సందర్శించకుండా నిర్లక్ష్యం చేయడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు ఆరోపించారు.

Suffer Due to Poor Sanitation

కాగా తమ గ్రామ సమస్యలను కార్యదర్శి ఏమాత్రం పట్టించుకోవడంలేదని మంగళవారం బిడకన్నె గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.సీపీఎం కార్యదర్శి చంద్రన్న ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు.చెత్త చెదారం నిండి దుర్గంధం వెదజల్లుతున్న మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారని వారు కోరారు.మంచినీటి పథకాలు పనిచేయకపోవడంతో పాటు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు.వీధి బలుపులు లేక రాత్రి వేళలో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలియజేశారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకుని తమ గ్రామాల సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఇండ్లలోకి వర్షం నీరు చేరిన మాచునూర్ గ్రామం…

ఇండ్లలోకి వర్షం నీరు వచ్చింది అని మాచునూర్ లో రాస్తా

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మాచునూర్ గ్రామంలో వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చిందని నిరసన తెలియజేసిన గ్రామ ప్రజలు ఇటీవల నాలుగు రోజులుగా వర్షపు కొరవడంతో ఇండ్లలోకి నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన చెందారు రాత్రి వేళలో వర్షపు నీరు ఇండ్లలోకి రావడంతో చిన్నపిల్లలు నిద్రాహారాలు మాని ఇబ్బందులతో బిక్కుబిక్కుమంటు జీవనం సాగిస్తున్నారు.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు

 

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు , కోహిర్ మాజి సర్పంచ్ కళీమ్ గారి జన్మదిన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు కోహిర్ మండలం అధ్యక్షులు నర్సింలు, ఝరసంఘం మండలం అధ్యక్షులు వెంకటేశం ,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,యువ నాయకులు ముర్తుజా ,దీపక్ , మల్లేష్ తదితరులు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version