మహాకవి కాళోజీ గారి వర్ధంతి సభను ఘనంగా నిర్వహించిన వరంగల్ బార్ అసోసియేషన్:-
వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
తెలంగాణ ప్రజాకవి మహాకవి కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా వరంగల్ బార్ అసోసియేషన్ హాల్ (అంబేద్కర్ హాల్)లో గురువారం స్మారక సభను వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు,
ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు సుధీర్ మాట్లాడుతూ
“తెలంగాణ తొలిపొద్దు కాళోజీయని
అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి,
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.
అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు”
అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ గారంటూ,
అదేవిధంగా అన్నపు రాశులు ఒకచోట – ఆకలికేకలు ఒకచోట అంటూ సమాజంలోని అసమానతలను అక్షర యోధుడై దునుమాడి సమసమాజం కోసం పోరాడారని,ప్రజల ఆవేదనను బడిపలుకులతో గాక, పలుకుబడుల భాషలో పలికించిన నిజమైన ప్రజా కవి కాళోజీ గారిని స్మరించుకోవడం మనందరికీ స్పూర్తిదాయకం అంటూ వారి ఆశయాల వెలుగులో ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతతో ముందుకు సాగి అసమానతలు లేని సమాజాన్ని సాధించాలని బార్ అసోసియేషన్ తరఫున పిలుపునిచ్చారు
ఈ సందర్భంగా న్యాయవాదులు కాళోజీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు మైదం జయపాల్, ప్రధాన కార్యదర్శి డి. రమాకాంత్, సంయుక్త కార్యదర్శి ముసిపట్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి సిరుమళ్ల అరుణ, సీనియర్ ఈసి సభ్యుడు ఇజ్జేగిరి సురేష్, మహిళా ఈసి సభ్యురాలు తోట అరుణ, బార్ కౌన్సిల్ సభ్యుడు బైరపాక జయాకర్, అలాగే సీనియర్ న్యాయవాదులు తీగల జీవన్ గౌడ్, ఎలుకుర్తి ఆనంద్ మోహన్, రాచకట్ల కృష్ణ, గంధం శివ, ఓరుగంటి కోటేశ్వర్, సిద్దం యుగేందర్,గురుమిళ్ల రాజు మరియు ఇతర పలువురు న్యాయవాదులు పాల్గొని నివాళులర్పించారు.
