SSC పూర్వ విద్యార్థుల,గురువులకు ఘన సత్కారం….

SSC పూర్వ విద్యార్థుల,గురువులకు ఘన సత్కారం

స్వర్ణోత్సవ వేడుకల సందర్బంగా ప్రత్యేక కార్యక్రమం

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని SSC -1975-76 బ్యాచ్ 2026 నాటికి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా తమకు విద్యాబోధ చేసిన గురువుల పట్ల కృతజ్ఞతాభివందనంగా ప్రత్యేక సత్కార కార్యక్రమాన్ని చేపట్టారు.స్వర్ణోత్సవ వేడుకలకు అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోయిన గౌరవనీయ గురువులు కాచం వెంకటేశం , పత్తిపాక ఆనందం వారి స్వగృహాల్లో గురువారం సత్కరించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు, నూతన వస్త్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నాటి విద్యార్థులు గాజుల ప్రతాప్, బూర దేవానందం, కరుణాల భద్రాచలం, బోడ రవి, పాశికంటి శంకర్, తమ్మిశెట్టి ప్రసాద్, కట్టా శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, అంబరీషం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, తమ జీవితాల్లో గురువుల పాత్ర ఎంతో గొప్పదని, వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తమకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు

సత్యసాయి కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారు: చంద్రబాబు..

సత్యసాయి కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారు: చంద్రబాబు

 

భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని.. బాబా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు.భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని.. బాబా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు. క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం గురించి సత్యసాయి చెప్పారని.. సకలజనుల సంక్షేమాన్ని బాబా కోరుకున్నారని చెప్పుకొచ్చారు. సత్యసాయి పుట్టపర్తి శతజయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ(ఆదివారం) సత్యసాయి సమాధిని ముఖ్యమంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రసంగించారు సీఎం చంద్రబాబు.‘భగవాన్ సత్యసాయి 1926 నవంబర్ 23వ తేదీన ఈ పుణ్యభూమిలో ఒక లక్ష్యం కోసం అవతరించారు. ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవన ప్రయాణాన్ని సాగించి సాయి సిద్ధాంతాన్నిప్రపంచానికి అందించారు. జ్ఞానాన్ని బోధించి సన్మార్గం చూపించారు. సమాజ సేవ, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తిమార్గంతో కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే ప్రార్థనలు, కీర్తనలు, భజనలతో దైవ చింతన కలిగిన వ్యక్తిగా వ్యవహరించేవారు. 1940 మే 23వ తేదీన సత్యసాయి వయసు 14 ఏళ్లు… అప్పుడే ఆయన సత్యనారాయణరాజుగా ఉన్న పూర్వాసన నామాన్ని వదలుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు. దేవుళ్లు ఎక్కడో ఒకచోట అవతరిస్తారు. సతస్యాయి ఈ పుణ్యభూమిని ఎంచుకున్నారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్యానికి నిలయంగా మార్చారు. మావన రూపంలో మనం చూసిన దైవమే సత్యసాయి శత జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం అందరి అదృష్టం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి…

చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి

మరిపెడ నేటిధాత్రి

 

 

తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర విశేషమైనదని, ఆమె మహిళా చైతన్యం, శక్తికి ప్రతీక అని మరి పెడ ఎంపిడిఓ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ 40వ వర్థంతి సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపిడిఓ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి, బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి మార్గం చూపారని ఈ సందర్భంగా అన్నారు. ఆమె ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి ఎంపీఓ సోములాల్ నాయక్,ఏపీఓ భీమా నాయక్, పంచాయతీ కార్యదర్శి లెనిన్, టెక్నికల్ అసిస్టెంట్ నెహ్రూ, ధర్మయ్య ఎల్లమ్మ, జూనియర్ అసిస్టెంట్ సౌజన్య పంచాయతీ కార్యదర్శిలు లతా,ప్రియదర్శిని,సరిత, విజయ కుమారి,నజియా తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version