భూమ నందినికి ప్రతిష్టాత్మక అవార్డు…

భూమ నందినికి ప్రతిష్టాత్మక అవార్డు

అభినందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన భూమ సుజాత రాజయ్య కూతురు నందినికి అరుదైన అవార్డు దక్కింది. ఇటీవల యంగ్ ఛాంపియన్ అవార్డు,వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ సర్టిఫికేట్ ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ అండ్ అవార్డ్స్ (ఎన్ఐఎఫ్ఏఏ ) నుండి అందుకున్నారు.

ఈ అవార్డులు ఈ నెల 22 న న్యూ ఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగిన కార్యక్రమంలో నందినికి ప్రముఖులు ప్రదానం చేశారు.చిన్న వయస్సులోనే సాధించిన ఈ విజయాలు ఆమె పట్టుదల,కష్టపడి పనిచేసే నైపుణ్యం,అసాధారణ ప్రతిభకు నిదర్శనమని తన సహచరులు అభినందించారు. దేశస్థాయిలో ఇంతటి మహోన్నతమైన అవార్డును అందుకున్న నందినిని నేడు బిజెపి కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ శాలువాతో సన్మానించి అభినందించారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు తను ఎదిగేలా సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ భరోసా కల్పించారు.

ఘనంగా చిట్యాల ఐలమ్మ 130 వ జయంతి కార్యక్రమం…

ఘనంగా చిట్యాల ఐలమ్మ 130 వ జయంతి కార్యక్రమం.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రంలో చిట్యాల ఐలమ్మ 130వ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి కేక్ కట్ చేసుకుని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది, ఇట్టి కార్యక్రమం చందుర్తి మండల రజక సంఘం అధ్యక్షులు సుద్దాల నరసయ్య, వనపర్తి సతీష్ (ప్రధాన కార్యదర్శి), కొడగంటి గంగాధర్ (కోశాధికారి) ఆధ్వర్యంలో చందుర్తి రజక సంఘం అధ్యక్షులు లింగంపల్లి మల్లయ్య మరియు చందుర్తి రజక సంఘం సభ్యులు, మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి రజక సంఘం సభ్యులు అలాగే చందుర్తి మండల నాయకులు పాక్స చైర్మన్ తిప్పని శ్రీనివాస్, నాయకులు పులి సత్యం, గొట్టె ప్రభాకర్, బైరబోని రమేష్, బత్తుల కమలాకర్, చిలుక పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తొలి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలని. పెత్తందారులతో, రజాకార్లతో, దొరలతో, భూస్వాములతో కొట్లాడి ఎన్నోవేల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టిన ధీర వనిత అని కొనియాడారు. ఇప్పటి యువత ఆమె స్ఫూర్తితో ఆమె ఆశయాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం…

చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఘన నివాళులు

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రభాగంలో నిలిచిన ధైర్యవంతురాలు చాకలి ఐలమ్మ అని ఆమె జీవితం నేటితరానికి స్ఫూర్తిదాయకం నర్సంపేట నియోజకవర్గ శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు.వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ చాకలి ఐలమ్మగారి పోరాటం నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తిదాయకమని, ఆమె సామాన్య వర్గానికి చెందినప్పటికీ సామాజిక అసమానతలకు, భూ దోపిడీకి, జమీందారీ శాసనానికి వ్యతిరేకంగా పోరాడారు అని, ఆమె ధైర్యం పట్టుదల అందరికీ ఆదర్శం కావాలని తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version