విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కాలిన్సీ ఎరోస్పేస్ *ఆధ్వర్యంలో…

విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కాలిన్సీ ఎరోస్పేస్ *ఆధ్వర్యంలో

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

మొగుళ్ళపల్లి ఉన్నత పాఠశాలలో కాలిన్సీ ఏరోస్పేస్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు రామారావు, విశాల్ గారులు మొగుళ్ళపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న 190 మందిక విద్యార్థులకు బ్యాగులు,నోట్ బుక్కులు, పెన్నులు ,పెన్సిళ్లు మరియు ఇతర స్టేషనరీ పంపిణీ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు భాగ్యశ్రీ గారు అధ్యక్షత వహించారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కాలింగ్ చేరోస్పేస్ వారు అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తద్వారా జీవితంలో పురోగమించాలని అభిలసించారు.
ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధిలు,మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థిని విద్యార్థులు చదువులో రాణించుటకై మా సంస్థ తరఫున ప్రతి సంవత్సరము విద్యాభివృద్ధికై ఇతోదికంగా సహాయ చేయడం జరుగుతుందని , అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా కావలసిన వసతులను సమకూర్చడంలో మా సంస్థ ముందు ఉంటుందని ఇంకా ఏదైనా సదుపాయాలు అవసరం ఉంటే మాకు తెలియజేసిన, వెంటనే మీకు సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయుల వెంకన్న గారు మాట్లాడుతూ తను చదువుకున్న పాఠశాల విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్న ఎరోస్పేస్ ప్రతినిధి రామారావు గారిని అభినందించడం జరిగింది. ఫిజికల్ డైరెక్టర్ రాజయ్య గారు మాట్లాడుతూ గత సంవత్సరము పాఠశాలకు అందించిన స్పోర్ట్స్ మెటీరియల్ ద్వారా పలువురు విద్యార్థులను జాతీయ స్థాయిలో రాష్ట్రస్థాయిలో క్రీడాకారులుగా రాణించుటకు ఉపయోగపడిందని
ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిల్,రాజు, ప్రవీణ్ ,విజయభాస్కర్, కళ్యాణి, పద్మ, రాజయ్య, లలిత,చందర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులలో స్ఫూర్తిని నింపిన “వందేమాతరం “- ఎన్ సి.సి అధికారి గుండెల్లి రాజయ్య

విద్యార్థులలో స్ఫూర్తిని నింపిన “వందేమాతరం “- ఎన్ సి.సి అధికారి గుండెల్లి రాజయ్య
మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

స్వాతంత్ర పోరాట స్ఫూర్తి గీతం!

ఉద్యమానికి మనోబలం తెచ్చిన శబ్ద తరంగం!
వందేమాతరానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా, పదవ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కలనల్ సెంతిల్ రామదురై, పరిపాలన అధికారి రవి సోనహరే వారి ఆదేశాల మేరకు జడ్పీహెచ్ఎస్ మొగుల్లపల్లి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఎస్.భాగ్యశ్రీ, ఎన్సిసి అధికారి గుండెల్లి రాజయ్య ఆధ్వర్యంలో ఎన్సిసి విద్యార్థులచే జాతీయ గీతం అయిన వందేమాతరం పూర్తి గేయాన్ని మూడు నిమిషాల ఆలపించి, మొగుళ్లపల్లి వీధుల గుండా ర్యాలీగా వెళ్లి,చౌరస్తాలో మానవహారం ఏర్పరిచి మండల అభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారి, సమక్షంలో వందేమాతర గీతాన్ని ఆలపించి దాని యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది.
పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఎన్సిసి అధికారి మాట్లాడుతూ వందేమాతరం యొక్క పుట్టుక, దాని యొక్క ప్రాముఖ్యతను విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో టి. వెంకన్న,
బి. కుమారస్వామి, కె. ప్రవీణ్
ఎం. రాజు, డి. పద్మ, పి. లలిత,
జి. విజయభాస్కర్. ఆర్. చందర్ ఎండి. మజార్, బి. వేణు, ఎన్సిసి విద్యార్థులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version