మహాదేవపూర్‌లో బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T132408.472.wav?_=1

ఘనంగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు

మహాదేవపూర్ఆగస్టు21నేటి ధాత్రి *

మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మహాదేవపూర్ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్బంగా మహాదేవపూర్ బస్టాండ్ లో వివేకానంద విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేసి, బాణాసంచా కాల్చి, స్వీట్స్ పంపిణి చేశారు, అనంతరం మహాదేవపూర్ మండల తాసిల్దార్ ఎరాబటి రామారావు మరియు హాస్పిటల్ సూపరెండెంట్ డా, విద్యావతి ముఖ్య అతిధిగా పాల్గొని,ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణి చేసి ఆసుపత్రి ప్రాంగణం లో చెట్లు నాటడం జరిగింది అలాగే బీజేపీ సీనియర్ నాయకులు కన్నీబోయిన అయిలన్న సహకారంతో ప్రధానోపాధ్యాయురాలు సరిత ఉపాధ్యాయుడు మడుక మధు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని 10వ 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు భగవద్గిత పుస్తకాలు పంపిణి చేయడం జరిగింది,
బీజేపీ మహాదేవపూర్ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ఒక సామాన్య కార్యకర్త నుండి జాతీయ స్థాయి నాయకునిగా మరియు కేంద్ర మంత్రిగా ఎదగడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు, అనేక రకాల ప్రజా ఉద్యమాలు చేసి కింది స్థాయి నుండి వచ్చిన నాయకుడు అని అన్నారు, అలాగే కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రివర్యులుగా ఎదిగిన అయన జీవితం, నేటి కార్యకర్తలకు, యువకులకు ఆదర్శమన్నారు, కష్టపడి పనిచేసే నిజాయితీ కలిగిన కార్యకర్తలకు కేవలం భారతీయ జనతా పార్టీలోనే గుర్తింపు ఉంటుందన్నారు, రాబోవు రోజుల్లో బండి సంజయ్ఆ అమ్మవారి ఆసిస్సులతో మరింత ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశభావం వ్యక్తం చేసారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ మండల ప్రధాన కార్యదర్శులు బొల్లం కిషన్, సూరం మహేష్, సీనియర్ నాయకులు కన్నీబోయిన అయిలన్న, సాగర్ల రవి, లింగంపల్లి వంశీ, బాలిరెడ్డి,శ్రీనివాస్,శ్యామ్,రాంరెడ్డి, వెంకటేష్, శ్రవణ్,సాయి, సంపత్, రాకేష్, మనోజ్, రాజు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సుబాస్ చంద్ర బోస్ నేతాజీ కి భారతరత్న అవార్డు ఇవ్వాలి.

సుబాస్ చంద్ర బోస్ నేతాజీ కి భారతరత్న అవార్డు ఇవ్వాలి

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో
భారత స్వాతంత్ర్య సమర యోధుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రజావాగ్గేయకారుడు
రాజారాంప్రకాష్ మాట్లాడుతూ
ఆజాద్ హిందు ఫౌజు దళపతి నేతాజి అఖండ భారత జాతి
కన్న మరో శివాజి స్వాతంత్ర్య సమరయోధుడు భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక భూమిక పోషించిన మరో శివాజీ యువ భారతానికి ఆదర్శంగా నిలిచిన భారత జాతీయవాది స్వాతంత్ర పోరాటంలోనూ
పటిమ ఉన్నటువంటి దిగ్గజం బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై రాజీలేని పోరాటం జరిపిన నేత సుభాష్ చంద్రబోస్ దేశం కోసం 11 సార్లు జైలు జీవితం అనుభవించిన దళపతి నేతాజీ పార్టీని నేత సుభాష్ చంద్రబోస్ స్థాపించారు
జై హిందు నినాదంతో భారతీయులలో స్ఫూర్తిని రగిలించిన నేతాజీ భారతీయులందరూ సగర్వంగా నేతాజీ అని పిలుచుకునే సుభాష్ చంద్రబోస్ పోరాటానికి ప్రతిరూపం రెండుసార్లు నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన ఆయన గాంధీ నెహ్రూలతో విభేదించి స్వాతంత్ర్య సాధన కోసం మార్గాన్ని ఎంచుకున్నారు రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజుల్లో నిర్బంధాన్ని ఛేదించుకుని భారత్ నుంచి విదేశాలకు చేరుకున్నారు ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏర్పాటుచేసి ఆంగ్లేయులను భారత్ నుంచి తరిమికొట్టేందుకు ప్రపంచ దేశాల మద్దతు కోసం ప్రయత్నించారు ఈ క్రమంలో స్టాలిన్ వంటి ఎందరో నేతల్ని కలుసుకున్నారు సింగపూర్ కేంద్రంగా చేసుకొని భారతదేశాన్ని దాస్యశృంఖలాల నుంచి విముక్తి చేసేందుకు ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించారు 1945 ఆగస్టు 18న తైవాన్ నుంచి నుంచి జపాన్ కు వెళుతుండగా జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ దుర్మరణం పాలయ్యారు అనేది
ప్రతి వ్యక్తి అన్యాయంపై
నేతాజీ సుభాష్ చంద్రబోస్ లా పోరాడాలని ప్రజలకు అండగా నిలవాలని మహనీయుల వేదిక రాష్ట్ర చైర్మన్
ప్రజా వాగ్గేయకారుడు
రాజారాంప్రకాష్
కోరారు
ఈ కార్యక్రమంలో
కవిపండితుడు బూరోజు గిరిరాజాచారి పాల్గొని నేతాజీ సుభాష్ చంద్రబోసు గారి గురించి మాట్లాడారు
కవి శ్రేష్టుడు వ్యాఖ్యాత డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ
గాయకుడు చింతకుంట కుర్మయ్య
రజక సంఘం నాయకుడు శ్రీనివాసరావు
విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-26-6.wav?_=2

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క.

#ప్రజల కోసం సమాజం కోసం ఉమ్మడి హక్కుల కోసం పోరాడిన వారిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ప్రజల కోసం సమాజం కోసం ఉమ్మడి హక్కుల కోసం పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,
స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి
దనసరి అనసూయ సీతక్క పాల్గొని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి,
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అధికారికంగా జరపడం జరుగుతుందని, చాలా సంతోషకరమని అన్నారు.
ప్రతి ఒక్కరూ మహనీయుల జీవిత చరిత్రను వారి త్యాగాలను గుర్తుంచుకోవాలని మర్చిపోతే మాత్రం మానవ మనుగడకు భవిష్యత్తు కష్టతరం అవుతుందని , ” నాకోసం పనిచేస్తే నాలోనే ఉండిపోతావు – జనం కోసం పనిచేస్తే జనంలో ఉండిపోతావ్ అని అన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ ప్రాంతంలోని ఖిలషాపూర్ అనే గ్రామంలో జన్మించారని పశువుల కాపరిగా ఉంటూ రాజుల సైన్యాలను వారి ఆగడాలను ఎదిరించి, అరికట్టి ఉమ్మడి హక్కుల కోసం పోరాడారని , అన్యాయాలను ఎదిరించిన ఆయన జీవిత చరిత్ర మనకు ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో గౌడ్ అన్నలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యల పరిష్కరించడం కొరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించేటట్లు చూస్తానని పేర్కొన్నారు.
మహనీయుల విగ్రహాలను త్వరలో ఏర్పాటు చేయుటకు, బీసీ భవన్ ఏర్పాటు చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వం బి.సి. రిజర్వేషన్ 42 శాతం అమలు కు కట్టుబడి ఉందని ,
బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలనీ ఈ సందర్భంగా మంత్రి కోరారు.
ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులకు కాటమయ్య 100 రక్షక కవచాలను మంత్రి అందచేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, ఆర్డీఓ వెంకటేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, ఎక్సైజ్ సి ఐ సుధీర్ కుమార్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఇంచార్జీ సర్దార్ సింగ్, బి.సి. కులస్థులు,
బి.సి. సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

నేషనల్ ర్యాంకర్ ను సన్మానించిన సామాజిక సేవా కార్యకర్త

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-44-2.wav?_=3

నేషనల్ ర్యాంకర్ ను సన్మానించిన సామాజిక సేవా కార్యకర్త

పలమనేరు(నేటి ధాత్రి)

పలమనేరు పట్టణానికి చెందిన, భాగీరధి లక్ష్మీపతి కుమారుడు శశి శ్రీనివాస్ అటు సీఎంఏ, సీఏ లో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన విషయం తెలిసిందే.
చిన్నప్పటినుంచి చదువులో చురుకుగా ఉంటూ. పదవ తరగతి నుండి, ఏడుసార్లు జాతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థి ప్రతిభను గుర్తించి….
పలమనేరు సామాజిక సేవా కార్యకర్త, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ నేషనల్ సెక్రెటరీ మధు మోహన్ రావు, ఈరోజు, ఆ అబ్బాయిని స్థానిక ఆంజనేయ స్వామి దేవస్థానంలో సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా మధుమోహన్రావు మాట్లాడుతూ…పలమనేరు ఖ్యాతిని జాతీయస్థాయిలో తీసుకువెళ్లి, మూడుసార్లు కలకత్తాలో, ఒకసారి చెన్నైలో, మొన్నటికి మొన్న ఢిల్లీలో రాష్ట్రపతి వద్ద అవార్డు తీసుకున్న ఇటువంటి విద్యార్థిని, మంచి ప్యాకేజీలో సెలెక్ట్ అయిన విద్యార్థిని సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నానని, చదువుతున్న విద్యార్థులందరూ…ఈ అబ్బాయిని రోల్ మోడల్ గా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారుసామాజిక సేవ చేస్తున్న నేను,ఇకపై,
ఈ విధంగా ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులను సన్మానిస్తానని, ఈ సందర్భంగా మధుమోహన్రావు తెలియజేశారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-40-1.wav?_=4

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

తొర్రుర్ డివిజన్ నేటి ధాత్రి

తెలంగాణ, ముఖ్యంగా గౌడ సామాజిక వర్గానికి గర్వంగా నిలిచిన బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆగస్టు 16, 2025 (శనివారం)న వైభవంగా ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా మోకు దెబ్బ కార్యదర్శి మెరుగు మల్లేశం గౌడ్ గారు ప్రతి గౌడ బిడ్డ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేక పిలుపునిచ్చారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ – ప్రేరణాత్మక జీవితం
17వ శతాబ్దాది చివరి, 18వ శతాబ్దాది మొదటిబాగంలో (1650–1710) జనగామ జిల్లా, ఖిలాషాపూర్ గ్రామంలో గౌడ్ కుటుంబంలో పుట్టిన పాపన్న.

తండ్రి నాసగోని ధర్మన్న గౌడ్, తల్లి సర్వమ్మ. చిన్నతనం నుంచే సామాజిక సమస్యలను గమనించే శీలం.

ధూళిమిట్ట శాసనం ప్రకారం తన జననం “ఆగస్టు 18, 1650″గా గుర్తించబడింది.

గౌడ వృత్తిని స్వీకరించిన అతను, తాటిచెట్లు ఎక్కి (కలాలి) కల్లు గీయడంలో ప్రావీణ్యం గలవాడు.

పశువులను కాస్తూ, చుట్టుపక్కల గ్రామస్తులతో సామరస్యాన్ని పాటిస్తూ అభినవ దళిత & బహుజన ఉద్యమానికి నాయకుడుగా ఎదిగాడు.

పాపన్న గొప్పతనం, పోరాటం
అగ్రకులాల ఆధిపత్యం, జమీందార్ల అరాచకపు పాలనకు వ్యతిరేకంగా తన సిద్ధాంతాలు, ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు.

స్వీయ సైన్యంతో దాదాపు 20 కోటలను జయించాడు; గోల్కొండ కోటను స్వాధీనపర్చుకుని 7 నెలలు పరిపాలించాడు.
మొగలయ్యిన అధికారులను తెలంగాణ లో తొలిసారి ఎదుర్కొన్న బహుజన నాయకుడు పాపన్న గౌడ్.
బహుజనుల ఏకత్వం, మత-కుల-వర్గ వైషమ్యాలు లేకుండా సాగిన రాజ్యానికి ఆయనే పరిచయమిచ్చిన గొప్ప చక్రవర్తి.
విగ్రహావిష్కరణ కార్యక్రమం మహత్యం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇది గౌడ జాతి గర్వానికి, అనేక తరాల పాపన్న ఆశయాలకు కొత్త ప్రేరణనిచ్చే వేడుకగా నిలుస్తుంది.
ప్రతి గౌడ బిడ్డ, గౌడ కుటుంబం, బహుజన సమాజం పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను గౌడ జాతి మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలు కూడా స్మరిస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణ సంస్కరణాత్మక చాయలను ప్రజల్లోకి చాటిచెప్పే అవకాశం. పాపన్న తొలి బహుజన రాజ్యాన్ని స్థాపించి, సామాన్య ప్రజానీకానికి న్యాయం అందించేందుకు చేసిన పోరాటం అందరికీ ఆదర్శంగా నిలవాలి.
ఈ కార్యక్రమంలో ప్రతి గౌడ బిడ్డ, సామాజిక భావాలుతో మహబూబాబాద్ జిల్లా యువత పాల్గొనాలి

ఒకవైపు రక్షకభటుడు, మరొకవైపు రచయిత..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-20-5.wav?_=5

ఒకవైపు రక్షకభటుడు, మరొకవైపు రచయిత
కానిస్టేబుల్ ముడారి సాయి మహేష్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణానికి చెందిన కానిస్టేబుల్ ముడారి సాయి మహేష్ ఒకవైపు రక్షక భటుడిగా,మరొకవైపు రచయితగా ఎదుగుతూ అనేకమైన అంశాలపై సాహిత్యంలో పెన్నును,గన్నుగా చేస్తూ రానిస్తున్నటువంటి సాయి మహేష్ సమాజంలో జరిగే అంశాలను తన లోతుల వైపు చూస్తూ గన్నును పెన్నుగా మారుస్తూ సమాజ శ్రేయస్సుకు వివిధ అంశాలతో కూడిన కవిత్వాన్ని క్రూడీకరించి విశ్లేషించి అనేక అంశాలను కవితలుగా మార్చి సమాజాన్ని తట్టు లేపుతున్నటువంటి ముడారి సాయి మహేష్ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా
రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి సభ్యులు గా మరియు అనేక అవార్డులు రివార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి ముడారి సాయి మహేష్. అంతేకాకుండా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భముగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ సేవా పథకం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ చేతులమీదుగా,,జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మరియు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే చేతుల మీదుగా అందుకోవడం విశేషం. అలాగే జిల్లా కవులు రచయితలు, రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, బురదేవానందం,అంకారపు రవి ,గుండెల్ని వంశీ కృష్ణ, మొదలైన సాహితీ మిత్రులు అభినందించారు.

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలి.

 

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలి

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు.

నర్సంపేట,నేటిధాత్రి:

భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి
విముక్తి కోసం సంఘం కట్టి బడిసెలు పట్టి బాంచన్ నీ కాళ్లు మొక్కుతా అన్న చేతులతో బందుకులు ఎక్కుపెట్టి మట్టి మనుషులు చేసిన చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని ఆయన
స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు పిలుపునిచ్చారు. దొడ్డి కొమురయ్య 59వ వర్ధంతిని సీపీఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.అయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య బలిదానం కొలిమోలే రాజుకుంది.భూస్వాముల ఆగడాల్నీ కాల్చి బూడిద చేసింది. దొడ్డి కొమురయ్య అక్షరాస్యడు కాదు. మార్క్స్ ను చదవలేదు, మావోను అధ్యయనం చేయలేదు. కానీ వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అగ్గి రాజేశాడని వర్ణించారు. అప్పటికే జాగీర్దార్ల, జమీందార్ల, దేశముఖ్ ల ఆగడాలతో విసిగి వేసారిన తెలంగాణ పల్లెలు ఆవేదన, ఆగ్రహంతో లావాలా కుతకుత ఉడికి పోతున్నాయి. ముఖ్యంగా విస్నూర్ దేశముఖ్, రాపాక రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు బాబు దొర అరాచకాలు పల్లెలను నిద్ర లేకుండా చేసాయి.దొరల అణిచివేతకు,అరాచకాలకు వ్యతిరేకంగా,కౌలు,లెవీ రద్దు చేయాలని,కూలిరేట్లు పెంచాలని, పేదలకు భూములు పంచాలని, వెట్టిచాకిరి నిర్మూలించాలని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజా పోరాటాలు పెరిగాయని పేర్కొన్నారు. నిరసన ప్రదర్శనలు, సభలు, వినతులు వంటి ప్రజాస్వామిక పద్ధతులలో పోరాటాలు జరుగుతున్నాయి. అలాంటి ఒక ప్రజా నిరసన ప్రదర్శన 1946, జూలై 4న విస్నూర్ దేశముఖ్ ఇలాకాలోని కడవెండి గ్రామంలో ప్రారంభిమైంది. విస్నూర్ రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ గడి ముందుకు ప్రదర్శన చేరగానే, ఆయన గూండాలు ప్రదర్శనకారులపై కాల్పులు జరిపారు. ప్రదర్శనలో ముందు వరుసలో ఉన్న దొడ్డి కొమురయ్య తుపాకీ గుళ్ళకు బలయ్యాడని బాబు తెలిపారు.ఈ వార్త దావానలంలా తెలంగాణ పల్లెలన్నీ ఆవహించింది.ప్రజల్లో అప్పటికే రగులుకొంటున్న అసంతృప్తి ఒక్క ఉదుటున పెల్లుబికింది. ఆగ్రహంతో కుతకుత ఉడుకుతున్న అగ్ని పర్వతం కడవెండిలో బద్దలైందన్నారు.ఈ నేపథ్యంలో కొమురయ్య బలిదానం తెలంగాణను కొలిమోలే రాజేసింది.ఊరూరా ప్రతిఘటన పోరాటాలు ఉవ్వెత్తునలేచాయి. భూస్వాముల గూండాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు గొడ్డలి, పార, పలుగు, గుతుపకర్ర, వడిశెల వంటి వ్యవసాయ పనిముట్లను ఆత్మరక్షణ ఆయుధాలుగా మలుచుకున్న క్రమంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటరూపం తీసుకున్నదని పేర్కొన్నారు.కాగా ఈ పోరాటంలో భూస్వాముల గడీలు నేలమట్టమయ్యాయి. దొరలు పల్లెలిడిచి పట్నంకు పరుగు తీసిండ్లు. వేలాది గ్రామాలు భూస్వాముల పాలన నుండి విముక్తి చెందాయన్నారు.ఆ పోరాటం ముందుకుతెచ్చిన ఎంజెడా ఇంకా మిగిలే ఉందన్నారు. మరోవైపు దేశంలో కార్పొరేట్ శక్తుల, మతోన్మాదుల కూటమి దేశాన్ని పట్టిపీడిస్తున్నదని,ప్రజా వనరులన్నిటిని దోచి బడా పెట్టుబడిదారుల ఖజానా నింపుతున్నదని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, పరికి మధుకర్ పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ మండల, పట్టణ నాయకులు బుర్రి ఆంజనేయులు, పుచ్చాకాయల నర్సింహా రెడ్డి, నాయకులు లక్క రాజు, తోటకూరి రాజేష్, కందికొండ సంతోష్, వీరన్న, ప్రశాంత్, నర్సింహారాములు తదితరులు పాల్గొన్నారు.

మీరే నాకు స్ఫూర్తి.

మీరే నాకు స్ఫూర్తి

 

నేతిధాత్రి:

 

 

శేఖర్‌ కమ్ముల సినీ పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. చిరంజీవిని తన స్ఫూర్తిగా పేర్కొంటూ శేఖర్‌ కమ్ముల సోషల్‌ మీడియా ద్వారా భావోద్వేగాలను పంచుకున్నారు.

చిరంజీవిని కలసిన శేఖర్‌ కమ్ముల

ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల చిత్ర పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. ‘25 ఇయర్స్‌ ఆఫ్‌ శేఖర్‌ కమ్ముల’ సెలబ్రేటింగ్‌ ది సోల్‌ ఆఫ్‌ స్టోరీ టెల్లింగ్‌ అనే పోస్టర్‌ని చిరంజీవి ఆవిష్కరించి, అభినందించారు. ఈ విషయాన్ని శేఖర్‌ కమ్ముల సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. ‘టీనేజ్‌లో ఉన్నప్పుడు మెగాస్టార్‌ చిరంజీవిని ఒకసారి దగ్గర నుంచి చూశాను. ఈయనతో సినిమా చేయాలనే భావన కలిగింది. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అవుతోంది. దీనిని సెలెబ్రేట్‌ చేసుకుందామని మా టీమ్‌ అనగానే వెంటనే నాకు గుర్తొచ్చింది చిరంజీవి గారే. కొన్ని తరాల వారిలో స్ఫూర్తి నింపిన వ్యక్తి ఆయన. కలలను వెంటాడితే విజయం తప్పకుండా మనల్ని అనుసరిస్తుందని నమ్మకం కలిగించింది ఆయనే. నా ఈ 25 ఏళ్ల వేడుకను ఆయన సమక్షంలో చేసుకోవాలనిపించింది. థాంక్యూ సర్‌. ఈ క్షణంలోనే కాదు నా టీనేజ్‌ నుంచి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు’ అని శేఖర్‌ కమ్ముల ఆ పోస్టులో పేర్కొన్నారు. చిరంజీవితో కలసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

రాజీవ్ గాంధీ జీవితం అందరికీ ‌ స్ఫూర్తిదాయకం.

రాజీవ్ గాంధీ జీవితం అందరికీ ‌ స్ఫూర్తిదాయకం.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య.

చిట్యాల నేటిధాత్రి:

రాజీవ్ గాంధీ జీవితం అందరికీ
స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య అన్నారు .
చిట్యాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని శ్రీ ‌రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ .హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆధునిక దృష్టి కలిగిన భారత ప్రధానిగా టెక్నాలజీ. యువతపై .దృష్టి చారించి దేశాన్ని ఆధునిక రంగంలోకి నడిపించారు
ఆయన సామాన్య వ్యక్తి నుండి మహానాయకుడుగా ఎదిగిన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించారు. రాజీవ్ గాంధీ పేరిట స్థాపించబడిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ నేటికీ .విద్య ఆరోగ్యం .సామాజిక అభివృద్ధి కోసం కృషి చేస్తోంది ఆయన విధానాలు భారతదేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాయని తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చిలుకల‌ రాయకోంరు . చిట్యాల ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ మండల అధ్యక్షులు గుమ్మడి సత్యనారాయణ . సీనియర్ నాయకులు ‌ సరిగోమ్ముల సదయ్య . చిలుముల రాజమౌళి ‌ బుర్ర మల్లేష్. గుర్రపు తిరుపతి. బుర్ర కరుణాకర్ . ఆరేపల్లి నరసింహారాములు. శనిగరపు మొగిలి. గుర్రపు నరసయ్య.
తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ నేతపుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో ఉద్యమించాలి.

ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో ఉద్యమించాలి

 

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు

 

ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు..

 

నర్సంపేట, నేటిధాత్రి:

 

 

 

ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన పుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు పిలుపునిచ్చారు.

పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి వేడుకలు నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం దగ్గర సుందరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈసందర్బంగా సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెళ్లి బాబు మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు.

కులవ్యవస్థను నిరసించిన సుందరయ్య అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డిలోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడని కొనియాడారు.

సహచరులు పుచ్చలపల్లి సుందరయ్యను “కామ్రేడ్ పి.ఎస్.” అని పిలిచేవారని అన్నారు.

సుందరయ్య మార్క్సిస్ట్ పార్టీ నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపాడు.

స్వాతంత్ర్య సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు.

సుందరయ్య భార్య కూడా సీపీఐ-ఎంలోని ముఖ్య నాయకురాలు.

తెలంగాణ ప్రజల పోరాటం – దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు, నివేదికలు రాశాడు గొప్ప కమ్యూనిస్టు నాయకుడు అని పేర్కొన్నారు.

పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘ కాలం పనిచేసిన సుందరయ్య ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్లి ఆదర్శ కమ్యూనిస్ట్ పార్టీ నేతగా మన్నన్నలు పొందాడన్నారు.

నిజాం పాలన కాలంలో సాగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ఒక ముఖ్యమైన ఘట్టం.

ఆ పోరాటానికి నాయకత్వం వహించిన వాళ్లులో ముఖ్యులు సుందరయ్య అని ఆ పోరాటం చివరి దశలో 1948 నుండి 1952 వరకు సుందరయ్య అజ్ఞాతంలో గడిపాడని అన్నారు.

భూస్వామి విధానాలకు వ్యతిరేకంగా జాగిరిదారులకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన కమ్యూనిస్టు ఉద్యమనేత అని చెప్పారు. ఆ పోరాటంలో 10 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశారని ఈ సందర్భంగా గుర్తుకు చేశారు.

పేదల ఆకలి తీర్చేందుకు అంబలి కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు.

పేదల నిత్యవసర అవసరాలు తీర్చేందుకు పట్టణం నుండి తన సైకిల్ పై నిత్యవసర వస్తువులు తెచ్చి గ్రామంలో పేదలకు పంపిణీ చేసేవారని, పేదల కోసం ఆసుపత్రి ఏర్పాటు, యువకుల కోసం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారని వివరించారు.

1930 లోనే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి కుల వివక్షత వ్యతిరేకంగా పోరాడారన్నారు, ప్రజల భాగస్వామ్యంతో బందరు కాల్వ పూడిక తీసి రైతులకు మేలు చేశారన్నారు.

ఆనాడే కూలి సంఘం,కర్షక సంఘం, కార్మిక సంఘాలను స్థాపించారని గుర్తు చేశారు.

చివరి శ్వాస వరకు అను నిత్యం పేదప్రజల కోసం పోరాడిన సుందరయ్య పోరాట స్ఫూర్తిని పునికిపుచ్చుకొని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి,పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీది బాలకృష్ణ, కంది కొండ రాజు బేంబెలి మలహల్ రావు, కలకోట అనిల్, ఎండీ ఫరిదా, బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి,రుద్రరపు లక్ష్మి నాయకులు జగన్నాధం కార్తీక్, గణిపాక ఇంద్ర,యాక లక్ష్మి, ఎల్లయ్య, సంతోష్, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమ పార్టీ పోరాటాలకు స్ఫూర్తి.

ఉద్యమ పార్టీ పోరాటాలకు స్ఫూర్తి….. ప్రగతికి సాక్షి…బిఆర్ఎస్ .
చరిత్రలో నిలిచిపోయే సభ విజయోత్సవ సభ
తాజా మాజీ సర్పంచ్ గాలి చంద్రమౌళి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్లపల్లి మండలం అంకుషాపురం గ్రామంలో గురువారం మాజీ సర్పంచ్ గాలి చంద్రమౌళి అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన ఎలుకతుర్తి ఎక్స్ రోడ్డులో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రచతోత్సవ సభకు గ్రామంలో అధిక సంఖ్యలో హాజరై సభ విజయవంతం అయ్యేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని రానున్న రోజుల్లో బి. ఆర్. ఎస్. అధినేత కేసీఆర్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతున్నారని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రజల మద్దతుతో ముందుకు సాగేందుకు రెట్టింపు ఉత్సాహంతో సిద్ధమవుతుందని ఈ సభ కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదని ఇది ఒక విశాల సంకల్పానికి సంకేతమని ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటూ భవిష్యత్ దిశగా ప్రజలను నడిపించే ప్రయత్నం ఉద్యమం కాలం నుంచి సాధన వరకు మార్గ నిర్దేశ కుడిగా నిలిచిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పుడు భవిష్యత్తు తలుపులు తట్టేందుకు సిద్ధం అవుతున్నాడని తెలిపారు

భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమిద్దాం.

భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమిద్దాం….

సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

పరాయిపాలన నుండి భారతదేశ విముక్తి కోసం యుక్త వయసులోనే ప్రాణాలు త్రుణపాయంగా దేశ విముక్తి కోసం ప్రాణాలను ఇచ్చిన అమరులు సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు , సుఖదేవ్ ల త్యాగాల స్ఫూర్తితో సమ సమాజం కోసం దోపిడీ లేని కులమత రహిత సమాజం కోసం పాటుపడదామని, సమాజాన్ని ముందుకు తీసుకుపోయే యువత ఐక్యం కావాల్సిన అవసరం ఉందని రామకృష్ణాపూర్ సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి నక్క వెంకటస్వామి లు అన్నారు. భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, బీ జోన్ రాజీవ్ చౌక్ నుండి సూపర్ బజార్ చౌరస్తా వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరుల స్ఫూర్తితో సమ సమాజం కోసం కృషి చేద్దామని నాయకులకు,యువకులకు పిలుపునిచ్చారు.

Mittapalli Srinivas

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్, వెంకటస్వామి, వనం సత్యనారాయణ, పౌల్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version