ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆదర్శప్రాయం…

ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆదర్శప్రాయం
ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి

నేటి ధాత్రి, పఠాన్ చెరువు :

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి
ఆదర్శప్రాయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శివాజీ మహారాజ్ 396 వ జయంతినిపురస్కరించుకొని.. పటాన్చెరు మండలం భానూరు గ్రామంలో, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామాలలో శివాజీ మహారాజ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ తన పరిపాలనలో లౌకికవాదానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. శివాజీ అనుసరించిన పరిపాలన విధానాలు, వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. భవిష్యత్ తరాలకు శివాజీ ఆదర్శాలను అందించాలన్న లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాలు, పట్టణాల పరిధిలో సొంత నిధులతో విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, శంకర్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, రాజి రెడ్డి, శివాజీ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

హిందూ ఐక్యత వేదిక ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు.

హిందూ ఐక్యత వేదిక ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి మున్సిపాలిటీలో హిందూ ఐక్యత వేదిక ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించిన 396వ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవoగురువారం ఘనంగా జరిపారుఈ సందర్భంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పిoచారు.శివాజీ మహారాజ్ దేశభక్తి, మాట్లాడుతూ, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహావీరుడు, స్వరాజ్య స్థాపనకు పునాది వేసిన గొప్ప యోధుడు శివాజీ మహారాజ్ అని పేర్కొన్నారు. చిన్న వయసులోనే స్వరాజ్య స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.
మహిళలకు అత్యున్నత గౌరవం ఇచ్చిన పరిపాలకుడిగా, మత సామరస్యాన్ని కాపాడిన నాయకుడిగా, ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మహానుభావుడిగా శివాజీ మహారాజ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. గెరిల్లా యుద్ధ తంత్రానికి ఆద్యుడిగా, భారత నౌకాదళ పితామహుడిగా ఆయన సేవలను గుర్తుచేశారు.సనాతన ధర్మ పరిరక్షణ కోసం కోటలను నిర్మించి శక్తి సాధనకు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన సందర్భాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. భవానీ అమ్మవారి ఆశీర్వాదంతో ధర్మ స్థాపనకు కట్టుబడి పనిచేసిన మహానాయకుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు.యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయంతిని విజయవంతం చేశారు. ధైర్యసాహసాలు, పరిపాలనా దక్షత యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. వారి ఆశయాలు, త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. సమాజ సేవా కార్యక్రమాల ద్వారా మహనీయుల జయంతులను నిర్వహించడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

శివాజీ జయంతి వేడుకల్లో గజవాడ లావణ్య సత్కారం..

శివాజీ జయంతి వేడుకల్లో గజవాడ లావణ్య సత్కారం..

రామాయంపేట ఫిబ్రవరి 19 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గురువారం నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు చత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్యకు నిర్వాహకులు సత్కారం నిర్వహించారు.
జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ నవనీతతో పాటు పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తి, పరిపాలనా నైపుణ్యం నేటి తరానికి ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. సమాజంలో స్వాభిమానం, స్వాతంత్ర్య భావాలు పెంపొందించడంలో శివాజీ పాత్ర చిరస్మరణీయమని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా గజవాడ లావణ్య మాట్లాడుతూ, శివాజీ చూపిన స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పట్టణాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మున్సిపాలిటీ కృషి చేస్తోందని తెలిపారు. యువత శివాజీ ఆదర్శాలను ఆచరణలో పెట్టాలని సూచించారు.
కార్యక్రమం ముగింపులో శివాజీ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సి లర్లు గజవాడ నాగరాజు. దేవుని రంజిత్. రవి.డాకి స్వామి. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి. చింతల యాదగిరి. ఎనీశెట్టి అశోక్. రాధా కిషన్ బొందుగుల రాజు. తదితరులు పాల్గొన్నారు.

నల్లగండ్లలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు…

నల్లగండ్లలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
​ శివాజీ మహారాజ్ పరాక్రమం అందరికీ స్ఫూర్తిదాయకం: పల్లపు సురేందర్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి

నల్లగండ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లపు సురేందర్ ఆధ్వర్యంలో స్వరాజ్య స్థాపకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా పల్లపు సురేందర్ మాట్లాడుతూ.. హిందూ ధర్మ రక్షకుడిగా, అపార ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన శివాజీ మహారాజ్ దేశభక్తి మనందరికీ ఆదర్శమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ముఖ్యంగా యువత శివాజీ జీవితం నుంచి స్ఫూర్తి పొంది సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, ధైర్యం కలిగిన సమాజం కోసమే శివాజీ నిరంతరం శ్రమించారని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో నల్లగండ్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఛత్రపతి శివాజీ విగ్రహానికి భూమి పూజ, శోభయాత్ర…

ఛత్రపతి శివాజీ విగ్రహానికి భూమి పూజ, శోభయాత్ర

నిజాంపేట: నేటి ధాత్రి

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకొని నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో శివాజీ విగ్రహానికి భూమి పూజ , శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శివాజీ హిందూ మత స్థాపన కోసం పోరాటం చేసిన మహా యోధుడని కొనియాడారు. శివాజీ సేవలు మాటల్లో చెప్పలేనివని కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్, ఉప సర్పంచ్ దేవరాజ్ యాదవ్, మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, వార్డ్ సభ్యులు, చత్రపతి శివాజీ సభ్యులు, గ్రామ పెద్దలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

చత్రపతి శివాజీ ని ఆదర్శంగా తీసుకోవాలి…

చత్రపతి శివాజీ ని ఆదర్శంగా తీసుకోవాలి

* విగ్రహ ఆవిష్కరణలో మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

యువత చత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా తుంకుంట మున్సిపాలిటీ మందయిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ఉమా ఆంజనేయులు, రాజ్ కుమార్ యాదవ్, బిఆర్ఎస్ అధ్యక్షుడు పాముల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ నాలుక యాదగిరి, కృష్ణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మందాయపల్లి వాసులు, యువకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version