గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమీక్ష…

గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమీక్ష

జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు బుధవారం ఆకస్మికంగా సందర్శించారు.అందుబాటులో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.అలాగే ఎంపీడబ్ల్యూ వర్కర్లను వార్డుల వారిగా విభజించి చెత్త సేకరించాలని తెలిపారు.ప్రతిరోజు అన్ని గ్రామ పంచాయతీలలో విధిగా పనులను నిర్వహించాలని,ఎక్కడ కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా చూడాలని,సేగ్రిగేషన్ షెడ్ లలో వర్మి కంపోస్ట్ ఎరువును తయారు చేపించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.ఇంటి పన్ను వాసులలో ఇప్పటివరకు 29% మాత్రమే చేశారని,నవంబర్ 25వ తేదీలోపు 100% ఇంటి పన్ను వసూలు చేయాలని లేనియెడల తగు చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ బాపూరావు,పంచాయతీ కార్యదర్శులు బి.ఉదయ్ కుమార్,ఆర్.శ్రావణి ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ…

కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ

వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పారదర్శకంగా పంపిణీ పూర్తి చేయాలని ఆదేశం

హైదారాబాద్/వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయం అని గుర్తు చేశారు.ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు సచివాలయం నుండి సీఎం తో కలిసి వీ.సీలో భాగస్వాములవగా, వరంగల్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని,నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలన్నారు. పండగ వాతావరణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరగాలని, మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో చీరల పంపిణీ చేపట్టాలని సూచించారు. పూర్తి వివరాలతో ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు అందేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని,
గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వివాదాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా, వాటికి మహిళలను యజమానులను చేశామని, స్కూల్ యూనిఫారంలు కుట్టే కుట్టుపని బాధ్యత మహిళా సంఘాలకే అప్పగించామని, ఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఆన్ లైన్ మార్కెట్ కోసం అమెజాన్ తో సంప్రదింపులు చేస్తున్నామని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ రామిరెడ్డి , మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులు, డిపిఎం, ఏపీఎం లు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు…

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

మహాదేవపుర్ నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి మహాదేవపూర్ మండల కేంద్రంలోని
పేదల అభ్యుదయం, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూపాల్ పల్లి గ్రంథాలయ సంస్థ చైర్మను కోట రాజబాబు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేకు కట్ చేసి నేతలకు తినిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశసేవకై తన జీవితాన్నే అంకితం చేసిన ఉక్కు మహిళ దేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ అని అన్నారు. ఆ మహనీయురాలి జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. నిరుపేదల ముంగిటకు బ్యాంకు సేవలను తీసుకువచ్చేందుకు బ్యాంకులను జాతీయం చేశారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి కార్యక్రమానికి ఇందిరాగాంధీ పథకాలు ఆదర్శమన్నారు. గత ప్రభుత్వ పాలనలో గృహ నిర్మాణ కార్యక్రమం కనుమరుగు అయిందని, కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం, ఉచిత గృహ విద్యుత్ అందించి అండగా నిలిచిందన్నారు. ఇందిరా గాంధీ ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలనిపిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ కోట సమ్మయ్య కడార్ల నాగరాజు ఐత తిరుపతిరెడ్డి బుర్రి శివరాజు, మోతే సాంబయ్య, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు

తంగళ్ళపల్లిలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూల నివాళులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా అమూల్యమైన సేవలు అందించిన స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నివాళులర్పిస్తూ జయంతి వేడుకలనుఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పిస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఆమె దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి దేశంలోని ప్రతి గ్రామంలో పేదలందరికీ గృహ నిర్మాణాలు చేపట్టి ప్రతి ఒక్కరు నిరుపేదలు ఉండకూడదనే ఉద్దేశంతో దేశంలో అందరి ప్రజలకు అనుకూలంగా సంక్షేమ పథకాలు తీసుకువచ్చి. సంస్కరణల విప్లాత్మకమై న.సమసమాజ. స్థాపనను అమలు చేశారని.భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో భారత దేశపు పేరు ప్రఖ్యాతలు నిలబెట్టారని. ఆమె భారత. ఉక్కు ప్రధానిగా దేశంలోని. ప్రజలకు ఇతర నాయకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కొని ఆడారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్. జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి. తంగళ్ళపల్లిమాజీ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి. మునిగలరాజు. మచ్చ శ్రీనివాస్. సామల గణేష్. గుగ్గిళ్ళ భరత్ గౌడ్.రా పెళ్లి ఆనందం. మోర లక్ష్మీరాజo. మైనార్టీ నాయకులు

వర్ధన్నపేటలో ఘనంగా ఇందిరా గాంధీ 108వ జయంతి వేడుకలు..

వర్ధన్నపేటలో ఘనంగా ఇందిరా గాంధీ 108వ జయంతి వేడుకలు

వర్ధన్నపేట.(నేటిధాత్రి):

 

వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం,టౌన్ ప్రసిడెంట్ మైస సురేష్ గారి అధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ 108 వ జయంతి. కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఆ మహనీయురాలు చిత్ర పటానికి దండ వేసి పూలు చల్లి ధన్యవాదాలు తెలుపడం జరిగింది.మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, వర్ధన్నపేట టౌన్ ప్రసిడెంట్ మైస సురేష్,ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్ లు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు, దళితులతో పాటు మైనార్టీలంతా .దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన మాజీ ప్రధాని ఇందిర గాంధీ 1966 లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి అయిన నాటికి దేశములో ఆర్థిక మాంద్యం,పారిశ్రామిక ఉత్పత్తుల పతనం,ఎగుమతులు తగ్గడం,ఆహార ధాన్యాల సంక్షోభం ఏర్పడ్డాయి. వీటితో పాటు బడ్జెట్ డేపిసిట్ పెరగడం,విదేశీ ఆర్థిక సాయంపై ఎక్కువగా ఆధారపడటం వంటివే గాక 1962,1965 నాటి యుద్ధాలు, పాకిస్థాన్,చైనా కూటమి ఏర్పాటులో సైన్యం పై ఖర్చు పెంచడం వంటివి జరిగాయి వర్షాలు లేక కరువు ఏర్పడింది.ధరలు పెరిగాయి,పాలన ఖర్చులు తగ్గించుకోవడం వీలుపడలేదు అయినా యుద్ధ ప్రాతిపదికన ఆహార ధాన్యాలు సేకరించి ప్రజలకు పంచి, వారి ప్రాణాలను కాపాడగలిగారు.1970 లో అనేక దేశాలు ఆయిల్ సంక్షోభంలో కొట్టుమిట్టాడిన భారత్ ను మాత్రం ఆ సమస్య నుంచి ఇందిర కాపాడగలిగారు.అదేవిధంగా దేశములోని పేదరికాన్ని ప్రారదోలాడానికి గరిభి హేట్టావో , 20 సూత్రాల పథకంప్రవేశ పెట్టడమే కాకుండా బ్యాంకులన జాతీయకరణ, రాజభరణాలు రద్దు చేసి ఆదూకున్న ఘనత ఇందిర గాంధీ గారిది.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు మరుపట్ల అరుణ, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కుల్ల యాకంతం, ఐనవోలు టెంపుల్ డైరెక్టర్ గుం టి కుమార స్వామి సీనియర్ నాయకులు గుజ్జ రవీందర్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ నంబర్ ఎండి అన్వర్,రాజా రాజేశ్వర టెంపుల్ చైర్మన్ మైదం బుచ్చి మల్లు,గడ్డం సమ్మయ్య గౌడ్, దమ్మన్నపేట మాజీ సర్పంచ్ మనోహర్ రెడ్డి,ల్యాబర్తి,అంబేద్కర్ నగర్ ,ఇల్లంద గ్రామ పార్టీ ల అధ్యక్షులు చిదుముల్ల భాస్కర్,సింగపురం ఎలియాస్,ఎద్దు రాజేంద్ర ప్రసాద్,మహిళా నాయకురాండ్లు ,లింగం రజిత రెడ్డి,,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మల్లెపాక సమ్మయ్య,,మరుపట్ల సాయికుమార్,దికొండ ఉపేందర్, సంకినేని దేవేందర్ రావు,రావుల గంగయ్య,గంగరాజు, ,,చిటూరి రాజు, ,ఒగ్గుల మాధవి,బెజ్జం పాపారావు, కట్రియా ల టెంపుల్ చైర్మన్ కట్ట వెంకటయ్య, చిర బోయిన రాజు,మెరుగు రమేష్,తుమ్మల కుమారస్వామి, రాకేశ్ ముదిరాజ్ బండారి యాకయ్య,సంతోష్ ,యాకయ్య,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version