ప్రవేటు కళాశాల లోపెండింగులో ఉన్న ఫీజు రియoబర్స్ స్కాలర్ షీప్ లు చెల్లించాలి సుమన్ వనపర్తి నేటిదాత్రి .
రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియ oబర్స్ స్కాలర్ షిప్ లు మంజూరు చేయాల ని తెలంగాణ దళిత రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపకులు అధ్యక్షులు గంధం సుమన్ మాదిగ అన్నారు ప్రైవేట్ కాలేజీ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ వెనుకబడ్డ పేద విద్యార్థులు అన్ని కోర్సులు చదువుకుంటున్నారని అన్నారు రాష్ట్రంలో విద్యాసంస్థల యజమాన్యంతో చర్చలు జరపి విద్యార్థులకు భవిష్యత్తు అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు
స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండలం లోని చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్వర్యంలో జూకల్ లక్ష్మీ విద్యానికేఆతన్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కవి రచయిత మ్యాదరి సునీల్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అంద జేయడం జరిగిందని తెలిపారు, ఈ కార్యక్రమ నికి ముఖ్య అతిథిగా తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్ పాల్గొని ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు అందించడం అభినందనీయం అని అన్నారు , అనంతరం మాజీ ఎంపీటీసీ జంబుల తిరుపతి ,మాజీ సర్పంచ్ పుట్టపాక మహేందర్ , నూనె స్వామి , కసిరెడ్డి మహేందర్ చేతుల మీదుగా ఉపాధ్యాయులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్వర్యంలో ఉపాధ్యాయులకు వారు చేసిన విశిష్ట సేవలకు ఈ పురస్కారాలు ఇవ్వడం జరిగింది అని చేయూత పౌండర్ మ్యాదరి సునీల్ తెలిపారు ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి వేమునూరి ధనలక్ష్మీ గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్ గారు మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయికి దీటుగా కంప్యూటర్ ప్రొజెక్టరులతో విద్యాను అందించే పాఠశాల మీ ఊరిలో ఉండడం గర్వకారణం అని కొనియాడారు ఈ సందర్భంగా చేయూత పౌండేషన్ వారు ఇలాంటి విద్యాసంస్థలను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఇవ్వడం అభినందనియం అని అన్నారు.
జిల్లాస్థాయి లో అవార్డు స్వీకరించిన భూమేశ్వర్ కు ఘన సన్మానం. మల్లాపూర్ సెప్టెంబర్ 12 నేటి దాత్రి
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న భూమేశ్వర్ ఉపాధ్యాయుడు ఇటీవలే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ఘన సన్మానం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని విలువలను వినయాన్ని నేర్పుతూ ప్రజల మనసును చూరగొన్న భూమేశ్వర్ నిజంగా అభినందనీయుడని అవార్డుకు తగిన వ్యక్తిగా సరిపోతాడని ఈ అవార్డు మరింత బాధ్యత పెంచుతుందని రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు కైవసం చేసుకొని మా పాఠశాలకు పేరు తీసుకురావాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయి, విష్ణువర్ధన్ రాజు శ్రీధర్ గౌడ్ కొండ గణేష్ దువ్వ నవీన్ నాగభూషణం మహేష్ రమణ ముజాబీర్ మెలికూర్ రెడ్డి వందన తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు మోట్లపల్లి ఉన్నత పాఠశాలలో.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ స్థాయి సమావేశము ప్రధానోపాధ్యాయులు శ్రీ కుమారస్వామి అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభను ఉపన్యాసాల రూపంలో మరియు కవితల రూపంలో నృత్య రూపంలో పాటల రూపంలో ప్రదర్శించినారు ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ హిందీ మన భారత దేశ రాజభాషగా 1949 వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన భారత రాజ్యాంగంలో గౌరవించడం జరిగినదని హిందీ మన భారత దేశ సంస్కృతిలో భాగమని మన భారతదేశంలో హిందీ మాట్లాడేవారు తెలిసినవారు అత్యధికమైన వారు ఉన్నారని స్వాతంత్ర సంగ్రామంలో దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ఈ భాష ఎంతగానో తోడ్పడిందని మహాత్మా గాంధీ గారు దేశమంతా తిరుగుతూ స్వతంత్ర అవసరాన్ని ప్రజలందరికీ తెలియజేయడంలో హిందీ భాషలోనే ప్రజల్ని పోరాటంలో పాల్గొనేలా హిందీ నే అధిక ప్రాధాన్యత పొందిందని తెలియజేశారు అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భూపాలపల్లి జిల్లా హిందీ ఫోరం అధ్యక్షులు శ్రీ నోముల రవీందర్ గారు మాట్లాడుతూ హిందీ మన రాష్ట్రంలో ద్వితీయ భాషగా అమలులో ఉన్నదని హిందీని నేర్చుకోవడం ద్వారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా రాణించవచ్చునని హిందీ ద్వారా వివిధ రకాల విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా బ్యాంకుల్లో రైల్వేలో విమానయాన సంస్థల్లో ఆర్మీలో నేవీలో మరియు సమాచార రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు
* ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు.
చేవెళ్ల, నేటిధాత్రి:
చేవెళ్ల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు జి. వెంకటరమణకుమార్. ఎం. సంతోషి ఉపాధ్యాయులు విద్యారంగంలో వారు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా జిల్లా విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయులకు వారి సేవలను గుర్తించి ఉత్తమ పురస్కారాలను అందించింది. చేవెళ్ల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ సాంఘీకశాస్త్రంలో ఉత్తమ సేవలు అందించిన జీ.
వెంకటరమణకుమార్ కలెక్టరేట్ లో బుధవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. గురువారం చేవెళ్ల మున్సిపల్ పట్టనకేంద్రంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేవెళ్ల మండల ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా ఉపాధ్యాయురాలు సంతోషి మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.
గణిత శాస్త్రంలో ఉత్తమ సేవలు అందించిననందుకు ఈ పురస్కారం దక్కింది. ఉత్తమ పురస్కారాలు అందుకున్న వెంకటరమణకుమార్, సంతోషి ఉపాధ్యాయులను, ఎంఈఓ పురందాస్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు నర్సింహా, సుధాకర్, శృతి, అలివేలు రజిత, అరుణ, అనిత పలువురు ఉపాధ్యాయులు మాజీ ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించి ప్రశంశించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, మాట్లాడుతూ తమ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు అందుకోవటం అభినదనీయమని అన్నారు. ఒక ఉపాధ్యాయుడిగా ఆయన సాధించిన విజయాలు ఒక్క రోజులో వచ్చినవి కావు, అవి ఆయన పట్టుదల, నిరంతర కృషికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో
నర్సంపేట పట్టణంలోని బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఈసం నారాయణ మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడా,సాంస్కృతిక రంగాలలోనూ రాణించాలని సూచించారు. ఈ లక్ష్య సాధనకు ఎన్ఎస్ఎస్ ఒక అద్భుతమైన వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. దేశాభివృద్ధికి ఆటంకాలైన మూఢనమ్మకాలు,నిరక్షరాస్యత,డ్రగ్స్ వంటి దుష్ప్రవర్తనలను సమాజం నుండి పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ మోర్తాల రామరాజు మాట్లాడుతూ నూతన విద్యార్థులు తప్పనిసరిగా ఎన్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకుని యూనివర్సిటీ నిర్వహించే వివిధ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని కళాశాలకు పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్,అధ్యాపకులు రవీందర్, బిక్షపతి,రాజ్‌కుమార్,మధు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన నిర్మల లక్ష్మి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన ఝరాసంగం మండలం కస్తూరిభాయి పాఠశాల స్పెషల్ ఆఫీసర్ నిర్మల సి ఆర్ టి లక్ష్మి కి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది.
అని,అజ్ఞానమనే చీకటిని ఫారద్రోలే వెలుగు చదువు అని తెలియజేశారు.మండలం స్థాయి లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన సందర్బంగా ఎస్ ఎస్ ఏ సంగారెడ్డి శాఖ పక్షాన శుభాభినందనలు. తెలిపారు,
దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది …గురు దేవో భవ ….! … మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు
రాయికల్, సెప్టెంబర్ 5, నేటి ధాత్రి:
దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని ఆ భవిష్యత్తు ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉందని మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు అన్నారు.శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికల్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 10 మంది ఉపాధ్యాయులను సాలువా మెమొంటోతో ఘనంగా సన్మానించారు.భారతరత్న అవార్డు గ్రహీత,మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను వివరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులను సమాజంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చి దిద్దేది గురువులేనని అలాంటి ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించడం అభినందనీయమన్నారు.ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధించే పాఠాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తాయన్నారు.తల్లిదండ్రుల కన్న ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతోనే విద్యార్థులు భవిష్యత్తులో సరైన మార్గాన్ని ఎంచుకుంటారన్నారు.ఉపాధ్యాయులు గ్రామంలోని బాలబాలికలకు విద్య అందించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు పాటుపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొత్తపెళ్లి రంజిత్,డిసి బత్తిని భూమయ్య,కోశాధికారి బెక్కెం తిరుపతి,లయన్స్ క్లబ్ సభ్యులు మచ్చ శేఖర్,దాసరి గంగాధర్,ఆడెపు రాంప్రసాద్,ఎర్ర సుమన్,జిల్లాల సూర్యం రెడ్డి,సాంబారు శ్రీనివాస్,ఉపాధ్యాయులు కుంభాల శ్రీనివాస్,రాపర్తి నర్సయ్య,కడకుంట్ల అభయ్ రాజ్,బెజ్జంకి హరికృష్ణ,ఆడెపు సుజాత,మచ్చ చంద్రకళ,ధ్యావన పెళ్లి సురేందర్, పుర్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం జిల్లా మినరల్ డవలప్మెంట్ నిధులు సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో పలు శాఖల జిల్లా స్థాయి అధికారులతో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డిఎంఎఫ్టి మేనేజింగ్ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యత కలిగిన రంగాలకు డిఎంఎఫ్టి నిధులు సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని అన్నారు. పారిశ్రామికీకరణ వల్ల ప్రభావితం అవుతున్న ప్రాంతాలలో ప్రజలకు మౌలిక సదుపాయాలైన ఆరోగ్యం, విద్య, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్య, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని నిధులు వినియోగించాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి, పారదర్శకతతో అమలు చేయాలని సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి డి.ఎం.ఎఫ్.టి మేనేజింగ్ కమిటి సమావేశాలు నిర్వహించాలని అలాగే, ఇప్పటికే మంజూరైన పనుల పురోగతిని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. చేపట్టిన పనులలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారు లను ఆదేశించారు. నిధుల వినియోగంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సీపీఓ బాబూరావు, మైనింగ్, సంక్షేమ, వ్యవసాయ, విద్యా, వైద్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
హాజరైన బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్.రాజేంద్రప్రసాద్ రెడ్డి
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని బిట్స్ పాఠశాలలో ప్రిన్సిపల్ పిండి యుగేందర్ ఆధ్వర్యంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని డాక్టర్.సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేశారు.ఈ సందర్బంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జీవిత సూత్రాలను అనుసరించినటువంటి పద్ధతులను అలాగే ఉత్తమ ఉపాధ్యాయులకు ఉండవలసినటువంటి లక్షణాలను తెలియజేశారు. తరువాత విద్యార్థులు వివిధ నృత్యాలతో,పాటలతో,ఉపన్యాసాలతో చూపర్లను అలరించారు.తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులను పుష్ప మాలా అలంకృతులతో సన్మానం చేశారు.తదానంతరం బిట్స్ పాఠశాల ప్రిన్సిపల్ యుగేందర్ గారు మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి కావలసినటువంటి ఉపాధ్యాయుల ఆవశ్యకతను మరియు విద్యార్థిదశ నుండి పెంపొందించుకోవాల్సినటువంటి లక్షణాలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండల కేంద్రం లోని బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం రోజున సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి లో బాగంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల లో భాగంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను పూల మాలలు మరియు శాలువాలతో సత్కరించి ఉపాధ్యాయుల గొప్పతనాన్ని కొనియాడారు. భారత దేశపు రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం మొత్తంలో ఉపాధ్యాయుడిగా చేసిన సేవలే అత్యంత తృప్తినిచ్చాయని తన జీవిత చరిత్రలో రాసుకున్న సందర్భాన్ని ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేది ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన రోజని ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల గురించి కవితలు, పాటలు వినిపించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజయ్య, దేవేందర్ రెడ్డి, రమేష్, లచ్చయ్య, అనిల్ కుమార్, సమ్మయ్య,షాజహా, అనిత, కవిత, కిరణ్ కుమార్, కోటేశ్వర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు.
17వ బెటాలియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యార్థులకు షూ,టైప్,బెల్టులు పంపిణీ
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17 వ బెటాలియన్ కి సంబంధించిన పోలీసుల అన్యువల్ రిఫ్రెషర్ కోర్సులో భాగంగా ఈరోజు సిరిసిల్ల అర్బన్ సర్దాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సిరిసిల్ల జిల్లా 17 వ బెటాలియన్ అధికారి ఆర్.ఎస్.ఐ తిరుపతి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు షూ, టై, బెల్ట్‌లను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. అంతేకాకుండా తిరుపతి మాట్లాడు విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం మరియు అధికారులు అన్ని విధాల కృషి చేస్తారు. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు మరియు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్ఆర్కె పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని ఎస్ఆర్కె పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు పెద్దపల్లి ఉప్పలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి మాట్లాడారు… ఉపాధ్యాయ వృత్తి నుంచి భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా ఎదిగిన తనను మేమందరం ఆదర్శంగా తీసుకొని భారత దేశ అభ్యున్నతి కోసం పాటుపడతామని తెలిపారు.
ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులందరికీ బహుమతులు అందించారు. పాఠశాల ఉపాధ్యాయులును అందరినీ శాలువాలతో సత్కరించి, విద్యార్థుల భవిష్యత్తు కోసం హర్నిశలు కృషి చేయాలని వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోల శ్రీనివాస్,డోకూరి సోమశేఖర్, అంబాల రాజేందర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జైపూర్ మండలంలోని ఇందారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా హాకీ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు.అలాగే మండల విద్యాధికారి బి.శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మేజర్ ధ్యాన్ చంద్ జీవితాన్ని విద్యార్థులకు పరిచయం చేసారు.మన జాతీయ క్రీడైన హాకీ లో ఆయన అత్యున్నత స్థాయి క్రీడాకారుడుగా ఎదిగిన తీరును వివరించారు.క్రీడలు మానసిక,శారీరక ఉల్లాసం తో పాటు ఐక్యతను చాటుతాయని వివరించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచి నచ్చిన క్రీడలో మెలుకువలు నేర్చుకోవాలని విద్యార్థులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో పి.డి. ఎన్.పద్మ, ఉపాధ్యాయులు కె.రమాదేవి, కె.రమేష్ బాబు,ఏం. విజయలక్ష్మి,ఎం.సత్తిరెడ్డి,డి. సహదేవ్,జి.సంధ్యారాణి,పి. మంజుల,గోపగాని రవీందర్, కె.కనకయ్య,శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ సందడి..
రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులను స్వాగతించేందుకు సీనియర్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఉత్సాహభరిత వాతావరణంగా మారింది. కార్యక్రమానికి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నృత్యాలు, పాటలు, నాటికలు, వినోదాత్మక ప్రదర్శనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఫ్రెషర్స్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
Freshers Party at Ramayampet Junior College.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మల్లేశం మాట్లాడుతూ – “కళాశాలలో అడుగు పెట్టిన ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, విద్యతో పాటు సామాజిక సేవా భావనను పెంపొందించుకోవాలని” సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలిచి ఎల్లప్పుడూ సహకారం అందిస్తారని తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు మాట్లాడుతూ, ఫ్రెషర్స్ పార్టీ విద్యార్థుల మధ్య ఆత్మీయత పెంపొందించేందుకు, ప్రతిభ ప్రదర్శనకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కళాశాలలో ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్లు ఫ్రెషర్స్ విద్యార్థులకు పుస్తకాలు బహుమతులుగా అందజేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆనందంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని పంచుకున్నారు.
దళిత బిడ్డల అభ్యున్నతికి మరియు చదువులో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న సంస్థ మాస్…
వర్దన్నపేట (నేటిధాత్రి ):
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బరిగెల కావేరి వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల లో బీటెక్ రెండోవ సంవత్సరం చదువుతుంది.చదువులో ఎంతో ప్రతిభ ఉన్న ఆర్ధికంగా వెనకబడి ఉన్న కుటుంభం తండ్రి లేక ఇద్దరి అమ్మాయిలను చదివిస్తున్న తల్లి.వీరి కుటుంభం నేపథ్యం తెలుసుకున్న డా”విక్రమ్ కుమార్ మహా ఆది సేవ సంస్థ సభ్యులకు తెలియజేయగా ఈ రోజు సంస్థ నుండి విద్యార్థికి కళాశాల ఫీజు మరియు పుస్తకాల అవసరానికి సంస్థ నుండి 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా డా’ విజయ్ కుమార్ మాట్లాడుతూ డా బి.ఆర్ అంబేద్కర్ గారి పిలుపైన “పే బ్యాక్ టు థి సొసైటీ” అనే సిద్ధాంతం మీద మాస్ గత 5 సంవత్సరాలుగా దాదాపు 205 మంది మాదిగ జాతి బిడ్డలైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని అలువాల విజయకుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాస్ సంస్థ సభ్యులు డా”విజయకుమార్,డా సీనపల్లి విక్రమ్ కుమార్,డా”శివ శంకర్,సాఫ్ట్వేర్ సీనపెల్లి హరీష్,గాయాల సుమన్,జోగుల సంపత్,వేల్పుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు…
కేయూ క్యాంపస్* మండల్ కమిషన్ సిఫారసులతోనే ఇతర వెనకబడిన తరగతులకు కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సుంకర జ్యోతి అభిప్రాయపడినారు, డాక్టర్ తిరునహరి శేషు ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన బీపీ మండల్ 107వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ రెండవ వెనుకబడిన తరగతుల చైర్మన్ గా మండల్ కమిషన్ సిఫారసుల మేరకే ఓబీసీ లకి కేంద్ర విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు సాధ్యమైనాయని అభిప్రాయపడినారు. మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారంగా కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి కానీ కేంద్ర విద్యా ఉద్యోగల లో ఓబీసీలకు రిజర్వేషన్లు 22 శాతానికి మించి దక్కటం లేదని అభిప్రాయపడినారు. బీసీ నాయకులు డాక్టర్ తండు నాగయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన ఈ ఏడు దశాబ్దాల కాలంలో కాక కలేల్కర్ కమిషన్ రిపోర్ట్ కానీ మండల్ కమిషన్ రిపోర్ట్ కానీ జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్ట్ లను అమలు చేయటానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం వలన ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయబడినారు. మండల్ కమిషన్ నివేదికని పూర్తిస్థాయిలో అమలుపరచినప్పుడే దేశంలో సామాజిక న్యాయం సాధించబడుతుందని అభిప్రాయపడినారు. బిసి నాయకులు డాక్టర్ ఎర్రబొజ్జు రమేష్ మాట్లాడుతూ జనగణలో భాగంగా జాతి ఆధారిత కుల గణన జరగాలని కాక ఖలేల్కర్ కమిషన్ మండల్ కమిషన్లు సిఫారసు చేసినా ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవటానికి ప్రభుత్వలకు ఏడు దశాబ్దాల సమయం పట్టిందంటే ఓబీసీల అభివృద్ధి సంక్షేమం పట్ల ప్రభుత్వాల వైఖరి తేటతెల్లమవుతుందని విమర్శించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరుణాకర్ డాక్టర్ ఫిరోజ్ డాక్టర్ వెన్నంపల్లి విజయకుమార్ డాక్టర్ లక్ష్మీనారాయణ డాక్టర్ దాసు డాక్టర్ శ్రీలత డాక్టర్ రమేష్ డాక్టర్ స్వామి డాక్టర్ జయప్రకాశ్ డాక్టర్ తాళ్లపల్లి సంజీవ్ డాక్టర్ సదానందం డాక్టర్ కొమురయ్య, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కోహీర్ మండలంలోని బిలాల్ పూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఎ చర్ల వెంకట్ రెడ్డి నగదు పురస్కారాలు అందజేశారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 10 మంది విద్యార్థులకు రూ.
2వేలు వంతున రూ.20వేలు, ప్రశంసా పత్రాలను తన సోదరుడు చర్ల పాండురంగారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఆనందం చేతుల పంపిణీ చేశారు. విద్యార్థులను చదువులో ప్రోత్సాహంచేందుకు గాను గత 12 సంవత్సరాలుగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉర్దూ, తెలుగు మీడియం విద్యార్థులకు తరగతిలో టాపర్లుగా నిలిచిన వారికి అందజేస్తూ వస్తున్నారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ ఫాతిమా బేగం, ఉపాధ్యాయులు ప్రకాష్ రావు, ఆబేద్లీ, బషీర్అహ్మద్, ఎ.నర్సింహులు, అనీస్ ఫాతిమా పాల్గొన్నారు.
ములుగు జిల్లా మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో తరాలను విద్యా ప్రస్థానంలో ఆవిష్కరించిన గురువు సుదర్శన్ చారి మరణవార్త వారి శిష్య సమాజం, సహచర ఉపాధ్యాయ వర్గానికీ తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. వృత్తిని ధర్మంగా భావించి, తప్పుదారి పట్టిన జీవితాలను క్రమశిక్షణతో సరిచేసిన క్రమశిక్షణ ప్రియుడు, రేపటి పౌరులను తీర్చిదిద్దిన శిల్పిగా ఆయన గుర్తింపు పొందారు. విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలను ఎదురించి, వాటి వైపు నడిపించిన ప్రేరణాత్మక వ్యక్తిత్వం గల వారు అని ఆయన శిష్యులు స్మరించారు. “అజ్ఞానమనే నిశీధిని జ్ఞానంతో రూపుమాపి, జీవంలేని రాతిశిలలను శిల్పాలుగా మలచి, విద్యార్ధుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ఆచార్యుడు ఇక లేరన్న వార్త శిష్యులను మ్రోయజేసింది. 2005 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు తమ గురువును స్మరించుకుంటూ ప్రగడా సానుభూతి తెలిపారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు బుధవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక విప్లవ నిర్మాత అని,ఐటీ రంగ వృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. దేశానికి సుస్థిర పాలన అందించి ఆదర్శంగా నిలిచాడని తెలిపారు.గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో ఆయన అమలు చేసిన పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన రాజీవ్ గాంధీ గ్రామపంచాయతీ వ్యవస్థను బలపరిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య, చాపల బాపురెడ్డి, గంజి విజయపాల్ రెడ్డి,ఏఎంసీ డైరెక్టర్లు కందాడి అచ్చిరెడ్డి,కంచర్ల వెంకట చారి,యూత్ పట్టణ అధ్యక్షుడు బసనబోయిన మహేష్ యాదవ్,నాయకులు జలకం శ్రీనివాస్, సొంటి రెడ్డి భాస్కర్ రెడ్డి,కల్లూరి కుశాల్, ముద్దసాని సురేష్, జంజీరాల మనోహర్, జలీల్, వెలుగు మహేశ్వరి, పంజా కల్పన,బిజ్జాల అనిల్, జలగం వెంకన్న,యశోద, మహంకాల దుర్గేష్, జాటోత్ రమేష్ నాయక్, నడిగడ్డ మధు, నడిగడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.