మండల కేంద్రంలో క్రీడా దినోత్సవం వేడుకలు …

మండల కేంద్రంలో క్రీడా దినోత్సవం వేడుకలు 
మహాదేవపూర్ఆగష్టు30 (నేటి ధాత్రి )

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో శనివారం రోజున క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ క్రీడ దినోత్సవ వేడుకలలో భాగంగా మహాదేవపూర్ మండల కేంద్రంలో విద్యార్థులతో క్రీడ ఉపాధ్యాయుని పూర్ణిమ తోటి ఉపాధ్యాయులతో కలిసి క్రీడా స్ఫూర్తినీ నింపేలా పాటలతో, నినాదాలతో ర్యాలీ నిర్వహించిన అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోటరాజబాపు, పిఎసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి ఎంఈఓ ప్రకాష్ సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడలలో విద్యార్థులు ముందంజలో ఉంటూ జాతీయస్థాయిలో క్రీడ పోటీలలో విజేతలుగా నిలిచి భవిష్యత్ తరాలకు క్రీడలపై స్ఫూర్తిని అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు అనిల్,ఎస్సై పవన్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం…

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలంలోని ఇందారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా హాకీ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు.అలాగే మండల విద్యాధికారి బి.శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మేజర్ ధ్యాన్ చంద్ జీవితాన్ని విద్యార్థులకు పరిచయం చేసారు.మన జాతీయ క్రీడైన హాకీ లో ఆయన అత్యున్నత స్థాయి క్రీడాకారుడుగా ఎదిగిన తీరును వివరించారు.క్రీడలు మానసిక,శారీరక ఉల్లాసం తో పాటు ఐక్యతను చాటుతాయని వివరించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచి నచ్చిన క్రీడలో మెలుకువలు నేర్చుకోవాలని విద్యార్థులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో పి.డి. ఎన్.పద్మ, ఉపాధ్యాయులు కె.రమాదేవి, కె.రమేష్ బాబు,ఏం. విజయలక్ష్మి,ఎం.సత్తిరెడ్డి,డి. సహదేవ్,జి.సంధ్యారాణి,పి. మంజుల,గోపగాని రవీందర్, కె.కనకయ్య,శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version