పాఠశాల టాపర్లకు ఎన్ఆర్ఎ నగదు పారితోషికం
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహీర్ మండలంలోని బిలాల్ పూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఎ చర్ల వెంకట్ రెడ్డి నగదు పురస్కారాలు అందజేశారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 10 మంది విద్యార్థులకు రూ.
2వేలు వంతున రూ.20వేలు, ప్రశంసా పత్రాలను తన సోదరుడు చర్ల పాండురంగారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఆనందం చేతుల పంపిణీ చేశారు. విద్యార్థులను చదువులో ప్రోత్సాహంచేందుకు గాను గత 12 సంవత్సరాలుగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉర్దూ, తెలుగు మీడియం విద్యార్థులకు తరగతిలో టాపర్లుగా నిలిచిన వారికి అందజేస్తూ వస్తున్నారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ ఫాతిమా బేగం, ఉపాధ్యాయులు ప్రకాష్ రావు, ఆబేద్లీ, బషీర్అహ్మద్, ఎ.నర్సింహులు, అనీస్ ఫాతిమా పాల్గొన్నారు.