17వ బెటాలియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యార్థులకు షూ,టైప్,బెల్టులు పంపిణీ
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17 వ బెటాలియన్ కి సంబంధించిన పోలీసుల అన్యువల్ రిఫ్రెషర్ కోర్సులో భాగంగా ఈరోజు సిరిసిల్ల అర్బన్ సర్దాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సిరిసిల్ల జిల్లా 17 వ బెటాలియన్ అధికారి ఆర్.ఎస్.ఐ తిరుపతి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు షూ, టై, బెల్ట్‌లను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. అంతేకాకుండా
తిరుపతి మాట్లాడు విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం మరియు అధికారులు అన్ని విధాల కృషి చేస్తారు. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు మరియు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.