గురువుకు శిష్యుల కన్నీటి వీడ్కోలు.
ములుగు, నేటిధాత్రి.
ములుగు జిల్లా మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో తరాలను విద్యా ప్రస్థానంలో ఆవిష్కరించిన గురువు సుదర్శన్ చారి మరణవార్త వారి శిష్య సమాజం, సహచర ఉపాధ్యాయ వర్గానికీ తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. వృత్తిని ధర్మంగా భావించి, తప్పుదారి పట్టిన జీవితాలను క్రమశిక్షణతో సరిచేసిన క్రమశిక్షణ ప్రియుడు, రేపటి పౌరులను తీర్చిదిద్దిన శిల్పిగా ఆయన గుర్తింపు పొందారు. విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలను ఎదురించి, వాటి వైపు నడిపించిన ప్రేరణాత్మక వ్యక్తిత్వం గల వారు అని ఆయన శిష్యులు స్మరించారు. “అజ్ఞానమనే నిశీధిని జ్ఞానంతో రూపుమాపి, జీవంలేని రాతిశిలలను శిల్పాలుగా మలచి, విద్యార్ధుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ఆచార్యుడు ఇక లేరన్న వార్త శిష్యులను మ్రోయజేసింది. 2005 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు తమ గురువును స్మరించుకుంటూ ప్రగడా సానుభూతి తెలిపారు.