బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఈసం నారాయణ మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడా,సాంస్కృతిక రంగాలలోనూ రాణించాలని సూచించారు. ఈ లక్ష్య సాధనకు ఎన్ఎస్ఎస్ ఒక అద్భుతమైన వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. దేశాభివృద్ధికి ఆటంకాలైన మూఢనమ్మకాలు,నిరక్షరాస్యత,డ్రగ్స్ వంటి దుష్ప్రవర్తనలను సమాజం నుండి పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ మోర్తాల రామరాజు మాట్లాడుతూ నూతన విద్యార్థులు తప్పనిసరిగా ఎన్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకుని యూనివర్సిటీ నిర్వహించే వివిధ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని కళాశాలకు పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్,అధ్యాపకులు రవీందర్, బిక్షపతి,రాజ్‌కుమార్,మధు తదితరులు పాల్గొన్నారు.