42% రిజర్వేషన్ల కోసం బీసీ బంద్‌కు సగర సంఘం మద్దతు

బిసి బంద్ కు సగర సంఘం మద్దతు

42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు పోతే సహించేది లేదు

సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సగర

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

Vaibhavalaxmi Shopping Mall

తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 వ తేదీన తెలంగాణ బిసి జేఏసీ ఇచ్చిన బంద్ కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. గురువారం గచ్చిబౌలి లోని సగర సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ బంద్ ద్వారా బిసి ల చైతన్యం ప్రదర్శించాలని పిలునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదని అన్నారు. రాజ్యాంగ సవరణ చేసి చట్ట పరంగా నే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ, విద్య, ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగరులు బంద్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, చిలుక శ్రీనివాస్ సగర, దిండి శేఖర్ సగర, సంయుక్త కార్యదర్శి సంగిశెట్టి గంగాధర్ సగర, కార్యనిర్వాక కార్యదర్శి బంగారి ఆంజనేయులు సగర, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మోడల రవి సగర, సగర సంఘం నాయకులు కేపీ వెంకటేష్ సగర, ఖాజా సగర, రాజు సగర, కృష్ణ సగర తదితరులు పాల్గొన్నారు.

మైసూర్ లో వెస్టీజ్ కంపెనీ మైండ్ సెట్ శిక్షణ ఏర్పాటు…

మైసూర్ లో వెస్టీజ్ కంపెనీ మైండ్ సెట్ శిక్షణ ఏర్పాటు

విజయవంతం చేసిన మంచిర్యాల టీం

హైదరాబాద్,నేటి ధాత్రి:

 

 

మైసూర్ లో వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ మైండ్ సెట్ శిక్షణ క్లాసులు మంగళవారం,బుధవారం రెండు రోజులుగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వి.ఎం.సి.ఎం సుబ్బయ్య శెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని వి.ఎం.సి.ఎం ఎం.ఎస్.ఆర్ తో కలసి మైండ్ సెట్ శిక్షణ క్లాసులు 300 మందికి పైగా మైసూర్ ప్రెసిడెంట్ హోటల్ లో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వి.ఎం.సి.ఎం సుబ్బయ్య శెట్టి మాట్లాడుతూ.. మైండ్ సెట్ క్లాస్ అంటే ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి మనస్తత్వాన్ని ఎలా మార్చుకోవాలి అనే దానిపై శిక్షణ,విధివిధానాలు తెలిపారు.సుబ్బయ్య శెట్టి మాటలు విన్న చాలా మంది నిరు పేదలు వారి మైండ్ సెట్ మార్చుకొని వెస్టీజ్ కంపెనీలో నిలబడి పనిచేస్తూ వాళ్ళ జీవితాలను మార్చుకొని గొప్పగా జీవిస్తూ వారి ఆశయాలను సాధిస్తున్నారని అన్నారు.

మన జీవనశైలి విధానంలో మార్పు రావాలి

ప్రతి ఒక్క వ్యక్తి తన జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్న వారి ఆర్థిక ఇబ్బందులను,సమస్యలను నిలుదొక్కుకొని వేస్టేజ్ సిస్టం ను ఫాలో అవ్వడం వల్ల వారి లక్ష్యాన్ని చేరుకుంటారని అన్నారు.

ప్రతి పనిలో పట్టుదలతో పనిచేయాలి

మానవ జీవన విధానంలో ఏ పని చేసిన పట్టుదలతో,ఒక సంకల్పం లాగా పని చేసినప్పుడే విజయాలు చేకూర్తాయని అన్నారు.అలాగే నీతి,నిజాయితీ,ఏకాగ్రత,నిబంధనతో పనిచేస్తూ తోటి వారికి సహాయం చేస్తూ ప్రేమగా,ఆప్యాయంగా ఉంటూ విజయాలను సాధించాలని తెలిపారు.

పదివేల అప్పుకు.. ఓ నిండు ప్రాణం బలి..

పదివేల అప్పుకు.. ఓ నిండు ప్రాణం బలి..

#మరొకరి పరిస్థితి విషమం.

#సొంత అన్న వదినపై దాడికి పాల్పడిన మరిది.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

పదివేల అప్పు కోసం అన్న వదినలపై మరిది దాడికి పాల్పడి వదిన ప్రాణాలు కోల్పోగా అన్న ప్రాణాలతో కొట్టు మి ట్టాడుతున్న సంఘటన గురువారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మేరగుర్తి మల్లయ్య-సమ్మక్క దంపతులకు రమేష్, సురేష్ ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కొడుకు రమేష్ కు పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు జన్మించారు తర్వాత 8 సంవత్సరాల క్రితం రమేష్ భార్య చనిపోగా. మరల గీసుకొండ మండలం మచ్చ పురం గ్రామానికి చెందిన స్వరూప (35) తో గ్రామంలోనే సహజీవనం చేస్తున్నాడు. స్వరూప భర్త చనిపోయాడని ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరు కలిసి గత పది ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం కొండాపురం గ్రామానికి వలస వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో రమేష్ తల్లిదండ్రులు, తమ్ముడు సురేష్ ఆ గ్రామంలోని ఉంటూ బ్రెడ్డు అమ్ముకుంటూ బతుకుతున్నారు. నాలుగు నెలల కిందట అన్న రమేష్ కు సురేష్ 10 వేలు అప్పుగా ఇచ్చాడు.

అప్పు తీర్చమని అడిగితే ఇవ్వడం లేదంటూ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ సైతం ఇటీవల నిర్వహించినట్లు తెలుస్తుంది. తన బంధువులు చనిపోవడంతో రమేష్ అతని భార్య చావుకు వెళ్లి బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. స్నానం చేసే క్రమంలో వేడి నీళ్లు ఎందుకు పెట్టలేదని తల్లితో రమేష్ గొడవ పెట్టుకోగా ఈ క్రమంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేష్ తన అన్నను తన డబ్బులు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది ఈ నేపథ్యంలో కత్తితో అన్నపై దాడి చేయగా గాయాలు కాగా పక్కనే ఉన్న స్వరూప ఆపడానికి ప్రయత్నించగా సురేష్ ఆమె పైన కూడా దాడి చేసి పొత్తికడుపు చాతి భాగంలో కత్తితో పొడిచి అక్కడ నుండి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. హుటాహుటిన స్థానికుల సహాయంతో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి గాయాల పాలన ఇద్దరిని తరలించారు. చికిత్స పొందుతూ స్వరూప మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన రమేష్ ను మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రమేష్ పరిస్థితి కూడా విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు స్వరూప కొడుకు శివ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి గోవర్ధన్ తెలిపారు.

మరణించిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు సహాయం…

మరణించిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు సహాయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గురువారం, ఇటీవల మరణించిన నలుగురు పిఆర్టియు ఉపాధ్యాయుల కుటుంబాలకు సంక్షేమ సంస్థ తరపున జిల్లా అధ్యక్షుడు మణయ్య లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దిగ్వాల్- విజయలక్ష్మి, చింతల్ చెరు- నీరజ, చాప్ట(కే ) – శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్- సుజాత కుటుంబ సభ్యులకు ఈ సహాయం అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

బెగుళూరు గ్రామంలో భవనాలకు ఎంజీఎన్ఆర్జిఇఎస్ నిధుల భూమి పూజ

ఎంజీఎన్ఆర్జిఈఎస్ నిధులతో పలు భవనాల భూమి పూజ
* నిధులను సాంక్షన్ చేయించిన మంత్రివర్యులు
* ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన గ్రామ ప్రజలు

మహాదేవపూర్ అక్టోబర్16 నేటి ధాత్రి *

Vaibhavalaxmi Shopping Mall

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బెగుళూరు గ్రామపంచాయతీలో మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో ఎంజిఎన్ఆర్జిఇఎస్ నిధులతో గురువారం రోజున పలు భవనాలకు భూమి పూజ నిర్వహించారు. గ్రామపంచాయతీ అభివృద్ధిలో భాగంగా ఐటి భారీ పరిశ్రమల శాఖ మరియు శాసనసభ వ్యవహార శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు చొరవ తీసుకొని గ్రామపంచాయతీ భవనముకు 20 లక్షల రూపాయలు మరియు అంగన్వాడి రెండు భవనాల నిర్మాణానికి 16 లక్షల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులను బదిలీ చేయడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రమోద్ మరియు పలువురు అధికారుల సమక్షంలో ఈరోజు ముగ్గుపోసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాట్లాడుతూ బెగుళూరు గ్రామానికి 20 లక్షలునిధులు సాంక్షన్ చేసినందుకు ఐటి మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్ ఆకుల సమ్మక్క మాజీ ఎంపిటిసి చల్ల పద్మ ఓదెలు పంచాయతీరాజ్ ఏఈ సతీష్ టెక్నికల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంమ్మూర్తి అంగన్వాడీ టీచర్లు సుజాత సరస్వతి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ ములకల పోచమ్మలు ఆకుల రాజయ్య బుర్రి శివరాజ్ కాంట్రాక్టర్ పోటు మల్లారెడ్డి అంకిరెడ్డి మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది….

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది

#పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ఇంటి కలను సాకారం చేస్తాం.

#అర్హులైన ప్రతి పేదవారికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం.

#వెంకటాపూర్ గ్రామములో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశానికి హాజరై ప్రారంభించిన ….

#రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీ కి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు బయ్యా ప్రమీల ఇందిరమ్మ ఇల్లును రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవనోపాధికి చిహ్నంగా నిలిచిందని మంత్రి సీతక్క అన్నారు.
పేదల బాగోగుల పట్ల శ్రద్ధచూపడం అందులో భాగమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వస్తోందని, పేద ప్రజల కలల ఇళ్ల రూపంలో ప్రతిబింబించడానికి ఈ పథకం దోహదపడిందని మంత్రి వివరించారు.
ప్రజా ప్రభుత్వమే నిజమైన రైతు–కూలీలకు అండగా నిలుస్తోందని అన్నారు. రైతును “రాజు”గా చూడాలనే సంకల్పంతోనే సన్నవరి వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. తొమ్మిది నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్లతో రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేయడం, రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం, మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కట్టించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అలాగే, 7 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, 17 లక్షల పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు నమోదు చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వమే విజయవంతంగా అమలు చేసిందని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దుల్లా సమపాళ్లలో ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కమిషన్‌ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పేదల గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

గంగాధరలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ తో భరోసా

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

గంగాధర, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

ప్రమాదాల్లో గాయపడి, అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం భరోసానిస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూట ఎనభై మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నలబై ఆరు లక్షల అరవై మూడు వేల రూ.ల ఆర్థిక సహాయం మంజూర అయింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు గురువారం గంగాధర మండలం మధురానగర్ లోని ప్రజా కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. సీఎంఆర్ఎఫ్ తో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సత్తు కనుకయ్య, రోమాల రమేష్, కర్ర విద్యా సాగర్ రెడ్డి, గుజ్జుల బాపురెడ్డి, తోట కరుణాకర్, వేముల భాస్కర్, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, వేముల అంజి, గరిగంటి కరుణాకర్, ముచ్చ శంకరయ్య, శ్రీనివాస్, మంత్రి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బంద్ పిలుపు

బిసి 42 శాతం అమలు చేయాలని రాష్ట్ర బంద్ కు పిలుపు

ఎం సి పి ఐ యు, ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న పిలుపు

కేసముద్రం/ నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో రాష్ట్ర బీసీ సంఘాలు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని ఈనెల 18వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినందున విజయవంతం చేయాలని కోరుతూ గ్రామంలో ఎం సి పి ఐ యు -ఏఐసీటియు ల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి జరగాలంటే 42% రిజర్వేషన్స్ ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన తదుపరి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు.బీసీల పట్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని, ఆ దిశగా జరుగుతున్న పోరాటాలలో భాగంగా ఈనెల 18 తేదీన జరిగే రాష్ట్ర బంద్ ను ఎం సిపిఐ యు పార్టీ మద్దతు తెలియజేస్తుందని ఆయన తెలియజేశారు.ఇట్టి బందులో ఎం సిపిఐ యు-ఏఐసిటియు కార్మిక సంఘం ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: పలుస సంపత్, కంకల శ్రీనివాస్ ,అంకిరెడ్డి వీరన్న, తండ శ్రీనివాస్, అంకిరెడ్డి రాంబాబు, ఎండి రహీం, కాకి సంతోష్, వాంకుడోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

పిడిఎస్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రైబల్స్ లో సేవా కార్యక్రమాలు….

పిడిఎస్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రైబల్స్ లో సేవా కార్యక్రమాలు.

మన్యం నిరుపేద ప్రజలకు విద్యార్థులకు, బట్టలు టీషర్ట్స్ పెన్నులు బుక్స్ పంపిణీ…

బనిశెట్టి విజయ వెంకటేష్ లను,అభినందించిన పెద్దాడ యోహాను…

కేసముద్రం/ నేటి ధాత్రి

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలంలో పిడిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో,( మన్యంలో మహా ఘనుడు,) ప్రోగ్రామ్ ద్వారా మన్యం నిరుపేద ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు, బుధవారం, చీరెలు, యవ్వనస్తులకు ,షర్ట్స్,పాయింట్స్,పంజాబీ డ్రెస్సెస్,చిన్నపిల్లలకు టీ షర్ట్స్,పెన్నులు, పెన్సిల్లు,నోట్ బుక్స్, బియ్యం, స్వీట్స్,పలు గ్రామాల్లో పంచి పెట్టడం జరిగింది, ట్రైబల్స్( మన్యం )ప్రాంతంలో ప్రజలు చాలా దిన స్థితిలో సమాజానికి దూరంగా జీవిస్తున్నారని వారిని ఆదరించి మేమున్నాము అంటూ బలపరిచి రావడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు బనిశెట్టి విజయ వెంకటేష్ లు, చిన్న జ్వరం వచ్చిన 30 నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్లాలని,, పెద్ద అనారోగ్య సమస్య వస్తే 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు వెళ్లాలని, కనీసం రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదని వారన్నారు, దేవుడే వారికి తోడై ఉండాలని వారన్నారు, రాబోయే రోజుల్లో దేవుని దయతో ప్రపంచమంతా సేవా కార్యక్రమాలు చేయాలని ఆశ కలిగి ఉన్నామని అందుకు దేవుని దీవెనలు ప్రజల దయ మాపై ఉండాలని వారు అన్నారు, నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తూ గత మూడు సంవత్సరాలుగా ఆదరణ కలిగిస్తున్న వెంకటేష్ , విజయ్ లను అభినందిస్తూ అనేకులు ఇంకా సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని, మనం తిన్నది మట్టి పాలు ఇతరులకు పెట్టింది మనకు, కావున సేవా గుణం కలిగి ఉండాలని,మన్నెంలో
మహా ఘనుడు, ప్రోగ్రాం అధ్యక్షులు పెద్దద యోహన్ తెలిపారు , సందర్శించిన గ్రామాలు,గంగవరం మండలం లోని గొల్ల కొండ,మర్రిపాలెం,చెప్పరి పాలెం,బర్రి మామిడి,కొండ కారం వారి వీధి,కరకపాడు, నీలవరం,మాకు మామిడి,గ్రామాల్లో సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో శైలేష్,పీటర్, మాదాసు ససారంగం, కొర్నేలి, భీమ శేఖర్,మణికుమార్, సమియేల్ ,చంద్రశేఖర్,మణికుమార్, జ్యోతి, దెబోర,దుర్గాప్రసాద్, మనోహర్ లు పాల్గొన్నారు,

ఆర్టీసీ డ్రైవర్ మొగిలికి దొమ్మటి సాంబయ్య నివాళులు

మొగిలి పార్థివదేహానికి నివాళులు అర్పించిన మాజీ టిపిసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి

 

పరకాల,నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మడికొండ మొగిలి గుండెపోటుతో అకాల మరణం చెందగా టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య గురువారం మడికొండ మొగిలి పార్దివదేహాన్ని సందర్శించి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.ఈ పరామర్శలో పిఎసిఎస్ మాజీ ఛైర్మెన్ బొజ్జం రమేష్,టీపీసీసీ ఎస్సిసెల్ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్.మడికొండ శ్రీను, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొచ్చు చందర్,సమన్వయ కమిటీ సభ్యులు చిన్నాల గోనాథ్,మడికొండ సంపత్ కుమార్,బిసి సంఘం నాయకుడు అముదాలపల్లి మల్లేశం గౌడ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పుల్యాల గాంధీ,మండల ఎస్సిసెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,పట్టణ నాయకులు పాడి వివేక్ రెడ్డి,బొచ్చు భాస్కర్,బొచ్చు జితేందర్,బొచ్చు రవి,ఒంటెరు వరుణ్,బొచ్చు అనంత్,బొచ్చు రవి కుమార్,లాదేళ్ల బిక్షపతి,మడికొండ రాజు తదితరులు ఉన్నారు.

మరణించిన ఓటర్లను విచారణ జరిపి తొలగించాలి…

మరణించిన ఓటర్లను విచారణ జరిపి తొలగించాలి
వనపర్తి నేటిదాత్రి .

 

తెలంగాణ ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంలతో కలిసి హాజరయ్యారు. సీఈఓ మాట్లాడుతూ ఎన్నికల సంఘం అదేవిధంగా మరణించిన ఓటర్ల జాబితాను విచారణ చేసి తొలగిం చాలని కోరారు ఎపిక్ కార్డ్స్, బీఎల్ వో ఐడి కార్డ్స్ పంపిణీ చేయాలని ఆదేశించారు.
వీసీ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 అప్లికేషన్లను త్వరతగతిన పరిష్కరించాలని ఆదేశించారు. 100 ఏళ్లకు పైబడిన ఓటర్లలో ఎవరైనా మరణించిన వారు ఉంటే వారి ఓట్లను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు రంజిత్ రెడ్డి, శ్రావ్య, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బీ సి బందుకు ప్రజలు సహకరించాలి…

బీ సి బందుకు ప్రజలు సహకరించాలి

అఖిలపక్ష ఐక్యవేదిక. మద్దతు

వనపర్తి నేటిదాత్రి .

 

బీ సీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు తెలంగాణ రాష్ట్ర బందుకు మద్దతు వనపర్తి జిల్లా అఖిల పక్ష ఐక్య వేదిక మద్దతు ఇస్తామని జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు
పార్టీలకు, ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా “సతీష్ యాదవ్.
బి సి బందుకు అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతతో తెలుపుతూ వారిని ఆహ్వానిస్తూ వారితో బంద్ లో పాల్గొoటా మని తెలిపారు చేయాలో తెలుసుకుంటూ వారిని ముందు పెట్టి మేము బందును ప్రశాంతంగా విజయవంతం చేయాలని.పిలుపునిచ్చారు,
ఈసమావేశంలో సతీష్ యాదవ్ టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాషా యాదయ్య , టిడిపి నాయకులు కొత్తగొళ్ల శంకర్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు,పాల్గొన్నారు

నిరు పేదల తమ ప్లాట్లకు రక్షణ కావాలి డిమాండ్….

నిరు పేదల తమ ప్లాట్లకు రక్షణ కావాలి డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఐడిఎస్ఎంటి కాలనీ 158 సర్వే నెంబర్ లో తాము ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన ప్లాట్లలో కట్టిన ఇండ్లను గత వారం రోజుల నుండి కొంతమంది వ్యక్తులు బుల్డోజర్ల తో కూల్చి వేస్తున్నారని వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుని మాకు రక్షణ కల్పించాలని పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై వినయ్ కుమార్ ఫిర్యాదు చేసిన ఐడిఎస్ఎంటి బాధితులు..ఇండ్లను కూల్చడం వెంటనే ఆపివేయాలని, తమ ప్లాట్లకు రక్షణ కావాలని డిమాండ్ చేస్తూ బాధితులకు అండగా మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు… పేదలకు న్యాయం పేదలకు న్యాయం చేసే వరకు జరిగే వరకు ఈ పోరాటం ఆగదు…

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రచారం చేస్తున్న జహీరాబాద్ శాసనసభ్యులు…

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రచారం చేస్తున్న జహీరాబాద్ శాసనసభ్యులు

◆: – కొన్నిటి మాణిక్ రావు

 

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్ లో బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గారి గెలిపే లక్ష్యంగా డోర్ టు డోర్ ప్రచారరం నిర్వహించిన జహీరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు..

గూగుల్ రాకతో రాష్ట్రానికి ఆదాయంతో పాటు మెండుగా ఉద్యోగ అవకాశాలు…

*గూగుల్ రాకతో రాష్ట్రానికి ఆదాయంతో పాటు మెండుగా ఉద్యోగ అవకాశాలు.

*మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి..

పలమనేరు(నేటి ధాత్రి)అక్టోబర్16

 

గూగుల్ రాకతో ఎఐ సిటీగా విశాఖపట్నం రూపాంతరం చెందుతొందని దీంతో రాష్ట్రానికి భారీ ఆదాయంతో పాటు యువతకు 1.88 లక్షల ఉద్యోగావకాశాలు చేకూరనున్నాయని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న అంశాన్ని వివరిస్తూ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవిశాఖపట్నంలో ఒక గిగావాట్ (
జి డెబ్యూ) హైపర్స్కల్ డేటా సెంటర్ క్యాంపస్ ను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామమన్నారు,
కూటమి ప్రభుత్వం చొరవతో, వైజాగ్లో ఏర్పడుతున్న ఏఐ సిటీకి దాదాపు 10 బిలియన్ లు పెట్టుబడి పెట్టనుందన్నారు,
ఆసియాలో గూగుల్ చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా విశాఖపట్నంలో ఈ సెంటర్ నిలవనుందన్నారు,
రాష్ట్రం ఒక స్వర్గధామంగా మారుతోంది. వైజాగ్ లో 1 గిగావాట్ సామర్థ్యంతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం, భారతదేశాన్ని డిజిటల్ పవర్ హౌస్ మార్చే దిశగా తొలి అడుగుగా నిలుస్తుందని అన్నారు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనా ప్రకారం,ఈ ప్రాజెక్ట్ 2028-2032 కాలంలో సగటున సంవత్సరానికి రూ.10,518 కోట్ల జీఎస్డీపీ వాటాతోపాటు సుమారు 1,88,220 ఉద్యోగాలను సృష్టించనుందని వివరించారు,
గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా సంవత్సరానికి రూ.9,553 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు,
మొత్తం ఐదేళ్ళలో సుమారు రూ.47,720 కోట్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోనుందనిసీఎం చంద్రబాబు బ్రాండింగ్, మంత్రి లోకేష్ నిరంతర కృషితో గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి విశాఖకు వచ్చేసిందన్నారు,
దేశంలో సురక్షిత నగరాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న గ్రేటర్ విశాఖపట్నం.. ఇప్పుడు ఐటీ, డేటా సిటీ నగరంగా రూపాంతరం కానుందన్నారు

శ్రీనివాసపురం చెరువు తూము నిర్మాణంపై విచారణ జరపాలి…

శ్రీనివాసపురం చెరువు తూము నిర్మాణంపై విచారణ జరపాలి

బీజేపీ రాష్ట్ర నేత సీనియర్ న్యాయవాది మున్నూర్ రవీందర్

వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి జిల్లా శ్రీనివాసపురం దగ్గర తూము నిర్మాణం చేపట్టడము వల్ల అక్కడ మున్సిపల్ అనుమతులు తీసుకొని ఇండ్ల నిర్మాణం చేసుకున్నారని తూము నిర్మాణం చేపట్టడం వల్ల నివాసంలో ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర నేత సీనియర్ న్యాయవాది మున్నూర్ రవీందర్ విలేకరుల సమావేశంలో తెలిపారు జిల్లా కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు న్యాయం చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తామని మున్నూర్ రవీందర్ చెప్పారు

ఉల్లాస్ పుస్తకాల పంపిణి చేసిన ఎంఈఓ…

ఉల్లాస్ పుస్తకాల పంపిణి చేసిన ఎంఈఓ

చిట్యాల,నేటి ధాత్రి :

 

సమాజంలోని ప్రతి ఒక్కరు చదువుతూ తన యొక్క వ్యక్తిగత జీవన విధానమును మార్చుకోవాలని మానవ వనరుల కేంద్రం చిట్యాల నందు వాలంటరీ టీచర్స్ నకు ఉల్లాస్ పుస్తకాల పంపిణీ మండల విద్యాశాఖాధికారి కోడెపాక రఘుపతి పంపిణీ చేసినారు.
మండల విద్యాశాఖాధికారి రఘుపతి మాట్లాడుతూ చదువు అనేది సమాజంలో మంచి గుర్తింపు ఇస్తుందని ముఖ్యంగా మహిళల అక్షరాస్యతను పెంచవలసిన అవసరము ఎంతైనా ఉన్నదని చదువుకున్న మహిళ తన ఇంటిని పిల్లలను సక్రమమైన మార్గంలో పయనింప చేయడానికి కృషి చేస్తుందని అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అని అన్నారని అదేవిధంగా అందరూ చదువుతూ అందరూ ఎదగాలని వారు కోరారు .చిట్యాల మండలంలో వాలంటరీ టీచర్స్ 279. లర్నర్స్ 2790 మందిని గుర్తించామని వాలంటరీ టీచర్స్ అందరూ కూడా లర్నర్స్ ను చదువు వైపునకు మళ్ళించాలని చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఉల్లాస్ కార్యక్రమమును దిగ్వి జయం చేయుటకు ప్రతి ఒక్కరు దీనినీ యజ్ఞములా భావించి పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీయం గుర్రపు రాజేందర్ ఉల్లాస్ కార్యక్రమ ఇన్చార్జ్ బోనగిరి తిరుపతి వాలంటరీ టీచర్స్  పాల్గొన్నారు.

ఇసుక లారీ లోడింగ్ దగ్గర అదనంగా డబ్బులు వసూలు…

ఇసుక లారీ లోడింగ్ దగ్గర అదనంగా డబ్బులు వసూలు

బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు ఊరా నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం భారతీయ జనాతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిదర్ రెడ్డి ఆదేశానుసరం జయశంకర్ జిల్లా లోని ఇసుక క్వారీ ల వద్ద ఇసుక లోడింగ్ కీ వెళ్లిన లారీలా దగ్గర అదనముగా డబ్బులు వసూలు చేస్తున్నారు టి ఎం ఎస్ డిసి వారు 14 టైర్ల లారీ కీ 32 టన్నులకు డబ్బులు తీసుకోని లోడింగ్ దగ్గర మాత్రం 30 టన్నులు మాత్రమే ఇసుక నింపుతున్నారు దీని వలన నేరుగా వినియోగ దారుని మీద సుమారుగా ఒక్క లారీ కీ పది వేళ రూపాయలు అధిక భారం పడుతుంది అలాగే గత ప్రభుత్వం జయశంకర్ జిల్లా ను స్థానిక జిల్లాగా గుర్తించి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్పెషల్ అలాట్మెంట్ చేసేది కానీ ఇప్పటి ప్రభుత్వం స్థానికతను తుంగలో తొక్కి స్థానిక వినియోగదారుల మీద స్థానిక లారీ ఓనర్ల మీద ఉక్కు పాదం మోపుతుంది కావున పై అంశాలపై టీజీఎండిసి ఎండీ తో చర్చించి వినియోగదారులపై అధిక భారం పడకుండా చర్యలు తీసుకోవాలి అని స్థానిక జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతిపత్రం మీద సానుకూలంగా స్పందించిన కలెక్టర్ తక్షణమే చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమం లో జిల్లా కోశాధికారి ఎర్రబెల్ల

ప్రాణదాత సలాం నీకు…..

ప్రాణదాత సలాం నీకు…..!

శ్రీకాంత్ అవయవదానం మహోన్నతమైనది. కుమారుడి అవయవాలు దానం చేసిన. భార్య సారిక. తల్లిదండ్రులు. నాగమణి శివరాజ్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాయికోడ్ మండలం, కుసునూర్ గ్రామ వాస్తవ్యులు మద్నూర్ రాచప్ప గారి మనుమడు తనయుడు శివరాజ్ నాగమణి గార్ల దంపతుల పెద్ద కొడుకు కీ.శే.శ్రీ. శ్రీకాంత్ హైద్రాబాద్ కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ లో ఉద్యోగం చేసేవాడు. దసరా పండుగ సందర్భంగా చేవెళ్ల గ్రామ జన్మస్థలంకు వచ్చారు. దసరా పండుగ ముంగించుకొని, అతడు ఈనేల 5న 38A హైద్రాబాద్ వెళ్ళుతుండగా శివంపేట దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తు తాను నడుపుతున్న ద్విచక్ర వాహనానికి వెనకాల నుంచి వస్తున్న
ద్విచక్ర వాహనం వచ్చి బలంగా ఢీ కొట్టడంతో, ప్రమాదానికి గురై తలకు తీవ్ర గాయలు కావడంతో, హుటాహుటిన హైద్రాబాద్ ప్రైవేట్ కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ లో, జాయిన్ చేశారు.

 

తొమ్మిది రోజులు ఐసీయులో అబ్జర్వేషన్ ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు. తొమ్మిది రోజులు కూడా డాక్టర్లు ఎంతో శ్రమించి ట్రీట్మెంట్ చేసిన శరీరంలో ఎలాంటి చలనం మార్పు రాకపోవడంతో, సోమవారం కిమ్స్ హాస్పిటల్ వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. ఎన్ని రోజులు ఐసియులో పెట్టి చికిత్సలు అందించిన ప్రయోజనం ఉండదని వైద్యులు. భార్య సారికకు మరియు
తల్లిదండ్రులు శివరాజ్ నాగమణి గార్లకు తేల్చి చెప్పారు. వైద్యుల సూచన మేరకు, శ్రీకాంత్ అవయవాలు అన్ని పని చేస్తున్నందున అవయవాలు దానం చేయొచ్చని వైద్యులు సూచించారు. దీంతో తనయుడి 5 అవయవాలు దానం చేయడానికి తల్లిదండ్రులు మరియు భార్య అంగీకరించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో చేసిన అవయవదానం ఎంతో మందికి పునర్జన్మనిస్తోంది. వైద్యులు వెంటనే గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, వేరు చేసి, వివిధ ఆసుపత్రులల్లో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి కోసం గ్రీన్ చానెల్ మార్గంలో తరలించి ఆరుగురుకి అమర్చినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇలా అరుగురు జీవితాల్లో వెలుగు నింపిన. భార్య సారిక, తల్లిదండ్రులు శివరాజ్ నాగమణి ఆదర్శంగా నిలిచారు. మా కుమారుడి ప్రాణాన్ని కోల్పోయిన ఆరుగురికి ఊపిరి పోశాడని, భార్య సారిక, మరియు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పెద్ద కుమారుడు తమకు దూరమవడంతో, వారు గుండెలవిసేలా రోదించారు. కుసునూర్ గ్రామం, చేవెళ్ల గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండే శ్రీకాంత్ మరణ వార్తతో గ్రామంలో. విషాద ఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!
Exit mobile version