ఓరి దేవుడా.. నిలబడి నీళ్లు తాగితే ఇన్ని ఆరోగ్య సమస్యలా..

ఓరి దేవుడా.. నిలబడి నీళ్లు తాగితే ఇన్ని ఆరోగ్య సమస్యలా..?

 

ఆరోగ్యానికి నీరు చాలా ముఖ్యమని అందరికీ తెలుసు. కానీ, నిలబడి నీళ్లు తాగితే శరీరం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుందని అంటారు. అయితే, ఇందులో నిజమెంత? ఈ విషయంపై ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

 శరీరానికి నీరు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఇది మన శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా మన అవయవాలు సరిగ్గా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది. కానీ, చాలా కాలంగా నీరు తాగడానికి సరైన మార్గం గురించి చర్చ జరుగుతోంది. నిలబడి ఉన్నప్పుడు నీరు తాగకూడదని అంటారు. దీనికి కారణం అందరికీ తెలియకపోయినా, చాలా మంది ఈ నియమాన్ని పాటిస్తారు. అయితే, నిలబడి ఉన్నప్పుడు నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదా? ఈ విషయంపై ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆయుర్వేద నిపుణుల ప్రకారం, నిలబడి నీరు తాగినప్పుడు, అది అన్నవాహిక ద్వారా నేరుగా కడుపులోకి వెళుతుంది. ఇది అజీర్ణం లేదా అసౌకర్యాన్ని కలిగిస్తుంది, కాబట్టి కూర్చుని నెమ్మదిగా నీరు తాగడం మంచిది.నిలబడి నీరు తాగడం వల్ల కలిగే సమస్యలు?

సాధారణంగా నిలబడి నీరు తాగడం మంచిది కాదు. ఇది మోకాళ్లకు నేరుగా హాని కలిగించకపోయినా.. జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని ఆయుర్వేద, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది: నిలబడి నీరు తాగినప్పుడు, అది అన్నవాహిక ద్వారా త్వరగా కడుపులోకి ప్రవేశిస్తుంది. ఈ వేగవంతమైన వినియోగం జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. అజీర్ణం లేదా గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది.

మూత్రపిండాల నొప్పికి కారణం: నిలబడి నీరు తాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. కాలక్రమేణా, ఇది మూత్రపిండాలలో ద్రవం నిలుపుదలకు దారితీస్తుంది. చివరికి మూత్రపిండాల నొప్పికి దారితీస్తుంది. నిలబడి నీరు తాగడం వల్ల అది ఫిల్టర్ కాకుండా త్వరగా కడుపులోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల మూత్ర నాళంలో నీటిలో మలినాలు పేరుకుపోతాయి. అంతే కాదు, ఇది మూత్రపిండాల పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

 మీరు నిలబడి నీరు తాగినప్పుడు అవసరమైన పోషకాలు, విటమిన్లు కాలేయం, జీర్ణవ్యవస్థ ద్వారా సరిగ్గా గ్రహించలేరు.నరాల చికాకు: నిలబడి నీరు తాగడం వల్ల శరీరంలోని ద్రవ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది నరాల చికాకుకు కారణమవుతుందని కూడా అంటారు.

ఆయుర్వేదం ప్రకారం, నీటిని ఎప్పుడూ కూర్చున్నప్పుడు, ప్రశాంతంగా, చిన్న సిప్స్‌లో తాగాలి. నిలబడి లేదా తొందరపడి నడుస్తున్నప్పుడు తాగకూడదు. రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది.

జంగిల్ సఫారీలో ఫొటోగ్రాఫర్లకు షాక్..

 జంగిల్ సఫారీలో ఫొటోగ్రాఫర్లకు షాక్.. ఫొటోలు తీస్తుండగా పక్కనే చిరుత.. చివరకు..

 

కొందరు ఫొటోగ్రాఫర్లు వాహనాల్లో జంగిల్ సఫారీకి వెళ్లారు. అడవిలో చక్కర్లు కొడుతూ తమ కంటికి కనిపించే దృశ్యాలను క్లిక్‌మనిపిస్తున్నారు. ఇంతలో వారికి దూరంగా చిరుత పులులు కనిపించాయి. వాటిని ఫొటోలు తీస్తుండగా.. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

జంగిల్ సఫారీ అంటే ఇష్టపడని వారుండరు. అడవి మధ్యలో క్రూరమృగాల మధ్యలో నుంచి వెళ్లడమే కాకుండా వాటిని అతి దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. అలాగే అడవిలోని అద్భుత దృశ్యాలను వీక్షించే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే కొన్నిసార్లు అదే స్థాయిలో ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. పులులు, సింహాలు.. వాహనాలను చుట్టుముట్టడం ఒక ఎత్తైతే.. కొన్నిసార్లు అవి మనుషులు గాయపడడం కూడా జరుగుతుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు ఫొటోగ్రాఫర్లు (Photographers) వాహనాల్లో జంగిల్ సఫారీకి (Jungle Safari) వెళ్లారు. అడవిలో చక్కర్లు కొడుతూ తమ కంటికి కనిపించే దృశ్యాలను క్లిక్‌మనిపిస్తున్నారు. ఇంతలో వారికి దూరంగా చిరుత పులులు కనిపించాయి. దీంతో వాహనాన్ని గడ్డిలో ఆపి.. కిందకు దిగారు. వాహనం పక్కనే కూర్చున్న ఇద్దరు ఫొటోగ్రాఫర్లు కాస్త దూరంలో ఉన్న చిరుతను ఫొటోలు తీస్తుంటారు.
అక్కడున్న ఇద్దరు ఫొటోగ్రాఫర్లలో ఓ మహిళ కూడా ఉంటుంది. వారు ఫొటోలు తీస్తుండగా.. మరో చిరుత (Leopard) వచ్చి వారి పక్కనే నిలబడుతుంది. కాసేపట తర్వాత ఫొటోలు తీస్తున్న మహిళ దృష్టి.. ఆ చిరుతపై పడుతుంది. చిరుతను ఫొటో తీస్తున్న ఆమె.. పక్కనే మరో చిరుత ఉండడం చూసి షాక్ అవుతుంది. అయితే ఆ చిరుత వారికి ఎలాంటి హానీ చేయకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘లక్ష్యంపై దృష్టి పెట్టడం ఎంత ముఖ్యంపై.. వెళ్తున్న మార్గాన్ని పరిశీలించడం కూడా అంతే ముఖ్యం’.. అంటూ కొందరు, ‘వీళ్ల అదృష్టం బాగుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 88 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

నేటి బీసీ సంఘాల రాష్ట్ర బంద్ కు సీపీఐ మద్దతు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-17T133719.880-1.wav?_=1

 

నేటి బీసీ సంఘాల రాష్ట్ర బంద్ కు సీపీఐ మద్దతు

సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు జరపాలని హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగే నేటి తెలంగాణ రాష్ట్ర బంద్ కు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు మాట్లాడారు. బీసీలు దశాబ్ద కాలంగా రిజర్వేషన్లు పెంచాలని పోరాటాలు చేస్తున్న నేపద్యంలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పించాలని తలపెట్టిన బంద్ కు వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, అన్ని కుల సంఘాలు,అన్ని వర్గాల ప్రజలు సహకరించి బంద్ లో పాల్గొనాలని తెలిపారు. అగ్రకులాల వారు బీసీ రిజర్వేషన్ ఆపాలని కోరుతూ స్టే తీసుకొచ్చిన నేపథ్యంలో బంద్ కు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఇప్పకాయల లింగయ్య, సాంబయ్య , మొండి, పౌలు, మారేపల్లి రవి, రాయలింగు,రాములు,దేవానంద్, గోపి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లిలో జర్నలిస్టుల నిరసన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-17T132714.913.wav?_=2

 

భూపాలపల్లిలో జర్నలిస్టుల నిరసన

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యంపై వరుస కథనాలు సాక్షి మీడియా,పేపర్లో ప్రసారం చేసినందుకు
సాక్షి ఎడిటర్‌ ధనుంజయరెడ్డి పై విచారణ పేరుతో గత మూడు రోజులుగా పోలీసులు వేధింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ ప్రెస్ క్లబ్, జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు జర్నలిస్టులు.
అక్రమంగా సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్ఛ ను హరించే హక్కు ఎవరికీ లేదని, ధనుంజయ రెడ్డి పై పోలీసుల విచారణ నిలిపివేసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా జర్నలిస్టులు. పాల్గొన్నారు

బీసీ బంద్ కు కాంగ్రెస్ మద్దతు….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-17T131708.158.wav?_=3

 

బీసీ బంద్ కు కాంగ్రెస్ మద్దతు
– ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

బీసీ సంఘాల పెద్దలు 42 శాతం రిజర్వేషన్ రాజకీయంగా ఇవ్వాలని 18న ఇచ్చిన తెలంగాణ బంధుకు జిల్లా కాంగ్రెస్ పక్షాన మద్దతు ఇస్తున్నామని
సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట కోసం బీసీలకు 42 శాతం విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ కోసం కృషి చేసినమని అన్నారు. అసెంబ్లీలో బిల్లులను పాస్ చేసుకుని కేంద్రానికి పంపడం జరిగిందని అన్నారు.కాంగ్రెస్ కృత నిశ్చయంతో ముందుకు పోతున్న తరుణంలో హై కోర్ట్ స్టే రావడం జరిగిందని అన్నారు.
ప్రజలను మేల్కొలిపే విధంగా బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు సంఘీభావం తెలిపారని అన్నారు.
బంద్ కు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందగా సహకరించాలని అన్నారు.
కోర్టులో న్యాయపరంగా కొట్లాడుతాం, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుతున్నాం మాకు పూర్తి ఆశాభావం ఉందని అన్నారు.
బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వం వద్దకు బిల్లులు వెళితే 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు ఒప్పించడం లేదని
ప్రశ్నించారు.
బీసీలకు నోటి కాడికి వచ్చిన బుక్కను లాక్కోవద్దని బిజెపి నాయకులను కోరుతున్నామని అన్నారు.
రాజ్యాంగంలో 50 శాతం క్యాబ్ ఎక్కడా లేదు అని అన్నారు.
కోర్టులో సవాలు చేసిన వారు జీఓ 9 జీవోను సవాల్ చేశారు కానీ చట్టాన్ని కాదనీ అన్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం చిత్త శుద్ధితో మేం ముందుకు పోతున్నామని, బిజెపి నాయకులు కూడా ఆలోచన చేయాలని అన్నారు.
18న జరిగే బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్,బిసి అధికార ప్రతినిధి పర్ష హన్మండ్లు, చేనేత సెల్ అధ్యక్షులు గోనే ఎల్లప్ప, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, బొప్ప దేవయ్య, మేకల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

పాల్గొన్నారు

దీపావళి వేళ బ్లింకిట్‌లో బంగారం.. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే డెలివరీ..

దీపావళి వేళ బ్లింకిట్‌లో బంగారం.. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే డెలివరీ..

 

దీపావళి, ధంతేరస్ (ధన త్రయోదశి) సందర్భంగా బంగారం, సిల్వర్‌ను తమ యూజర్లకు అందించేందుకు బ్లింకిట్‌తో MMTC-PAMP, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పుత్తడి, వెండి ఉత్పత్తులను 10 నిమిషాలలో తమ యూజర్లకు డెలివరీ చేయడాన్ని బ్లింకిట్ ప్రారంభించింది.

 భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పండుగకు ముందు రోజున ఇంటికి శుభ్రం చేసి కొత్త రంగులతో ఇంటిని శోభాయమానంగా తీర్చిదిద్దుతారు. పండుగ రోజున మామిడితోరణాలు, ముద్దబంతి పూలతోఇంటి గుమ్మాలను చక్కగా అలంకరించి పండుగను జరుపుకుంటారు. ఆరోజున బంధువులు అందరూ ఒక్కచోటికి చేరుకుని.. మధుర పదార్థాలు వండి దేవతారాధన చేసి నివేదన చేస్తారు. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం కలగాలని శ్రీ మహాలక్ష్మి దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి మధుర పదార్థాలు నివేదించి ఆ తర్వాత దానినే ప్రసాదంగా స్వీకరిస్తారు. సాయంత్రం పూట ఇంటికి అంతటా కూడా దీపాలు వెలిగింది లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తారు. శైవ, వైష్ణవ క్షేత్రాల్లో పూజలు నిర్వహిస్తారు.
ఇక దీపావళి పర్వదిన రోజున శుభ ముహూర్త సమయం కావున ప్రజలు ఎంతో నమ్మకంగా బంగారం కొనుగోలు చేస్తారు. కనీసం తమకు ఉన్నంతలో డబ్బులు సమకూర్చుకొని పుత్తడి కొనుగోలు చేస్తారు. దీంతో దేశ వ్యాప్తంగా బంగారం షాపులకు బలే గిరాకీ ఉంటుంది. ఫుడ్ డెలివరీ, గ్రోసరీస్ డెలివరీ చేస్తున్నట్టుగానే.. బంగారం కూడా ఈ పండుగ నుంచి డెలివరీ చేయాలని ఈ కామర్స్ బిజినెస్ సంస్థలు ఆలోచనలో పడ్డాయి. అనుకున్నదే తడవుగా బంగారం కొనుగోలు చేసే తమ యూజర్ల కోసం వినూత్న ఆలోచనతో ఓ ఈ కామర్స్ బిజిజెస్ సంస్థ ముందుకు వచ్చింది.

దీపావళి, ధంతేరస్ (ధన త్రయోదశి) సందర్భంగా బంగారం, సిల్వర్‌ను తమ యూజర్లకు అందించేందుకు బ్లింకిట్‌తో MMTC-PAMP, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పుత్తడి, వెండి ఉత్పత్తులను 10 నిమిషాలలో తమ యూజర్లకు డెలివరీ చేయడాన్ని బ్లింకిట్ ప్రారంభించింది. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు ఉన్న సింబల్‌ను బంగారు నాణేలపై ముద్రించి అమ్మకానికి పెట్టింది. యూజర్లు బ్లింకిట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటే మీ ఇంటికే లక్ష్మీ దేవి వస్తుంది. GRT జువెల్లర్స్ లక్ష్మీ గోల్డ్ కాయిన్ (0.5గ్రాములు) ధర రూ.6.999.. అలాగే GRT జువెల్లర్స్ లక్ష్మీ గోల్డ్ కాయిన్ (1 గ్రాములు) ధర రూ.13,949గా నిర్ణయించారు.

పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు….

పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

 

తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజులోనే తులం బంగారం రూ.3,770 పెరిగింది.అంతర్జాతీయంగా కీలక పరిణామాలు, దీపావళి పండుగ దృష్ట్యా దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటున్నాయి. తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజులోనే తులం బంగారం రూ.3,770 పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,180 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,690గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,85,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమలులో ఉంటాయి.

పరికామణిలో చోరీ కేసు.. టీటీడీ అధికారులపై న్యాయమూర్తి అసహనం..

పరికామణిలో చోరీ కేసు.. టీటీడీ అధికారులపై న్యాయమూర్తి అసహనం

 

ఈ నెల 27న టీటీడీ ఈవో.. కోర్టు ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. లేనిపక్షంలో 20 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.తిరుమల పరకామణిలో చోరీ కేసుపై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు సహా ప్రాథమిక దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సీఐడీ సమర్పించింది. ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ అధికారుల తీరుపై హైకోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 27న టీటీడీ ఈవో.. కోర్టు ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. లేనిపక్షంలో 20 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తిరుమల పరకామణిలో చోరీ ఘటనపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని హైకోర్టును టీటీడీ కోరింది. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయమిస్తూ ఈనెల 27కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

కాగా.. 2023లో వైసీపీ ప్రభుత్వంలో తిరుమల పరకామణిలో చోరీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. పరకామణి చోరీపై టీటీడీ విజిలెన్స్‌కు 2023లోనే ఫిర్యాదు అందింది. రవికుమార్ అనే ఉద్యోగి పెద్ద ఎత్తున పరకామణిని కొల్లగొట్టారని ఆరోపణలతో ఫిర్యాదులు వెళ్లాయి. అయితే ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపకుండానే అప్పటి టీటీడీ అధికారులు లోకాయుక్తతో రాజీ చేయించారు. ఇప్పుడు తాజాగా పరకామణిలో చోరీ వ్యవహారంపై శ్రీనివాసులు అనే వ్యక్తి పిటిషన్ వేయడంతో ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. పరకామణి చోరీ కేసులో చోరీపై సీఐడీ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో తిరుమల పరకామణిలో దస్త్రాలను సీఐడీ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఏరియా ఆసుపత్రిలో వైద్యులు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-17T124930.385.wav?_=4

 

ఏరియా ఆసుపత్రిలో వైద్యులు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని ఏరియా ఆసుపత్రిలో సరైన సమయానికి వైద్యులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా వైద్యులు లేకపోవడం వల్ల రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత కారణంగా గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే వైద్యుల నియామకాలు చేసి, ఆసుపత్రి సేవలను బలోపేతం చేయాలని ఆయన జిల్లా ఆరోగ్య అధికారులను డిమాండ్ చేశారు. ఇది స్థానిక ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్న పిలుపునిచ్చారు.

హీరోయిన్ల ఓటర్ కార్డులు ఫేక్.. తేల్చిన ఈసీ, కేసు నమోదు..

హీరోయిన్ల ఓటర్ కార్డులు ఫేక్.. తేల్చిన ఈసీ, కేసు నమోదు

టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్ పేరుతో ఓటర్ల జాబితా సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఓటర్ల జాబితా సర్కులేషన్‌పై సిరియస్ అయిన ఎన్నికల అధికారులు.. తాజాగా ఆ ఓటరు జాబితా ఫేక్ అని తేల్చారు.

 హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ ఓటర్ కార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్ పేరుతో ఓటర్ల జాబితా సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఓటర్ల జాబితా సర్కులేషన్‌పై సిరియస్ అయిన ఎన్నికల అధికారులు.. తాజాగా ఆ ఓటరు జాబితా ఫేక్ అని తేల్చారు. ఈ మేరకు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సయ్యద్ యాహియా కమల్ మధుర నగర్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఎన్నికల అధికారి పిర్యాదు మేరకు 336(4), 353(1)(C) BNS సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఅర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గత రెండు రోజులుగా జూబ్లీహిల్స్‌లో ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ ఫేక్ ఓటర్ కార్డులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నాల ఫోటోలతో ఫేక్ ఓటర్ ఐడీలు క్రియేట్ చేసి కేటుగాళ్లు ప్రచారం చేశారు. వేరే ఓటర్ల ఎపిక్ నంబర్ తో హీరోయిన్ల ఫోటోలు పెట్టీ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేశారు. ఈ ఓటర్ ఐడీల ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేట్ చేశారు? ఎవరు ప్రచారం చేశారు? అన్న అంశాలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాలూకా వీరశైవ లింగాయత్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్…

తాలూకా వీరశైవ లింగాయత్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్,నియోజకవర్గం వీర శైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక బసవేశ్వర ఫంక్షన్ హాల్ లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్ష కార్యవర్గం, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణా కౌలాస్, కార్యదర్శి పద్మజ, స్థానిక లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో జరిగాయి. ఇందులో జిల్లా నుండి అధ్యక్షులు ఇప్పేపల్లి నరసింహు లు, ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వర్, కోశాధి కారి పోలీస్ సంతోష్ పటేల్, యువజన ప్రధాన కార్యదర్శి రామోజీ నవీన్, స్థానిక లింగాయత్ సమాజ్ అధ్యక్షులు రాజశేఖర్ శెట్కర్, ప్రధాన కార్యదర్శి ఆర్ సుభాష్ సమక్షంలో జరిగిన ఎన్నికలలో జహీరాబాద్ నియోజకవర్గం మండలాల వారీగా కూడా ఎన్నికలు నిర్వహించారు. ఇందులో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గ వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోహీర్ మండలం నుండి బిల్లాపాటి విజయకుమార్, మండల అధ్యక్షునిగా ఎన్నుకోగా మొగడంపల్లి మండల అధ్యక్షులుగా ఎం రా%శీ% శెట్టి, ప్రధాన కార్యదర్శిగా ఎల్ విజయ్ కుమార్ ఝరా సంగం మండల అధ్యక్షునిగా పట్లోళ్ల రవి పటేల్, ప్రధాన కార్యదర్శిగా పొట్లోళ్ల పరమేశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగిలిన కార్యవర్గానికి అధ్యక్షులు త్వరలో ప్రకటిస్తారని సమావేశం ప్రకటించింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆగూర్ శివరాజ్ మాట్లాడుతూ తనమీద ఉన్న నమ్మకంతో జిల్లా, స్థానిక అధ్యక్ష కార్యవర్గానికి, మండల సభ్యులందరికీ తన ధన్యవాదాలు తెలిపారు.

స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనపై తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం

“నేటిధాత్రి”, హైదరాబాద్‌:
స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలు నిబంధనపై తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. పలు రంగాలకు భూ కేటాయింపులు జరిపేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్‌ కూడా ఇస్తామన్నారు.

‘‘రాష్ట్రంలో కొత్తగా 3 వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నల్సార్‌లో స్థానిక విద్యార్థులకు 50శాతం సీట్లు ఇవ్వాలని కేబినెట్‌ తీర్మానించింది. నల్సార్‌ వర్సిటీకి గతంలో ఇచ్చిన దానికంటే అదనంగా 7 ఎకరాలు ఇస్తాం. రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని నిర్ణయించాం. కేంద్రం కొనుగోలు చేసినా.. చేయకపోయినా మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తాం. దీనికి సంబంధించి కేబినెట్‌ సబ్‌ కమిటీ వేశాం. హైదరాబాద్‌ మెట్రోకు సంబంధించి కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించాం. మెట్రో రెండో దశను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సీఎస్‌ ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటు’’ అని మంత్రి పొంగులేటి తెలిపారు

గుట్టుగా గుట్కా తయారీ.. “ఫ్యాక్టరీ సీజ్​”చేసిన పోలీసులు

“నేటిధాత్రి”..”బిగ్ ఎఫెక్ట్

“నేటిధాత్రి” వరుస కథనాలతో, స్పందించిన పోలీస్ కమిషనర్ “సాయి చైతన్య”

“గుట్కా కింగ్ హీరోలాల్ ఎవరు!?..అనే “నేటిధాత్రి” కథనానికి స్పందించిన నిజామాబాద్ “పోలీస్ అధికారులు”.

గుట్కా స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి

“నేటిధాత్రి”నిజామాబాద్ జిల్లా ప్రతినిధి,:

“నేటిధాత్రి”లోవార్త వచ్చిన నేపథ్యంలో, నిజామాబాద్ పోలీస్ “కమిషనర్ సాయి చైతన్య”, ఆధ్వర్యంలో స్పెషల్ టీం, గుట్కా సప్లై కేంద్రాలను గుర్తించి, వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

నిజామాబాద్​ నగర శివారులో కొందరు అక్రమంగా గుట్కా తయారు చేస్తున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సదరు ఫ్యాక్టరీపై దాడులు చేశారు.నగర శివారులో అక్రమంగా తయారు చేస్తున్న గుట్కాను “సీసీఎస్​ పోలీసులు” పట్టుకున్నారు. జన్నెపల్లి రోడ్డు గల ఓ ఫ్యాక్టరీలో సీసీఎస్​ ఏసీపీ “నాగేంద్ర చారి” ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు చేశారు.
అక్కడ గుట్కా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గుట్కా తయారీకి సంబంధించిన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అసాన్​, అమీర్ అనే నిందితు​లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సదరు ఫ్యాక్టరీలో పాన్​ మసాలా ముసుగులో గుట్కా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అటు లుకలుకలు..ఇటు చిటపటలు!

`మహాఘట్‌ బంధన్‌లో కుంపట్లు.

`బిహార్‌లో నిగ్గు లేతకపోతున్న సర్ధుబాట్లు!

`ఎన్డీయే కూటమి సీట్ల ప్రకటన దాదాపు ఖరారైంది.

`ఇండియా కూటమిలోనే లుకలుకలు కొనసాగుతున్నాయి. 

`కాంగ్రెస్‌ గతంలో 71 సీట్లు పోటీ చేసింది.

`17 సీట్లు మాత్రమే గెల్చుకున్నది.

`ఈసారి 75 సీట్లు కావాలని కాంగ్రెస్‌ మెలిక పెట్టింది.

`అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని తేజస్వీ ప్రకటించారు.

`ఇండియా కూటమిలో కలకలం రేగింది.

`లాలూ కుటుంబం మీద కేసులు తెరమీదకు వచ్చాయి.

`ఆర్జేడీ దారికొచ్చింది..కూటమి బంధం గుర్తుకొచ్చింది.

`కాంగ్రెస్‌కు 60 సీట్లిస్తామంటోంది.

`ఆర్జేడీ 135 సీట్లలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

`మిగతా సీట్లు కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశం వుంది.

`తాజాగా ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు.

`రాజకీయం ఎటు మారుతుందనేది సస్పెన్స్‌గా మారింది.

`ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం పికేకు ఇష్టం లేదు.

`రసవత్తరంగా మారనున్న బిహార్‌ పోరు.

 

హైదరాబాద్‌, నేటిధాత్రి: 

 బిహార్‌ రాష్ట్రంలో ఎన్నికల పొత్తులు ఎంత వరకు వచ్చాయని ప్రశ్నిస్తే సరైన సమాదానం ఎవరి వద్దా లేదు. ముఖ్యంగా ఇండియా కూటమిలో పొత్తులు పొడిచినా, సీట్ల సర్ధుబాటులో లుకలుకలు, చిటపటలు కనిపిస్తున్నాయి. ఓ వైపు బిజేపి, జేడీయూల పొత్తులు, సీట్ల పంపకాలు జరిగిపోయాయి. నామినేషన్లు కూడా వేస్తున్నారు. కాని ఇండియా కూటమిలో మాత్రం కుంపట్లు రేగుతున్నాయి. సీట్ల సర్ధుబాట్లు ఓ కొలిక్కి రాలేకపోతున్నాయి. యూపిఏ హాయాంలో ప్రతిపక్షం ఎప్పటిప్పుడు ఎంతో బలంగా వుంటూ వుండేది. కాని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార బిజేపి వేసే ఎత్తులకు ప్రతిపక్షాలు చిక్కుల్లో పడుతున్నాయి. సహజంగా ప్రతిపక్షాలు వేసే ఉచ్చులోఅదికార పార్టీ పడుతుంటాయి. ఓడిపోతుంటాయి. కాని ఇక్కడ గత పన్నెండు సంవత్సరాల కాలంగా ప్రతిసారి ప్రతిపక్షాలు పదే పదే బోల్తాపడుతున్నాయి. అయినా వాటి నుంచి తేరుకోవాలని ప్రతిపక్షాలు అనుకోవడం లేదు. ఐక్యత ప్రదర్శించడం లేదు. కలిసి సాగుదామన్న భరోసా వాటిలో కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఇండియా కూటమి ఐక్యతకు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇండియూ కూటమి పార్టీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆ పార్టీల కోసం కూడా పొత్తు ధర్మంలో అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆ పార్టీలకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్రాలలో ఆ పార్టీలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అయినా ఆ పార్టీలు రాహుల్‌ గాంధీని నమ్మడం లేదు. అందుకే ఎప్పటికప్పుడు ఇండియా కూటమిలో లుకలుకలు వెగులోకి వస్తునే వున్నాయి. సమస్యలు పొడసూపుతూనే వున్నాయి. ఐక్యతకు బీటలు వారుతూనే వున్నాయి. అయినా ఎంత దిగినా ఫరావాలేదు. బిజేపిని ఓడిరచాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకుడు, రాహుల్‌ గాంధీ చేస్తున్న కష్టం, కూటమి పార్టీలు బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు లుకలుకలు తెరమీదకు తెస్తూనేవున్నారు. రాహుల్‌ గాంధీ మూలంగానే ఇండియా కూటమికి మరింత బలం ఏర్పడిరది. ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతూ వస్తోంది. అయినా ఎన్నికల సమయంలో రాహుల్‌ గాంధీకి హాండ్‌ ఇవ్వడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది బిహార్‌లోనూ జరుగుతుందా? అన్న అనుమానం ఏర్పడుతోంది. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటన చేసింది. నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. కాని బిహార్‌లోని ఇండియా కూటమిలో సీట్ల సర్ధుబాటు పూర్తి కాలేదు. ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, ఆర్జేడీ పోటీ చేస్తాయన్నది తేలలేదు. ఇంకా సీట్ల నెంబర్లే తేల్చుకోలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ 75 సీట్లకు పోటీ చేసింది. కాని కేవలం 17 సీట్లు మాత్రమే గెలిచింది. ఇప్పుడు కూడా అదే నెంబర్‌ కావాలని కోరుతోంది. కాని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ ససేమిరా అంటున్నారు. ఈ విషయంలో ఆ మధ్య తేడాలొస్తే పూర్తి స్దానాలలో పోటీ చేసేందుకు తాము సిద్దమంటూ కూడా తేజస్వీ యాదవ్‌ అన్నారు. అయితే ఇక్కడ రాహుల్‌ గాందీ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. దేశంలోని రాష్ట్రాలలో వున్న ప్రాంతీయ ప్రతిపక్షాలన బలోపేతం చేయడం తన భుజాల మీద వేసుకుంటున్నాడు. నిజానికి ఆ పని రాహుల్‌ గాందీ చేయకూడదు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. కాంగ్రెస్‌ను మరింత ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాహుల్‌ గాందీ ఎన్ని సార్లు ఎన్నికల ప్రచారానికి వచ్చారు? అదే బిహార్‌లో ఎన్నికల ప్రచారానికి ఎన్నిసార్లు వెళ్లారనేది లెక్కతీస్తే అసలు విషయం అర్దమౌతుంది. అదే కర్నాకటలో కూడా అంతే. సొంత పార్టీ బలంగా వున్న రాష్ట్రాలలో పార్టీని అదికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. బలంగా లేని రాష్ట్రాలలో సొంత పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలి. కాని ఆయన ప్రతిపక్షాల ఐక్యత కోసం పాటు పడుతున్నారు. ప్రతిపక్షాలను బలోపేతం చేసే పనిని ఎంచుకున్నారు. ఇది కూడా కాంగ్రెస్‌ పార్టీ తన బలహీనతను తెలియజేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇన్ని సార్లు కాంగ్రెస్‌కు అవమానాలు ఎదురౌతున్నా కాంగ్రెస్‌లో మార్పు కనిపిండచం లేదు. దేశమంతా రాహుల్‌ గాందీ వెంట నడుస్తోంది. ఆయన మాత్రం ప్రతిఫక్షాల వెంట నడుస్తున్నారన్న అభిప్రాయం వక్తమౌతోంది. ఇండియా కూటమిలోనే ఇన్ని లుకలుకలు అని అనుకుంటే కాంగ్రెస్‌ గతంలో ఎప్పుడూ లేనంతగా ఓటమి పాలు కావడం. 2014లో కనీసం 40 సీట్లు గెలవలేకపోవడం. దేశాన్ని అత్యధిక సార్లు పాలించిన, కాంగ్రెస్‌ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకపోవడం అనేది ఆ పార్టీకి మైనస్‌గా మారింది. మూడోసారి 2024లో 100 సీట్లు సాదించి ప్రతిపక్ష హోదా సాదించుకున్నది. అయినా ఆ పార్టీని ఇతర ప్రాంతీయ పార్టీలు లెక్క చేయడం లేదు. కనీసం వారి పార్టీల కోసం కాంగ్రెస్‌ను ఆసరా చేసుకొని గెలుద్దామన్న భావన వారిలోనూ లేదు. సమయం వస్తే కాంగ్రెస్‌ను దూరం పెట్టెందుకు సైతం ప్రాంతీయ పార్టీలు ఆలోచించడం లేదు. ఆ మధ్య జరిగిన డిల్లీ, పంజాబ్‌, హార్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీలు ఇదే అనుసరించాయి. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాయి. ముఖ్యంగా హర్యానాలో కాంగ్రెస్‌పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే పరిస్దితి మరో రకంగా వుండేదన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. ముందు కలిసి సాగాలని అనుకున్నారు. ఎన్నికల సమయం దాకా కలిసి ప్రచారం చేసుకున్నారు. కాని తీరా ఎన్నికల వేల పొత్తులు కుదరక విడిపోయారు. దాంతో కాంగ్రెస్‌ను చిక్కుల్లోకి నెట్టేశారు? ఫలితంగా హార్యానాలో కూడా ముచ్చటగా మూడోసారి బిజేపి కూటమి విజయం సాదించింది. మహరాష్ట్రలోనూ అదే జరిగింది. కాంగ్రెస్‌పార్టీ ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుందనేది కూడా ఎంతో ముఖ్యం. తాత్కాలిక పొత్తులు ఎప్పుడూ పుట్టి ముంచేస్తాయని కాంగ్రెస్‌ తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరి పోరు చేస్తే అనేక సీట్లు గెలిచే అవకాశం వుండేది. కాని స్దానిక రాజకీయాలకు తనను తానే బలి చేసుకుంటోంది. పొత్తు ధర్మంతో తనను తాను తగ్గించుకుంటోంది. ఇది కాంగ్రెస్‌కుతీరని అన్యాయమైపోతోంది. ఇప్పుడు బిహార్‌లోనూ అదే జరుగుతోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ ఇచ్చే సీట్ల మీద ఆదారపడడం అనేది కాంగ్రెస్‌కు ఆశని పాతంగా మారనున్నది. ఓట్‌ చోరీ అనే అంశాన్ని పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకొచ్చి, ఎన్నికల సంఘం మీద రాహుల్‌ గాందీ యుద్దం చేస్తున్నారు. ప్రజలను చైతన్యం చేయడం కోసం పాదయాత్రలు చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు జవసత్వాలు కల్పిస్తున్నారు. ఫలితంగా ఆ పార్టీలకు ఊపిరిపోస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఓటమి పాలైన ఆర్జేడీ ఈసారి గెలిచేందుకు రాహుల్‌ గాంధీ రూపంలో ఆపార్టీకి ఎంతో బలం వచ్చింది. అయినా సరే కాంగ్రెస్‌ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ ససేమిరా అంటోంది. ఇదిలా వుంటే బిహార్‌లో రాజకీయపార్టీని పెట్టి, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ప్రకటించారు. కారణం ఆయన పార్టీకి ప్రజల నుంచి స్పందన రావడం లేదని స్పష్టమైంది. ఒక వేళ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోయినా, తాను ఓడిపోయినా తనకు తీరని నష్టమని తెలుసుకున్నారు. పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు. కాని తాను ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించలేదు. ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ మాద్దతు ఎవరికి అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలా ఇండియా కూమిటికి సరిగ్గా ఎన్నికల సమయంలో పడుతున్న దెబ్బలు కోలుకోకుండా చేస్తున్నాయి. అయితే బిహార్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే మాత్రం కాంగ్రెస్‌కు ఒక రకంగా సంజీవని అవుతుందని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. కాంగ్రెస్‌కు మంచి రోజులు రానున్నాయనే వాటికి సంకేతాలు అని చెప్పక తప్పదు.

చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్

చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షులుగా పొదిల సురేష్

#నెక్కొండ, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

నెక్కొండ మండల కేంద్రంలోని చంద్రుగొండ, బంజరపల్లి, మూడు తండా, గొల్లపల్లి, వాగ్య నాయక్ తండ, లకు సంబంధించి ఆటో యూనియన్ ఏర్పరచుకొని 30 సంవత్సరాలుగా అవుతున్న తరుణంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఆటో యూనియన్ ఎన్నికలను నెక్కొండ నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడం సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికలలో చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ ని, కార్యదర్శిగా చిలువేరు కొమ్మాలను, కోశాధికారి జితేందర్ , కమిటీ మెంబర్ గా కాజా పాషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన అధ్యక్షుడు పొదిల సురేష్ తెలిపారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా నెక్కొండ నవత యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్ చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలనం.

టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలనం.

◆:- కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలీన కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ హైదరాబాద్ లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రజా సేన పార్టీ అధ్యక్షులు ఆవుల హన్మన్లు టీఆర్పీ పార్టీ లో విలీనం చేయడం జరిగింది.ఈ సందర్భంగా, ప్రజా సేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్పీ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజా సేన పార్టీ నాయకులు, మహిళలు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ

ముత్తారం :- నేటి ధాత్రి

 

ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రo ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ సందర్శించడం జరిగింది దీనిలో భాగంగా వైద్య సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగినది. సిబ్బంది ఇప్పుడు హైపటైటిస్ వైరస్ నుండి ఇబ్బంది కలగకుండా ఉండడానికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ మేడం ఇనాగ్రేషన్ చేసి ఇవ్వడం జరిగినది మరియు హాస్పటల్ సిబ్బందికి మరియు సిబ్బందికి రివ్యూ మీటింగ్ తీసుకోవడంతో పాటు పలు సూచనలు చేయడం జరిగినది. రివ్యూ లో భాగంగా ముఖ్యంగా టీవీ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏఎంసీ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ డెలివరీ మీద పలు సూచనలు సలహాలు సూచించారు అందరు సక్రమంగా విధులు నిర్వహించాలని తెలిపినారు ఇన్ పేషెంట్స్ ఓపి ఎంత వస్తుంది అని చూడడంతో పాటు ఇన్ పేషెంట్స్ ఆల్ రిజిస్టర్స్ ను వెరిఫికేషన్ చేశారు ఈ కార్యక్రమం లో జిల్లా టీవీ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ సార్ జిల్లా ఇమినేషన్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ కుమార్ మరియు హాస్పటల్ సిబ్బంది  పాల్గొన్నారు

తంగళ్ళపల్లిలో గర్భిణీ స్త్రీలకు పోషక ఆహార అవగాహన

పోషక ఆహారాలపై గర్భిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

Vaibhavalaxmi Shopping Mall

తంగళ్ళపల్లి మండలంలో. పోషణ మాసం కార్యక్రమం పురస్కరించుకొని. సరైన పోషణ ఆహారంతో. ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా. తీర్చిదిద్దాలని నినాదంతో.C.D.P.O. ఉమారాణి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు. బాలింతలకు 0….6. పిల్ల తల్లులకు. పోషణ ఆహారంపై. అవగాహన చేస్తూ. ఉమారాణి మాట్లాడుతూ ఆరోగ్యం మనది కొనుక్కునేది కాదు అని. సంపాదించుకునేదని. ఆరోగ్యం అనేది అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారమని. పోషకరమైన ఆహారాలు తీసుకున్నప్పుడు. ఆరోగ్యం బాగుంటుందని. అంగన్వాడి కేంద్రం నుంచి వచ్చే. ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని. అలాగే ఫ్రీ స్కూల్ లోకి అంగన్వాడి కేంద్రాలకు పిల్లలను పంపించాలని. ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను. అందిస్తారని. వీటిని ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో.C.D.P.O. ఉమారాణి. సూపర్వైజర్ అంజలి. అంగన్వాడీ టీచర్స్.B. సత్యవతి. P. శోభ.R. లతా. G. పుష్పలత.N. పద్మ.S. శారదా. గర్భిణీలు స్త్రీలు బాలింతలు.పిల్లలు తదితరులు పాల్గొన్నారు

నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలి…

నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

విద్య వ్యవస్థ అభివృద్ధి చర్యలలో భాగంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ తో కలిసి పరిశీలించారు.పనుల నిర్వహణలో శ్రేష్టమైన సిమెంట్,ఇసుకను వినియోగించాలని,పనులలో నాణ్యత పాటించాలని తెలిపారు.తెలంగాణ సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల,సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ,మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ లతో కలిసి పరిశీలించారు.అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,ఇందులో భాగంగా పాఠశాలలో చేపట్టిన విద్యుత్ వ్యవస్థ,మూత్రశాలలు, భోజనశాల ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా నీటి ట్యాంకులు నిర్మించి త్రాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటుందని,ఈ నేపథ్యంలో పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.చెన్నూరు పట్టణంలోని భవిత కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.స్థానిక ప్రజలకు వేగవంతమైన,మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని,అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తి చేసే విధంగా గుత్తేదారు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు

42% రిజర్వేషన్ల కోసం బీసీ బంద్‌కు సగర సంఘం మద్దతు

బిసి బంద్ కు సగర సంఘం మద్దతు

42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు పోతే సహించేది లేదు

సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సగర

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

Vaibhavalaxmi Shopping Mall

తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 వ తేదీన తెలంగాణ బిసి జేఏసీ ఇచ్చిన బంద్ కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. గురువారం గచ్చిబౌలి లోని సగర సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ బంద్ ద్వారా బిసి ల చైతన్యం ప్రదర్శించాలని పిలునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదని అన్నారు. రాజ్యాంగ సవరణ చేసి చట్ట పరంగా నే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ, విద్య, ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగరులు బంద్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, చిలుక శ్రీనివాస్ సగర, దిండి శేఖర్ సగర, సంయుక్త కార్యదర్శి సంగిశెట్టి గంగాధర్ సగర, కార్యనిర్వాక కార్యదర్శి బంగారి ఆంజనేయులు సగర, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మోడల రవి సగర, సగర సంఘం నాయకులు కేపీ వెంకటేష్ సగర, ఖాజా సగర, రాజు సగర, కృష్ణ సగర తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version