◆-: కళ్యాణోత్సవానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, మహిళలు.
◆-: పట్టువస్త్రాలు సమర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంఘం,అష్ట తీర్థముల సంఘ మం.. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి నవహీనిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళ వారం నాడు శ్రీ కేతకి ఆలయంలో పార్వ తీ పరమేశ్వరుల కళ్యాణం మహోత్స వం అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. ఈ కళ్యాణ మహోత్సవానికి జహీ రాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షే ట్కార్, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్టావు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు ఆలయ ప్రాంగాణంలో చూడముచ్చట గా అలంకరించిన పచ్చని తోరణాలు, పూ ల పందిళ్ళతో, పార్వతీ పరమేశ్వరుల క ళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఆలయ పురోహితులు, పేద బ్రాహ్మణుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యా లు, అశేష భక్త జనాలు
తిలకిస్తుండగా అమ్మవారి మాంగళ్య సూత్రధారి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అర్చకు లు, వేద బ్రాహ్మణుల మంత్రోచరణా లతో కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయంలో గణపతి పూ జతో పాటు, దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు అర్చనలతో కేతకీ ఆలయం భక్తులతో ఓం నమశివాయ నామస్మరణతో మారుమో గింది. ఈ కళ్యాణ మహోత్సవానికి అశేష భక్తజనంతో పాటు, పలు రాష్ట్రాలకు చెం దిన భక్తులతో పాటు, వివిధ గ్రామాల ప్ర జా ప్రతినిధులు, ప్రజలు, మహిళామణు లు, కళ్యాణోత్సవం తిలకించేందుకు హాజరయ్యారు. ఆలయ అర్చకులతో పాటు వేద బ్రాహ్మణుల మంత్రోచ్చణాల మధ్య కళ్యాణ మహోత్సవ ముహూర్త ఘడియలు సమీపిస్తున్న కొద్ది పార్వతీ పరమేశ్వరులకళ్యాణం చూదం రారండి అనే భావనతో భక్తుల ఎదురుచూస్తు ండగా 7 గంటలకు కళ్యాణ మహోత్సవా న్ని అర్చకులు, వేద బ్రాహ్మణులు, ముగించారు. స్వామి వారి కళ్యాణ మహోత్స వంలో అధిక మొత్తంలో దంపతులు పాల్గొన్నారు. అనంతరం భక్తులు కళ్యా ణ ప్రాప్తిరస్తూ అంటూ వారు పార్వతీ పరమేశ్వరులకు తీసుకొచ్చిన ముత్యాలు తలంబ్రాలను వేసి కళ్యాణ వైభోగం కనులారా చూసి ఆనందించారు. కళ్యాణ మహోత్సవానికి హాజరైన వారందరికీ స్వామి వారి ఆశీస్సులతో పాటు కుకుమ తో పాటు తీర్థప్రసాదాలు ఆలయ అర్చకు లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పటేల్ కేతకి ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, ఝరాసంఘం గ్రామ సర్పంచ్ వినోద బాలరాజ్, గ్రామ ఉపసర్పంచ్ గడ్డం మమతా అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పాటిల, మాజీ ఎంపిటిసి ఎంపీ రజిని ప్రియ సంతోష్ పాటిల్, మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్, టౌన్ ప్రెసిడెంట్ ఏజాద్ బాబా నాగన్న పటేల్ సిను పటేల్ సజ్జన్ నాగేశ్వర్ మల్లన్న పటేల్ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నేత్రపర్వంగా కేతకీలో రథోత్సవం…
ఝరాసంగం: అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 12:00 గంటలకు పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. పార్వతీ పరమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆలయం నుండి రథోత్సవం వరకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకు వచ్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి రథంపై అధిష్టించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, ఢమరుక నాదాలతో అశేష జనవాహిని మధ్య రథోత్సవం నయనానందకరంగా సాగింది. రాత్రి 3 గంటల వరకు రథం ఊరేగింపు కొనసాగింది. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జహీరాబాద్ డీఎస్పీ స్వయం పర్యవేక్షణలో ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ భారీ బందోబస్తు మధ్య ఉత్సవాలు ముగిశాయి.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల .. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదలైంది. తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 26న నోటిఫికేషన్ ఇస్తారు. నామినేషన్ల దాఖలుకు మార్చి 5 గడువు తేదీ. 6న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు మార్చి 9 వరకు గడువు.
భారత ఎన్నికల సంఘం (ECI) రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ (ఫిబ్రవరి 18, 2026)న విడుదల చేసింది. దీని ప్రకారం 10 రాష్ట్రాల్లో మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలు ఏప్రిల్ 2026లో వివిధ తేదీల్లో ఖాళీ అవుతున్నాయి. వీటిలో తెలంగాణ నుంచి 2 స్థానాలు (కేఆర్ సురేష్ రెడ్డి – BRS, అభిషేక్ మను సింఘ్వీ- INC) ఉన్నాయి. వీరి పదవీకాలం ఏప్రిల్ 9, 2026తో ముగుస్తుంది. వీటిని ద్వైవార్షిక ఎన్నికల భాగంగా ఇప్పుడు భర్తీ చేయనున్నారు.
`ఎమ్మెల్యే స్థాయి నుంచి కౌన్సిలర్, ఎంపీటీసీ దాకా ఎగిరిపోవాలి.
`కొత్త రాజకీయం.. అభివృద్ధి మంత్రం!
`ఓట్లు కొనాలే.. గెలిస్తే అమ్ముడు పోవాలే!
`పార్టీలకే నైతిక విలువలు లేవు, మనమెంత అనుకోవాలె.
`గెలిచిన తెల్లారే పదవి కోసమో, పైసల కోసమో పార్టీ మారలే!
`గెలిచిన కండువా తీసేసి, అధికార పార్టీ కండువా కప్పుకోవాలె.
`పార్టీ పేరు మీద గెలిచినా అధికార పార్టీ కి దగ్గరగా ఉండాలే.
`పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు సంపాదిచుకోవాలె!
`పార్టీలు ముఖ్యం అనుకుంటే అప్పులు తీరవు!
`పైసలు సంపాదించాలంటే పనులు దక్కవు!
`రాజకీయంగా ఇబ్బందులు రావొద్దనుకుంటే అధికార పార్టీ దోస్తీ కావాలే!
`మళ్ళీ ఎలక్షన్ లకు సొమ్ములు కావాలే.
`ఓడిపోయియినా అప్పుల పాలు కాకుండా ఉండాలే.
`దీపమున్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకోవాలె!
`ఒక్కసారి గెలిచినా మూడు తరాలకు సరిపడ సంపాదించాలి.
`పైసలుంటే ఏ పార్టీలో నైనా చేరొచ్చు.. రాజకీయం చేయొచ్చు.
హైదరాబాద్, నేటిధాత్రి: రాను రాను రాజకీయాలలో తీరు మారుతోంది. నాయకుల్లో అవకాశ వాదాలు పెగుతున్నాయి. ఏ నాయకుడు ఎప్ప్పుడు ఏ పార్టీలో వుంటాడో అన్నది ఎవరూ చెప్పలేని రోజులొచ్చాయి. ఎన్నికల వరకు ప్రత్యర్ధులు. తర్వాత ఏ పార్టీతో సంబంధాలు కలుపుకుంటారో అర్దం కాని పరిస్తితులు. ఇదేకొత్త రాజకీయం. నాయకులు చెప్పే అభివద్ది మంత్రం. ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయడం కోసమంటూ మాటలు చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఎన్నికల ముందు పార్టీలు మారితే రాళ్లతో కొట్టండని పిలుపునిస్తారు. ఎన్నికల తర్వాత అదే నాయకులు పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడికి పోతుంది సమాజం అని ఎవరూ అడగొద్దు. ఎన్నికల దాకానే మనకు వంగి వంగి దండాలు. పార్టీలను నమ్మిన జనం పిచ్చోళ్లు? అని నాయకులు నవ్వుకుంటారు. అయినా జనం మారరు. నాయకులు మారరు. ఎందుకంటే ఎన్నికలొచ్చినప్ప్పుడు ఓట్లు కొనాలి. అదష్టం బాగుండి గెలిస్తే అధికార పార్టీలోకి వెళ్లిపోవాలి. రాజకీయ పార్టీలకే సిద్దాంతాలు లేవు. నైతిక విలువలు అసలే లేవు. అలాంటప్ప్పుడు నాయకులు వుండాలని కూడా అనుకోవడం సరైంది కాదేమో? నాయకులు పార్టీలకు బానిసలు కాదు. పల్లకి మోసే బోయిలు కాదు. గెలిచిన తర్వాత వారి ఇష్టం. మనస్సాక్షి చెప్పినట్లు నడుచుకోవడం అని సర్ధిచెప్ప్పుకోవడం. అంతే.. గెలిచిన మరునాడే పార్టీ మారాలే. నిధుల కోసమో, పదవులకోసమో, కాంట్రాక్టుల కోసమో, ఆఖరుకు పెట్టిన పెట్టుబడి రాబడి కోసమో పార్టీ మారాలే? అంతే!! ఇదే రివాజు ఇప్ప్పుడు. గెలిచిన కండువా వెంటనే తీసెయ్యాలి. అదికార పార్టీ Å£ండువా కప్ప్పుకోవాలి. ఏ పార్టీ మీద గెలిచిన సరే అధికార పార్టీకి మాత్రమే దగ్గరుండాలి. సొంత పార్టీకి దూరమవ్వాలి. అది ఎమ్మెల్యే అయినా, జడ్పీటిసి, ఎంపిటిసి, కౌన్సిలర్ ఎవరైనా సరే పార్టీ మారితేనే ఇప్ప్పుడు పరపతి. మీడియాలో కూడా నిత్యం కనపడేది. వార్తల్లో వుండేది. జనం మర్చిపోకుండా వుండే రాజకీయ స్టాటజీ. కొత్తగా వున్నా, అది వింతగా వున్నా ఇదే నయా రాజకీయం. నిత్యనూతనం. జనం నోళ్లలో నానే నాయకత్వం. ప్రతిపక్ష పార్టీలో నోరు తెరవకుండా వుండడంకన్నా, అదికార పార్టీలో చేరి నోరు మూసుకున్నా మీడియా వచ్చి మాట్లాడిస్తుంది. పుణ్యానికి ప్రచారం దక్కుతుంది. పార్టీలే ముఖ్యమనుకుంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెట్టిన పెట్టుబడి రాదు. అప్ప్పులు తీరవు. ఎన్నికల కోసం, రాజకీయం కోసం, జనం సేవ కోసం ఇంత కాలం పెట్టిన ఖర్చులు చేతికి రావాలే. గెలిచేదాకా ఖర్చు పెట్టి, గెలిచినంక ఖర్చు చేయాలంటే మళ్లీ డబ్బులు కావాలి. అందుకే అదికార పార్టీ వైపు చూడాలి. ఒక వేళ మళ్లీ ఎన్నికల్లో అవకాశం వస్తుందో రాదో? ఒక వేళ వచ్చినా మళ్లీ నిలబడాలన్నా, గెలవాలన్నా సొమ్ములు కావాలి. దీపమున్నప్ప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఎమ్మెల్యే స్దాయి అయితే ఒక్కసారి గెలిస్తే చాలు మూడు తరాలకు సరిపడా సంపాదించాలే. ఎమ్మెల్యే అయి కూడా ఏమీ లేదంటే కూడా నామూషీగా చూసే రోజులు. నిజాయితీ పరుడు అని పేరు ఈ రోజుల్లో సరిపోదు. ఇంటికి వచ్చిన కార్యకర్తలకు Å£డుపు నిండా బువ్వ పెట్టాలే. ఏదైనా ఆపదుందంటే నాలుగు పైసలు జేబుల పెట్టాలే? లేకుంటే కార్యకర్తలు గోడ చాటు నుంచి తిట్టే తిట్లు వినకుంటూ చెవులు మూసుకోవాలే. దానికన్నా పార్టీ మారితే చాలు. పైసలుంటే ఏ పార్టీలోనైనా చేరొచ్చు. పదవి పరపతి పొందొచ్చు. నలుగురు అనుచరులను ఎప్ప్పుడూ వెంట తిప్ప్పుకోవచ్చు. అందుకే కౌన్సిలర్ అయినా సరే అవకాశమొస్తే పార్టీలు వెంటనే మారాలే..ఇదే రాజకీయ ట్రెండ్.. మున్సిపల్ చైర్మన్ల ఎంపికలు పార్టీల కలయికలు చూస్తే స్పష్టంగా అర్దమౌతోంది. నిన్నటి దాకా రాజకీయం రణ కేత్రంలో బద్ద శుత్రవులుగా కొట్లాడుకున్నా సరే పదవుల కోసం కలిసి పోవాలే. కలిసిపోవాలి. Å£డుపులో కత్తులు వున్నా, కౌగిలించుకోవాలే. కలిసిపోవాలే. పదవులంటేనే ఆత్మీయతలు. ఎన్నికలయ్యే దాకా ఎత్తులు పై ఎత్తులు ఎన్ని వేసుకున్నా సరే, పదవుల కోసం ఒకరి ఒకరు తోడు నీడలు కావాలే. పదవులు పంచుకోవాలే. ఎన్నికల ముందు ఎన్ని మాట్లాడుకున్నా అన్నీ పూరామాఫ్ అనుకోవాలే. ఫైటింగ్‌లో శత్రువులు కాని, పదవులకు అందరూ స్నేహితులే అనే రాజకీయాలు నేర్చుకోవాలి. పదవుల పందేరంలో పార్టీల కోపతాపాలన్నీ పక్కపెట్టాలే. అంతే పదవులొస్తే అదే పదివేలు అనుకోవాలే. దిజగారిన రాజకీయాలకు పరాకాష్ట అని జనం అనుకుంటే నవ్వుకున్నా పట్టించుకోవద్దు. జనం నమ్మకాలతో పుంజీతమాటలాడుకోవాలే. లేకుంటే రాజకీయాలు చేయలేరు. జనం మధ్యలో వుండలేరు. అన్ని ఎన్నికల ముందు బిఆరఎస్ బిజేపి ఒక్కటే అని కాంగ్రెస్ విమర్శలు విన్నాం. కాని ఇప్ప్పుడు ఏ పార్టీ ఏ పార్టీకి మద్దతు అనేది ఆలోచించకూడదు. కాంగ్రెస్ బిజేపి ఒక్కటే అంటూ బిఆరఎస్ అనేకసార్లు ప్రచారాలు చేసుకున్నారు. ఇప్ప్పుడు ఎవరికి ఎవరు మిత్రులో అర్ధం కాకుండా చేసుకుంటున్నారు. అలియాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు బిజేపి మద్దతిచ్చింది. మున్సిపల్‌లో కలిసిపోయింది. కాంగ్రెస్, బిఆరఎస్ ఒక్క తాను ముక్కలే అని బిజేపి అనేక మార్లు ప్రచారాలు. మున్సిపలఎన్నికల ముందు బీరాలు పలికిన నాయకులు. పదవుల విషయానికి వచ్చే సరికి అక్రమ కలయికలు. పదవులు వస్తే చాలు మేము మేమంతా ఒ క్కటే. జనాలను పిచ్చోళ్లను చేయడమే రాజకీయమంటే. రాజకీయాలంటే సామాన్యులకు అర్ధం కావని మరోసారి తెలంగాణలో రాజకీయ పార్టీలు నిరూపించాయి. మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చాయి. చాల వరకు మెజార్టీ చైర్మన్ స్దానాలు కాంగ్రెస్ గెల్చుకున్నది. అయితే కొన్ని చోట్ల హంగ్ పలితాలు కనిపించాయి. వాటిని కైవసం చేసుకోవడం కోసం పార్టీలు తమ సిద్దాంతాలు పక్కన పెట్టేశాయి. నీతి మాలిన రాజకీయాలకు తెరతీశాయి. అందులో ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలు ఇందుకు మినహాయింపు కాదు. లేదని మరోసారి రుజువు చేశాయి. ఇంత కన్నా దిగజారుడు తనం వుంటుందా? అని ఎవరూ అనుకోవద్దు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు రాజకీయ నిర్ణయాలు ఇలాగే వుంటాయని నాయకులు అనుకున్నారు. ఇంతకు మించి ఏమీ చేయలేక ఇలా చేయకతప్పడం లేదని మద్దతు పలుకుతున్నాయి. వీలైన చోట్ల గెలిచిన కౌన్సిలర్లను,కార్పోరేటర్లను లాగేసుకున్నారు. వీలు కాని చోట పరస్పరం సహకరించుకున్నారు. ఫలితాలు వెలువడిన నుంచి ఈ అక్రమ రాజకీయాలు మొదలు పెట్టారు. ఖమ్మం జిల్లాలో ఓ మున్సిపాలిటీలో కమ్యూనిస్టులు మెజార్టీ స్దానాలు గెల్చుకున్నారు. అక్కడ తామే చైర్మన్ గిరి ఏలుతామని సిపిఐ చెప్పింది. కాని కాంగ్రెస్ ససేమిరా అని చెప్పింది. ఇ ంతలో బిఆరఎస్ రంగంలోకి దిగింది. మేము మద్దతిస్తామని చెప్పింది. అందుకు సిపిఐ కూడా సరే అన్నది. కాని రాత్రికి రాత్రే మళ్లీ సమీకరణాలు మారిపోయాయి. నిన్నటి దాకా మాతో పొత్తులో వుండి, ఇప్ప్పుడు బిఆరఎస్ మద్దతు తీసుకోవడం సరైంది కాదని కాంగ్రెస్ ఒక అడుగు వెనక్కి వేసింది. చెరి సగం చైర్మన్ పీఠం అని బేరం పెట్టింది. రెండున్నరేళ్లపాటు ఒకరు, మరో రెండున్నరేళ్లపాటు ఇంకొకరు అని ఒప్పందానికి వచ్చాయి. మధ్యలో దూరిన బిఆరఎస్‌కు చేదు అనుభవం ఎదురైంది. గత ఎన్నికల్లో బిఆరఎస్ ఓటమిలో ప్రధాన బాగస్వామిగా వున్న కమ్యూనిస్టులతో పొత్తుకు వెళ్లడం బిఆరఎస్ దిగజారుడు తనానికి నిదర్శనం. దాన్ని అదిగమించి కాంగ్రెస్ పన్నిన వ్యూహం బిఆరఎస్‌కు దిమ్మతిరిగేలా చేసింది. ఇదేం రాజకీయమని అనుకునేలో లోపు చైర్మన్ల ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒక్కటయ్యాయి. ఏ పార్టీ ఏ పార్టీకి మద్దతు పలుకుతున్నాయో అర్దం కాని అయోమయ పరిస్దితులు వచ్చి చేరాయి. కొన్ని చోట్ల బిఆరఎస్ బిజేపి మద్దతు పలికింది. కొన్ని చోట్ల బిజేపికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. అసలు కాంగ్రెస్ , బిజేపిలు మద్దతు తెలుపుకోవడం విచిత్రం. ఇది బిజేపి నాయకులు ఎలా జీర్ణించుకుంటున్నరన్నది పెద్ద ప్రశ్న. రాజకీయంగా దేశ వ్యాప్తంగా బద్ద శత్రువులు. ఓ వైపు దేశమంతా కాంగ్రెస్‌ను తూడ్చేసిన బిజేపితో పొత్తు పెట్టుకొని చైర్మన్ పదవుల ఎంపికలో లాలూచి పడే పరిస్దితి ఎందుకొచ్చింది. పార్టీ వర్గాలు ఏం చేస్తున్నాయి. ఎందుకు స్పందించకుండా వున్నాయి. బిఆరఎస్ పార్టీని నిత్యం తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్లే ఎంపి రఘునందన్ రావు బిఆరఎస్‌కు మద్దతు పలికినట్లు వార్తలు రావడం విచిత్రంగా వుంది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా తమ ఇష్టాను సారం ఓటింగ్ వేయొచ్చని పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? కాంగ్రెస్, బిజేపి కలిసి బిఆరఎస్‌ను పూర్తిగా తుడిచి వేయాలని పదే పదే ప్రకటనలు చేసే కరీంనగర్ ఎంపి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మేయర్ పీఠంకోసం పరోక్షంగా బిఆరఎస్ మద్దతు తీసుకున్నారు? ఇదెక్కడి రాజకీయం?
· మంత్రుల అవినీతిని పట్టించుకోకపోవడం పెద్ద తప్పిదం
· వాస్తు ప్రకారం కట్టిన సెక్రటేరియట్ నిర్మాణం
· అది పూర్తయింది…పార్టీ ఓడింది
· నమ్మకాలతో పాలన సాగదు
· వాస్తవ దక్పథంతోనే అది సాధ్యం
· స్వీయ తప్పిదాలే దెబ్బతీసిన వైనం
హైదరాబాదH, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫిబవ్రరి 17న తన 722వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. తొలుత కాంగ్రెస్‌లో తన పొలిటిక్ కెరీర్‌ను ప్రారంభించినా,
1983లో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత మహానటుడు ఎన్టీఆర్ వీరాభిమానిగా పార్టీలో చేరి 2001 వరకు కొనసాగి, ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం తెలంగాణ రాష్ట్రసమితిని (టీఆరఎస్)ను స్థా పించి దాదాపు దశాబ్డన్నరకాలంపాటు అప్రతిహతంగా ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. కాంగ్రెస్ యువ నాయకుడి స్థానంనుంచి ఆయన ప్రస్థానం తెలంగాణ రూపశిల్పి దశకు ఎదిగింది. తెలంగాణకు జరుగుతున్న నష్టంపై మొదట్లో కేవలం ఈ ప్రాంత మేధావులు మాత్రమే సుదీర్ఘ చ ర్చించేవారు. వీరిలో ప్రొఫెసర్ జయశంకర్, బియ్యాల జనార్థనరావు, కాళోజీ నారాయణ రావు వంటి ఉద్దండులుండేవారు. తర్వాత ఈ ఉద్యమాన్ని ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లడానికి వీలుగా అప్పటికి తెలుగుదేశంలో వున్న కేసీఆర్‌ను వీరు మోటివేట్ చేయడంతో చివరకు ఉద్యమ నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి అంగీకరించి, రంగంలోకి దిగారు. ఆయన ఉద్యమపథంలోకి ప్రవేశించిన కాలంలో ఎవరికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్న నమ్మకం ఏకోశానా వుండేది కా దు. పైకి ఎవరైనా మద్దతు పలికినా ఇది సాధ్యమయ్యేది కాదని చాటుమాటున పెదవి విరిచిన రోజులవి. అంతటి అపనమ్మక పరిస్థితుల మధ్య చిమ్మచీకట్లో ఉద్యమం అనే లాంతరు పట్టు కొని ప్రత్యేక రాష్ట్ర సాధన అనే వేకువ వైపునకు ప్రయాణం సాగించారు. ఎవరు తోడున్నా లేకున్నాలక్ష్యం వైపు నిజాయతీగా సాగితే తర్వాతి కాలంలో క్రమంగా మద్దతు లభిస్తుందన్న సత్యం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ పథాన్ని గమనిస్తే తేలిగ్గా అర్థమవుతుంది.
తెలంగాణ తెలుగు యాసలో పదాల గారడీతో విషయాన్ని విడమరచి చెప్పి సమాజాన్ని తనవైపు కు తిప్పుకున్న ఆధునిక యుగ నాయకుడుగా రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ప్రతి మనిషి పుట్టుకకు ఒక కారణం వుంటుందని కర్మసిద్ధాంతం చెబుతుంది. కానీ కొందరి పుట్టుక కొన్ని అనూహ్య మార్పులకు దోహదపడుతుంది. నిజానికి తెలంగాణ సమస్య మేధావుల మెదళ్లలో నానుతున్నా, ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మేధోమధనం చేసిన వారు, కేసీఆర్‌ను ఎంపిక చేసిన తీరు, సమయం అత్యద్భుతం! అంటే సరైన సమయంలో, సరైన నాయకుడిని ముందుకు తీసుకురావడంలో వారు అత్యద్భుత మేధస్సును ప్రదర్శించారు. తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ నమ్మకాన్ని కేసీఆర్ వమ్ము చేయలేదు. రాష్ట్రాన్ని సాధించి, అంతకు ముందు ఎవరూ కలలో కూడా ఊహించని ఒక గొప్ప దశ్యాన్ని ఆవిష్కరించారు. నిజం చెప్పాలంటే కేసీఆర్ తెలంగాణ సాధనకే జన్మించిన నాయకుడుగా చెప్పుకోవాలి. కేసీఆర్ దగ్గర గొప్పతనమేమంటే, పనిలోకి దిగే ముందు, దాని గురించి సంపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవడం. ఇది ఆయన వద్ద నేర్చుకోవలసిన అత్యంత ముఖ్యమైన లక్షణం. పనిపై అవగాహన ఏర్పరచుకున్నప్పుడు రాబోయే ఒడిదుడుకులను ముందుగానే అంచనా వేసి, తదనుగుణంగా తగిన వ్యూహంతో ముందుకు సాగవచ్చు. ఉద్యమంలో చావో రేవో అనే దశ వస్తుందన్నది, గొప్ప పో రాటాలు, ఉద్యమాలను పరిశీలించినవారికి, వాటిల్లో పాలుపంచుకున్నవారికి బాగా తెలుస్తుంది. అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహాత్మాగాంధీ కూడా 1942లో క్విట్ ఇండియా ఉద్య మంలో ‘సాధించు లేదా మరణించు’ అని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కూడా ఆమరణ నిరాహారదీక్ష చేసి మరణం అంచుల వరకు వెళ్లిన తర్వాతే ఒక్కసారి పరిస్థితులు మారిపోయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవ డానికి మార్గం సుగమమైంది. అంతకుముందు ఉ ద్యమం ఎంతటి తీవ్రస్థాయికి చేరుకున్నా, రాజకీయాలు, ప్రతి రాజకీయాలు నడిచాయే తప్ప రా ష్ట్రోదయం జరుగుతుందన్న విశ్వాసం ఏర్పడలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా రాజకీ యాలను ఒక్కసారిగా మలుపు తిప్పిన 2009లో కేసీఆర్ చేసిన 11రోజుల నిరాహారదీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
2014లో రాష్ట్రం ఆవిర్భవించి, తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీర్ 2023 వరకు తిరుగులేని నాయకుడిగా రాష్ట్రాన్ని పాలించారు. ఆయన పాలనా కాలంలో ఎన్నో సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి తెచ్చారు. ఆయన ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, రైతుబం ధు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకే ఒక గొప్ప మణిహార మని చెప్పాలి. తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మలచిన గొప్ప ప్రాజెక్టు. తక్కువ కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తిచేసిన లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్‌దే. మేడిగడ్డ వద్ద ఒక పిల్లర్ కుంగినంత మాత్రాన ప్రాజెక్టు వైఫల్యం కాదు. మరమ్మతులు చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ప్రాజెక్టుకైనా నిర్మించిన తర్వాత కొన్ని సమస్యలు రాకమానవు. ఇది సహజం. వాటిని ఒక్కసారి పరిష్కరిస్తే ప్రాజెక్టులు అజరామరంగా నిలిచిపోతాయి! ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వం రాజకీయ కక్షలను పక్కన బెట్టి, లక్షలాది రైతుల ప్రయోజనాన్ని దష్టిలో పెట్టుకొని కాళేశ్వరం మరమ్మతులను వేగంగా పూర్తిచేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో రాష్ట్రంలో విపరీతం గా విద్యుత్ కోతలుండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 24/7 కరెంటు సరఫరా చేసి శభాషఅనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఇదే పద్ధతిని అనుసరించి, అక్కడి ప్రజలకు నిరంతరం విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడం చరిత్ర!
ఎంతటి గొప్ప నాయకులైనా, కొన్ని లోపాలుండటం సహజం. కేసీఆర్ అందుకు అతీతుడు కా దు. ఆయన తన కెరీర్‌లో చేసిన తప్పిదం, టీఆరఎస్‌ను, బీఆరఎస్‌గా మార్చడం. అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. ఉద్యమకాలంలో దాదాపు దశాబ్దన్నరపాటు ప్రజల నోళ్లలో విపరీతం గా నానిన తెలంగాణ రాష్ట్ర సమితి స్థానంలో భారత రాష్ట్ర సమితిగా మార్చిన పేరు అంతగా ఆకర్షించలేకపోయింది. ఉద్యమకాలంలో టీఆరఎస్ అనేది రాష్ట్ర సాధనకు ప్రధాన అస్త్రంగా ఉపయోగపడింది. అదే బీఆరఎస్‌గా మార్చిన తర్వాత, ఉద్యమం నాటి స్థాయి పరిస్థితులు లేవు కనుక దీనిపై ప్రజల్లో పెద్దగా స్పందన కలగలేదు. ఒకరకంగా చెప్పాలంటే బీఆరఎస్ పేరు అచ్చిరాలేదే మోననిపిస్తుంది. ఇప్పటికైనా టీఆరఎస్‌గా మార్చుకొని రాజకీయాలు చేస్తే కలిసిరావచ్చునేమో. బీఆరఎస్‌గా మార్చిన తర్వాత పార్టీ పతనం మొదలై 2024 నాటికి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుచుకోని స్థాయికి దిగజారిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కేసీఆర్ రాజకీయంగా చేసిన రెండు తప్పులు ప్రధాన కారణమని చెప్పాలి. మొదటిది ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నిర్లక్ష్యం చేయడం కాగా రెండవది రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయించడం. ఈ రెండూ కేసీఆర్‌ను ప్రతిపక్షంలో కూర్చునేలా చేశాయి. తన మంత్రివర్గంలోని చాలా మంది మంత్రులు విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తినా ఆయన పట్టించుకోలేదు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ మాదిరిగానే తనకూ తిరుగుండదన్న అతి విశ్వాసాన్ని ప్రదర్శించారు. కనిమొళి అరెస్టయి తీహార్ జైలుకెళ్లినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఎంతగా విలవిలలాడారో, ఇక్కడ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టయి తీహార్ జైలుకు వెళ్లినప్పుడు కూడా కేసీఆర్ ఒక తండ్రిగా తీవ్ర మనోవేదనకు గురైవుంటారు. ఇప్పుడు అదే కుమా ర్తె కవిత తన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుండటం, వద్ధాప్యంలో ఆయనకు తీరని క్షోభ కలిగించే అంశం. ప్రస్తుతం ఆయన వయసు 72 సంవత్సరాలు, గతంలో కిందపడి తుంటి విరిగిన నేపథ్యంలో గతంలో చూపిన ఉద్యమ ఉత్సాహం, వ్యూహ ప్రతివ్యూహ చాతుర్యాన్ని ఇప్పుడు ఆయన ప్రదర్శించలేకపోవచ్చు. కాకపోతే కేటీఆర్, హరీష్‌రావులు కాంగ్రెస్‌ను సమర్థవంతంగా కాంగ్రెస్‌ను ఎదిరిస్తూ వస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆరఎస్ పట్ల ప్రజల్లో ఇంగా గట్టి సానుకూలత వున్నదన్న సంగతి స్పష్టమైంది. స్థానిక ఎన్నికల్లో దిగువస్థాయి నాయకుల్లో ఆ యారాం, గయారాంలు, కప్పదాట్లు, జంపింగ్‌లు సర్వ సాధారణం కనుక రాబోయే అసెంబ్లీ ఎ న్నికలకు వీటిని ప్రాంతిపదికగా కొంతవరకు మాత్రమే తీసుకోగలం కానీ, పూర్తిగా ఆధారపడి ఒక నిర్ణయానికి రావడం కష్టం. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే బీఆరఎస్ ఇంకా తెలంగాణ ప్రజల్లోతన బలాన్ని పూర్తిగా కోల్పోలేదన్నది సుస్పష్టం. ఇదిలావుండగా కేసీఆర్ తెలంగాణ భవన్‌లో తన 72వ పుట్టినరోజు వేడుకలను 72కిలోల కేక్ కట్‌చేసి మరీ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మద్దతుదార్లు ఆయన పునరాగమనాన్ని తీవ్రంగా ఆకాంక్షిస్తున్నా, ప్రత్యర్థి రాజకీయాలు, ప్రతికూలతలు ప్రస్తుతానికి అడ్డంకిగా వున్నాయి. రానున్న కాలంలో ఆయన మరింత ఉత్సాహంగా పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలని ఆకాంక్షిద్దాం.
కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్ పట్టణంలో నిన్న ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆమనగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ లో గెలిచిన అభ్యర్థి పత్యానాయక్ ని కాంగ్రెస్ బిజెపి కలసి కుట్ర పన్ని కాంగ్రెస్ లో కి తీసుకొని మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహించి పత్యా నాయక్ ఇంటిని ముట్టడించారు దాంతో అధికార పార్టీ నేతలు ఉప్పల వెంకటేష్, ఆమనగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ పాపిశెట్టి రామకృష్ణ పై అక్రమ కేసులు బనయించడం తో అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కల్వకుర్తి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే పెట్టిన కేసులను ఎత్తివేయాలి లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాలు అనుబంధ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంస్థల నాయకులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తమ అధినాయకుడు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయమే బీ ఆర్ ఎస్ శ్రేణులు పాలమూరు చౌరస్తాలో గుమిగూడారు.. బీఆర్ఎస్ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, తెలంగాణ ఫుడ్ కమీషన్ చైర్మన్ గోలి శ్రీనివారెడ్డిల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణుల మధ్యన కేక్ కట్ చేసి తమ బాస్ కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ, బీఆర్ఎస్ శ్రేణులు ముక్త కంఠంతో లాంగ్ లీవ్..లాంగ్ లీవ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు..బాణాసంచాలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం… నిన్న ఆమనగల్ లో జరిగిన పరిణామం బీ ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ ను మభ్యపెట్టి తమ పార్టీలో చేర్చుకుని రాజకీయాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. ఆమనగల్ మున్సిపాలిటీలో ఒక్కటంటే ఒక్క కౌన్సిలర్ స్థానం గెలిచిన కాంగ్రెస్ లోపాయికార ఎత్తుగడలతో చైర్మన్ కుర్చీ దక్కించుకోవడం సిగ్గుచేటని.. ఢిల్లీ నుండి గల్లీ దాకా ఎక్కడలేని విధంగా కాంగ్రెస్ బీజేపీతో కలిసిపోవడం ఇక్కడి నాయకులకే చెల్లిందని ఓటర్లు సిగ్గుపడుతున్నారని.. ప్రశ్నించిన మా పార్టీ నాయకుడు ఉప్పల వెంకటేష్ పైన.. బీఆర్ఎస్ కార్యకర్తలపైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ తో అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో నిర్వహించి.. కాంగ్రెస్..బీజేపీలు చేసినవి నీచ రాజకీయాలని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్యర్యంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు:-
వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-
మంగళవారం రోజున వరంగల్ ఉమ్మడి జిల్లా బి ఆర్ ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ అధినేత, తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా బి ఆర్ ఎస్ లీగల్ సెల్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది గుర్రాల వినోద్ కుమార్ నేతృత్వంలో హనుమకొండ లోని బి ఆర్ ఎస్ లీగల్ సెల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
బి ఆర్ ఎస్ న్యాయవాదులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్ లు పంపిణి చేశారు, ఈ సందర్బంగా “కెసిఆర్ లాంగ్ లైవ్ “అంటూ నినాదాలు చేస్తూ కెసిఆర్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆ తరువాత జనార్దన్ గౌడ్, గణేష్ , రంజిత్ పత్రిక ముఖం గా గత అనుభవాలను నెమరు వేసుకున్నారు .
ఇట్టి కార్యక్రమం లో బి ఆర్ ఎస్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ గోకికర్ శివరాజ్ సీనియర్ న్యాయవాదులు, సహోదర్ రెడ్డి, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, వద్ది రాజ్ గణేష్, శ్యామ్ సుందర్ రావు, సోమేశ్వర్ రావు, చింతం సదానందం, ములుగూరి రంజిత్, నబి, వసంత్, వెంకటేశ్వర్ రావు బి, సిద్ధం యుగేందర్, వెంకట రమణ, శ్రీరాం కిరణ్, వేణుపటేల్, నాయిని రవి,శ్రీ రామ్,కొండయ్య, ఎలామాద్రి రవి,అనిల్ నాయక్, రమేష్, నాగరాజు తది తర న్యాయవాదులు పాల్గొన్నారు
బిఆర్ఎస్ గణపురం మండల అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ సూరీడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకులు,భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు, తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం కేకు కట్ చేసి స్వీట్లు,పండ్లను పంచి బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబురాలను నిర్వహించారు అనంతరం కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి,దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో తెలంగాణ ను తన పాలన దక్షతతో మొదటి స్థానంలో నిలిపిన తెలంగాణ జాతిపిత కెసిఆర్ అని తెలిపారు.తెలంగాణ సంస్కృతి మాండలికంలో లోతుగా పాతుకుపోయిన శక్తివంతమైన, భావోద్వేగభరితమైన తరచుగా కవితాత్మకమైన తెలుగు ప్రసంగాలకు ప్రసిద్ధి కెసిఆర్ అని అన్నారు.. .కెసిఆర్ తరచుగా ఆత్మగౌరవం,రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం మరియు పేదల అభివృద్ధి కోసం పాటుపడిన మహానేత అన్నారు. . తన పది యేండ్ల పాలనలో ఎన్నో సంక్షేమా కార్యక్రమాలను,అభివృద్ధికార్యక్రమలను జోడేద్దులాగా ముందుకు తీసుకెళ్లారు. .కుల మతాల వివక్ష లేకుండా పాలించిన మహనీయుడు కెసిఆర్ ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమం లో మండలం బి ఆర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు,ఉద్యమకారులు, నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, యూత్ నాయకులు కెసిఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం మున్సిపాలిటీ కేసముద్రం విలేజ్ లో మరణించిన బొల్లోజు ప్రార్థన చారి పార్థివ దేహానికి నివాళి అర్పించిన 8 వ మరియు 9వ వార్డు కౌన్సిలర్స్ వేముల భారతి శ్రీనివాస్ రెడ్డి,కనుకుల సుభద్ర రాంబాబు మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని తెలిపి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.వారితో పాటు అరెందుల శ్రీనివాస్, తుంపిల్ల వెంకన్న,నిమ్మల రామకృష్ణ ,కమటం సురేందర్, యాకంబ్రం, సముద్రాల మహేష్, దోసపాటి అచ్యుత్ మరియు తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జమ్మికుంట నూతన పాలకవర్గం
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్
జమ్మికుంట, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి
జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకోవడం పట్టణ ప్రజల అభివృద్ధి పట్ల ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ప్రమాణస్వీకారం అనంతరం నూతన పాలకవర్గం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ని మర్యాదపూర్వకంగా కలిశారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో నూతన మున్సిపల్ చైర్మన్ మొలుగు దిలీప్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ (జావేద్) , కౌన్సిలర్ ఫిరోజ్ ఖాన్ కలిసి కేటీఆర్ ని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. జమ్మికుంట పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఆధునిక రహదారులు, మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, సీసీ రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, పట్టణ సౌందర్యీకరణ వంటి అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధికి అనుకూలమని, జమ్మికుంట పట్టణంలో మరింత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రతి వర్గానికీ న్యాయం చేసే విధంగా పాలన అందిస్తామని తెలిపారు.బీఆర్ఎస్ నాయకత్వం మార్గదర్శకత్వంలో జమ్మికుంటలో అభివృద్ధి నూతన దశ ప్రారంభమైందని నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ధీమా వ్యక్తం చేశారు
సింగరేణి సంస్థలో ఎస్సీ& ఎస్టి కార్మికుల ఎదుర్కుంటున్న పలు సమస్యలపై చర్చించిన.
ఎస్సీ & ఎస్టి అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిలుక రాజనర్సు.
బెల్లంపల్లి నేటిధాత్రి :
ఈ రోజు మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ని అలాగే, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఐ ఈ డి కిరణ్ కుమార్ ని, నూతనంగా ఏరియాకు బదిలీ పై వచ్చిన డీ.జీ.మ్ పర్సనల్ సిహెచ్.అశోక్ ని మర్యాద పూర్వకంగా కలిసి,సింగరేణి లోని కార్మికులు ఎదుర్కుంటున్న పలు సమస్యలపైన మాట్లాడడం జరిగినది ముఖ్యంగా సింగరేణి సంస్థలో ఎస్సీ & ఎస్టి కార్మికులు ఎదుర్కుంటున్న పలు సమస్యలు.అలగే సింగరేణి కార్మికులకు రావలసిన పదోన్నతుల విషయం ఆర్ ఓ ఆర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ లో కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రమోషన్లు వచ్చే విధంగా చూడాలని. జిఎం ని కోరడం జరిగినది. జిఎం సానుకూలంగా స్పందిస్తూ ఆర్ ఓ ఆర్ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూస్తానని అర్హులైన కార్మికులకు తక్షణమే రిజర్వేషన్ ఫలాలు అందేలా చూస్తానని అన్నారు ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది.
నూతన సొసైటీ ఏర్పాటు చేయాలని గ్రామాల సర్పంచులు డీసీవో కరుణాకర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్, నగరం, నంద గోకుల్ గ్రామాలకు సొసైటీ లేకపోవడం వల్ల రామాయంపేట సొసైటీ పై ఆధార పడవలసి వస్తుందని తమ సొసైటీ తమకు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాను ప్రకాష్ రెడ్డి, నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్, సుశీల సురేష్, మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, ఉడెపు కృష్ణ, లింగం, లింగం గౌడ్, రవి, కుమార్ తదితరులు ఉన్నారు.
జహీరాబాద్ హైవే సంగారెడ్డి మెయిన్ రోడ్డులో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అతివేగమే దీనికి కారణమని చెబుతున్నారు.స్కూటర్ నడుపుతున్న షాక్, బొలెరో కారును అధిగమించడానికి ప్రయత్నించాగా.బొలెరో కారు బోల్తా పడింది, ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తికి గాయమైంది, అతని చేయి తెగిపోయింది.అతన్ని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.స్కూటర్ నడుపుతున్న వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం.
నడికూడ మండల కేంద్రం తో పాటు వరికోల్ గ్రామంలో బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కేసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.వరికోల్ గ్రామంలోని శ్రీరామలింగేశ్వర ఆలయం లో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కేక్ కట్ చేసి స్విట్లు పంపిణి చేశారు.ఈ సందర్బంగా మండల ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి,హనుమకొండ విద్యార్థి సంఘం విభాగం జిల్లా కో ఆర్డినేటర్ పోచంపల్లి రఘుపతి,మాజీ వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి, వరికోల్ గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి,ఉపసర్పంచ్ భుజంగరావు మాట్లాడతూ తెలంగాణ వస్తుందో రాదో అన్న అనుమానన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన అపర భగీరథుడు,మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి కెసిఆర్,ఆయన లేనిదే ఈరోజు స్వరాష్ట్ర స్వప్నం సాకారమయ్యేది,కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో బీడు భూములను పచ్చని పొలాలుగా మార్చారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత ఆయనది. రైతు బంధు,రైతు బీమా వంటి పథకాలు దేశానికే దిక్సూచిగా నిలిచాయి రాజకీయ నాయకుడిగానే కాకుండా,ఒక కవిగా, సాహితీవేత్తగా,తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు కెసిఆర్ మరిన్ని వసంతాలు పూర్తి చేసుకుని,నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని,వారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు మరింత సుఖసంతోషాలతో ఉండాలని బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ నందికొండ జయపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరమ్ మాజీ అధ్యక్షులు తిప్పర్తి సాంబశివరెడ్డి,బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి లింగాల తిరుపతి,మాజీ సర్పంచ్ గూడెం కృష్ణమూర్తి,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి,రావుల కిషన్ ఉపసర్పంచ్ రాసమళ్ళ మల్లికార్జున్,కంకణాల వినయ్ గోనెల్ శరత్,రామ్ చందర్ వీరమళ్ళ మల్లారెడ్డి,కిన్నెర మణి,సంఘని వేణు దేవేందర్ రావు,కాందాల అశోక్,కోడెపాక నరేష్, నారగని రాకేష్,మధూకర్ బాబా,శ్రీధర్,తదితర బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మెట్పల్లి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ లకు సన్మానం మెట్ పల్లి ఫిబ్రవరి 17 నేటి ధాత్రి
మెట్ పల్లి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో మెట్ పల్లి పట్టణ మున్సిపల్ చైర్మన్ నూతనంగా ఎన్నికైన మైలారపు లింబాద్రి ని వైస్ చైర్మన్గా నియమితులైన ఓంకారి నవీన్ ని 23వ వార్డు కౌన్సిలర్ గా కోయల్కర్ స్రవంతి లింగేశ్వర్ ని నూతనంగా ఎన్నికైన సందర్భంగా మర్యాదపూర్వకంగా సంఘ భవనంలో సంఘ అధ్యక్షులు కొండ మురళి సంఘ సభ్యులు వారిని ఘనంగా శాలువతో సన్మానం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ మీ అందరి సహకారంతో మున్సిపల్ చైర్మన్ గా నియమితుల కావడం సంతోషకరమని మీకు ఏ సహాయం కావాలన్నా తన వద్దకు ఎప్పుడైనా రావచ్చని మీకు ఎల్లప్పుడు సహాయ సహకారం అందిస్తానని అలాగే పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ అధ్యక్షులు కొండ మురళి కార్యదర్శి ఇంద్రాల ఈశ్వర్ కోశాధికారి మద్దే నపల్లి స్వామి ఉపాధ్యక్షులు ఎదులాపురం కుమార్ గౌరవ అధ్యక్షులు కొడిమ్యాల వెంకటస్వామి మ్యాడపు అశోక్, గడిపల్లి నారాయణ భూమేశ్వర్ చంద్రగిరి రామకృష్ణ మ్యాడపుశ్రీనివాస్,రవి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం, ఛైర్మన్గా యూనుస్ ఏకగ్రీవం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ చైర్మన్ గా మహ్మద్ యూనూస్, వైస్ చైర్మన్ గా కొత్తకాపు శిరీషారెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికకు సంబంధించి నిర్ణీత సమ యానికి ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్తో సహా 20 మంది కాంగ్రెస్ సభ్యులు మున్సిపల్ కార్యా లయానికి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు సహా 19మంది బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేరుకున్నారు. కోరం సభ్యు లందరూ హాజరైన అనంతరం ప్రత్యే కాఅధికారి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. చైర్మన్ గా యునస్, వైస్ చైర్మన్ గా శిరీషారెడ్డి ఎన్నికవగా వారికి అభి నందనలు తెలిపారు.
మెట్‌పల్లి పట్టణంలో కలుషిత నీటి సమస్య -అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలవిజ్ఞప్తి ఫిబ్రవరి17 మెట్ పల్లి నేటిదాత్రి
మెట్ పల్లి పట్టణంలోని 14వ వార్డులో మిషన్ భగీరథ నల్ల ద్వారా వచ్చే తాగునీరు కలుషితంగా వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కిరాయికి ఉంటున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ విషయంపై గృహిణి ఎశమేని నాగవ్వ మాట్లాడుతూ: మేము కిరాయికి ఉంటున్నాం. ఈ ఇంట్లో బోర్ లేదు. నల్ల నీరే మా కుటుంబానికి ఆదారం. కానీ ఇలా మురికి, కలుషిత నీరు వస్తే త్రాగడానికి, స్నానానికి, వంటకు, బట్టలు ఉతకడానికి ఎలా ఉపయోగించాలి?” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలకు ఈ పరిస్థితి మరింత ప్రమాదకరమని తెలిపారు. కలుషిత నీరు వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎశమేని నాగవ్వ తో పాటు స్థానిక ప్రజలుఅధికారులకు విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటి నాణ్యతను పరీక్షించాలని పైప్‌లైన్లను పరిశీలించాలని శుద్ధమైన తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
#రాదన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన కారణజన్ముడు కేసీఆర్ .
# 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం.
# రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ విధ్వంసం.
నల్లబెల్లి , నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను మంగళవారం మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి ఉత్సాహభరిత వాతావరణంలో భారీ బాణాసంచా పేల్చి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ముఖ్య అతిథిగా హాజరై భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్ది స్వప్న మాట్లాడుతూ.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వయంపాలన లక్ష్యంగా ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని పద్నాలుగేళ్ల సుదీర్ఘ ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ వంటి సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన దూరదృష్టి గల నాయకుడు కేసీఆర్ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం పెద్ద చెరువు సమీపంలో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ , సర్పంచులు నాగేల్లి జ్యోతి ప్రకాష్,, పులి రమేష్, మచ్చిక రవి, ఉపసర్పంచ్ గుమ్మడి వేణు, గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, క్లస్టర్ ఇన్‌చార్జులు గందె శ్రీనివాస్ గుప్తా, ఇంగ్లీ శివాజీ, మామిళ్ళ మోహన్ రెడ్డి, సట్ల శ్రీనివాస్ గౌడ్,మండల సర్పంచుల ఫోరం మాజీ చైర్మన్ నాన బోయిన రాజారాం యాదవ్ మాజీ సర్పంచులు గుండాల కుమార స్వామి, గన్నె బోయిన చేరాలు, ఊరటి అమరేందర్, గోనెల పద్మ నరహరి, మాజీ ఎంపీటీసీ లు జన్ను జయరావు , వైనాల వీరస్వామి, పోడేటి ప్రకాశం, పాలెపు రవీందర్ రావు, అభివృద్ది కమిటీ చైర్మన్ నాగేల్లి శ్రీనివాస్, మద్ది మేడారం మాజీ చైర్మన్ చిట్యాల సీతారాం రెడ్డి, బోట్ల పవన్, పాండవుల రాంబాబు, వార్డు సభ్యులు నాగేల్లి అనిల్, కనకం నవీన్, మాజీ ఉప సర్పంచ్ దాసరి నాగేశ్వర్ రావు, గుండాల శ్రీశైలం, పోతునూరి సుభాష్, బూస సదయ్య, వేల్పుల రవి, మైల గాని సురేష్, గోల్య, సురేందర్, పుట్ట రవి, చందర్, రాజు యూత్ నాయకులు మేడిపల్లి రాజు, సద్దాం, మధు, రెడ్డి ప్రశాంత్, గుండాల సుమన్, పెండ్యాల మహేందర్, కొత్తపల్లి రామ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ వేదికపై భారత పతాకం రెపరెపలు * అబుదాబిలో ఓపెన్ మాస్టర్స్ క్రీడల్లో రెండు బంగారు పతకాలు * 3000 మీటర్లు, 1500 మీటర్ల పరుగుల్లో సత్తా చాటిన డాక్టర్ కొలన్ జగజ్జీవన్ రెడ్డి
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి
ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీల్లో నిలబడటం ఒక్కటే పెద్ద సవాలు కాగా, అందులోనే రెండు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడం అరుదైన ఘనతగా నిలుస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో ఎమిరేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ మాస్టర్స్ గేమ్స్–2026లో భారతదేశానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్ డాక్టర్ కొలన్ జగజ్జీవన్ రెడ్డి 3000 మీటర్లు, 1500 మీటర్ల పరుగుపందాల్లో మొదటి స్థానంలో నిలిచి రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. ఫిబ్రవరి 6న ప్రారంభమైన ఈ క్రీడా మహోత్సవంలో 148 దేశాలకు చెందిన సుమారు 27 వేల మంది క్రీడాకారులు పాల్గొనగా, తీవ్ర పోటీ మధ్య ఆయన ప్రదర్శించిన పట్టుదల, స్థైర్యం ప్రత్యేకంగా నిలిచింది. • గత విజయాల జాడలోనే కొత్త రికార్డు: ఇప్పటికే 2024లో అమెరికాలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకం సాధించిన ఆయన, అదే ఆత్మవిశ్వాసంతో అబుదాబి వేదికపై మరోసారి ప్రతిభ చాటుతూ దేశానికి కీర్తి తీసుకువచ్చారు. • దేశ గౌరవమే లక్ష్యం: భారత పతాకం ఎగురవేయడం ప్రతి క్రీడాకారుడి కల కాగా, స్వర్ణ పతకాలతో దేశానికి గౌరవం తేవడం గర్వకారణమని డాక్టర్ జగజ్జీవన్ రెడ్డి పేర్కొన్నారు; రాబోయే రోజుల్లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించి దేశ ప్రతిష్ఠను మరింత పెంచాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన గౌడ సంఘం నేతలు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ లను మంగళవారం తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలుపొంది, ఇటీవలె చైర్మన్ గా బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్ లు ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గౌడ సంఘం నేతలు వారికి శాలువాలు కప్పి, స్వీట్లు పంచి, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ చైర్మన్ గా బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్ లు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. కష్టపడి పని చేసే వాళ్లకు పదవులు దక్కడం అభినందనీయమన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తూనే, గౌడ సంఘం సమస్యలు కూడా పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. భూపాలపల్లిలో గౌడ సంఘం కులస్తుల ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణం తో పాటు, గౌడ కులస్తులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా వారికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి నర్సింగం గౌడ్, గౌరవ అధ్యక్షులు ఏరుకొండ సంపత్ కుమార్ గౌడ్, జిల్లా నాయకులు కొండపాక సాంబయ్య గౌడ్, కంకటి రాజవీరు గౌడ్, తడుక సుధాకర్ గౌడ్, పెరుమాండ్ల తిరుపతి గౌడ్, బుర్ర రమేష్ గౌడ్, బుర్ర లక్ష్మణ్ గౌడ్, ముత్యాల రాజబాబు గౌడ్, నాగపురి సమ్మయ్య గౌడ్, గైని ఎల్లగౌడ్, సదానందం గౌడ్, జగన్ గౌడ్, రమేష్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గండి చిరంజీవి గౌడ్, కె.వి అశోక్ గౌడ్, చిర్రా అశోక్ గౌడ్, గట్టు రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.