జహీరాబాద్: కారు బోల్తా, ఆరుగురికి తీవ్ర గాయాలు…

జహీరాబాద్: కారు బోల్తా, ఆరుగురికి తీవ్ర గాయాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బుచ్చినెల్లి సమీపంలోని 65వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఒక కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది..

అతివగం కారణంగా బోల్తా పడ్డ బోలోరో ఒకరికి గాయాలు…

అతివగం కారణంగా బోల్తా పడ్డ బోలోరో ఒకరికి గాయాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ హైవే సంగారెడ్డి మెయిన్ రోడ్డులో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అతివేగమే దీనికి కారణమని చెబుతున్నారు.స్కూటర్ నడుపుతున్న షాక్, బొలెరో కారును అధిగమించడానికి ప్రయత్నించాగా.బొలెరో కారు బోల్తా పడింది, ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తికి గాయమైంది, అతని చేయి తెగిపోయింది.అతన్ని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.స్కూటర్ నడుపుతున్న వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version