కల్వకుర్తిలో ఘనంగా KCR జన్మదిన వేడుకలు..

కల్వకుర్తిలో ఘనంగా KCR జన్మదిన వేడుకలు..

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తమ అధినాయకుడు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయమే బీ ఆర్ ఎస్ శ్రేణులు పాలమూరు చౌరస్తాలో గుమిగూడారు.. బీఆర్ఎస్ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, తెలంగాణ ఫుడ్ కమీషన్ చైర్మన్ గోలి శ్రీనివారెడ్డిల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణుల మధ్యన కేక్ కట్ చేసి తమ బాస్ కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ, బీఆర్ఎస్ శ్రేణులు ముక్త కంఠంతో లాంగ్ లీవ్..లాంగ్ లీవ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు..బాణాసంచాలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం… నిన్న ఆమనగల్ లో జరిగిన పరిణామం బీ ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ ను మభ్యపెట్టి తమ పార్టీలో చేర్చుకుని రాజకీయాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. ఆమనగల్ మున్సిపాలిటీలో ఒక్కటంటే ఒక్క కౌన్సిలర్ స్థానం గెలిచిన కాంగ్రెస్ లోపాయికార ఎత్తుగడలతో చైర్మన్ కుర్చీ దక్కించుకోవడం సిగ్గుచేటని.. ఢిల్లీ నుండి గల్లీ దాకా ఎక్కడలేని విధంగా కాంగ్రెస్ బీజేపీతో కలిసిపోవడం ఇక్కడి నాయకులకే చెల్లిందని ఓటర్లు సిగ్గుపడుతున్నారని.. ప్రశ్నించిన మా పార్టీ నాయకుడు ఉప్పల వెంకటేష్ పైన.. బీఆర్ఎస్ కార్యకర్తలపైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ తో అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో నిర్వహించి.. కాంగ్రెస్..బీజేపీలు చేసినవి నీచ రాజకీయాలని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఈ ప్రభుత్వం మొదటి నుండి యూరియా విషయంలో విఫలమే..

ఈ ప్రభుత్వం మొదటి నుండి యూరియా విషయంలో విఫలమే

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మాట్లాడుతూ.. రైతులు వాన కాలంలో యూరియా సకాలంలో దొరుకక ఇబ్బంది పడ్డట్టుగానే యాసంగిలో కూడా పడుతున్నారు దానికి తోడు యూరియాకు ఒక యాప్ ను తీసుకొచ్చి చదువురాని రైతులను చాలా ఇబ్బంది గురి చేస్తున్నది ఈ ప్రభుత్వం ఇంకా కొద్ది రోజులు ఆగితే రైతులు డిగ్రీ పాసైన సర్టిఫికెట్లు తెచ్చుకుంటేనే యూరియా ఇస్తాం అనే నిబంధన తీసుకువచ్చేటట్టుగా అనిపిస్తుంది యూరియా దొరకక రైతులు పంటలు వేయాలంటే భయపడుతున్నారు ఈ ప్రభుత్వం మొదటి నుండి యూరియా విషయంలో ఇబ్బంది పెడుతూనే ఉంది ఈ ప్రభుత్వం మారితేనే రైతులకు యూరియా దొరుకుతుందా ఏ లాంటి షరతులు లేకుండా రైతులకు యూరియా అందించాలి యూరియా అందించడం శాత గాదని చెప్పకుండా కొత్త యాప్ ని పట్టుకొచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వానికి ఈ అదే రైతులతో అన్ని మండల కేంద్రాలలో ధర్నా రాస్తారోకాలు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version