నిరుపేదలకు ఇల్లు మంజూరు…

నిరుపేదలకు ఇల్లు మంజూరు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి మున్సిపాలిటీలోని 3,12వార్డులలో శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారం తో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ రత్నమాల ఆనంద్ కుమార్ పూజ చేశారు.ఈ సందర్బంగా బృంగి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి, కుడుముల చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు లాలు నాయక్, రాజేష్,క్రాంతి,కార్తీక్ వార్డు ఆఫీసర్ శివ తదితరులు ఉన్నారు.

ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆగ్రహం…

ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆగ్రహం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

కల్వకుర్తి నియోజకవర్గం లోని
ఆమనగల్ పట్టణంలో నిన్న ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆమనగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ లో గెలిచిన అభ్యర్థి పత్యానాయక్ ని కాంగ్రెస్ బిజెపి కలసి కుట్ర పన్ని కాంగ్రెస్ లో కి తీసుకొని మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహించి పత్యా నాయక్ ఇంటిని ముట్టడించారు దాంతో అధికార పార్టీ నేతలు ఉప్పల వెంకటేష్, ఆమనగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ పాపిశెట్టి రామకృష్ణ పై అక్రమ కేసులు బనయించడం తో అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కల్వకుర్తి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే పెట్టిన కేసులను ఎత్తివేయాలి లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాలు అనుబంధ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంస్థల నాయకులు పాల్గొన్నారు.

అండలమ్మ కు అండగా నిలిచిన ఉప్పల వెంకటేష్.

అండలమ్మ కు అండగా నిలిచిన ఉప్పల వెంకటేష్.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామానికి చెందిన అండాలమ్మ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అండాలమ్మకు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తము ఉప్పల వెంకటేష్ 5000 రూపాయలు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఓరుగంటి వెంకట్ రెడీ 5000 రూపాయలు అండాలమ్మ భర్త అంజయ్యకు కొడుకు సందీప్ కు హైదరాబాద్ లో ఉప్పల వెంకటేష్ నివాసంలో 10000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పద్మ నరసింహ, ఓరుగంటి వెంకటరెడ్డి, వంశీ,మాజీ వార్డ్ మెంబర్ సభ్యుడు మహేష్, విజయ్, కార్తీక్,సందీప్, పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version