తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదిన వేడుకలు…

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదిన వేడుకలు

నడికూడ,నేటిధాత్రి:

 

నడికూడ మండల కేంద్రం తో పాటు వరికోల్ గ్రామంలో బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కేసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.వరికోల్ గ్రామంలోని శ్రీరామలింగేశ్వర ఆలయం లో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కేక్ కట్ చేసి స్విట్లు పంపిణి చేశారు.ఈ సందర్బంగా మండల ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి,హనుమకొండ విద్యార్థి సంఘం విభాగం జిల్లా కో ఆర్డినేటర్ పోచంపల్లి రఘుపతి,మాజీ వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి, వరికోల్ గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి,ఉపసర్పంచ్ భుజంగరావు మాట్లాడతూ
తెలంగాణ వస్తుందో రాదో
అన్న అనుమానన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన అపర భగీరథుడు,మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి కెసిఆర్,ఆయన లేనిదే ఈరోజు స్వరాష్ట్ర స్వప్నం సాకారమయ్యేది,కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో బీడు భూములను పచ్చని పొలాలుగా మార్చారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత ఆయనది. రైతు బంధు,రైతు బీమా వంటి పథకాలు దేశానికే దిక్సూచిగా నిలిచాయి రాజకీయ నాయకుడిగానే కాకుండా,ఒక కవిగా, సాహితీవేత్తగా,తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు
కెసిఆర్ మరిన్ని వసంతాలు పూర్తి చేసుకుని,నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని,వారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు మరింత సుఖసంతోషాలతో ఉండాలని బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు కోరుకున్నారు
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ నందికొండ జయపాల్ రెడ్డి,
సర్పంచుల ఫోరమ్ మాజీ అధ్యక్షులు తిప్పర్తి సాంబశివరెడ్డి,బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి లింగాల తిరుపతి,మాజీ సర్పంచ్ గూడెం కృష్ణమూర్తి,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి,రావుల కిషన్
ఉపసర్పంచ్ రాసమళ్ళ మల్లికార్జున్,కంకణాల వినయ్ గోనెల్ శరత్,రామ్ చందర్ వీరమళ్ళ మల్లారెడ్డి,కిన్నెర మణి,సంఘని వేణు దేవేందర్ రావు,కాందాల అశోక్,కోడెపాక నరేష్, నారగని రాకేష్,మధూకర్ బాబా,శ్రీధర్,తదితర బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు…

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.

#రాదన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన కారణజన్ముడు కేసీఆర్ .

# 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం.

# రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ విధ్వంసం.

నల్లబెల్లి , నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను మంగళవారం మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి ఉత్సాహభరిత వాతావరణంలో భారీ బాణాసంచా పేల్చి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ముఖ్య అతిథిగా హాజరై భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్ది స్వప్న మాట్లాడుతూ.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వయంపాలన లక్ష్యంగా ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని పద్నాలుగేళ్ల సుదీర్ఘ ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ వంటి సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన దూరదృష్టి గల నాయకుడు కేసీఆర్ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
అనంతరం పెద్ద చెరువు సమీపంలో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ , సర్పంచులు నాగేల్లి జ్యోతి ప్రకాష్,, పులి రమేష్, మచ్చిక రవి, ఉపసర్పంచ్ గుమ్మడి వేణు, గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, క్లస్టర్ ఇన్‌చార్జులు గందె శ్రీనివాస్ గుప్తా, ఇంగ్లీ శివాజీ, మామిళ్ళ మోహన్ రెడ్డి, సట్ల శ్రీనివాస్ గౌడ్,మండల సర్పంచుల ఫోరం మాజీ చైర్మన్ నాన బోయిన రాజారాం యాదవ్‌ మాజీ సర్పంచులు గుండాల కుమార స్వామి, గన్నె బోయిన చేరాలు, ఊరటి అమరేందర్, గోనెల పద్మ నరహరి, మాజీ ఎంపీటీసీ లు జన్ను జయరావు , వైనాల వీరస్వామి, పోడేటి ప్రకాశం, పాలెపు రవీందర్ రావు, అభివృద్ది కమిటీ చైర్మన్ నాగేల్లి శ్రీనివాస్, మద్ది మేడారం మాజీ చైర్మన్ చిట్యాల సీతారాం రెడ్డి, బోట్ల పవన్, పాండవుల రాంబాబు, వార్డు సభ్యులు నాగేల్లి అనిల్, కనకం నవీన్, మాజీ ఉప సర్పంచ్ దాసరి నాగేశ్వర్ రావు, గుండాల శ్రీశైలం, పోతునూరి సుభాష్, బూస సదయ్య, వేల్పుల రవి, మైల గాని సురేష్, గోల్య, సురేందర్, పుట్ట రవి, చందర్, రాజు యూత్ నాయకులు మేడిపల్లి రాజు, సద్దాం, మధు, రెడ్డి ప్రశాంత్, గుండాల సుమన్, పెండ్యాల మహేందర్, కొత్తపల్లి రామ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version