బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నపోలీసులు…

బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నపోలీసులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులను పోలీసులు చిరగ్పల్లి వద్ద సోమవారం అదుపులోకి తీసుకున్నారు.ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ అరెస్టులు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఈ చర్యలను ఖండించిన జిల్లా ప్రధాన కార్యదర్శి నౌబాద్ జగన్నాథ్, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును అణచివేస్తున్నారని, అక్రమ అరెస్టుల ద్వారా ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు నౌబాద్ జగన్నాథ్ హిందూస్, జగన్, వడిగార్పల్లి డిప్యూటీ సర్పంచ్ పాండు, యువ మోర్చా జి.ఎస్ మడివాలయ స్వామి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పరకాలలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు…

పరకాలలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

పరకాల,నేటిధాత్రి

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపునిచ్చిన నేపథ్యంలో పరకాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలో సోమవారం ఉదయం పరకాల పట్టణంలో పోలీసులు ముందస్తు చర్యగా బీజేపీ నాయకులను అరెస్టు చేశారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాచం గురుప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్,9వ వార్డ్ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారి,పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, జిల్లా నాయకుడు బాసాని సోమరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆగ్రహం…

ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆగ్రహం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

కల్వకుర్తి నియోజకవర్గం లోని
ఆమనగల్ పట్టణంలో నిన్న ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆమనగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ లో గెలిచిన అభ్యర్థి పత్యానాయక్ ని కాంగ్రెస్ బిజెపి కలసి కుట్ర పన్ని కాంగ్రెస్ లో కి తీసుకొని మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహించి పత్యా నాయక్ ఇంటిని ముట్టడించారు దాంతో అధికార పార్టీ నేతలు ఉప్పల వెంకటేష్, ఆమనగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ పాపిశెట్టి రామకృష్ణ పై అక్రమ కేసులు బనయించడం తో అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కల్వకుర్తి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే పెట్టిన కేసులను ఎత్తివేయాలి లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాలు అనుబంధ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంస్థల నాయకులు పాల్గొన్నారు.

విప్ జారీకి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు…

విప్ జారీకి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు…

మంచిర్యాల డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు విప్ జారీ చేసేందుకు మున్సిపాలిటీ కార్యాలయం లోకి వెళుతుండగా అకారణంగా పోలీసులు అడ్డుకున్నారని మంచిర్యాల డిసిసి అధ్యక్షులు పి రఘునాథరెడ్డి ఆరోపించారు. పోలీసుల సూచనల మేరకు మున్సిపాలిటీ కార్యాలయం నుండి బయటకు వచ్చి టెంట్ వద్ద కూర్చున్నానని ఆయన వివరించారు. గొడవలకు ఆస్కారం లేకుండా పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారాలు జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version