నాగర్ కర్నూలులో 650 పడకల ఆసుపత్రి నిర్మాణం ప్రారంభం

235 కోట్ల రూపాయలతో మంజూరైన 650 పడకు ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ

నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా

నాగర్ కర్నూలు జిల్లాలో మెడికల్ కాలేజీకి అనుసంధానంగా 10 ఎకరాల స్థలంలో 235 కోట్లతో మంజూరు అయిన 650 పడకల ఆసుపత్రిని ఈరోజు నవ తేజ నిర్మాణ సంస్థ యజమాన్యంతో కలిసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు
వీలైనంత త్వరగా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే గారు సంస్థ వారికి సూచించడం జరిగింది ఎక్కడ కూడా పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారు సూచించారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు ప్రిన్సిపల్ సంబంధిత అధికారులు పట్టణ మాజీ కౌన్సిలర్ నాయకులు పాల్గొన్నారు

16వ వార్డులో నూతన బోరు ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ 16 వార్డులో నూతనంగా వేసిన బోరును ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
నేటి ధాత్రి నాగర్ కర్నూలు జిల్లా

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రతి వార్డులో ప్రతిరోజు రెండు గంటలు పర్యటించి కాలనీ సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కమిషనర్ ఏ ఈ కాలనీ ప్రజలు పాల్గొన్నారు

నాగర్ కర్నూల్‌లో బీఆర్ఎస్ నేతల కాంగ్రెస్ చేరికలు

బి ఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోచేరిన మాజీ కౌన్సిలర్స్ బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్
నేటి ధాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

 

కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బి ఆర్ ఎస్ మాజీ కౌన్సిలర్ నాయకులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు
ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సర కాలంలో బి ఆర్ ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరముల కాలంలోని దాదాపుగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి 100 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే గారు తెలిపారు అభివృద్ధి పనుల్లో భాగంగానే ఈరోజు మాజీ కౌన్సిలర్ మోతిలాల్ ఖాజా ఖాన్ ఇసాక్ తిరుమల యాదవ్ బి ఆర్ ఎస్ టౌన్ ప్రెసిడెంట్ బాదం రమేష్ ఇమ్రాన్ హరికృష్ణ రవీంద్ర చారి అనేకమంది నాయకులు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు

జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తులు ఆహ్వానం

నాగర్ కర్నూల్ జిల్లా టౌన్
నేటి ధాత్రి

 

 

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఎఫ్ బిఎఫ్ బాధిత కుటుంబానికి 20వేల రూపాయలు ప్రయోజనం అందించే పథకానికి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవచ్చని నాగర్ కర్నూల్ ఎమ్మార్వో గారు ఒక ప్రకటనలో తెలియజేశారు దానికి సర్కులేషన్ ఒకటి విడుదల చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version