అధైర్య పడొద్దు అండగా ఉంటాము..

అధైర్య పడొద్దు అండగా ఉంటాము

కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు విజయ్ నాయుడు

నేటిదాత్రి చర్ల

 

చర్ల మండలంలో ఇటీవల కాలంలో చిరకాల మిత్రుడు గొంపల్లి గ్రామానికి చెందిన మచ్చ నాగేంద్రకుమార్ అకాల మరణం చెందడం జరిగింది మరణించిన మిత్రుని కుటుంబానికి చర్ల మండలం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు విజయ నాయుడు ఆధ్వర్యంలో మిత్ర బృందం 1998 మరియు 1999 టెన్త్ బ్యాచ్ తరుపున నాగేంద్ర కుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయంగా 54వేల ఐదువందలు రూపాయలు ఇవ్వడం ఆ కుటుంబానికి అందించారు ఈ కార్యక్రమంలో విజయ నాయుడు వల్లె వెంకటరావు కిరణ్ కుమార్ ఖజ్జం విజయభాస్కర్ పాపారావు కొర్సా శ్రీనివాస్ గుంటుపల్లి నరేష్ పాల్గొన్నారు

మృతుడి కుటుంబాన్ని పరామర్శించి పెద్దకర్మకు 50 కేజీల బియ్యం..

మృతుడి కుటుంబాన్ని పరామర్శించి పెద్దకర్మకు 50 కేజీల బియ్యం అందజేసినా బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు గారు…..

ఏటూరునాగారం, నేటిధాత్రి

మంత్రివర్యలు సీతక్క గారి ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షులు పైడకుల యువనేత కుంజా సూర్య గార్ల సూచనల మేరకు కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు సునార్కని బిక్షపతి గారి తండ్రి (సునార్కని బత్కయ్య) గారు ఇటీవల అనారోగ్యంతో మరణింంచగా ఈరోజు వారి పెద్ద కర్మ ఉండగా బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు గారు బుట్టాయిగూడెం గ్రామ కాంగ్రేస్ పార్టీ నాయకులతో కలిసి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరమార్శించి పెద్దకర్మ కు 50 కేజీల బియ్యం ఇచ్చి వారి కుటుంబానికి అన్ని విధాలుగా కాంగ్రేస్ పార్టీ అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు…

ఈ కార్యక్రమం బుట్టాయిగూడెం గ్రామ కాంగ్రేస్ నాయకులు, మండల కాంగ్రేస్ నాయకులు, గ్రామ వార్డు మెంబెర్స్ సునార్కని ఆనందరావు, జాడి సమ్మయ్య, మరియు గ్రామ కాంగ్రేస్ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు

బుల్లోజు పార్ధు కుటుంబాన్ని పరామర్శించిన వార్డ్ కౌన్సిలర్లు..

బుల్లోజు పార్ధు కుటుంబాన్ని పరామర్శించిన వార్డ్ కౌన్సిలర్లు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ
కేసముద్రం విలేజ్ లో మరణించిన బొల్లోజు ప్రార్థన చారి పార్థివ దేహానికి నివాళి అర్పించిన 8 వ మరియు 9వ వార్డు కౌన్సిలర్స్ వేముల భారతి శ్రీనివాస్ రెడ్డి,కనుకుల సుభద్ర రాంబాబు మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని తెలిపి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.వారితో పాటు అరెందుల శ్రీనివాస్, తుంపిల్ల వెంకన్న,నిమ్మల రామకృష్ణ ,కమటం సురేందర్, యాకంబ్రం, సముద్రాల మహేష్, దోసపాటి అచ్యుత్ మరియు తదితరులు పాల్గొన్నారు.

భాధిత కుటుంబానికి బీమా చెక్కు అందజేత..

భాధిత కుటుంబానికి బీమా చెక్కు అందజేత

పరకాల,నేటిధాత్రి

 

పట్టణానికి చెందిన కొలుగూరి సరోజన భర్త కొలుగూరి రాజేశ్వరరావు చిరు వ్యాపారం నిర్వహించుకునేందుకు సుమారు ఆరు నెలల క్రితం బంధన్ బ్యాంక్ పరకాల బ్రాంచ్‌లో రూ.50 వేల రుణం తీసుకున్నారు.రుణం తీసుకునే సమయంలో ఆయన బీమా సౌకర్యం పొందగా,రూ.లక్ష బీమా చేయించారు.అయితే రెండు నెలల క్రితం రాజేశ్వరరావు మృతి చెందారు.ఈ నేపథ్యంలో బీమా నిబంధనల ప్రకారం బంధన్ బ్యాంక్ ద్వారా రూ.లక్ష బీమా మొత్తానికి సంబంధించిన చెక్కును సోమవారం కొలుగూరి సరోజనకు అందజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల బ్రాంచ్ మేనేజర్ బానోతు నరేష్, ఏరియా మేనేజర్ బాధవత్ శ్రీను,ఏజెంట్ మాలోతు అనిల్ పాల్గొన్నారు.బీమా సౌకర్యం ద్వారా కుటుంబానికి ఆర్థిక భరోసా లభించిందని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version