ఘనంగా కెసిఆర్ 72 వ జన్మదిన వేడుకలు…

ఘనంగా కెసిఆర్ 72 వ జన్మదిన వేడుకలు

బిఆర్ఎస్ గణపురం మండల అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ సూరీడు,
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకులు,భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు, తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది
అనంతరం కేకు కట్ చేసి స్వీట్లు,పండ్లను పంచి బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబురాలను నిర్వహించారు
అనంతరం కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి,దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో తెలంగాణ ను తన పాలన దక్షతతో మొదటి స్థానంలో నిలిపిన తెలంగాణ జాతిపిత కెసిఆర్ అని తెలిపారు.తెలంగాణ సంస్కృతి మాండలికంలో లోతుగా పాతుకుపోయిన శక్తివంతమైన, భావోద్వేగభరితమైన తరచుగా కవితాత్మకమైన తెలుగు ప్రసంగాలకు ప్రసిద్ధి కెసిఆర్ అని అన్నారు..
.కెసిఆర్ తరచుగా ఆత్మగౌరవం,రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం మరియు పేదల అభివృద్ధి కోసం పాటుపడిన మహానేత అన్నారు.
. తన పది యేండ్ల పాలనలో ఎన్నో సంక్షేమా కార్యక్రమాలను,అభివృద్ధికార్యక్రమలను జోడేద్దులాగా ముందుకు తీసుకెళ్లారు.
.కుల మతాల వివక్ష లేకుండా పాలించిన మహనీయుడు కెసిఆర్ ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమం లో మండలం బి ఆర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు,ఉద్యమకారులు, నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, యూత్ నాయకులు కెసిఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి.

ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంట నీళ్ల పాలైతే పట్టించుకోని ప్రభుత్వం

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన బిఆర్ఎస్ నాయకులుఈ సందర్బంగా భూపాలపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ
అకాల వర్షాలకు అన్నదాత ఆగమైతుంటే, ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీళ్ల పాలైతే, పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు. మండలం గాంధీనగర్ గ్రామ రైతుల పరిస్థితి మాత్రమే కాదు దాదాపు రాష్ట్రమంతా ఇదే దుస్థితి. ములుగే నక్కపై తాటి పండు పడ్డట్టు రైతు పరిస్థితి ఉంది.
ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుంది.
సొంత మండలం అని గొప్పలు చెప్పుకునే స్థానిక శాసనసభ్యులు కొనుగోల కేంద్రాల్లో కాంటాలు అయి 4,5 రోజుల నుండి ధాన్య బస్తాలు కల్లాలో ఉన్న వాటిని మిల్లు లకు తరలించంచడానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ లారీలను కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.గత 4,5 రోజుల నుండి వర్షాలు పడుతు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిచి రైతులు బాధ పడుతుంటే స్థానిక శాసనసభ్యులు కనీసం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల యొక్క వడ్లను కటింగ్ లేకుంటే కొంటామని ధైర్యాన్ని ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారు.కేసీఆర్ ఉన్నపుడు ఎప్పుడూ వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం కాలేదు తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, రైతుల బతుకులు కాపాడాలని మంత్ర ఉత్తంకుమార్ సివిల్ సప్లయిస్ కమిషనర్ , భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వారిని కోరుతున్నాం బి ఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతులకు తోడుగా ఉంటామని తెలియజేశారు 2, 3 రోజుల్లో వడ్లను పూర్తిగా మిల్లులకు తరలించకపోతే బిఆర్ఎస్ పార్టీ తరపున భారీ ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భైరగాని కుమారస్వామి గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు మామడి రమేష్, ఉపాధ్యక్షుడు రాము , నాయకులు బోట్ల స్వామి, రవి, వాజిత్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version