కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా వీరాటి రవీందర్ రెడ్డి..

కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా వీరాటి రవీందర్ రెడ్డి

ఉత్సవ కమిటీని ప్రకటన చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవ కమిటీ ప్రకటన

ఈనెల 9 వరకు ఉత్సవ కమిటీకి జాతర బాధ్యతలు

నర్సంపేట /గీసుకొండ: నేటిధాత్రి:

వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో గల కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా వీరాటి రవీందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. కమిటీ ఎంపిక ప్రకటనను జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు.వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో గల కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు నేడు 3 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవ కమిటీని ఎంపిక చేశారు.

ఈ నూతన ఉత్సవ కమిటీలో 14 మంది సభ్యుల పేర్లను ఎండోమెంట్ శాఖ ప్రకటించింది. ఈనెల 2 నుండి 9 వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఉత్సవ కమిటీలో వీరాటి రవీందర్ రెడ్డి,అజ్మీర సమ్మయ్య, కందారి సంతోష్, హలావత్ వీరన్న, మంద రమేష్, బధావత్ రమేష్, ఊరుగొండ రాజు, లాడే రాజేశ్వర్ రావు, గోనెల మల్లేష్, మండల నరేష్,మార్తాల రాజు, దుకిరే వినయ్, మామూనూరి వనిత, నాగిరెడ్డి నాగన్నలను ప్రకటిస్తూ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసాద్ తో పాటు రాష్ట్ర,జిల్లా దేవాదాయ శాఖ, సంబంధిత శాఖలకు జీవో కాపీలతో ఆదేశించింది.

కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా వీరాటి రవీందర్ రెడ్డి

గీసుకొండ మండలం కొమ్మాల గ్రామ శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ జీవో జారీ చేయగా పరకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి ఉత్సవ కమిటీని ఎంపిక చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గా వీరాటి రవీందర్ రెడ్డి, సభ్యులుగా అజ్మీర సమ్మయ్య, కందారి సంతోష్, హలావత్ వీరన్న, మంద రమేష్, బధావత్ రమేష్, ఊరుగొండ రాజు, లాడే రాజేశ్వర్ రావు, గోనెల మల్లేష్, మండల నరేష్,మార్తాల రాజు, దుకిరే వినయ్, మామూనూరి వనిత, నాగిరెడ్డి నాగన్న పేర్లను కమిటీలో ప్రకటిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కొమ్మాల జాతర ఉత్సవాలలో భక్తులకు ఇలాంటి కలగకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు.

జాతరలో ఏలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు

శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, ఉత్సవాల నేపథ్యంలో జాతరకు వేలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని నూతన ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి తెలిపారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు జాతర ఉత్సవ కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు.

నేడు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం..

శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర హోలీ పండుగ రోజు నుండి 9 వ తేదీ వరకు వారం రోజులపాటు సాగే ఉత్సవాల నేపథ్యంలో జాతరకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు,ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండేందుకు గాను చైర్మన్ తో పాటు 14 మంది సభ్యుల ఉత్సవ కమిటీని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సోమవారం ప్రకటించారు. కాగా నూతనంగా ఎన్నికైన ఉత్సవ కమిటీ మంగళవారం దేవాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

శ్రీ నాగులమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ..

శ్రీ నాగులమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ

* మార్చి 3 వ తేదీ నుండి 7 వ తేదీ వరకు జాతర ఉత్సవాలు
* 5 వ తేదీన నిండు జాతర

మంగపేట నేటిధాత్రి

 

శ్రీ నాగులమ్మ జాతర పోస్టర్ ను మీడియా సమక్షంలో నాగులమ్మ గుడి ప్రధాన ధర్మకర్త, ఆలయ పూజారి, ఆలయ మేనేజింగ్
బాడిశ రామకృష్ణ స్వామీ
శ్రీ రామ కృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్
బి ఆర్ ఎస్ పార్టీ ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగరమేష్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమం లో ఆలయ పూజారులు, సిబ్బంది, గ్రామస్తులు, సన్నిహితులు పాల్గొన్నారు

సూర్య భగవాన సేవ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

సూర్య భగవాన సేవ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

గురువారం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నిర్వహించిన సూర్య భగవాన వాహన సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈరోజు నుండి కొడవటంచ జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.
అనంతరం ఆర్య వైశ్యులు ఏర్పాటు చేసిన వాసవి ఆర్య వైశ్య నిత్యాన్న సత్రంను ప్రారంభించి భక్తులకు అన్నదానం సేవలు ప్రారంభించారు.
తదుపరి రాయపల్లి గ్రామంలో బత్తిన అనిత కి చెందిన నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుతోజ్ కిష్టయ్య కొడవటంచ ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు మండల అధ్యక్షులు ఈప్పకాయల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

బడంపేటలో అంగరంగ వైభవంగా రాచన్న స్వామి జాతర…

బడంపేటలో అంగరంగ వైభవంగా రాచన్న స్వామి జాతర

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేటలో రాచన్న స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా కార్యనిర్వాహణ అధికారి విభూతి శివరుద్రప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం వద్ద సోమవారం ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, భక్తిశ్రద్ధలతో అగ్నిగుండం తొక్కి మొక్కులు తీర్చుకున్నారు. ఈ జాతరలో భక్తుల కోలాహలం నెలకొంది.

రేపటి నుంచి బడంపేట రాచన్న స్వామి దేవాలయ జాతర…

రేపటి నుంచి బడంపేట రాచన్న స్వామి దేవాలయ జాతర

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మండలం బడంపేట గ్రామ శివారులోని రాచన్న స్వామి దేవాలయ జాతర ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శివ రుద్రప్ప శనివారం తెలిపారు.
22న రుద్రాభిషేకం, ధ్వజారోహణ, 23న ప్రత్యేక పూజలు, 24న కళ్యాణోత్సవం జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.

వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం…

వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం…

◆-: శివనామస్మరణతో మారుమోగిన కేతకి ఆలయం

◆-: కళ్యాణోత్సవానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, మహిళలు.

◆-: పట్టువస్త్రాలు సమర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంఘం,అష్ట తీర్థముల సంఘ మం.. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి నవహీనిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళ వారం నాడు శ్రీ కేతకి ఆలయంలో పార్వ తీ పరమేశ్వరుల కళ్యాణం మహోత్స వం అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. ఈ కళ్యాణ మహోత్సవానికి జహీ రాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షే ట్కార్, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్టావు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు ఆలయ ప్రాంగాణంలో చూడముచ్చట గా అలంకరించిన పచ్చని తోరణాలు, పూ ల పందిళ్ళతో, పార్వతీ పరమేశ్వరుల క ళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఆలయ పురోహితులు, పేద బ్రాహ్మణుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యా లు, అశేష భక్త జనాలు

తిలకిస్తుండగా అమ్మవారి మాంగళ్య సూత్రధారి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అర్చకు లు, వేద బ్రాహ్మణుల మంత్రోచరణా లతో కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయంలో గణపతి పూ జతో పాటు, దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు అర్చనలతో కేతకీ ఆలయం భక్తులతో ఓం నమశివాయ నామస్మరణతో మారుమో గింది. ఈ కళ్యాణ మహోత్సవానికి అశేష భక్తజనంతో పాటు, పలు రాష్ట్రాలకు చెం దిన భక్తులతో పాటు, వివిధ గ్రామాల ప్ర జా ప్రతినిధులు, ప్రజలు, మహిళామణు లు, కళ్యాణోత్సవం తిలకించేందుకు హాజరయ్యారు. ఆలయ అర్చకులతో పాటు వేద బ్రాహ్మణుల మంత్రోచ్చణాల మధ్య కళ్యాణ మహోత్సవ ముహూర్త ఘడియలు సమీపిస్తున్న కొద్ది పార్వతీ పరమేశ్వరులకళ్యాణం చూదం రారండి అనే భావనతో భక్తుల ఎదురుచూస్తు ండగా 7 గంటలకు కళ్యాణ మహోత్సవా న్ని అర్చకులు, వేద బ్రాహ్మణులు, ముగించారు. స్వామి వారి కళ్యాణ మహోత్స వంలో అధిక మొత్తంలో దంపతులు పాల్గొన్నారు. అనంతరం భక్తులు కళ్యా ణ ప్రాప్తిరస్తూ అంటూ వారు పార్వతీ పరమేశ్వరులకు తీసుకొచ్చిన ముత్యాలు తలంబ్రాలను వేసి కళ్యాణ వైభోగం కనులారా చూసి ఆనందించారు. కళ్యాణ మహోత్సవానికి హాజరైన వారందరికీ స్వామి వారి ఆశీస్సులతో పాటు కుకుమ తో పాటు తీర్థప్రసాదాలు ఆలయ అర్చకు లు అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పటేల్ కేతకి ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, ఝరాసంఘం గ్రామ సర్పంచ్ వినోద బాలరాజ్, గ్రామ ఉపసర్పంచ్ గడ్డం మమతా అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పాటిల, మాజీ ఎంపిటిసి ఎంపీ రజిని ప్రియ సంతోష్ పాటిల్, మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్, టౌన్ ప్రెసిడెంట్ ఏజాద్ బాబా నాగన్న పటేల్ సిను పటేల్ సజ్జన్ నాగేశ్వర్ మల్లన్న పటేల్ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా కేతకీలో రథోత్సవం…

 

ఝరాసంగం: అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశిగా
ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 12:00 గంటలకు పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. పార్వతీ పరమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆలయం నుండి రథోత్సవం వరకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకు వచ్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి రథంపై అధిష్టించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, ఢమరుక నాదాలతో అశేష జనవాహిని మధ్య రథోత్సవం నయనానందకరంగా సాగింది. రాత్రి 3 గంటల వరకు రథం ఊరేగింపు కొనసాగింది. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జహీరాబాద్ డీఎస్పీ స్వయం పర్యవేక్షణలో ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ భారీ బందోబస్తు మధ్య ఉత్సవాలు ముగిశాయి.

మహాశివరాత్రి సందర్భంగా కేతకిని దర్శించుకున్న గ్రామ కార్యదర్శి..

మహాశివరాత్రి సందర్భంగా కేతకిని దర్శించుకున్న గ్రామ కార్యదర్శి

జహీరాబాద్ నేతి ధాత్రి:

 

మహా శివరాత్రి సందర్భంగా, ఝరాసంగం గ్రామ పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్, తన బంధువులు, స్నేహితులు కార్యదర్శులతో కలిసి, సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ప్రసిద్ధ చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామిని అధికారులతో కలిసి దర్శించుకున్నారు. ఈ పవిత్ర స్థలంలోని జలాశయాల అమృత గుండంలో వారు స్నానాలు చేసి, స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహా శివరాత్రికి భక్తులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ, వివిధ గ్రామాల కార్యదర్శులు ప్రత్యేక విధుల్లో పాల్గొని, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల సహాయంతో ఆలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచడంలో, జాతర పరిసరాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడంలో, సంగమేశ్వర స్వామి ఆలయం అమృత గుండం పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించారు.

కేతకికి శివరాత్రి వైభవం.. భక్తులతో కిక్కిరిసిన దేవస్థానం..

కేతకికి శివరాత్రి వైభవం.. భక్తులతో కిక్కిరిసిన దేవస్థానం!

◆-: కేతకీలో శివరాత్రి వైభవం

◆-: భక్తి పారవశ్యంలో దక్షిణ కాశీ..

◆-: ధర్మ దర్శనానికి 4గంటల నిరీక్షణ భక్తులతో కిక్కిరిసిన దేవస్థానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: జిల్లాలోని శైవక్షేత్రాలు మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు నదిలో స్నానాలు ఆచరించి నీలకంఠుడు పరమేశ్వరుడిని ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అష్టతీర్థాల నిలయంగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర దేవాలయంలో నవాహ్నిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి భారీగా పోటెత్తారు.

స్వామి వారి ధర్మ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారికి సుప్రభాత సేవ, మేల్కొలుపు సేవ, మహారుద్రాభిషేకం, మహామంగళహారతి నిర్వహించిన అనంతరం ఉదయం 1:20 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. జహీరాబాద్, బీదర్ (కర్ణాటక), నారాయణఖేడ్, రాయికోడ్, ఝరాసంగం పరిసరాల గ్రామాల ప్రజలు పాదయాత్రగా దేవస్థానానికి తరలివస్తున్నారు.

 

 

ముందుగా భక్తులు స్వామివారి పుష్కరిణి అమృత గుండంలో స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో బారులు తీరారు. కేతకీ ఆలయ పరిసరాలు “ఓం నమః శివాయ” హర హర మహాదేవ అనే పంచాక్షరి మంత్రంతో మార్మోగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు జహీరాబాద్ ఆర్డీవో దేవుజా, డీఎస్పీ సైదా ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు, దేవస్థానం చైర్మన్ చంద్రశేఖర్, ఈవో శివ రుద్రప్ప, సర్పంచ్ వినోద బాలరాజ్, దేవాదాయ ధర్మాదాయ, రెవెన్యూ శాఖల అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.A

మహాశివరాత్రికి సర్వం సిద్ధం…

మహాశివరాత్రికి సర్వం సిద్ధం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలను ఘ నంగా నిర్వహించుటకు ఏర్పా ట్లు చేస్తున్నట్లు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు.15వ తేదీ ఆది వారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ ప్రధమ రుద్రా భిషేకం ఆరు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అభిషే కాలు పూజలు నిర్వహిస్తా మని రాత్రి 9:30 గంటలకు శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తామని రాత్రి 12 గంటలకు లింగో ద్భవ పూజ శివపార్వతుల పంచులోహ విగ్రహాల ఊరే గింపు నిర్వహిస్తున్నట్లు కావు న భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగల రని చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు

అప్పాజీపల్లి లక్ష్మీ నరసింహ కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొనడం

నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా

 

తిమ్మాజీపేట మండలం అప్పాజీపల్లి గ్రామంలో లోని లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు
అనంతరం నియోజవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు స్వామివారి కళ్యాణం వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేయాలని తెలిపారు గ్రామీణ ప్రాంతంలోని దేవాలయాల అభివృద్ధికి అవసరమైన సహకారం ఎల్లప్పుడూ అందిస్తానే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మండల నాయకులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version