రాష్ట్ర ముఖ్యమంత్రివ కె.సి.ఆర్ 72వ జన్మదిన వేడుకలలో బీ ఆర్ ఎస్ నేతలు…

రాష్ట్ర ముఖ్యమంత్రివ కె.సి.ఆర్ 72వ జన్మదిన వేడుకలలో బీ ఆర్ ఎస్ నేతలు
వనపర్తి నేటిధాత్రి .పట్టణ

 

పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ ఆధ్వర్యములో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో కె.సి.ఆర్ 72 వ జన్మదిన వేడుకలు సందర్భంగా కేక్ కట్ చేసి ఘన o గా జరుపుకున్నారు
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మాట్లాడుతూ కె.సి.ఆర్ పాలననే తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు.
ఈ కార్యక్రమములో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,ప్రధాన కార్యదర్శి గంధం.పరంజ్యోతి కౌన్సిలర్స్ మురళీ సాగర్,శ్రీకర్ గౌడ్,మాజీ జెడ్.పి.టి.సి రఘుపతి రెడ్డి,జాతృ నాయక్,హేమంత్ ముదిరాజ్,సునీల్ వాల్మీకి,సయ్యద్.జమీల్,నందిమల్ల.రమేష్,సూర్యవంశం.గిరి,జె.శ్రీనివాసులు,జోహెబ్ హుస్సేన్,బండారు.కృష్ణ,డాక్టర్.డ్యానియల్ చిట్యాల.రాము,నీలస్వామిక్రాంతి కుమార్,మహేశ్వర్ రెడ్డి, వెంకట్ సాగర్, హారీఫ్,గంధం.వి
విజయ్ ఆర్యవైశ్యడు వజ్రాలసాయిబాబాపార్థసారథి గౌడ్,లోకాజీ,ఖాదర్శ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు…

ఘనంగా కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ 72వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్ని కేక్ కట్ చేసి,ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్స్ కి పండ్ల పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు

అదే విదంగా భూపాలపల్లి మున్సిపాలిటీలోని 16వ వార్డు కౌన్సిలర్ జ్యోతుల మంజుల వేంకటేశ్వర్లు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక్క సంవత్సరం ఉచితంగా డిష్ కనెక్షన్ అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇది న్యాయ సమర్థమైంది ధర్మమైనటువంటి కోరిక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడమేనని, సబండ వర్గాలను ఏకతాటిపై తీసుకువచ్చి రాష్ట్రాన్ని సాధించుకున్న తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా,నేడు ప్రతిపక్ష నాయకుడిగా మన నాయకుడు కొనసాగుతున్న విషయం మన అందరికి తెలుసు.

చాలా మంది నాయకులు వస్తుంటారు కానీ అందరికంటే భిన్నంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రజల యొక్క హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిన వ్యక్తి కేసీఆర్ ముఖ్యంగా మన ఇంట్లో ఆడపిల్లలు నీళ్ల కొరకు సుదూర ప్రాంతాలకు పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు అని ప్రతి ఇంటిలో స్వచ్ఛమైనటువంటి గోదావరి, కృష్ణా జలాలు ఇవ్వాలనే సంకల్పంతోటి చేపట్టినటువంటి కార్యక్రమమే మిషన్ భగీరథ కార్యక్రమం.

నేడు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ది

ఈరోజు మన రాష్ట్రానికి చెందిన వాళ్లే కాదు భారతదేశం నుంచి వచ్చిన అనేక మంది వ్యక్తులు ఇక్కడ ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఉపాధి పొందుతూ స్థిరపడ్డారు.

హైదరాబాద్ నగరం ఈరోజు బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలతో పోటీపడే స్థాయికి వచ్చింది.

అంతేకాదు ముఖ్యంగా రైతుల గురించి చాలా రాజకీయ పార్టీలు మాటలు చెప్పినయి కానీ ఎవరు కూడా చేయని విధంగా మొట్టమొదటిసారిగా రైతు నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ నాయకుడు విన్నవించకుండానే, ఆయనే ఒక్క రైతుగా అలోచించి ఎకరానికి పదివేల రూపాయల రైతుబంధు ఇచ్చి రైతుల పాలిట రైతు బాంధవుడయ్యాడు.
వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు రెండు వేల పెన్షన్ ఇచ్చి పెద్దకొడుకు అయ్యాడు.
ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ రూ. 100016/-ఇచ్చి మేనమామ అయిండు. చరిత్రలో నిలిచిపోయే పరిపాలన చేసి ప్రజల మనస్సు గెలుచుకున్న కేసీఆర్ కి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఆయన పరిపాలనలో తెలంగాణ ప్రజలు ఆనందంగా జీవించాలని కోరుతూ వారికీ
భూపాలపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ప్రజల తరుపున శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version