మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలి…

మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలి…

జహీరాబాద్ నతి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మునిసిపాలిటీలోని వార్డులను శానిటైజ్ చేయడానికి కొత్తగా నియమితులైన ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ ఒక దరఖాస్తును సమర్పించారు, ఎందుకంటే కోహీర్ మునిసిపాలిటీలో ప్రజలు టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రభుత్వ అధికారులెవరూ దీనిపై దృష్టి పెట్టడం లేదని, ప్రజల నుండి చెత్తను సేకరించడానికి ఏడుగురు సిబ్బంది సరిపోరని వారు అన్నారు. మున్సిపాలిటీ కార్యాలయానికి ట్రాక్టర్ల సంఖ్యను పెంచాలని వారు డిమాండ్ చేశారు కొన్ని వార్డులలో మిషన్ భగీరథ నీటి సౌకర్యం లేకపోవడం వల్ల తాము సమస్యలను ఎదుర్కొంటున్నామని చెప్పారు.

వివేకానంద కాలనీలో కాల్వలు పూడ్చుకపోయి తీవ్ర ఇబ్బందులు..

వివేకానంద కాలనీలో కాల్వలు పూడ్చుకపోయి తీవ్ర ఇబ్బందులు

క్లీనింగ్ పట్ల మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం

10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డు వివేకానంద కాలనీలో కాల్వలు పూడ్చుకపోయి, మురికి నీరు ఒకే దగ్గర ఉండటం వలన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాలనీలో మురికి నీరు ఉండటం వలన దుర్గంధం వెదజల్లుతుండడంతో ప్రజలు తీవ్రమైన పడుతుంటే వాటిని శుద్ధి చేసేందుకు గాని 4 రోజుల నుండి మున్సిపాలిటీ జేసిబి అడుగుతుంటే, ఆయిల్ మార్పించాలని దాటవేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిఅంటున్నారని మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మున్సిపాలిటీలో ప్రజా సమస్యల కంటే ముఖ్యమైన పని ఏం ఉంటుందని అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ప్రజలకు అవసరైన పనులను నిర్లక్ష్యంగా వ్యవహరించకూడా పనులు చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.

మెట్‌పల్లి పట్టణంలో కలుషిత నీటి సమస్య..

మెట్‌పల్లి పట్టణంలో కలుషిత నీటి సమస్య
-అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలవిజ్ఞప్తి
ఫిబ్రవరి17 మెట్ పల్లి నేటిదాత్రి

 

మెట్ పల్లి పట్టణంలోని 14వ వార్డులో మిషన్ భగీరథ నల్ల ద్వారా వచ్చే తాగునీరు కలుషితంగా వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కిరాయికి ఉంటున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
ఈ విషయంపై గృహిణి ఎశమేని నాగవ్వ మాట్లాడుతూ:
మేము కిరాయికి ఉంటున్నాం. ఈ ఇంట్లో బోర్ లేదు. నల్ల నీరే మా కుటుంబానికి ఆదారం. కానీ ఇలా మురికి, కలుషిత నీరు వస్తే త్రాగడానికి, స్నానానికి, వంటకు, బట్టలు ఉతకడానికి ఎలా ఉపయోగించాలి?” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె మాట్లాడుతూ, చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలకు ఈ పరిస్థితి మరింత ప్రమాదకరమని తెలిపారు. కలుషిత నీరు వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎశమేని నాగవ్వ తో పాటు స్థానిక ప్రజలుఅధికారులకు విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి
నీటి నాణ్యతను పరీక్షించాలని
పైప్‌లైన్లను పరిశీలించాలని
శుద్ధమైన తాగునీరు సరఫరా చేయాలని
డిమాండ్ చేస్తున్నారు.
పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version