చైర్ పర్సన్, వైస్ చైర్ లను శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు…

చైర్ పర్సన్, వైస్ చైర్ లను శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికలలో ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగి చివరకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు, సురేష్ కుమార్ షట్కార్, మాజీ మంత్రివర్యులు, డాక్టర్ చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర సట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మాజీ ఇండస్ట్రియల్ చైర్మెన్ మొహమ్మద్ తన్వీర్, రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి, ఉద్దండ రాజకీయ దురందరులు ఒకే వేదిక పైకి వచ్చి జహీరాబాద్ మునిసిపాలిటీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిఆర్ఎస్ పార్టీని అద పాతాళానికి అణగదొక్కి మరోసారి జహీరాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డ అని నిరూపించి పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు నేడు మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైఫ్ చైర్పర్సన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఎంఐఎం పార్టీ కౌన్సిలర్లు, స్వతంత్ర అభ్యర్థులు అందరూ కలిసి గౌరవనీయులు అందరికీ ఆమోదయోగ్యులైనటువంటి మహమ్మద్ యూనుస్ గారిని చైర్పర్సన్ గా, శిరీష రెడ్డి గారిని వైఫ్ చైర్పర్సన్ గా ఎన్నుకొని జహీరాబాద్ పట్టణ బాధ్యతలన్నింటిని తమరి భుజస్కందాల పైన పెట్టడం జరిగింది. ఈ ఐదు సంవత్సరాలు పట్టణ అభివృద్ధికి అందరి సహకారం తీసుకొని అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచడానికి శాయశక్తుల కృషి చేస్తారని ఆశిస్తూ జహీరాబాద్ నియోజకవర్గంలో మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ బాగా రెడ్డి గారి హయాంలో, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గీతారెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు స్వర్గీయ మహమ్మద్ ఫరీదోద్దీన్ గారి ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచిన మాట వాస్తవం అని తెలియజేస్తూ ఎన్నికైన జహీరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మహమ్మద్ యూనుస్ గారికి, వైస్ చైర్ పర్సన్ శిరీష రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు,

మెట్పల్లి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో…

మెట్పల్లి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ లకు సన్మానం
మెట్ పల్లి ఫిబ్రవరి 17 నేటి ధాత్రి

 

మెట్ పల్లి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో మెట్ పల్లి పట్టణ మున్సిపల్ చైర్మన్ నూతనంగా ఎన్నికైన మైలారపు లింబాద్రి ని వైస్ చైర్మన్గా నియమితులైన ఓంకారి నవీన్ ని 23వ వార్డు కౌన్సిలర్ గా కోయల్కర్ స్రవంతి లింగేశ్వర్ ని నూతనంగా ఎన్నికైన సందర్భంగా మర్యాదపూర్వకంగా సంఘ భవనంలో సంఘ అధ్యక్షులు కొండ మురళి సంఘ సభ్యులు వారిని ఘనంగా శాలువతో సన్మానం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ మీ అందరి సహకారంతో మున్సిపల్ చైర్మన్ గా నియమితుల కావడం సంతోషకరమని మీకు ఏ సహాయం కావాలన్నా తన వద్దకు ఎప్పుడైనా రావచ్చని మీకు ఎల్లప్పుడు సహాయ సహకారం అందిస్తానని అలాగే పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ అధ్యక్షులు కొండ మురళి కార్యదర్శి ఇంద్రాల ఈశ్వర్ కోశాధికారి మద్దే నపల్లి స్వామి ఉపాధ్యక్షులు ఎదులాపురం కుమార్ గౌరవ అధ్యక్షులు కొడిమ్యాల వెంకటస్వామి మ్యాడపు అశోక్, గడిపల్లి నారాయణ భూమేశ్వర్ చంద్రగిరి రామకృష్ణ మ్యాడపుశ్రీనివాస్,రవి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version