మృతుడి కుటుంబాన్ని పరామర్శించి పెద్దకర్మకు 50 కేజీల బియ్యం..

మృతుడి కుటుంబాన్ని పరామర్శించి పెద్దకర్మకు 50 కేజీల బియ్యం అందజేసినా బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు గారు…..

ఏటూరునాగారం, నేటిధాత్రి

మంత్రివర్యలు సీతక్క గారి ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షులు పైడకుల యువనేత కుంజా సూర్య గార్ల సూచనల మేరకు కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు సునార్కని బిక్షపతి గారి తండ్రి (సునార్కని బత్కయ్య) గారు ఇటీవల అనారోగ్యంతో మరణింంచగా ఈరోజు వారి పెద్ద కర్మ ఉండగా బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు గారు బుట్టాయిగూడెం గ్రామ కాంగ్రేస్ పార్టీ నాయకులతో కలిసి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరమార్శించి పెద్దకర్మ కు 50 కేజీల బియ్యం ఇచ్చి వారి కుటుంబానికి అన్ని విధాలుగా కాంగ్రేస్ పార్టీ అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు…

ఈ కార్యక్రమం బుట్టాయిగూడెం గ్రామ కాంగ్రేస్ నాయకులు, మండల కాంగ్రేస్ నాయకులు, గ్రామ వార్డు మెంబెర్స్ సునార్కని ఆనందరావు, జాడి సమ్మయ్య, మరియు గ్రామ కాంగ్రేస్ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు

33 వ వార్డులో పర్యటించిన చైర్మన్ మాధవి రమేష్…

33 వ వార్డులో పర్యటించిన చైర్మన్ మాధవి రమేష్
వనపర్తి నేటిధాత్రి .

 

 

వనపర్తి పట్టణంలో 33 వ వార్డులో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ బుధవారం ఉదయం పర్యటించారు ఈ మేరక వార్డులో దివంగత మాజీ ఎమ్మెల్యే జయ రాములు ఇంటి దగ్గర న్యాయ వాది కృష్ణ మోహన్ ఇంటి ఎదురు గా ఉన్నమోరిని పరిశీలించారు మోరీ మొత్తం కావడం వల్ల పందికొక్కులు ఎలుకలు స్వరంగాలు పెట్టి ఇండ్లలోకి వస్తున్నాయని వార్డు ప్రజలు మున్సిపల్ చైర్మన్ దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ మాట్లాడుతూ డ్రైన్ నిర్మాణానికి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోయి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు వార్డు పర్యటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూరగాయల రవీందర్ వార్డు ప్రజలు జ్ఞానేశ్వర్ యాదవ్ మహేష్ కుమార్ ఈ మేరకు 33 వ వార్డు లో పేదలకు ప్రభుత్వం చే ఇండ్ల నిర్మాణం అదేవిధంగా పురాతనమైన ట్రైన్స్ ఉన్నాయని కొత్తగా చేపట్టాలని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఏర్పుల సుమిత్రమ్మ మున్సిపల్ చైర్మన్ ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ దృష్టికి తెచ్చారు ఈ మేరకు వారు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తో చర్చించి వార్డులో ఉన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కాలువను దొంత నందు ఇo టి ముందర కలపాలని వార్డు ప్రజలు మున్సిపల్ కమిషనర్ చైర్మన్ విజ్ఞుప్తి చేశారు

సీఎం కప్ టోర్నమెంటు రాష్ట్ర స్థాయి పోటీలకు విజ్ఞాన భారతివిద్యార్థులు..

సీఎం కప్ టోర్నమెంటు రాష్ట్ర స్థాయి పోటీలకు విజ్ఞాన భారతివిద్యార్థులు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

క్రమశిక్షణతో కూడిన లక్ష్యసాధన ఉంటే ఎంతటి విజయమైన సాధ్యమైతుందని ప్రైవేట్ (ట్రస్మా )స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోనె హనుమంత రెడ్డి, విజ్ఞాన భారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ బీ జంగారెడ్డి అన్నారు. జిల్లా స్థాయిలో జరిగినటువంటి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజ్ఞాన భారతి పాఠశాల తుంకుంట విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దీంతో బుధవారం విద్యార్థులను పాఠశాలలో అభినందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అండర్ -14 లాంగ్ టెన్నిస్ లో పి.ఆంజలీనా, ఏ.రాజీవ మైత్రి అండర్- 16 వెయిట్ లిఫ్టింగ్ లో, బి రుద్ర ఆదిత్య, అండర్ -18 కోకోలో వి.హేమలత, జి నిహారిక లు రాష్ట్ర స్థాయి లో జరిగే సీఎం కప్ టోర్నమెంటులో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గోనే సంగీత, పిఈటీ మహేష్ పాల్గొన్నారు.

హకింపేట్ డిపోలో ఆర్టీసీ జెఏసి పోస్టర్ ఆవిష్కరణ…

హకింపేట్ డిపోలో ఆర్టీసీ జెఏసి పోస్టర్ ఆవిష్కరణ

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సికింద్రాబాద్ రీజియన్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ గోపు శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు ఆర్టీసీ హకింపేట్ డిపోలో బుధవారం ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై 24 ఫిబ్రవరి చలో సెక్రట్రియేట్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేదంటే ఆర్టీసీ సత్తా చాటి ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నామల కృష్ణ, నాగరాజు, రమేష్, గ్యారేజ్ సెక్రటరీ రఘు, రాంచందర్, సుజిత్, మౌలానా రాజేందర్, పద్మ, సింధు, నాగమణి, విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి, సరిత ఉద్యోగులు పాల్గొన్నారు

మురికి కాలువలశుభ్రం చేయించిన సర్పంచ్. చాట్ల విజయ రవీందర్…

మురికి కాలువలశుభ్రం చేయించిన సర్పంచ్. చాట్ల విజయ రవీందర్.

మొగుళ్లపల్లి నేటి ధాత్రి.

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని సర్పంచ్ గ్రామంలో రెండు సంవత్సరాల నుంచి పేరుకుపోయిన మురికి కాలువలో చెత్త పేరుకుపోవడం వర్షాల పట్ల దోమలు వ్యాప్తి చెంది గ్రామ ప్రజలు ఇబ్బంది పడడం ప్రజల ఆరోగ్యం పరిశుభ్రత కోసం సర్పంచి చొరవ తీసుకొని చెత్తను మట్టిని తొలగింపు చేశారు గత రెండు మూడు రోజుల్లో గ్రామ సర్పంచ్ చాట్ల రవీందర్ విజయ కార్మికులను ఏర్పాటు చేసి గ్రామంలో మురికి కాలువలను శుభ్రం చేయించి గ్రామ వీధుల్లో మురికి నీరు నిలవకుండా ప్రధాన కాలువలో పేర్కొన్న చెత్త చెదారాన్ని కార్మికులతో శుభ్రం చేయించారు దోమల నివారణ గురించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఊరు మొత్తం స్ప్రే చేయించారు గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని గ్రామంలో వీధి దీపాలు తాగునీటి సరఫరా మురికి కాలువలు శుభ్రం చేయించడం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడం గ్రామ సర్పంచ్ గా నా బాధ్యత అని తెలిపారు ఆయన వెంట వార్డు సభ్యులు ఏలేటి మధుకర్ రెడ్డి గుడిమల్ల జయసుధ రమేష్ చెక్క నరేష్ చెక్క వెంకటేష్ పాల్గొన్నారు

ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్…

ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధవారం టేకుమట్ల మండలం ఎంపేడు గ్రామం నుండి జమ్మికుంట వరకు వయా వావిలాల మీదుగా నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా ప్రారంభించారు.
ఈ కొత్త బస్సు సర్వీస్ ప్రారంభంతో ఎంపేడు, వావిలాల పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత సులభతరం కానుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు సాధారణ ప్రజలకు జమ్మికుంటకు వెళ్లడం సౌకర్యవంతంగా మారనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రవాణా సౌకర్యాల మెరుగుదల ముఖ్యమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ రామకృష్ణ ఆర్టీసీ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికలు సక్సెస్: అధికారుల సంబరాలు…

మున్సిపల్ ఎన్నికలు సక్సెస్: అధికారుల సంబరాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా ముగిశాయి. ఈ విజయంతో మున్సిపల్ కమిషనర్ జైతురాం నాయక్, ఎమ్మార్వో దశరథ్ సిబ్బందితో కలిసి ఆనందోత్సాహాలతో ఫోటోలు దిగారు. విధులను సమర్థవంతంగా నిర్వహించిన సిబ్బందిని అధికారులు అభినందించారు. అందరి సమిష్టి కృషితోనే ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని వారు పేర్కొన్నారు.ఈ ఎన్నికలు 2026 ఫిబ్రవరి 17న సాయంత్రం దాకా జరిగాయి.

ఎట్టకేలకు జహీరాబాద్…మున్సిపల్ ఛైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం…

ఎట్టకేలకు జహీరాబాద్…మున్సిపల్ ఛైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం

◆-: మున్సిపల్ ఛైర్మన్ గా మహమ్మద్ యూనుస్, వైస్ చైర్మన్ గా కొత్తకాపు శిరిష..

◆-: కాంగ్రెస్ ఖాతాలోకి జహీరాబాద్, కోహీర్ మున్సిపల్ ఛైర్మన్ పీఠాలు..

◆-: రెండు మున్సిపాలిటీలల్లో ఎగిరిన కాంగ్రెస్ జెండా..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఎట్టకేలకు జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఉత్కంఠకు తెరపడింది. కోరమ్ లేక సోమవారం నాడు వాయిదా పడిన ఈ ఎన్నిక చివరకు మ్యాజిక్ ఫిగర్ రాజకీ యాలతో ముగిసి మంగళ వారం కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వివరాలలోకి వెళితే సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మున్సి పాలిటీలో మొత్తం 37 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, స్వతంత్రులు 3 స్థానాలు గెలుచుకోగా, జహీరాబాద్ ఎమ్మెల్యే, ఎంపీ లు ఈ మున్సిపాలిటీలో ఎక్స్ ఆఫీసియో సభ్యులుగా నమోదు కావడంతో మొత్తం 39 మంది సభ్యులు కాగా, చైర్మన్ ఎన్నికకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 20 సభ్యుల మద్దతు దక్కించుకోవడం కీలకంగా మారింది. సోమవారం నాడు కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో కోరమ్ లేక ఎన్నిక వాయిదా పడింది. మంగళవారం జరిగిన చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలతో కలిసి ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిపి 19 మందితో బిఆర్ఎస్ మద్దతు కూడగట్టగా, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఇద్దరు, ముగ్గురు స్వతంత్రులను తమవైపు తిప్పుకుని ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ కు కాంగ్రెస్ చేరుకోగా, ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 15 వ వార్డు నుంచి ఎన్నికైన కాంగ్రెస్ కౌన్సిలర్ మహమ్మద్ యూనుస్ చైర్మన్ గా, 16 వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికైన కొత్త కాపు శిరీష వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు..a

రంజాన్ సందర్భంగా సరైన నిర్వహణ పరిశుభ్రత ఏర్పాట్ల నిర్వహించాలి..

రంజాన్ సందర్భంగా సరైన నిర్వహణ పరిశుభ్రత ఏర్పాట్ల నిర్వహించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

పవిత్ర రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో, కోహిర్ మున్సిపల్ కార్పొరేషన్ మసీదు, పాటు కోహిర్ ఇతర కేంద్ర మసీదుల ప్రాంగణాలలో పరిశుభ్రతపై దృష్టి పెటలని. రంజాన్ పండుగ వేళ ముస్లిం సోదరులు ప్రార్థనల కోసం భారీగా తరలివచ్చే మసీదు కట్టడాల పరిసరాలను క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచాలని అధికారులు నిర్ణయించాలని వార్డ్ నంబర్ 13 లో
ఇందులో భాగంగా బుధవారం కమిషనర్ వినతి అందించారు ప్రాంతంలో పర్యటించి పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించి.చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాలను సందర్శించాలని. ఈ పర్యటన సందర్భంగా, ఆయన మసీదు, ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యకలాపాలను సమీక్షించాలని. పవిత్ర ఇస్లాం మాసం ప్రారంభం కానుండటంతో కోహిర్ పట్టణంలోని రోడ్లు, జంక్షన్లను పరిశుభ్రంగా విధి దీపాలు తాగునీటి సమస్య ఇలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులను ఆదేశించాలని కోరారు.

అక్రమ అరెస్టులు గృహనిర్బంధాలను ఖండిస్తున్నాం కొంకుల రాజేష్…

అక్రమ అరెస్టులు గృహనిర్బంధాలను ఖండిస్తున్నాం కొంకుల రాజేష్ అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

క్యాతనపల్లి మున్సిపాలిటీ 22 వార్డులకు ఎన్నికలు జరగగా పొత్తులో భాగంగా బీఆర్ఎస్ సిపిఐ 14 వార్డులు గెలవగా కాంగ్రెస్ 7వార్డులు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడం జరిగింది, మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు బీఆర్ఎస్ సిపిఐ కి తగిన మెజారిటీ ఉన్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎంపీలు ఈ ఎన్నిక ను వాయిదా వేయటానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు, నిన్న కేతనపల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్ల మీద జరిగినటువంటి దాడి వైఖరిని చూస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని కళ్లకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది నిన్న జరిగినటువంటి దురాగాతానికి ఈరోజు కేతనపల్లి బంద్ కి సిపిఐ బిఆర్ఎస్ బందు పిలుపు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వం ఈ బందు కొనసాగకుండా పోలీస్ బలగాలను పట్టణంలోని మోహరించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు వనం సత్యనారాయణ నీ అరెస్టు చేసి జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, మిగతా కామ్రేడ్స్ అందరి ఇంటి వద్ద బీఆర్ఎస్ నాయకుల ఇంటి వద్ద పోలీస్ బలగాలను పెట్టి వారిని ఇంట్లోనే నిర్బంధించి హౌస్ అరెస్టులను చేయడాన్ని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ మంచిర్యాల జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తోందని వారన్నార, మంత్రివర్యులు ఇప్పటికైనా ప్రజల తీర్పును గౌరవించి క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎన్నికను సజావుగా జరగనివ్వాలని నిర్బంధాలతో తెలంగాణ ప్రజలను అణిచివేయలేరని గ్రహించాల్సిందిగా కోరుతున్నాం.

అంజమ్మ గడ్డ, హేమ్లా తండాలలో ఇందిరమ్మ ఇళ్ల ఘన ప్రారంభం…

అంజమ్మ గడ్డ, హేమ్లా తండాలలో ఇందిరమ్మ ఇళ్ల ఘన ప్రారంభం.

తండాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం – ఎమ్మెల్యే.

జడ్చర్ల /నేటి ధాత్రి.

 

పేదల సొంతింటి కల సాకారం ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని రాజాపూర్ మండలంలో అంజమ్మ గడ్డ తండా మరియు హేమ్లా తండా (సింగమ్మ గూడ)లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు లబ్ధిదారులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల గృహావసరాలను తీర్చేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి అర్హుడికి గౌరవప్రదమైన నివాసం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అనేక కుటుంబాలు సొంతింటి కలను సాకారం చేసుకున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తండాల అభివృద్ధికి అవసరమైన రహదారులు, తాగునీరు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను దశలవారీగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కి ప్రమాదం..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కి ప్రమాదం..

 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కి స్వల్ప ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం విశాఖపట్నంలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కి స్వల్ప ప్రమాదం జరిగింది. ఇవాళ(బుధవారం) ఉదయం విశాఖపట్నంలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా.. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఓ వాహనం హఠాత్తుగా బ్రేక్ వేసింది. దీంతో వెనక వైపుగా వస్తున్న మరో కాన్వాయ్‌ ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ఘటనలో వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ప్రమాద సమయంలో పవన్ కల్యాణ్ కాన్వాయ్‌లో లేరని అధికారులు తెలిపారు. ఆయన్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

పరిసరాల్లో సాయంత్రం సూర్యుడి అద్భుత దృశ్యం..

పరిసరాల్లో సాయంత్రం సూర్యుడి అద్భుత దృశ్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం వేళ అస్తమిస్తున్న సూర్యుడు అద్భుతమైన ప్రకృతి సోయగాన్ని ఆవిష్కరించాడు. నారింజ వర్ణంలో మెరిసిన ఆకాశం, మేఘాల మధ్య నుంచి విరిసిన సూర్యకిరణాలు, చెట్ల సిల్హౌట్తో కూడిన దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రశాంత వాతావరణంలో కనిపించిన ఈ అందమైన దృశ్యాన్ని స్థానికుడు బిజిలీపూర్ నరేష్ ములుగు తన కెమెరాలో బంధించారు. సాయంత్రం సమయంలో కనిపించిన ఈ ప్రకృతి దృశ్యం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది.

కౌన్సిలర్ గా గెలిచిన ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షునికి ఘన సన్మానం…

కౌన్సిలర్ గా గెలిచిన ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షునికి ఘన సన్మానం
మెట్ పల్లి ఫిబ్రవరి 18 నేటి ధాత్రి

 

మున్సిపల్ ఎన్నికల్లో 20వ వార్డు నుంచి కౌన్సిలర్ గా గెలిచిన టీ యు డబ్ల్యూ జే ఐజేయు మెట్ పల్లి గౌరవాధ్యక్షులు మాసుల ప్రవీణ్ ను టీయూడబ్ల్యూజే ఐజేయు ప్రెస్ క్లబ్ సభ్యులు బుధవారం రోజున ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు మెట్ పల్లి అధ్యక్షుడు డా: బూరం సంజీవ్, జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్, ఉపాధ్యక్షులు జంగం విజయ్, అఫ్రోజ్ , జిల్లా కార్యవర్గ సభ్యులు సాజిద్ పాషా, బాసెట్టి హరీష్, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, పింజర్ శివ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, ముత్యాల రమేష్ , ఓంకారి శ్రీనివాస్,బొల్లం రాజు,మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్ సభ్యులు ఆదిల్ పాషా, రమణ, ఏసమేని గణేష్, ఎండి అభిద్, శశి కుమారు, అమ్ముల ప్రవీణ్ ,తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల నియమావాలిని కుంగాలా తొక్కిన జహీరాబాద్ ఎన్నికల అధికారులు…

ఎన్నికల నియమావాలిని కుంగాలా తొక్కిన జహీరాబాద్ ఎన్నికల అధికారులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు మాణిక్ రావు, చింత ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి డీసీఎంస్ చైర్మన్ శివకుమార్, ఎన్నికల ఇంచార్జీ దేవీప్రసాద్ నాయకులతో కల్సి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి (ARO) ఫిర్యాదు.అలాగే జిల్లా కలెక్టర్ కు మరియు ప్రధాన ఎన్నికల అధికారులకు కూడా దరఖాస్తు రూపంలో ఫిర్యాదు చేసారు.ఎన్నికల నియామవాలి ప్రకారం రాష్ట్రం మొత్తంలో గెలచిన అభ్యర్థుల పేరులో తెలుగు అక్షరాలా ప్రకారం అభ్యర్థి పేరులోని మొదటి అక్షరం చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలి కానీ జహీరాబాద్ మున్సిపాలిటీలో అధికారులు మాత్రం రాష్ట్రా ప్రభుత్వనికి తలోగ్గి అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా అభ్యర్థి పేరులోని మెదటి అక్షరం కాకుండా రాజకీయ పార్టీ పేరులోని మొదటి అక్షరంతో చైర్మన్, వాయిస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థుల పేర్లు మొదటగా పిలిచి ఎన్నికలు నిర్వహించారు.ఇదే విషయంలో ఎన్నికల నియామవాలి ప్రకారం మీదటగా బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ అభ్యర్థి అయినా” కట స్రవంతి ” పేరును అధికారులు మొదటగా చైర్మన్ కొరకు పేరును ప్రతిపథటించాలి కానీ అధికారులు మాత్రం ఎన్నికల నియమావాలిని ఉల్లాగించి అధికార పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అయినా యూనుస్ పెరు ను మొదటగా చైర్మన్ అభ్యర్థి గా ప్రతిపదించి ఎన్నికలు నిర్వహించి అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చైర్మన్ గా చేశారు అని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు తెలిపారు.ఇదే విషయంలో అవసరం అయితే న్యాయపరంగా కూడా మందుకు వెళ్తాము అని చెప్పారు.

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రం లోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రం లోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి జాతర లో నిన్న రాత్రి అందజా 9 గంటలకు జీర్ల పల్లి గ్రామానికి చెందిన సంగమేశ్వర్ పాటిల్ గారి యొక్క బైక్ చోరికి గురైంది. బైక్ నెంబర్ A P 23 A జె 4617 ఆచూకీ తెలిసిన వారు ఈ నెంబర్ కు తెలుపగలరు.08555059758
[12:55 PM, 2/18/2026] +91 99890 79788: End

వేసవి తాగునీటి కొరత: న్యాల్కల్ పంచాయతీ ముందస్తు చర్యలు…

వేసవి తాగునీటి కొరత: న్యాల్కల్ పంచాయతీ ముందస్తు చర్యలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ గ్రామపంచాయతీ రానున్న వేసవిలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మల్గి మెకానిక్ కిష్టన్నలతో కలిసి గ్రామంలోని మినీ వాటర్ ట్యాంకులను పరిశీలించారు. ట్యాంకుల పనితీరును తనిఖీ చేసి, మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ట్యాంకుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, లీకేజీలను నివారించి నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, వేసవిలో గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటిని సమృద్ధిగా అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. నీటిని వృథా చేయకుండా వినియోగించాలని గ్రామస్థులకు సూచించారు.

ఘనంగా శ్రీ సంఘమేశ్వర స్వామి ఆలయంలో శివ పార్వతుల కల్యాణ మహోత్సవం….

ఘనంగా శ్రీ సంఘమేశ్వర స్వామి ఆలయంలో శివ పార్వతుల కల్యాణ మహోత్సవం:

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ మరియు కర్ణాటక రాష్ట్ర మంత్రి వర్యులు ఈశ్వర్ కాండ్రే శివరాత్రి పండుగ సందర్బంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవ కార్యక్రమములో పాల్గోనడం జరిగింది…ఈ మహోత్సవంలో ఝరాసంగం మండల అధ్యక్షులు హనుమంత్ రావు పాటిల్, ఆలయ చైర్మన్ శేఖర్ పాటిల్ , ఆలయం పాలకవర్గం మరియు మండల పెద్దలు, ప్రజాప్రతినిధులు,వివిధ గ్రామ సర్పంచులు,అధ్యక్షులు,నాయకులు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శివపార్వతుల ఆశీర్వాదములు తీస్కున్నారు..

చైర్ పర్సన్, వైస్ చైర్ లను శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు…

చైర్ పర్సన్, వైస్ చైర్ లను శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికలలో ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగి చివరకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు, సురేష్ కుమార్ షట్కార్, మాజీ మంత్రివర్యులు, డాక్టర్ చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర సట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మాజీ ఇండస్ట్రియల్ చైర్మెన్ మొహమ్మద్ తన్వీర్, రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి, ఉద్దండ రాజకీయ దురందరులు ఒకే వేదిక పైకి వచ్చి జహీరాబాద్ మునిసిపాలిటీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిఆర్ఎస్ పార్టీని అద పాతాళానికి అణగదొక్కి మరోసారి జహీరాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డ అని నిరూపించి పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు నేడు మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైఫ్ చైర్పర్సన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఎంఐఎం పార్టీ కౌన్సిలర్లు, స్వతంత్ర అభ్యర్థులు అందరూ కలిసి గౌరవనీయులు అందరికీ ఆమోదయోగ్యులైనటువంటి మహమ్మద్ యూనుస్ గారిని చైర్పర్సన్ గా, శిరీష రెడ్డి గారిని వైఫ్ చైర్పర్సన్ గా ఎన్నుకొని జహీరాబాద్ పట్టణ బాధ్యతలన్నింటిని తమరి భుజస్కందాల పైన పెట్టడం జరిగింది. ఈ ఐదు సంవత్సరాలు పట్టణ అభివృద్ధికి అందరి సహకారం తీసుకొని అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచడానికి శాయశక్తుల కృషి చేస్తారని ఆశిస్తూ జహీరాబాద్ నియోజకవర్గంలో మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ బాగా రెడ్డి గారి హయాంలో, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గీతారెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు స్వర్గీయ మహమ్మద్ ఫరీదోద్దీన్ గారి ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచిన మాట వాస్తవం అని తెలియజేస్తూ ఎన్నికైన జహీరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మహమ్మద్ యూనుస్ గారికి, వైస్ చైర్ పర్సన్ శిరీష రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు,

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

బాలాజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గ మంలో బాలాజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన గ్రామ నూతన సర్పంచ్ నాగేందర్ పటేల్ బుధవారం ప్రారంభించారు ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పిల్లల మరియు పెద్దల కోసం ఉచిత క్యాంప్ నిర్వహించిన బాలాజీ హాస్పిటల్ యజమాన్యాన్ని పలువురు అభినందించారు.బిఎంటి,షుగర్,బిపి,వంటి పరీక్షలను ఉచితంగా చేశారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ గ్రామ ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version